నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సత్యయేసుబాబు
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): జిల్లాలో టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. బొమ్మక్కపల్లికి చెందిన బోయ ఈరన్న కిడ్నాప్ ఉదంతం కట్టుకథ అని ఎస్పీ బి.సత్యయేసుబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన రాయదుర్గంలోని పంచాయతీ నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్యతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో కర్ణాటకకు తీసుకెళ్లారని, వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చినట్లు ఈరన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. దీనిపై డీఎస్పీ రమ్య నేతృత్వంలో లోతుగా విచారణ చేయించగా కిడ్నాప్ అనేది నాటకమని తేలిందన్నారు. (చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..)
విచారణలో సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఇతరత్రా సాంకేతిక ఆధారాలు కూడా సేకరించామన్నారు. అన్నీ క్రోడీకరిస్తే ఈరన్న ఇచ్చిన ఫిర్యాదుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేదన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 వేలమంది రౌడీషీటర్లు, అల్లరిమూకలను బైండోవర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూపు అడ్మిన్‌పై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.(చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?)
చంద్రబాబు డైరెక్షన్‌లోనే..
అధికారపక్షం నేతలే కిడ్నాప్ చేశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు చేయగా.. ఈరన్న, కృష్ణానాయక్‌ది కిడ్నాప్ డ్రామా అని పోలీసులు తేల్చారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఈరన్న, కృష్ణానాయక్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ నేతలు కిడ్నాప్ డ్రామాలాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment