
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాంనగర్‌లో టీడీపీ కార్యకర్తలు శనివారం రాత్రి బీభత్సం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టీడీపీ కార్యకర్తలు క్రాంతి, విజయ్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండ.. తమనే ఆపుతారా అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇంతటితో ఊరుకోకుండా.. ఫోర్త్ టౌన్ ఎస్సై శాంతిలాల్‌పై కాంత్రి, విజయ్‌లు దాడికి యత్నించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు టీడీపీ కార్యర్తలుగా పోలీసులు గుర్తించారు. క్రాంతి, విజయ్‌లపై 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.