Kidnap drama
-
యాభై వేలకు కన్న బిడ్డను అమ్మేసి.. కిడ్నాప్ డ్రామా..!
లక్నో: బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఎన్నింటినో సృష్టించాడు. కానీ ఆయనకు ఎక్కడో లోటు అనిపించింది. దాన్ని పూడ్చడానికి అమ్మని సృష్టించాడంటారు. “అమ్మ” అనే పదానికి అర్థం చెప్పటం చాలా కష్టం. అమ్మను మించిన శక్తి మరొకటి లేదు. అలాంటి అమ్మ తనానికి మచ్చ తెచ్చింది ఓ మహిళా.. తన బిడ్డను రూ. 50 వేలకు అమ్మి.. కిడ్నాప్ కథను అల్లింది. వివరాల్లోకి వెళితే.. గోరఖ్ నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఇలహిబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న సల్మా ఖాటూన్ అనే మహిళ తన కుమారుడు కనిపించడం లేదని ఆదివారం పోలీసులకు సమాచారమిచ్చింది. రసూల్పూర్ ప్రాంతంలోని ఓ వివాహ వేడువ వద్ద తన కొడుకును తన నుంచి లాక్కొని ఎరుపు చీర ధరించిన మహిళ ఎస్‌యూవీలో పరారైనట్లు పోలీసులకు తెలిపింది. దీంతో ఎస్పీ సోనమ్ కుమార్‌తో పాటు పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని శిశువు కోసం అన్వేషణ ప్రారంభించారు. అయితే బాలుడి తల్లి కిడ్నాప్ కథను మార్చి మార్చి చెప్పడంతో.. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఖాటూన్ తన కొడుకును మరొక మహిళకు అప్పగించి, ఇ-రిక్షాలో వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో ఆ బాలుడి తల్లిని, కొనుగోలు చేసిన మహిళను ప్రశ్నించి ఇద్దరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
ఆ సంచీలో ఒక్క రూపాయి లేదు.. కిడ్నాప్ ఓ డ్రామా!
మంథని: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 50 లక్షలతో వెళ్లిన తాము కిడ్నాప్‌కు గురయ్యామన్న ఇద్దరు వ్యక్తుల వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం కిడ్నాప్ నాటకం ఆడినట్లు తేల్చి 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మంథనిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ వివరాలు వెల్లడించారు. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బిల్క్ ఉన్నిసాబేగం వద్ద కొనుగోలు చేసి న భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 17న రూ. 50లక్షలతో ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వారు తిరిగి రాలేదని రాజేశం భార్య పుష్పలత రామగిరి పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నెల 19న అర్ధరాత్రి రెండు గంటలకు రాజాపూర్ శివారులో మల్లయ్య, రాజేశంలను వదిలేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిని తీసుకెళ్లి విచారించారు. తమను గు ర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు బాధితులు వెల్లడించారు. అనంతరం మంథని సీఐ మహేందర్ రెడ్డి, రామగిరి ఎస్సై మహేందర్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చి, గట్టిగా మందలించడంతో కిడ్నాప్ డ్రామా ఆ డినట్లు ఒప్పుకున్నారు. తమకు భూమి అ మ్ముతానని ఉన్నిసాబేగం రూ.36లక్షలు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. భూ సమస్య పరి ష్కారం కోసమే నాటకం ఆడినట్లు చెప్పారని డీసీపీ పేర్కొన్నారు. ఖాళీ సంచినే డబ్బులు ఉన్నట్లు నమ్మించినట్లు చెప్పారన్నారు. రాజేశం, మల్లయ్యలపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించిన ట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు కిరణ్, సదానందంల కు నగదు పురస్కారం అందించి, మంథని సీఐ, రామగిరి ఎస్సైలను అభినందించారు. చదవండి: రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు చెప్పిన కథనంలో అనుమానాలు.. అసలేం జరిగింది..? -
కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది..
విజయనగరం క్రైమ్/సాక్షి, అమరావతి: కాళ్లూ, చేతులూ బంధించి ముళ్ల పొదల్లో ఉన్న ఓ విద్యార్థినిని రక్షించిన కేసులో పోలీసులు అసలు విషయం రాబట్టారు. తనకు తానే కాళ్లూ, చేతులు చున్నీతో కట్టేసుకుని, అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు ఆ విద్యార్థిని నటించిందని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గుర్ల పోలీసు స్టేషన్‌కి సమీపంలో ఇటీవల జరిగిన ఈ ఘటనను పోలీసులు సీరియస్ తీసుకుని విచారించారు. మొదట ఏమీ తెలియదని చెప్పిన ఆ విద్యార్థిని.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టింది. బాబాయి ఇంటికి వెళ్తానని గత నెల 27న హాస్టల్లో అనుమతి తీసుకుని స్నేహితుడితో బయటకు వెళ్లింది. అదే సమయంలో తన గురించి హాస్టల్లో అన్న వాకబు చేసినట్లుగా తెలుసుకుని కట్టుకథకు తెరతీసింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కి గుర్ల దాటిన తర్వాత దిగింది. అక్కడే రోడ్డుపక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించేందుకు తనకుతానే బంధించుకుంది. ఈ విషయం సీసీ ఫుటేజ్‌ల ద్వారా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. వాస్తవాలు తెలుసుకో లోకేశ్ గుర్ల విద్యారి్థని ఘటనపై నిజాలు తెలుసుకోకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల చేసిన ట్వీట్‌పై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని సమాచారం అందిన వెంటనే స్పందించి విచారణ పోలీసులు చేపట్టారు. అయినా లోకేశ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. చదవండి: భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో.. అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. -
ఘట్కేసర్ యువతి ఆత్మహత్య
-
ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా: యువతి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: నగరంలో పది రోజుల క్రితం ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చివరకు ఇదంతా డ్రామా అని తేల్చారు పోలీసులు. సదరు యువతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం యువతి షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి వరకు బాగానే ఉన్న యువతి బుధవారం ఉదయం 10 గంలకు చికిత్స పొందతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత విద్యార్థిని డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే... మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు. చదవండి: ఘట్కేసర్ కేసు; రాడ్లతో విచక్షణ రహితంగా.. ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు -
స్థానిక ఎన్నికల్లో కుంపట్లు రాజేస్తున్న ‘తమ్ముళ్లు’
సాక్షి, అనంతపురం : పార్టీకి సంబంధం లేని పంచాయతీ ఎన్నికలకు టీడీపీ రాజకీయ రంగు పులుముతోంది. ఏ చిన్న సంఘటన జరిగినా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి లింకు పెట్టి విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. కనీస విచారణ చేసుకోకుండానే పచ్చని పల్లెల్లో నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కట్టుకథలకు గట్టి ఎదురుదెబ్బే తగులుతోంది. పోటీలో నిలిస్తే ఖర్చు భరిస్తామని హామీ ఇస్తున్నప్పటికీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకుంటుండటంతో దిక్కుతోచని ‘తమ్ముళ్లు’ కిడ్నాప్ డ్రామాలకు తెరలేపుతుండటం గమనార్హం. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మక్కపల్లి పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన తిమ్మక్క భర్త ఈరన్న.. తనను మొలకాల్మూరు వద్ద నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి నుంచి తప్పించుకువచ్చానని ఫిర్యాదు చేశారు. దీనిపై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుతో పాటు ఏకంగా చంద్రబాబు కూడా సదరు అభ్యర్థికి ఫోను చేశారు. ఇవన్నీ అధికార పార్టీ దౌర్జన్యాలంటూ మండిపడ్డారు. అయితే, పోలీసుల విచారణలో అసలు ఆయన కిడ్నాపే కాలేదని తేలింది. అంతేకాదు ఆర్థిక సమస్యలతో పోటీ నుంచి తప్పుకునేందుకు డ్రామా ఆడారని తేలింది. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్దతండకు చెందిన కృష్ణానాయక్‌ను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు నానాయాగీ చేశారు. అయితే, తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని.. గ్రామస్తులు సహకరించే పరిస్థితి లేనందువల్లే పోటీ నుంచి తప్పుకున్నానని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇదేతరహాలో కట్టుకథలతో పంచాయతీ ఎన్నికల్లో పోట్లాటలు రాజేసేందుకు టీడీపీ నేతలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అటు రాయదుర్గం.. ఇటు కదిరిలో కూడా పోటీ చేసే అభ్యర్థులకు టీడీపీ తాయిలాలు ఎరవేసినట్టు తెలుస్తోంది. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మక్కపల్లి పంచాయతీకి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన తిమ్మక్క భర్తకు టీడీపీ నేతలు ఆర్థికంగా సహాయం చేస్తామని మొదట హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నామినేషన్ వేసిన తర్వాత పట్టించుకోకపోవడంతో కిడ్నాప్ డ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది. తమ ఇంటి దైవాన్ని దర్శించుకునేందుకు మొలకాల్మూరుకు వెళ్లగా.. అక్కడ నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. అయితే, తాను ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్నానని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే, పోలీసులు కాస్తా పాయింట్ టు పాయింట్ విచారణ చేయడంతో పాటు సెల్‌ఫోన్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఇదంతా డ్రామా అని తేలింది. అసలు మొలకాల్మూరు రద్దీ ప్రాంతం అని.. ఇక్కడ అలాంటి సంఘటన జరగలేదని స్థానికులు తేల్చారు. మరోవైపు తాను పూజారిని 10 గంటలకు కలిశానని సదరు వ్యక్తి చెప్పగా.. 2 గంటలకు కలిశాడని పూజారి చెప్పారు. మొత్తంగా ఆర్థిక సహాయం చేస్తామని నమ్మించి నామినేషన్ వేయించిన టీడీపీ నేతలు.. చివరకు హ్యాండ్ ఇవ్వడంతో ఈ డ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది. కదిరి నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. ఇక్కడ కూడా కిడ్నాప్ జరిగిందంటూ కదిరి టీడీపీ ఇన్చార్జి కందికుంట నాటకానికి ప్రయతి్నంచారు. చివరకు సదరు అభ్యర్థే తనను కిడ్నాప్ చేయలేదనడంతో కందికుంట డ్రామాకు తెరపడింది. మొత్తంగా టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు కాస్తా జిల్లా ప్రజానీకానికి తేటతెల్లమవుతున్నాయి. ఆడలేక మద్దెల ఓడినట్టు...! స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. టీడీపీ నేరుగా మద్దతు ఇస్తున్నట్టు పలువురు అభ్యర్థులకు తాయిలాలను ప్రకటిస్తోంది. ఎన్నికల ఖర్చు భరిస్తామని ఆఫర్లు ఇస్తోంది. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు కరువవుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో 6 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల టీడీపీ నుంచి ఒత్తిడితో కొద్ది మంది పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీలకు పార్టీ రంగుపులిమిన టీడీపీ.. ఎలాగైనా రచ్చచేయాలనే ధోరణితో ముందుకు పోతోంది. ఆడలేక మద్దెల ఓడినట్టు కిరికిరి చేసేందుకు యతి్నస్తోంది. ప్రజల్లో లేని భయాన్ని సృష్టించేందుకు ప్రయతి్నస్తోంది. తద్వారా పచ్చని పల్లెల్లో పోటీలు పెట్టి నిప్పులు రాజేసేందుకు ప్రయతి్నస్తోంది. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉంటూ.. టీడీపీ నేతల రాజకీయాలకు రెచ్చిపోకుండా అభివృద్ధి వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. కిడ్నాప్‌లన్నీ కట్టుకథలే రాప్తాడు: జిల్లాలో నమోదైన రెండు కిడ్నాప్ కేసులు కట్టుకథలుగా తేలిందని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. బొమ్మక్కపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బోయ తిమ్మక్క భర్త ఈరన్న, గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్దతండా సర్పంచ్ అభ్యర్థి కృష్ణానాయక్లను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆ కిడ్నాప్ ఉదంతమంతా కట్టుకథ అన్నారు. గురువారం ఆయన రాప్తాడులో మీడియాతో మాట్లాడారు. బొమ్మక్కపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యరి్థగా ఈరన్న భార్య తిమ్మక్క బరిలో నిలిచారని, అయితే కుటుంబీలు మద్దతు ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఈరన్న కర్ణాటకకు వెళ్లి తిరిగి వచ్చినట్లు తేలిందన్నారు. ఇక తుమ్మలబైలు పెద్దతండా సర్పంచ్ అభ్యర్థి కృష్ణానాయక్‌ను కిడ్నాప్ చేశారని భార్య ఫిర్యాదు చేయగా , తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే స్వచ్ఛందంగా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని కృష్ణానాయక్ చెప్పాడన్నారు. -
టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): జిల్లాలో టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. బొమ్మక్కపల్లికి చెందిన బోయ ఈరన్న కిడ్నాప్ ఉదంతం కట్టుకథ అని ఎస్పీ బి.సత్యయేసుబాబు స్పష్టం చేశారు. బుధవారం ఆయన రాయదుర్గంలోని పంచాయతీ నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్యతో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో కర్ణాటకకు తీసుకెళ్లారని, వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చినట్లు ఈరన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. దీనిపై డీఎస్పీ రమ్య నేతృత్వంలో లోతుగా విచారణ చేయించగా కిడ్నాప్ అనేది నాటకమని తేలిందన్నారు. (చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) విచారణలో సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఇతరత్రా సాంకేతిక ఆధారాలు కూడా సేకరించామన్నారు. అన్నీ క్రోడీకరిస్తే ఈరన్న ఇచ్చిన ఫిర్యాదుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేదన్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 వేలమంది రౌడీషీటర్లు, అల్లరిమూకలను బైండోవర్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ మద్యంపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూపు అడ్మిన్‌పై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.(చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?) చంద్రబాబు డైరెక్షన్లోనే.. అధికారపక్షం నేతలే కిడ్నాప్ చేశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపణలు చేయగా.. ఈరన్న, కృష్ణానాయక్‌ది కిడ్నాప్ డ్రామా అని పోలీసులు తేల్చారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఈరన్న, కృష్ణానాయక్ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి కోసం టీడీపీ నేతల బరితెగిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ నేతలు కిడ్నాప్ డ్రామాలాడుతున్నారు. -
అప్పలరాజు కిడ్నాప్ డ్రామా బట్టబయలు
-
అప్పలరాజు కిడ్నాప్ డ్రామా బట్టబయలు
సాక్షి, విశాఖపట్నం: ఫైనాన్స్ వ్యాపారి అప్పలరాజు కిడ్నాప్ వ్యవహారంలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. అప్పలరాజే కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా పోలీసులు నిర్ధారణ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా అప్పలరాజు అడ్డంగా దొరికిపోయనట్లు పోలీసులు తెలిపారు. అప్పలరాజు తనను ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద ఆటోలో కిడ్నాప్ చేశారని తెలిపారు. ఇక తనపై హత్యాయత్నం చేయడమే కాకుండా దుండగులు రూ. 1,25,000 నగదు, బంగారం దోచుకున్నారని చెప్పాడు. అదే విధంగా తనను రుషికొండ-సాగర్ నగర్ మధ్య కొట్టి పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (విభేదాలే కిడ్నాప్‌కి కారణమా..?) కుటుంబ సభ్యుల సాయంతో కేజీఎచ్‌లో చేరిన అప్పలరాజు షర్ట్‌పై ఎటువంటి రక్తపు మరకలు లేకుండా పొట్టపై రెండు కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు అనుమానాలు ఉన్న ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అసలు కిడ్నాప్ డ్రామా బట్టబయలైంది. సీసీ కెమెరా ఫుటేజ్‌లోనూ ఆటోలో అప్పలరాజు ఒక్కడే ఎక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అప్పలరాజుపైనే అనుమానం రావటంలో అతని ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా బంగారం దొరికింది. దీంతో లక్ష రూపాయిల నగదుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్పుల బాధలు, ఈఎంఐ నుంచి తప్పించుకోవడానికే అప్పలరాజు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
బెడిసికొట్టిన జనసేన కిడ్నాప్ డ్రామా
సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులే కిడ్నాప్ చేశారని ఆరోపణలు గుప్పించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు) షాహిద్ కనబడటం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. వినుత ఇంట్లో సోదాలు జరిపేందుకు రేణిగుంట పోలీసులు యత్నించగా జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్, ఇతర నాయకులు అడ్డుకున్నారు. తాము తలచుకుంటే కేంద్ర హోం శాఖ దిగుతుందంటూ బెదిరింపులకు దిగారు. జనసేన నాయకురాలు నగరం వినుత, కోట చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి డ్రామా బెడిసికొట్టడంతో జనసేన నేతలు కంగుతిన్నారు. (ఇది ఫెవికాల్ బంధం) -
బావతో వివాహం.. తర్వాత ఎన్ని మలుపులో..!
సాక్షి, ఒంగోలు: ఓ యువతిని సొంత బంధువులే కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుల కార్లను ఛేజ్ చేసి ఆమెను రక్షించి నగరంలోని ఓ హోమ్‌కు తరలించారు. వివరాలు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతి వైజాగ్‌లో బీఎల్ చదివే క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు ఆమె బావతో వివాహం చేశారు. ఆమెకు ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎనిమిది నెలల్లోనే మూడుసార్లు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. మూడోసారి ఈ ఏడాది జనవరి 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగి కనీసం వారికి టచ్‌లోకి కూడా రాకపోవడంతో తల్లి బెంగ పెట్టుకుంది. ఎలాగైనా తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తల్లి ఆమె స్నేహితులను కలిసింది. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! వైజాగ్‌కు చెందిన తరుణ్ తన కుమార్తెకు స్నేహితుడని తెలుసుకుని అతడితో తల్లి మాట్లాడింది. తాను ప్రస్తుతం బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నానని, తనకు మీ కుమార్తె విషయం తెలియదని తెలిపాడు. తల్లి మరింతగా ప్రాధేయపడటంతో ఓకే అన్న తరుణ్..తనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న రాఘవ, అతని స్నేహితుడు మనోజ్‌ల సాయం తీసుకున్నాడు. ఆమె ఎక్కడ ఉందనే విషయమై ఫేస్బుక్లో ముగ్గురు కలిసి సెర్చ్ చేశారు. చివరకు ఆమె ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తోందని తెలుసుకున్నారు. ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న సీఐ డబ్బుకు ఆశ పడిన యువకులు తన కుమార్తెను అప్పగిస్తే ఎన్ని డబ్బులైనా ఇస్తానని తల్లి చెప్పడంతో ఆ ముగ్గురు యువకులు ఒక ప్లాన్ వేశారు. తమ స్నేహితురాలు ఒకరు ముంబైలో ఉద్యోగం చేయాలనుకుంటోందని, మదనపల్లె వస్తే ఆమెను కూడా తీసుకెళ్దువంటూ యువతిని కోరారు. ఈ మేరకు ఆమె గోవా వరకు బస్సులో రాగా యువకులు ముగ్గురు కారులో వెళ్లి ఆమెను తొలుత మదనపల్లె తీసుకొచ్చారు. తమ కుమార్తెను ఎలాగైనా ఒంగోలు తీసుకురావాలని ఆమె తల్లి ఆ ముగ్గురు యువకులను కోరింది. వారు నచ్చ జెప్పడంతో యువతి నమ్మి వారితో పాటు ఒంగోలు వచ్చి ఓ హోటల్లో బస చేసింది. ఈ క్రమంలో యువకులు ముగ్గురు ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? దౌర్జన్యం చేసిన బంధువులు సదరు మహిళ బంధువులతో పాటు తల్లి హోటల్‌కు వచ్చి దౌర్జన్యం చేశారు. రూమ్ నంబర్ 104లో బస చేసిన తమ కుమార్తెను లాక్కెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో యువకులు అడ్డం పడటంతో వారిపై దాడి చేయడంతో పాటు వారు వచ్చిన కారును సైతం ధ్వంసం చేశారు. అనంతరం అడ్డుపడ్డ రాఘవను బలవంతంగా తమతో పాటు కారులో ఎక్కించుకుని చిలకలూరిపేట బయల్దేరారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ భీమానాయక్ తన సిబ్బందితో కలిసి కార్లను వెంబడించి మహిళను రక్షించారు. ఆమెతో పాటు ఉన్న తల్లి, ఇతర బంధువులను అదుపులోకి తీసుకుని ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. యువకులు మాత్రం తాము కేవలం ఆమెను వారికి అప్పగించేందుకైన ఖర్చులు చెల్లించమని కోరామని, తాము సహకరిస్తే ఆమె బంధువులతో చావుదెబ్బలు తిన్నామని వాపోయారు. యువతి తల్లి మాత్రం తమ కుమార్తెను ఆ ముగ్గురు యువకులే తీసుకెళ్లారంటూ ఆరోపిస్తుండగా యువతి మాత్రం తనకు వివాహం ఇష్టం లేక వెళ్లిపోయానని, స్నేహితులుగా ఉంటూ తనను నమ్మించి తనను తల్లిదండ్రులకు బలవంతంగా అప్పగించేందుకు ప్రయత్నించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. యువతి తల్లి, సోదరుడు, భర్త, మరో ఐదుగురు బంధువులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. యువతి తన తల్లిదండ్రులు, భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను ఒన్‌స్టాప్ హోమ్‌కు తరలిస్తున్నట్లు సీఐ భీమానాయక్ తెలిపారు. -
సీఎం తమ్ముడి కిడ్నాప్; ఛేదించిన పోలీసులు
కోల్‌కతా : సీబీఐ ఆఫీసర్లమని అని చెప్పి ఒక వ్యక్తి కిడ్నాప్‌కు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కిడ్నాప్ చేద్దామనుకున్న వ్యక్తి స్వయానా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ సోదరుడు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే .. బిరెన్ సింగ్ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్ కోల్‌కతాలో నివాసముంటున్నారు. కాగా శుక్రవారం ఐదుగురు వ్యక్తులు న్యూటౌన్‌లో లుఖోయ్ సింగ్ కొత్తగా తీసుకున్న ఇంటికి వచ్చారు. తాము సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఇంట్లోకి చొరబడి లుఖోయ్ సింగ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. తర్వాత సింగ్ భార్యకు ఫోన్ చేసి రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో సింగ్ భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిలో ఇద్దరిని శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురిని కూడా శనివారం ఉదయం సెంట్రల్ కోల్‌కతాలోని బేనియాపుకుర్‌లో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ. 2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇద్దరు మణిపూర్, మరో ఇద్దరు కోల్‌కతా, ఒకరు పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. కాగా, వీరిపై గతంలో కూడా పలు క్రిమినల్ రికార్డులు ఉన్నాయని, కేవలం డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు మా విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
పబ్జీ ఎఫెక్ట్.. ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ డ్రామా
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్) : పబ్ జీ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పబ్జీ వద్దన్నందుకు నీ కొడుకును కిడ్నాప్ చేశారని తల్లికే ఓ ఇంటర్ విద్యార్థి ఫోన్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉండే సమీర్ ఆర్మన్(16) నార్సింగిలోని జాహ్నవి జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో షేక్‌పేట్‌లోని ఆకాశ్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు చేస్తున్నాడు. తండ్రి అల్తఫ్ ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కొంత కాలంగా సమీర్ పబ్ జీ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేశాడు. గమనించిన తల్లి పబ్జీ ఆడవద్దని మందలించి సెల్‌ఫోన్ తీసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన సమీర్ మణికొండలోని స్నేహితుడు సిద్ధార్థ వద్దకు వెళ్లి అటు నుంచి కాలేజీకి వెళతానని చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. బ్యాంక్‌లో రెండు వేల నగదు తీసుకొని రాత్రి 9.30 ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి బస్సులో ముంబై బయటుదేరాడు. తెల్లవారు జామున 5.30 గంటలకు షోలాపూర్‌లో దిగి బాత్ రూమ్‌కు వెళ్లి వచ్చే లోపు బస్సు వెళ్లిపోయింది. ఏమి చేయాలో పాలుపోక అక్కడున్న వారి సెల్ ఫోన్ తీసుకొని ఉదయం 7 గంటలకు తల్లికి ఫోన్ చేశాడు. నీ కొడుకును కిడ్నాప్ చేశాం, నీ కొడుకు అంటే నీకు ప్రేమ లేదా అర్జంట్‌గా మూడు లక్షల రూపాయలు పంపాలని, ఈ ఫోన్ నంబర్‌కు మళ్లీ మళ్లీ పోన్ చేయవద్దని చెప్పాడు. ఆమె పెద్దగా స్పందించలేదు. శనివారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి బస్సులో మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌కు వచ్చాడు. సాయంత్రం 6 గంటలకు మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్లైన్లో బస్సు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్‌కు మెసేజ్ రావడంతో తల్లి ఆశా చూసి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించింది. మాచెర్లకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న బస్సులో కూర్చున్న సమీర్‌ను రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి తల్లి ఆశకు సమీర్‌ను అప్పగించడంతో కథ సుఖాంతమైంది. -
పెళ్లి ఇష్టలేక కిడ్నాప్ డ్రామా..
