‘నాన్న నేను కిడ్నాప్‌ అయ్యా.. 5 లక్షలు పంపు’ | 11 Year Old Asks Father To Come In 5 Minutes And 5 Lakh Ransom | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 17 2018 9:47 AM | Last Updated on Wed, Oct 17 2018 9:54 AM

11 Year Old Asks Father To Come In 5 Minutes And 5 Lakh Ransom - Sakshi

నోయిడా : ‘నాన్న నేను కిడ్నాప్‌ అయ్యా.. 5 నిమిషాల్లో వచ్చి 5 లక్షలిచ్చి నన్ను కాపాడు’ అని ఓ 11 ఏళ్ల బాలుడు ఫోన్‌లో తన తండ్రితో ఏడుస్తూ అన్నాడు. కొడుకు మాటలతో కంగారుపడిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించగా అసలు బండారం బయట పడింది. ఆ కిడ్నాపర్‌ తన కొడుకేనని, అతనే ఈ డ్రామా ఆడాడని తెలుసుకుని ఆ తండ్రి అవాక్కయ్యాడు. ఈ సినిమాటిక్‌ కిడ్నాపింగ్‌ ఉత్తరప్రదేశ్‌, నోయిడాలోని చిహ్‌జార్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడి తండ్రికి కిరాణపు షాప్‌ ఉంది. అయితే ఆ కుర్రాడు తరుచు షాపులోని గళ్లాపెట్టె నుంచి డబ్బులు తీస్తుండటంతో అతని తల్లితండ్రులు మందలించారు. అలాగే సోమవారం ఉదయం కూడా షాపులోని రూ.100 దొంగలించాడంతో ఆ అబ్బాయి బాబాయ్‌ గట్టిగా మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు స్కూల్‌ అనంతరం గ్రేటర్‌ నోయిడాలోని బిస్రాక్‌ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి సమయాన్ని ఆస్వాదించాడు. ఇంతలో అతనికో ఉపాయం తట్టింది. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి మొబైల్‌ అడిగి ఇంటికి ఫోన్‌ చేశాడు. తను కిడ్నాప్‌ అయ్యానని, వెంటనే వచ్చి 5 లక్షలిచ్చి కాపాడాలని తండ్రికి చెప్పాడు. అతను పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మొబైల్‌ వ్యక్తిని పట్టుకోగా అసలు వ్యవహారం తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి కేసునమోదు చేయలేదని, ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని అఖిలేష్‌ అనే పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement