ఫేస్‌బుక్ ఆధారంగా బయటపడిన కిడ్నాప్ డ్రామా | Kidnap drama broke out with face book | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ ఆధారంగా బయటపడిన కిడ్నాప్ డ్రామా

Published Sat, Oct 19 2013 9:46 PM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

Kidnap drama broke out with face book

నోయిడా: ఓ ఆకతాయి ఆడిన కిడ్నాప్ డ్రామా ఫేస్‌బుక్ కారణంగా బట్టబయలైంది.  ఎనిమిదో తరగతి చదువుతున్న నోయిడాకు చెందిన ఓ విద్యార్థి తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని నమ్మిస్తూ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులకు సందేశం పంపాడు. దీంతో కంగారుపడిన ఆ కుర్రాడి తల్లిదండ్రులు సెక్టార్ 24లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా ఆచూకీ కనిపెట్టడంతో అసలు విషయం తెలిసొచ్చింది.  ఈ విషయమై నోయిడా డీఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ... ‘నోయిడాలోని సెక్టార్ 22లో ఉంటున్న ఓ విద్యార్థి పొరుగునే ఉంటున్న ఓ మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
 
 

దీంతో పొరుగునే ఉండే ముగ్గురు సదరు విద్యార్థిని తీవ్రంగా మందలించారు. తనను తిట్టారన్న కోపంతో వారిపై పగ తీర్చుకునేందుకు కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. అక్టోబర్ 14 నుంచి కనిపించకుండా పోయిన సదరు కుర్రాడు 16న తనను పొరుగునే ఉంటున్న ముగ్గురు కిడ్నాప్ చేశారని, నోయిడాలోని చౌరా గ్రామంలో బంధించారని పేర్కొంటూ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులకు సందేశం పంపాడు. ఆ సందేశాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు చూపించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విద్యార్థి ఆచూకీని గుర్తించారు. ప్రశ్నిస్తే తననెవరూ కిడ్నాప్ చేయలేదని, మొదటి రెండ్రోజులు స్నేహితుల ఇంట్లో ఉన్నానని, అక్కడి నుంచి చెన్నై వెళ్లిపోయానని చెప్పాడు. అయితే తన ఫోన్ తీసుకెళ్తే పట్టుబడతాననే భయంతో స్నేహితుడి ఫోన్‌ను తీసుకెళ్లానని తెలిపాడ ’న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement