Rayadurg
-
కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కొడుకుపై జరిగిన దాడి విషయమై ఈ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు దీని పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ)ఇంతకీ ఏమైంది?ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న శ్యామ్ అనే స్టూడెంట్ ఇతడిని ర్యాగింగ్ చేసేవాడు. ఈ గొడవ కాస్త ముదిరి.. బస్సులో వెళ్లేటప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగాడు. ఇందులో భాగంగా ఆవేశానికి లోనైన శ్యామ్.. వైష్ణవ్ చెవి కొరికేశాడు.తన కొడుకుపై జరిగిన దాడి గురించి తెలిసిన ఆర్పీ పట్నాయక్.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదలా ఉండగా ఆర్పీ పట్నాయక్ ప్రస్తుతం సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడిగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఆ మధ్య నటుడు, దర్శకుడిగానూ పలు చిత్రాలు తీశారు. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ) -
భలే దొంగలు.. సీసీ ఫుటేజీ వైరల్.. ‘తొలిసారి దొంగతనం చేశాం క్షమించండి’
సాక్షి, హైదరాబాద్: వస్త్ర దుకాణంలోకి కొనుగోలుదారుల్లా వచ్చిన దొంగలు.. దృష్టి మరల్చి ఖరీదైన చీరలను నొక్కేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి చెక్కేశారు. నానా హంగామా చేసి ఒక్క చీర కూడా కొనకుండా తిరిగి వెళ్లిపోవటంతో అనుమానం వచ్చిన షాపు యజమానురాలు.. సీసీ టీవీ కెమెరాలోని ఫుటేజీని పరిశీలించారు. వచ్చింది కస్టమర్లు కాదు దొంగలు అని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కెమెరాలో నమోదైన వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్‌గా మారి దొంగల వరకూ చేరింది. దీంతో ఇంట్లో పిల్లలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన వారు.. షాపు యజమానురాలికి ఫోన్ చేసి తప్పయిందని ఒప్పుకొన్నారు. తాము దొంగిలించిన చీరలను తిరిగి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొనుగోలుదారుల్లా వచ్చి.. ► మణికొండలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో పావులూరి నాగతేజకు తేజ సారీస్ పేరుతో బోటిక్ ఉంది. గత సోమవారం గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు (ఓ పురుషుడు, అయిదుగురు మహిళలు) నంబరు ప్లేట్‌లేని స్కార్పియో కారులో వచ్చారు. షాపు ముందు వాహనంలో నుంచి దిగి రెండు బృందాలుగా విడిపోయి కొనుగోలుదారుల్లా నటిస్తూ దుకాణంలోకి ప్రవేశించారు. బోటిక్లోని విక్రయదారులను చీరలు చూపించండి అని వారి దృష్టి మళ్లించారు. రూ.2 లక్షలు విలువైన అయిదు ఖరీదైన చీరలను దొంగిలించారు. ►ఏమీ కొనకుండానే 15 నిమిషాల్లో అక్కడి నుంచి నిష్క్రమించారు. ► వీరి కదలికలపై నాగతేజకు అనుమానం వచ్చి వెంటనే స్టాక్‌ను చెక్ చేసి చీరలు తగ్గినట్లు గుర్తించారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. కొనుగోలుదారుల్లా వచ్చిన అయిదుగురు సభ్యులు ఒకే ముఠా అని, చీరలు దొంగతనం చేసి స్కార్పియో కారులో పరారైనట్లు అందులో రికార్డయింది. ఆ వీడియోలను నాగతేజ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేశారు. ►ఆ దృశ్యాలను చూసిన కోకాపేటకు చెందిన మరో షాపు యజమాని నాగతేజకు ఫోన్ చేశారు. తన షాపులోనూ ఇదే ముఠా సభ్యులు ఇదే తరహాలో రూ.10 లక్షలు విలువైన చీరలు ఎత్తుకెళ్లారని వివరించారు. ఓ నేత కార్మికుడు, షాపు యజమానికి ఫోన్ చేసి.. మార్చి 9న తన షాపులోనూ చోరీ జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 షాపుల యజమానులు చోరీ జరిగిందంటూ నాగతేజకు వివరించారు. మొదటిసారి దొంగతనం చేశామని.. వైరల్‌గా మారిన సదరు వీడియోలు.. సదరు ముఠా సభ్యుల కంట పడటంతో షాక్ తిన్నారు. వెంటనే గ్యాంగ్‌లోని ఓ మహిళ షాపు యజమానురాలు నాగతేజకు ఫోన్ చేసి.. తొలిసారిగా దొంగతనం చేశామని, తప్పయిందని ప్రాధేయపడింది. దొంగిలించిన చీరలను తిరిగిచ్చేస్తామని చెప్పింది. ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలోని వీడియో, ఫొటోలను తమ పిల్లలు చూస్తే పరువుపోతుందని వాటిని డిలీట్ చేయాలని అభ్యర్థించింది. పోస్టులను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించింది. వెంటనే దుకాణానికి వచ్చి చీరలు రిటర్న్ చేయాలని నాగతేజ సూచించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరోసారి మహిళ నాగతేజకు ఫోన్ చేసింది. బొటిక్కు కొద్ది దూరంలో ఉన్న మరో షాపు సెక్యూరిటీ గార్డు వద్ద చోరీ చేసిన చీరలు అప్పగించామని వివరించింది. వెంటనే అక్కడికి వెళ్లి చీరలు స్వాధీనం చేసుకున్న నాగతేజ.. పరిసర ప్రాంతాలలో గాలించగా నిందితులు అప్పటికే అక్కణ్నుంచి పరారయ్యారు. సోషల్ మీడియాను ఫాలో అవుతూ.. షాపింగ్ మాల్స్‌లో దుస్తులకు ట్యాగ్స్ ఉంటాయి. వాటిని చోరీ చేస్తే మాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు స్కానర్ వద్ద దొరికిపోతామని గుర్తించిన ఈ ముఠా.. ట్యాగ్స్ లేకుండా ఉండే సాధారణ షాపుల్లో మాత్రమే చోరీలకు పాల్పడుతోంది. కొత్త స్టాక్ రాగానే కస్టమర్లను ఆకర్షించేందుకు దుకాణాదారులు సోషల్ మీడియాలో పోస్టులతో ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే ఈ ముఠా.. నిరంతరం పోస్టులను ఫాలో అవుతూ ఖరీదైన చీరలు ఉండే షాపులను టార్గెట్ చేసుకొని చోరీలు చేస్తుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): జిల్లాలో టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. బొమ్మక్కపల్లికి చెందిన బోయ ఈరన్న కిడ్నాప్ ఉదంతం కట్టుకథ అని ఎస్పీ బి.సత్యయేసుబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన రాయదుర్గంలోని పంచాయతీ నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్యతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో కర్ణాటకకు తీసుకెళ్లారని, వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చినట్లు ఈరన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. దీనిపై డీఎస్పీ రమ్య నేతృత్వంలో లోతుగా విచారణ చేయించగా కిడ్నాప్ అనేది నాటకమని తేలిందన్నారు. (చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) విచారణలో సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఇతరత్రా సాంకేతిక ఆధారాలు కూడా సేకరించామన్నారు. అన్నీ క్రోడీకరిస్తే ఈరన్న ఇచ్చిన ఫిర్యాదుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేదన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 వేలమంది రౌడీషీటర్లు, అల్లరిమూకలను బైండోవర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూపు అడ్మిన్‌పై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.(చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?) చంద్రబాబు డైరెక్షన్లోనే.. అధికారపక్షం నేతలే కిడ్నాప్ చేశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు చేయగా.. ఈరన్న, కృష్ణానాయక్‌ది కిడ్నాప్ డ్రామా అని పోలీసులు తేల్చారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఈరన్న, కృష్ణానాయక్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ నేతలు కిడ్నాప్ డ్రామాలాడుతున్నారు. -
పోలీసుల అత్యుత్సాహం.. రామచంద్రారెడ్డి ఇంట్లో సోదాలు
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంపై రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు ఈ విధమైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు, పోలీసులు మంత్రి కాల్వ శ్రీనివాసులకు తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు. సోదాలు చేస్తున్న సమయంలో మీడియాను అనుమతించకపోవడంపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలకు పాల్పడటంపై ఆయన మండిపడ్డారు. -
చారిత్రాత్మకం...రాయదుర్గం
కర్ణాటక సరిహద్దున ఉన్న దుర్గాల్లో రాయదుర్గం చారిత్రాత్మకమైనది. విజయనగర రాజుల పాలనా వైభవానికి, నాటి శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిన ప్రాంతం. 15వ శతాబ్దంలో రాజకీయ, సాంస్కృతిక రంగాలకు నిలయం. కాలక్రమేణా రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా.. ఆ సంస్కృతీ పరిమళాలు మాత్రం ఇప్పటికీ గుభాళిస్తూనే ఉన్నాయి. అత్యంత ప్రశాంతమైన ఈ నియోజకవర్గంలో ఎడారి ఛాయలు విస్తరిస్తుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సాక్షి, రాయదుర్గం : నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 67 ఏళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జరిగాయి. అయితే శాసనసభ్యులుగా గెలుపొందిన నాయకులు మాత్రం పదవులకు ఆమడదూరంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి కూడా ఆమడదూరంలో ఉంది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన కాలవ శ్రీనివాసులు మాత్రం ఆ చరిత్రను చెరిపేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్, గృహనిర్మాణ, పౌరసమాచార శాఖ మంత్రి అయ్యారు. మున్సిపాలిటీతోపాటు రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ , బొమ్మనహాళ్ , కణేకల్లు మొత్తం ఐదు మండలాలున్నాయి. అంతకు మునుపు ఆంధ్రాలో ఉన్న బళ్లారి జిల్లాను కర్ణాటకలో కలవడంతో బళ్లారి జిల్లాలో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లాలో చేరింది. గుమ్మఘట్ట మండలం పూలకుంట వద్ద 2016 ఆగస్టు 31న రక్షకతడుల ప్రారంభానికి వచ్చిన చంద్రబాబు ఆ ఏడాదిలోపు బీటీపీకి నీరు తెస్తామంటూ తొలిసారి హామీ ఇచ్చారు. 2017 జూన్ 9న ఏరువాక కార్యక్రమ ప్రారం భానికి రెండోసారి వచ్చిన బాబు అదే ఏడాది ఆగస్టు 15న బీటీపీ పనులకు మంత్రి కాలవ శంకుస్థాపన చేస్తారని, రూ.968 కోట్లతో 2018 అక్టోబర్ 10న బీటీ ప్రాజెక్టు పనులు ప్రారంభించి, 2019 సంక్రాంతికి నాటికి కృష్ణజలాలతో ప్రాజెక్ట్‌ను నింపుతామని గొప్పగా చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రధాన రహదారుల పక్కన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే అక్కడక్కడ కాలువలు తవ్వి వదిలేశారు. కమీషన్లతో పాలకులే లబ్ధి పొందారు. రాయదుర్గం కేంద్రంగా జీన్స్ పరిశ్రమకు విద్యుత్ రాయితీ ఇచ్చి, గార్మెంట్ రంగాన్ని అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తానని గతంలో బాబు ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో కొండల్లా పేరుకుపోయిన ఇసుకమేటలను తొలగిస్తామని ఇచ్చిన హామీ ఎండమావిగానే మిగిలింది. ప్రధాన సమస్యలు.. నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది కరువు. ఏటా తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి హామీ పనులను పూర్తిస్థాయిలో చేపట్టడకపోవడంతో వ్యవసాయ కూలీలతోపాటు రైతులు వేలాదిగా కర్ణాటకకు వలస వెళుతున్నారు. హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు వేగవంతం చేసి చివరి ఆయకట్టు రైతుల భూములకు నీరివ్వడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బీటీపీకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు మళ్లించి 12 వేల ఎకరాల భూములను సాగులోకి తేవాలని కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జీన్స్ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ‘దుర్గం’ దాహార్తి తీర్చిన గతంలో రాయదుర్గం పట్టణంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉండేది. పట్టణ ప్రజలు నిత్యం నీటి కోసం కొట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో తాగునీటి పథకానికి రూ.48 కోట్లు విడుదల చేశారు. కణేకల్లు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు కు 168 ఎకరాలు భూసేకరణ చేసి, ట్యాంకు నిర్మించారు. హెచ్చెల్సీ నీటిని ట్యాంకులోకి ఎత్తిపోతల ద్వారా నింపి అక్కడి నుంచి రాయదుర్గం వరకు పైపులైను నిర్మించారు. ఆ తర్వాత 2009లో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరిక మేరకు తాగునీటి కోసం రూ.4 కోట్లు విడుదల చేశారు. మహానేత కృషికి గుర్తుగా రాయదుర్గం తాగునీటి పథకానికి వైఎస్సార్ తాగునీటి పథకంగా నామకరణం చేశారు. టీడీపీకి వ్యతిరేక పవనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేర్చకపోవడం, నియోజకవర్గంలో మంత్రి కాలవతో పాటు అతని అనుచరగణం చేసిన మట్టి, ఇసుక దోపిడీతో ప్రజల్లో టీడీపీకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు అర్హులకు అందించకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకోవడంపై కూడా బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి కాలవ తన కోటరీ ద్వారా వేల కోట్లు దండుకున్నట్లు ఆ పార్టీలోని నాయకులే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మంత్రి అవినీతిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, సీనియర్ టీడీపీ నేతలు సమావేశాలు పెట్టి చెబుతున్నారు. టీడీపీకి చెందిన దీపక్‌రెడ్డి వర్గాన్ని కేసులు పెట్టి వేధించాడని, దాడులు చేయించాడని ఆవేదన చెందుతూ మంత్రికి వ్యతిరేకంగా ఓటు వేయిస్తామంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఆదరణ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతోంది. ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు సాగిస్తూ వస్తున్నారు. నవరత్నాలపై ఇప్పటికే నియోజకవర్గమంతా ముమ్మర ప్రచారం చేశారు. జగన్ పథకాలతో ఆకర్షితులైన పలువురు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి రాకతో రాయదుర్గం పట్టణంతోపాటు కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో పార్టీకి మరింత బలం పెరిగింది. సామూహిక వివాహాలు, ట్రై సైకిళ్ల పంపిణీ, ఉచిత కంటి ఆపరేషన్లు, మసీదులు, ఆలయాల అభివృద్ధికి విరివిగా విరాళాలు తదితర సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ‘కాపు’ తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గ వివరాలు.... మొత్తం జనాభా 3,19,479 మొత్తం ఓటర్లు 2,40,196 పురుషులు 1,20,350 మహిళలు 1,19,839 ఇతరులు 07 పోలింగ్ బూత్‌లు 316 రాయదుర్గం ఎమ్మెల్యేలు వీరే.. సంవత్సరం పార్టీ విజేత 1952 కాంగ్రెస్ గురుమాల నాగభూషణ 1957 కాంగ్రెస్ ఎన్సీ శేషాద్రి 1962 కాంగ్రెస్ లక్కా చిన్నపరెడ్డి 1967 స్వతంత్ర గొల్లపల్లి తిప్పేస్వామి 1972 కాంగ్రెస్ గొల్లపల్లి తిప్పేస్వామి 1975 రెడ్డి కాంగ్రెస్ పయ్యావుల వెంకటనారాయణ 1978 కాంగ్రెస్ కేబీ చన్నమల్లప్ప 1983 స్వతంత్ర పాటిల్ వేణుగోపాల్ రెడ్డి 1985 టీడీపీ బండి హులికుంటప్ప 1989 కాంగ్రెస్ పాటిల్ వేణుగోపాల్ రెడ్డి 1994 టీడీపీ బండి హులికుంటప్ప 1999 కాంగ్రెస్ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి 2004 టీడీపీ మెట్టు గోవిందరెడ్డి 2009 కాంగ్రెస్ కాపు రామచంద్రారెడ్డి 2012 వైఎస్సార్సీపీ కాపు రామచంద్రారెడ్డి 2014 టీడీపీ కాలవ శ్రీనివాసులు -
వైఎస్సార్ సీపీ నేతలపై కాలవ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మంత్రి కాలవ శ్రీనివాసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. డీ హీరేహాల్ మండలం మురిడిలో సర్వే పేరుతో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. ఆ సర్వే బృందం గ్రామంలోని వైఎస్సార్ సీపీ ఓటర్ల వివరాలు సేకరించింది. ఈ విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి ముగ్గురు అనుమానితులను పోలీసులకు అప్పగించారు. అయితే కాలవ శ్రీనివాసులు ఒత్తిడితో రాయదుర్గం సీఐ చలపతిరావు ఈ కేసును తారుమారు చేశారు. మంత్రి ఆదేశాలతో రామచంద్రారెడ్డితో పాటు 11 మందిపై సీఐ అక్రమ కేసులు నమోదు చేశారు. సీఐ తీరుపై రామచంద్రారెడ్డితో వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. అనుమానితులను అప్పగిస్తే.. పోలీసులు తమపై కేసులు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు దొంగ సర్వేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరులు వైఎస్సార్సీపీ ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. రాయదుర్గం పోలీసులు కాల్వ శ్రీనివాసులుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
‘రాయదుర్గ్’ భూములకు రక్షణ
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామంలో కోట్ల రూపాయల విలువైన భూముల హక్కులు అన్యాక్రాంతం కాకుండా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ టి.తిరుపతిరావుకు కోర్టు ధిక్కార కేసులో సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాలను కూడా రద్దు చేసింది. ప్రజాప్రయోజనాలకు భంగం కలిగే విధంగా వంద ఎకరాలకుపైగా ఉన్న భూములపై హక్కుల్ని కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గ్‌లోని 1 నుంచి 49వ సర్వే నంబర్ వరకూ ఉన్న భూములపై హక్కులు కల్పించాలని ఎం.లింగమయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003 నాటి తీర్పునకు లోబడి రెవెన్యూ రికార్డుల్లో లింగమయ్య పేరు నమోదు చేయాలని, ప్రభావిత కుటుంబాల వాదనలు విన్న తర్వాతే మ్యుటేషన్ చేయాలని 2009 మార్చిలో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను జడ్జి ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో లింగమయ్య కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అప్పటి తహసీల్దార్ తిరుపతిరావు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు రెండు మాసాల జైలు, రూ.1500 జరిమానా విధిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ తిరుపతిరావు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ధర్మాసనం అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. తహసీల్దార్ జైలు శిక్ష రద్దు ‘‘సీఎస్ 7/1958 నాటి దావాకు సంబంధించి లింగమయ్య పేరున 2002 నుంచి జారీ అయిన ఉత్తర్వులు మోసపూరితంగా ఉన్నాయి. ప్రజాప్రయోజనాలకు హాని కలిగించేలా వంద ఎకరాలకుపైగా ఉన్న భూముల హక్కుల్ని ప్రభుత్వం చేజారేలా ఆదేశాలు జారీ చేయలేం. 1959 ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా లింగమయ్య భూములపై హక్కులు కోరుతున్నారు. 7/1958 నాటి కేసు ప్రకారం షెడ్యూల్–ఎ లోని ఐటం 234లో ఆస్తుల వివరాలు మక్తా రాయదుర్గ్‌లో ఉన్నాయి. సదరు ఐటంకు చెందిన భూములు, సర్వే నంబర్లు, సరిహద్దుల వివరాలు పేర్కొనలేదు. అందుకే లింగమయ్య కోరినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పునకు (మ్యుటేషన్) అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం లేదు. థర్డ్‌పార్టీలకు భూములపై హక్కులు కల్పించాలని సింగిల్ జడ్జి ఆదేశాలను ఆమోదించలేం. తహసీల్దార్‌కు విధించిన జైలుశిక్ష, కోర్టు ధిక్కార తీర్పును రద్దు చేస్తున్నాం ’’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
ఆటోను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి
-
ఆటోను ఢీకొన్న లారీ.. ఐదుగురు మృతి
రాయదుర్గం(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందగా మరో పది మంది గాయపడ్డారు. 15 మందికి పైగా మహిళలు కూలిపనుల కోసం ఆటోలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో వన్నూరమ్మ, వన్నూరక్క, దుర్గ అనే మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం మూలంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణకు ఆదేశం
కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం : నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభు త్వం ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలంయలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులతో నీరు–చెట్టు కార్యక్రమం కింద యంత్రాలతో పనులు చేపట్టారన్నారు. కూలీల కడుపు కొడుతున్న నీరు–చెట్టు పనులు, పక్క దారి పడుతున్న ఉపాధి హామీ బిల్లులపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాను గత నెలలో ప్రధానమంత్రికి లేఖ రాశానన్నారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాల యం ఈ అక్రమాలపై సమగ్ర విచార ణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసిందన్నారు. ఆ ప్రతిని తనకు కూడా పంపిందని చెప్పారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు నభీష్, ప్రధానకార్యదర్శి అబ్బాస్, మండల కన్వీనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.