కిడ్నాప్ డ్రామా ఆడిన మల్లయ్య, రాజేశం
మంథని: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 50 లక్షలతో వెళ్లిన తాము కిడ్నాప్‌కు గురయ్యామన్న ఇద్దరు వ్యక్తుల వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం కిడ్నాప్ నాటకం ఆడినట్లు తేల్చి 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మంథనిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ వివరాలు వెల్లడించారు. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బిల్క్ ఉన్నిసాబేగం వద్ద కొనుగోలు చేసి న భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 17న రూ. 50లక్షలతో ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వారు తిరిగి రాలేదని రాజేశం భార్య పుష్పలత రామగిరి పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు.
వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నెల 19న అర్ధరాత్రి రెండు గంటలకు రాజాపూర్ శివారులో మల్లయ్య, రాజేశంలను వదిలేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిని తీసుకెళ్లి విచారించారు. తమను గు ర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు బాధితులు వెల్లడించారు. అనంతరం మంథని సీఐ మహేందర్ రెడ్డి, రామగిరి ఎస్సై మహేందర్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చి, గట్టిగా మందలించడంతో కిడ్నాప్ డ్రామా ఆ డినట్లు ఒప్పుకున్నారు.
తమకు భూమి అ మ్ముతానని ఉన్నిసాబేగం రూ.36లక్షలు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. భూ సమస్య పరి ష్కారం కోసమే నాటకం ఆడినట్లు చెప్పారని డీసీపీ పేర్కొన్నారు. ఖాళీ సంచినే డబ్బులు ఉన్నట్లు నమ్మించినట్లు చెప్పారన్నారు. రాజేశం, మల్లయ్యలపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించిన ట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు కిరణ్, సదానందంల కు నగదు పురస్కారం అందించి, మంథని సీఐ, రామగిరి ఎస్సైలను అభినందించారు.
చదవండి:
రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు
చెప్పిన కథనంలో అనుమానాలు.. అసలేం జరిగింది..?
Comments
Please login to add a commentAdd a comment