సాక్షి, శంషాబాద్: ఓ యువకుడు తాను కిడ్నాప్ అయి నట్లు సమాచారం ఇచ్చి తన కుటుంబసభ్యులతోపాటు పోలీసులను ఉరుకులుపరుగులు పెట్టించాడు. తీరా.. పోలీసుల దర్యాప్తులో అతడు డ్రామా ఆడినట్లు తేలింది. తన కుమారుడు ప్రవీణ్ మంగళవారం రాత్రి లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడని, అనంతరం అతడి జాడ లేకుండా పోయిందని మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడెంకు చెందిన శేషగిరిరావు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లండన్ నుంచి వచ్చిన కొద్దిసేపటికి తనను క్యాబ్ డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బులు, బంగారం దోచుకున్నాడని ప్రవీణ్ తమకు సమాచారం ఇచ్చాడంటూ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. ప్రస్తుతం అతడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు ప్రవీణ్ అనే వ్యక్తి లండన్ నుంచి వచ్చినట్లు ఎలాంటి సమాచారమూ లేదని తేల్చేశారు. ప్రవీణ్ ఉద్దేశపూర్వకంగానే కుటుంబీకులనుు తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా అతడు కర్ణాటకలోని కోలార్‌లో నివాసముంటూ కటుంబీకులకు మాత్రం లండన్‌లో ఉంటు న్నట్లు నమ్మించినట్లు నిర్ధారించారు. మరో పదిహేను రోజుల్లో ప్రవీణ్ వివాహం ఉండడంతో అతడు వివాహం ఇష్టలేక ఉద్దేశపూర్వకంగానే కుటుంబసభ్యులను తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ చెప్పిన వివరాలన్నీ తప్పుడు సమాచారమేనని శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ మీడియాకు వివరించారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరింత సమాచారం రాబట్టనున్నట్లు చెప్పారు. -
సినిమాను తలపించే రియల్ క్రైమ్ స్టోరీ
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటే తాను ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని ఓ వ్యక్తి కిడ్నాప్ డ్రామా ఆడాడు. లండన్ నుంచి వస్తున్న తనను కిడ్నాప్ చేసి డబ్బు, నగలు దోచుకెళ్లారంటూ తల్లిదండ్రులను నమ్మించాడు. కన్నవాళ్లను, పోలీసులను తప్పుదోవపట్టించి... చివరకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దమ్మాయిగూడకు చెందిన ప్రవీణ్ చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు. తమ కొడుకు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడని ప్రవీణ్ తల్లిదండ్రులు మురిసిపోయారు. కుమారుడు పిల్లాపాపల్తో కళకళడుతుంటే చూసి సంతోషించాలనుకున్నారు. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. అయితే తాను పెళ్లి చేసుకుంటే లండన్‌లో ఉద్యోగం చేయటం లేదన్న సంగతి బయటపడుతుందనుకున్న ప్రవీణ్ ఓ పథకం వేశాడు. లండన్ నుంచి వచ్చిన తనను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడని, తీవ్రంగా కొట్టి తన వద్ద ఉన్న బంగారం, నగదును దోచుకెళ్లాడని తండ్రి శేషగిరికి ఫోన్ చేశాడు. దీంతో శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించారు. అయినప్పటికి కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల దృష్టి ప్రవీణ్ మీదకు మళ్లింది. ప్రవీణ్‌పై అనుమానం వచ్చిన పోలీసులు కొంచెం గట్టిగా అతడ్ని విచారించేసరికి అసలు నిజం బయటపెట్టాడు. పెళ్లి ఇష్టం లేకే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విచారణలో వెల్లడించాడు. చెన్నైలో ఉంటూ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నానని తల్లిదండ్రులను మోసం చేసినట్లు తెలిపాడు. -
బాలుడు చెప్పిన కథ అవాక్కయ్యేలా చేసింది!
అంబర్‌పేట: అమ్మా.. నన్ను కిడ్నాప్ చేశారు..! గాబరా పడ్డ తల్లి తండ్రికి సమాచారం అందించింది. నా కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆ తండ్రి హైరానా పడ్డాడు. కట్ చేస్తే సీన్లోకి పోలీసులు వచ్చారు. కిడ్నాప్ అనేసరికి పోలీసులతో పాటు స్థానికులు ఉలిక్కిపడ్డారు. రద్ధీగా ఉండే ప్రాంతంలో కిడ్నాప్ జరగడానికి అవకాశమే లేదని స్థానికులు అనుమానిస్తున్నప్పటికీ సదరు బాలుడు చెప్పిన స్క్రిప్ట్ పక్కాగా ఉండటంతో అంతా నమ్మేశారు. కిడ్నాప్ వార్త క్షణాల్లో పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో స్థానిక పోలీసు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన పోలీసులు కిడ్నాప్ జరగలేదని నిర్ధారణకు వచ్చారు. అయితే బాలుడు చెప్పిన కథ నమ్మేలా ఉంది. తీరా సీసీ టీవీ కెమెరాలు చూస్తే కిడ్నాప్ ఉత్తదే అని నిర్ధారణ కావడంతో అంతా అవాక్కయ్యారు. మరో కేసులో.... ఇటీవల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి సైతం ఒత్తిడి తట్టుకోలేక కిడ్నాప్ డ్రామా ఆడటం సంచలనం సృష్టించింది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక, బయటికి చెప్పుకోలేక విద్యార్థులు ఒత్తిడితో అసలు చదువు పక్కనబెట్టి ఇలాంటి చర్యలకు దిగడం ఆందోళనకరం. బాలుడు చెప్పిన కథ.... ఎల్కేజీ నుంచి ఇంజినీరింగ్ చదివే విద్యార్థుల వరకు వారి తల్లిదండ్రులు చదువు పేరుతో చేసే ఒత్తిడి ఈ బాలుడు చెప్పిన కథకు చక్కని నిదర్శనం. 5వ తరగతి చదివే ఈ బాలుడికి తల్లిదండ్రులు ఉదయం లేస్తే పాఠశాల, అనంతరం ట్యూషన్, నిద్రపోవడం మినహాయించి ఎలాంటి ఆటవిడుపు ఇవ్వడం లేదు. కనీసం ఇంట్లో టీవీ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఇంటి నుంచి బయటపడి స్వేచ్ఛాజీవిలా గల్లీలో గంతులేశాడు. గంటకు పైగా పరిసరాలను గమనిస్తూ పరవశించిపోయాడు. గంట తరువాత తల్లి బాలుడి కోసం గల్లీలో వెతుక్కుంటూ రావడంతో గమనించిన బాలుడు భయంతో తల్లి దగ్గరికి పరిగెత్తి ఓ చక్కని అబద్ధపు కథను అప్పటికప్పుడు అల్లాడు. అమ్మా... నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. వారి బారినుండి తప్పించుకుని బయటపడ్డానన్నాడు. ఎలా పడ్డావంటే ఇద్దరు వ్యక్తులు ముసుగులతో మారుతీ ఓమ్ని వ్యాన్‌లో వచ్చి ఒక్కసారిగా అందులోకి లాక్కున్నారు. అనంతరం వారిద్దరికీ ఒకేసారిఫోన్ రావడంతో వారి బారినుంచి తప్పించుకుని వచ్చానన్నాడు. అందరూ నమ్మేలా కాళ్లకు చేతితో రక్కుకున్నాడు. స్క్రిప్ట్ పక్కాగా ఉండడంతో అంతా నమ్మారు. సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు గల్లీల్లో స్వేచ్ఛగా ఎగిరేతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు అతడి తల్లిదండ్రులకు చూపించి మీ అబ్బాయి కిడ్నాప్ కాలేదని, కిడ్నాప్ అయ్యానంటూ చక్కని అబద్ధపు కథ చెప్పాడు. దానికి మీ పెంపకమే కారణమంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నిర్బంధం వ్యక్తిత్వ వికాసానికి దెబ్బ విద్యార్ధులను నిర్బందించి తల్లిదండ్రుల ఆశయాలను వారిపై రుద్దితే వారి వ్యక్తిత్వ వికాసానికి నష్టం జరుగుతుంది. లోకంతీరు వారికి తెలియాలి. పిల్లలకు కావాల్సిన సమకూర్చి అక్కర్లేనివి అంతే ప్రేమతో దూరంగా పెట్టాలే తప్ప దేనినీ అతిగా చేయకూడదు. వారిని స్వేచ్ఛ ఇస్తూనే వెనకాల గమనిస్తూ ఉండాలి. చిన్నారుల ప్రతి అంశంలో అడ్డుతగిలితే వారు భవిష్యత్‌లో ఏమీ చేయకుండా మిగిలే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇతరుల పిల్లలతో పోల్చుకొని తమ పిల్లలు కూడా అలాగే ఉండాలనుకోవడం పొరపాటు. –బీవీ సత్యనాగేష్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ సహజ అలవాట్లు నేర్పించాలి చిన్నారులు తరగతి గదులు, ఫోన్లో ఆటల వరకే పరిమితం కావడంతో వారికి బయటి ప్రపంచంతో పరిచయం లేకుండా పోతోంది. వారు ఎలాంటి పనిచేయాలన్న ఫోన్లో జరిగే సంఘటనల ఆధారంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రమాదకరం. వీడియో గేముల్లో కదలికలు, అందులోని చర్యలనే వీరు అనుకరిస్తూ సహజ లక్షణాలను కోల్పోతున్నారు. దీంతో బయటివారు చెప్పే విషయాలను కూడా పట్టించుకోకుండా మొండిగా తయారవుతున్నారు. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. –మోహన్‌కుమార్, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ -
ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు కిడ్నాప్ డ్రామా
గుంటూరు, తాడేపల్లిరూరల్: నవ్యాంధ్ర రాజధానిలో దళారులు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో మహేష్ నివసిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పిచ్చికందుల గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం విజయవాడ వచ్చి గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. రాజధాని ప్రాంతంలో 5 సెంట్ల స్థలం కావాలని కోరడంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మహేష్ స్థలాన్ని చూపించారు. మహేష్ సర్వే నబరు 172/2లో ఉన్న తన 5 సెంట్ల భూమిని రూ.40లక్షలకు అమ్ముతున్నట్లు 2017 సెప్టెంబరు నెలలో రూ.5లక్షలు ఇచ్చి అగ్రిమెంటు రాయించుకున్నారు. అదే నెలలో మరో రూ.6 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని, చెల్లించాల్సిన మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొత్తపల్లి శ్రీనివాసరావు ఫోన్ తీయకపోవడంతో పలుసార్లు విజయవాడ షాపునకు వెళ్లినా సమాధానం చెప్పలేదని బాధితుడు మహేష్ తెలియజేశాడు. మంగళవారం తాడేపల్లి బైపాస్‌రోడ్డులో కొత్తపల్లి శ్రీనివాసరావు కనిపించడంతో అడ్డుకొని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం పద అని మాట్లాడగా కాళ్లూగడ్డాలు పట్టుకొని రాయపూడిలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుందామని తీసుకెళ్లాడని, అనంతరం స్థలం కొనుగోలు చేసిన శ్రీనివాసరావు తన సహచరులకు ఫోన్ చేసి, మహేష్ కిడ్నాప్ చేశాడని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడని మహేష్ తెలిపారు. పోలీసులు తనకు ఫోన్ చేశారని, వెంటనే శ్రీనివాసరావును పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చానని, కిడ్నాప్ చేస్తే పెద్ద మనుషులతో కలిసి ఎందుకు మాట్లాడతామంటూ ప్రశ్నించినా, పోలీసులు చెప్పింది వినకుండా అతను చెప్పిన అందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘నాన్న నేను కిడ్నాప్ అయ్యా.. 5 లక్షలు పంపు’
నోయిడా : ‘నాన్న నేను కిడ్నాప్ అయ్యా.. 5 నిమిషాల్లో వచ్చి 5 లక్షలిచ్చి నన్ను కాపాడు’ అని ఓ 11 ఏళ్ల బాలుడు ఫోన్లో తన తండ్రితో ఏడుస్తూ అన్నాడు. కొడుకు మాటలతో కంగారుపడిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించగా అసలు బండారం బయట పడింది. ఆ కిడ్నాపర్ తన కొడుకేనని, అతనే ఈ డ్రామా ఆడాడని తెలుసుకుని ఆ తండ్రి అవాక్కయ్యాడు. ఈ సినిమాటిక్ కిడ్నాపింగ్ ఉత్తరప్రదేశ్, నోయిడాలోని చిహ్‌జార్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడి తండ్రికి కిరాణపు షాప్ ఉంది. అయితే ఆ కుర్రాడు తరుచు షాపులోని గళ్లాపెట్టె నుంచి డబ్బులు తీస్తుండటంతో అతని తల్లితండ్రులు మందలించారు. అలాగే సోమవారం ఉదయం కూడా షాపులోని రూ.100 దొంగలించాడంతో ఆ అబ్బాయి బాబాయ్ గట్టిగా మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు స్కూల్ అనంతరం గ్రేటర్ నోయిడాలోని బిస్రాక్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి సమయాన్ని ఆస్వాదించాడు. ఇంతలో అతనికో ఉపాయం తట్టింది. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి మొబైల్ అడిగి ఇంటికి ఫోన్ చేశాడు. తను కిడ్నాప్ అయ్యానని, వెంటనే వచ్చి 5 లక్షలిచ్చి కాపాడాలని తండ్రికి చెప్పాడు. అతను పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మొబైల్ వ్యక్తిని పట్టుకోగా అసలు వ్యవహారం తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి కేసునమోదు చేయలేదని, ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని అఖిలేష్ అనే పోలీస్ అధికారి పేర్కొన్నారు. -
చదువుకోవటం ఇష్టం లేక.. బాలుడి అతి తెలివి
సాక్షి, వేములవాడ : చదువుకోవటం ఇష్టంలేని ఏడేళ్ల బాలుడు అతి తెలివిగా ఆలోచించి కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఈ సంఘటన గురువారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణానికి చెందిన వరుణ్ 7వ తరగతి చదువుతున్నాడు. చదువుకోవటం ఇష్టం లేని వరుణ్ ఇంటినుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. గురువారం తమ్ముడు శుశాంత్‌తో కలిసి పాఠశాలకు బయలుదేరాడు. మార్గం మధ్యలో.. తనను కిడ్నాప్ చేసినట్లు అమ్మకు చెప్పాలని తమ్ముడితో ఒట్టు వేయించుకున్న వరుణ్ అక్కడినుంచి పారిపోయి వరంగల్ బస్సెక్కాడు. అతడి తమ్ముడు ఇంటికి చేరుకుని.. అన్నయ్యను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారని తల్లికి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిగా నిజాలు తేటతెల్లమయ్యాయి. చదువుకోవటం ఇష్టంలేక ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని పట్టుకోవాలని అతడు ప్రయాణిస్తున్న బస్ నెంబర్‌ను హుజురాబాద్ పోలీసులకు ఇచ్చారు. త్వరలో బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అర్ధరాత్రి వేళ వ్యక్తి కిడ్నాప్
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి వేళ బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నగరంలోని వెంకటేశ్వరపురం నేతాజీనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. నేతా జీనగర్ పాత లెట్రిన్ల సమీపంలో ఎస్కే మస్తాన్, గౌసియా దంపతులు నివాసం ఉంటున్నారు. మస్తాన్ నగరంలోని బృందావనంలో కృష్ణ అనే స్కూటర్ మెకానిక్ వద్ద పని చేస్తున్నాడు. మస్తాన్ శుక్రవారం రాత్రి పని నుంచి వచ్చి, భోజనం చేసి నిద్రించాడు. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో ఇంటి వెనుక వైపు ఉన్న తలుపునకు బయట వైపు గడియ పెట్టిన ముగ్గురు వ్యక్తులు ప్రధాన గేటు వద్దకు వచ్చి తలుపు తట్టారు. తలుపు తీసిన గౌసియాను మీ భర్తను పిలవమని చెప్పడంతో ఆమె మస్తాన్‌ను పిలిచింది. నిద్ర నుంచి లేచి మస్తాన్ వచ్చి ఎవరు కావాలి అని అడిగే లోపే గుర్తుతెలియని ముగ్గురు మస్తాన్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత వారిలో ఒక వ్యక్తి తిరిగి మస్తాన్ ఇంట్లోకి వచ్చి మస్తాన్, అతని భార్య గౌసియా సెల్ఫోన్లు తీసుకెళ్లాడు. ఈ పరిణామాల నుంచి తేరుకున్న గౌసియా తమ బంధువులకు, తెలియజేయటంతో శనివారం ఉదయం నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియడం లేదు. మస్తాన్‌కు ఇతరులతో ఎలాంటి తగాదాలు లేవని చెబుతున్నారు. అర్ధరాత్రి కిడ్నాప్‌నకు గురైన మస్తాన్ కోసం భార్య గౌసియా, పిల్లలు నాయబ్‌రసూల్, నస్రీన్ విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మస్తాన్ పనిచేసే యజమాని కృష్ణ, మస్తాన్ బంధువులు గాలిస్తున్నారు. -
పెళ్లి తప్పించుకోవడం కోసం...
ఘజియాబాద్ : ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ఝందపూర్ గ్రామానికి చెందిన అభిజిత్ తివారికి గతంలోనే వివాహమయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అభిజిత్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ యువతితో అభిజిత్ తాను బ్యాంక్‌లో పనిచేస్తున్నాని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఘజియాబాద్ నుంచి అహ్మాదాబాద్‌కు రప్పించాడు. దంపతులమని చెప్పి ఓ ఇంట్లో 15 రోజుల నుంచి అద్దెకుంటున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ తనను పెళ్లి చేసుకోవాలని అభిషేక్‌ను ఒత్తిడి చేసింది. దాంతో ఆమె నుంచి తప్పించుకోవడం కోసం అభిషేక్ తాను కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడు. అందులో భాగంగా ఆ మహిళకు ఆడగొంతుతో ఫోన్ చేసి అభిషేక్‌ను కిడ్నాప్ చేసానని... అతన్ని వదిలిపెట్టాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో కంగారుపడిన మహిళ అభిషేక్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు అభిషేక్ కిడ్నాప్ కాలేదని... అతను నాటకం ఆడుతున్నాడని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా తనకు ఇంతకు ముందే వివాహమయ్యిందని తెలిపాడు. ఇప్పుడు సహజీవనం చేస్తున్న మహిళ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండంతో ఆమె బారి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలా కిడ్నాప్ నాటకం ఆడానని తెలిపాడన్నారు. -
బాలుడి కిడ్నాప్.. డ్రామ
-
కిడ్నాపైన చిన్నారి క్షేమం
-
కిడ్నాప్ అయ్యానోచ్
‘‘తెలుగులో ఇప్పటివరకూ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా చిత్రం మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు నటుడు పోసాని కృష్ణమురళి. ఆయన ప్రధాన పాత్రలో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మధుర మూవీస్ పతాకంపై మాధవి అద్దంకి నిర్మిస్తున్న ‘నేను కిడ్నాప్ అయ్యా’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దగ్గుపాటి వరుణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత టి. ప్రసన్నకుమార్ క్లాప్ ఇచ్చారు. పోసాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నన్నెవరూ కిడ్నాప్ చేయకుండానే కిడ్నాప్ అవుతుంటా. అది ఎలా? అన్నది సినిమాలో చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది. ఇలాంటి మంచి నిర్మాతలు ఉంటే కొత్త టెక్నీషియన్స్‌తో పాటు పలువురికి ఉపాధి ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. హైదరాబాద్, విశాఖపట్నం, గోవాలో చిత్రీకరణ జరుపుతాం’’ అని దర్శకుడు అన్నారు. శ్రీకాంత్, ధీరూ, సౌమిత్రి, హర్ష కృష్ణమూర్తి, విశాల్, మహిమా కొట్టారి, అదితీ సింగ్, దీక్షిత పార్వతి, బ్రహ్మానందం, పృధ్వీ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్నారు. -
నేను.. కిడ్నాప్ అయ్యానోచ్..
తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్న చిన్నారులు దుష్ర్పభావం చూపుతున్న టీవీ సీరియళ్లు, సినిమాలు ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు ఏలూరు: ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం, రూ.లక్ష ఇస్తే వదిలిపెడతాం..’ అన్న ఫోన్ రాగానే ఆ తల్లిదండ్రుల గుండెలు గుభిల్లుమన్నాయి. వెంటనే సమీపంలోని పోలీసుస్టేషన్‌కు పరుగులు తీశారు. ఫోన్ వచ్చిన నంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడే పోలీసులు, తల్లిదండ్రులకు కళ్లు తిరిగే షాక్ తగిలింది. అదే చదవండి.. సమాజంలో వస్తోన్న అవాంఛనీయ మార్పులు, చోటు చేసుకుంటున్న దురదృష్టకర సంఘటనలు పసి మొగ్గలపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. నియంత్రణ కరువైన క్రమంలో సినిమాలు, టీవీలలో ప్రసారమవుతోన్న నేరాలు, ఘోరాలు కల్లా కపటం తెలియని చిన్నారుల నిర్మల హృదయాలను కలుషితం చేస్తున్నాయి. ఇందుకు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో తాజాగా జరిగిన రెండు సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గడచిన నెలలో ఒక బాలుడి తల్లిదండ్రులు త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌కు పరుగులు పెడుతూ వచ్చారు. నగరంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుకుంటున్న తమ చిన్నారి కొడుకును ఎవరో కిడ్నాప్ చేశారని, ఫోన్లో బెదిరింపు కాల్ వచ్చిందని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలుణ్ణి కిడ్నాప్ చేశామనే కాల్ వచ్చిన మొబైల్ నంబరు ఏ ప్రాంతానిదో గుర్తించారు. అది విజయవాడ పరిసర ప్రాంతంలో ఉందని గుర్తించి తల్లిదండ్రులతో కలిసి అక్కడికి చేరుకుని సెల్ సిగ్నల్స్ ఆధారంగా బాలుడున్న ప్రదేశానికి చేరుకున్నారు. తీరా అక్కడ ఆ బాలుడు తన స్కూలు స్నేహితుడితో కలిసి దాక్కుండడం గుర్తించారు. కిడ్నాప్ ఉదంతం ఒట్టిదని కుర్రాడే కి డ్నాప్ డ్రామా ఆడాడని తెలిసి పోలీసులతో పాటు వాడి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్కారు. కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడావని పోలీసులు పిల్లవాడిని గదమాయిస్తే అసలు విషయం చెప్పాడు. తాను చూసే టీవీ సీరియల్లో కుర్రాడు కిడ్నాప్ అయితే వాడి తల్లిదండ్రులు ఎంతగానో అల్లాడిపోయారని, తాను కిడ్నాపైతే తన వాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఇలా చేశానని చెప్పాడు. మరో సంఘటన.. ఇదే క్రమంలో నగరంలో మరో పోలీసుస్టేషన్లో నమోదైన చిన్నారి కిడ్నాప్ ఉదంతం మరో ట్విస్ట్‌తో సుఖాంతమైంది. యథావిధంగా తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ ముద్దుల కొడుకును ఎవరో కిడ్నాప్ చేసి ల క్ష రూపాయలు ఇవ్వకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ ఆధారంగా కేవలం గంట వ్యవధిలో కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడు డబ్బుల కోసం కిడ్నాప్ నాటకం నడిపాడని తె లుసుకుని పిల్లల్ని సక్రమంగా పెంచాలని తల్లిదండ్రులకు క్లాసు ఇచ్చి పంపేశారు. పిల్లల్ని గమనిస్తూ ఉండాలి ప్రస్తుత బిజీ లైఫ్‌లో పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ కొరవడుతోంది. దీంతో వారు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని సీరియళ్లలో ఘటనలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి నిదర్శనమే గత నెలలో జిల్లాలో జరిగిన కిడ్నాప్ డ్రామాలు. ఇటువంటివి జరగకుండా పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. వారి నడవడికను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. - ఎం.సాగరబాబు, త్రీ టౌన్ ఎస్సై, ఏలూరు