Minor Rape and Murder Case
-
పెద్దపల్లి: ఆరేళ్ల బాలిక హత్యాచారం.. నిందితుడి అరెస్ట్
పెద్దపల్లి, సాక్షి: జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక అత్యాచారం.. ఆపై హత్యకు గురైంది. నిందితుడిని గాలించి పట్టుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. అరెస్ట్ చేశారు. బలరాంపై పోక్సో యాక్ట్, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబం ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామంగా తెలుస్తోంది. -
బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం!
సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచార కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సుజిత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా(గుజరాత్) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్లోనే చేదు అనుభవం ఎదురైంది. జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్ సాకేత్ కోపంతో ఊగిపోయాడు. తన కాలి చెప్పులను తీసి జడ్జి పీఎస్ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడలేదు. ఆయనకు కాస్త ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి కంగుతినగా.. పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు. Special POCSO Judge P.S. Kala ఇదిలా ఉంటే జడ్జి పీఎస్ కళ గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించడం విశేషం. ఇదిలా ఉంటే హజిరా ఉదంతంలో బాధితురాలు ఐదేళ్ల బాలిక. ఆమె ఓ వలస కార్మికుడి కుటంబానికి చెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చాక్లెట్ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేయడం విశేషం. -
నరరూప రాక్షసుడ్ని.. కండోమ్ పట్టించింది
ఎనిమిదేళ్ల చిన్నారిని ఒళ్లు గగుర్బొడిచే రీతిలో హత్యాచారం చేసి.. ఆపై పోలీసులకు చిక్కకుండా సైకోయిజం ప్రదర్శించిందో మృగం. అయితే ముప్పై ఏళ్ల తర్వాత నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ కేసును ఓ కండోమ్ సాయంతో పోలీసులు చేధించటం విశేషం. ఇండియానా రాష్ట్రం, ఫోర్ట్ వైనే నగరంలో 1988, ఏప్రిల్1న 8 ఏళ్ల చిన్నారి ‘ఏప్రిల్ టిన్స్లే’ అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడు రోజుల తర్వాత అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో బాలిక మృతదేహం ముక్కలై పడి ఉంది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో చిన్నారిని లైంగికదాడి చేసి, ఆపై చిత్రవధ చేసి చంపినట్లు తేలింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు మాత్రం పోలీసులకు సవాల్ విసురుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో 1990లో నగరంలోని ఓ గోడ మీద..‘ఆ ఎనిమిదేళ్ల చిన్నారిని చంపింది నేనే. ఆ పాపా ఇంకో షూ మీకు దొరికిందా?.. హహ.. మళ్లీ చంపేస్తా’ అంటూ రాతలు కనిపించాయి. దీంతో పోలీసులు దర్యాప్తును మరింత ఉధృతం చేశారు. సుమారు 30 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. చివరికి జన్యుశాస్త్రవేత్త సాయంతో దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జెనాలజీని ఆశ్రయించారు. (జెనాలజీ అంటే వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు. ఆ డేటా ఇంటర్నెట్లో దొరుకుతుంది కూడా). కండోమ్ ద్వారానే... జెనాలజీ ఆధారంగా గ్రాబిల్‌కు చెందిన జాన్ మిల్లర్(59), అతని సోదరుడిపై పోలీసులకు అనుమానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో జాన్ మిల్లర్ ఇంటి డస్ట్ బిన్ నుంచి విచారణ అధికారులు కండోమ్‌లను సేకరించారు. వాటి పరీక్షల అనంతరం నిందితుడు మిల్లరే అని నిర్ధారించిన పోలీసులు.. చివరకు అతన్ని అరెస్ట్ చేశారు. తాము ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలోనే మిల్లర్ నేరం ఒప్పేసుకున్నాడని అలెన్ కౌంటీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను అలెన్ కౌంటీ జైలుల్లో ఉండగా, వచ్చే వారం కేసు కోర్టులో విచారణకు రానుంది. గోల్డెన్ స్టేట్ కిల్లర్, టకోమా చిన్నారి మిచెల్లా వెల్చ్ హత్యాచారం కేసు కూడా జెనాలజీ ద్వారానే చిక్కుముడి వీడటం తెలిసిందే. -
కొడుకులా చూసుకున్నాం, కానీ...
ఫరిదాబాద్: హర్యానాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. కన్నకొడుకులా చూసుకున్న యాజమానికి తీరని శోకం మిగిల్చిందో మానవ మృగం. నాలుగేళ్ల చిన్నారిని అతిక్రూరంగా హత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఆపై మృతదేహాన్ని తన ఇంట్లో దాచిపెట్టాడు. ఫరిదాబాద్‌లోని పల్వాల్ మండలం అసోథి గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం... చిన్నారి తండ్రి స్థానికంగా ఓ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. 24 ఏళ్ల భోలు అలియాస్ వీరేందర్ ఆ షాపులో తొమ్మిదేళ్లుగా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన భోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడిన అనంతరం చంపి, ఇంట్లోని డ్రమ్‌లో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏం తెలియనట్లు తిరిగి దుకాణానికి వచ్చేశాడు. బాలిక కనిపించపోయే సరికి కంగారుపడిన తల్లిదండ్రులు ఊరంతా వెతకటం ప్రారంభించారు. వారికి భోలు కూడా సాయం చేస్తున్నట్లు నటించాడు. నిందితుడి తల్లి సహకారం... అయితే చిన్నారి తండ్రితో కొందరు స్థానికులు.. బాలికను భోలు తీసుకెళ్లటం చూశామని చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది. భోలు ఇంటికి చేరుకున్న బాలిక బంధువులు ఇంట్లో సోదాలు చేసేందుకు యత్నించారు. అయితే భోలు తల్లి మాత్రం వాళ్లను ఇంట్లోకి రానివ్వలేదు. పైగా వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో బలవంతంగా వారంతా ఇంట్లోకి చొరబడి సోదా చేశారు. చివరకు ఓ గదిలో రక్తపు మరకలు, డ్రమ్‌లో బాలిక మృతదేహాన్ని గుర్తించిన బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు భోలుని, నేరానికి సహకరించిన అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు. (కథువా ఘటన కథనాలు) ఉరి తీయాలి... ‘తొమ్మిదేళ్లుగా నా దగ్గర నమ్మకంగా పని చేశాడు. కొడుకులా చూసుకున్నాం. కానీ, నా కూతురినే కిరాతకంగా చంపాడు. వాడి కళ్ల ముందే పుట్టి పెరిగిన నా బిడ్డను మృగంలా కబలించాడు. వాడిని ఉరి తీస్తేనే న్యాయం జరుగుతుంది. నాలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదు’ అని చిన్నారి తండ్రి కోరుతున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో బాలల హక్కుల సంఘాలు శనివారం ఫరిదాబాద్‌లో సంఘీభావ ర్యాలీని నిర్వహించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు కోరుతున్నాయి. కేసులు నమోదు... కాగా, ఘటన అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో బలగాలను మోహరించిన పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఐపీసీతోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. సీసీఫుటేజీ, నిందితుడి ఇంట్లో రక్తపు మరకల, స్థానికుల స్టేట్మెంట్ ఆధారంగా నిందితులపై అభియోగాలు నిరూపణ అయ్యే అవకాశం ఉందని దేవేంద్ర సింగ్ అనే అధికారి వెల్లడించారు. భోల్‌కు వివాహమైనప్పటికీ అతని పద్ధతి నచ్చని భార్య రెండేళ్లుగా దూరంగా ఉంటోంది. ప్రస్తుతం భోలు, అతని తల్లి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారని పోలీసులు తెలిపారు. -
‘ఆ చిన్నారికి తాతలాంటోడిని..’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కథువా కేసులో ప్రధాన నిందితుడు సాంజిరామ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను అమాయకుడినని, తనకే పాపం తెలీదని.. కుట్రపన్ని పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఆరోపణలకు దిగాడు. ఈ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో శుక్రవారం ఓ అఫిడవిట్ దాఖలు చేశాడు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు... ‘ఆ చిన్నారికి నేను తాతలాంటోడ్ని. పోలీసులు కుట్ర పన్ని ఈ కేసులో మమల్ని ఇరికించారు. బాధితురాలికే కాదు.. ఈ కేసులో మాకు కూడా న్యాయం జరగాల్సిందే. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అసలు నేరస్థులు ఎవరన్నది తేలుతుంది. ఛండీగఢ్ కోర్టుకు కేసును బదిలీ చేయాలన్న డిమాండ్ హేతుబద్ధమైంది కాదు. కానీ, ఈ కేసులో 221 మంది సాక్ష్యులు ఉన్నారు. వారందరినీ కథువా నుంచి ఛండీగఢ్ తరలించటం చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలోనే కేసును బదిలీ చేయాలని కొందరు వాదిస్తున్నారు. కానీ, దీనివెనుక వేరే ఉద్దేశం ఉంది. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మమల్ని చంపాలని చూస్తున్నారు. అందుకే అనుమతించొద్దు’ అని సాంజీరామ్, అతని తనయుడు విశాల్ తరపున న్యాయవాది అఫిడవిట్లో విజ్ఞప్తి చేశారు. కథువా కేసు.. దిగ్భ్రాంతికర విషయాలు ఇక ఈ కేసులో బాధితురాలి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌ను కూడా సాంజీ రామ్ వదల్లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఆమె వాదనలు వినిపించలేదు. అలాంటప్పుడు ప్రాణ హాని ఉందని ఆమె ఎలా అంటున్నారు. ఆమె కోసం నియమించిన భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలి’ అని సాంజీ రామ్ విజ్ఞప్తి చేశాడు. కాగా, తన కొడుకును రక్షించుకునేందుకే ఆ చిన్నారిని చంపాల్సి వచ్చిందన్న సాంజీరామ్ వాంగ్మూలాన్ని పోలీసులు ఇదివరకే నమోదు చేశారు. నేను కూడా ‘కథువా’ బాధితురాలినే... ‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం -
‘సూరత్’ కేసులో సాయం చేయండి
అహ్మదాబాద్ : మైనర్ బాలికపై పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పటిదాకా చిన్న సాక్ష్యాన్ని కూడా సూరత్ పోలీసులు చేధించలేకపోయారు. అసలు బాధిత బాలిక వివరాలు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు తీరుపై విమర్శలు వినిపిస్తుండగా.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామనే సంకేతాలను సూరత్ పోలీసులు అందించారు. బాధిత బాలిక మృతదేహం ఫోటోలను సూరత్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బ్లూ టీషర్ట్ ధరించి ఉన్న ఆ బాలిక వయసు సుమారు 9-11 ఏళ్ల లోపు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ బాలిక గురించి తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని.. తగిన పారితోషకం కూడా అందిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘డీఎన్ఏ శాంపిల్స్ ద్వారా ఈ కేసును చేధించేందుకు కృషి చేస్తున్నాం. ఘటనాస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రతీ ఇంటిలో వాకబు చేశాం. ఈ కేసులో మిగతా రాష్ట్రాల సాయం కూడా తీసుకోవాలని నిర్ణయించాం. ఇప్పటికే పిల్లల అదృశ్యాలకు సంబంధించిన 8 వేల కేసులను పరిశీలించాం’ అని సూరత్ నగర కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఏప్రిల్ 6వ తేదీన భేస్తన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానం వద్ద స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో అతి కిరాతకంగా ఆ చిన్నారిని అత్యాచారం చేసి.. హింసించి చంపినట్లు తేలింది. బాలిక ఒంటిపై 86 గాయాలు ఉన్నాయని సూరత్ సివిల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. -
నిద్రలోనే ఎత్తుకెళ్లి రేప్.. మర్డర్
సాక్షి, బెంగళూర్: మైనర్ బాలికను నిద్రలోనే కాటువేసింది ఓ మానవ మృగం. కిడ్నాప్, రేప్ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. కర్ణాటక చికబల్లాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం ఇంటి బయట నిద్రించిన బాలికపై స్వయానా ఆమె మేనమామే తప్పతాగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎత్తుకెళ్లి ఊరి బయట ఉన్న ఓ ఫామ్ హౌజ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి సమీపంలోని పొదల్లో పడేశాడు. కూతురు కనిపించకపోయే సరికి కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా, శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం 25 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు.