నిద్రలోనే ఎత్తుకెళ్లి రేప్.. మర్డర్
నిద్రలోనే ఎత్తుకెళ్లి రేప్.. మర్డర్
Published Fri, Aug 25 2017 3:54 PM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM
సాక్షి, బెంగళూర్: మైనర్ బాలికను నిద్రలోనే కాటువేసింది ఓ మానవ మృగం. కిడ్నాప్, రేప్ చేసి ఆపై దారుణంగా ప్రాణం తీశాడు. కర్ణాటక చికబల్లాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది.
బుధవారం సాయంత్రం ఇంటి బయట నిద్రించిన బాలికపై స్వయానా ఆమె మేనమామే తప్పతాగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎత్తుకెళ్లి ఊరి బయట ఉన్న ఓ ఫామ్ హౌజ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి సమీపంలోని పొదల్లో పడేశాడు.
కూతురు కనిపించకపోయే సరికి కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా, శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం 25 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement