పెద్దపల్లి జిల్లాలో ఘోరం.. బాలికపై హత్యాచారం | Minor Raped And Killed At Peddapalli Rice Mill | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి: ఆరేళ్ల బాలిక హత్యాచారం.. నిందితుడి అరెస్ట్‌

Published Fri, Jun 14 2024 10:34 AM | Last Updated on Fri, Jun 14 2024 11:32 AM

Minor Raped And Killed At Peddapalli Rice Mill

పెద్దపల్లి, సాక్షి: జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక అత్యాచారం.. ఆపై హత్యకు గురైంది. నిందితుడిని గాలించి పట్టుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్‌లో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. 

ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. అరెస్ట్‌ చేశారు. బలరాంపై పోక్సో యాక్ట్‌, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబం ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామంగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement