నిందితుడు సాంజి రామ్.. పక్కన ‘కథువా’ చిన్నారి మృతదేహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కథువా కేసులో ప్రధాన నిందితుడు సాంజిరామ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను అమాయకుడినని, తనకే పాపం తెలీదని.. కుట్రపన్ని పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఆరోపణలకు దిగాడు. ఈ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో శుక్రవారం ఓ అఫిడవిట్ దాఖలు చేశాడు.
అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు... ‘ఆ చిన్నారికి నేను తాతలాంటోడ్ని. పోలీసులు కుట్ర పన్ని ఈ కేసులో మమల్ని ఇరికించారు. బాధితురాలికే కాదు.. ఈ కేసులో మాకు కూడా న్యాయం జరగాల్సిందే. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అసలు నేరస్థులు ఎవరన్నది తేలుతుంది. ఛండీగఢ్ కోర్టుకు కేసును బదిలీ చేయాలన్న డిమాండ్ హేతుబద్ధమైంది కాదు. కానీ, ఈ కేసులో 221 మంది సాక్ష్యులు ఉన్నారు. వారందరినీ కథువా నుంచి ఛండీగఢ్ తరలించటం చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలోనే కేసును బదిలీ చేయాలని కొందరు వాదిస్తున్నారు. కానీ, దీనివెనుక వేరే ఉద్దేశం ఉంది. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మమల్ని చంపాలని చూస్తున్నారు. అందుకే అనుమతించొద్దు’ అని సాంజీరామ్, అతని తనయుడు విశాల్ తరపున న్యాయవాది అఫిడవిట్‌లో విజ్ఞప్తి చేశారు.
కథువా కేసు.. దిగ్భ్రాంతికర విషయాలు
ఇక ఈ కేసులో బాధితురాలి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌ను కూడా సాంజీ రామ్ వదల్లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఆమె వాదనలు వినిపించలేదు. అలాంటప్పుడు ప్రాణ హాని ఉందని ఆమె ఎలా అంటున్నారు. ఆమె కోసం నియమించిన భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలి’ అని సాంజీ రామ్ విజ్ఞప్తి చేశాడు. కాగా, తన కొడుకును రక్షించుకునేందుకే ఆ చిన్నారిని చంపాల్సి వచ్చిందన్న సాంజీరామ్ వాంగ్మూలాన్ని పోలీసులు ఇదివరకే నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment