హార్దిక్‌కు హైకోర్టు మందలింపు
అహ్మదాబాద్: గుజరాత్‌లో మంగళవారం ఓ బహిరంగ సభ తర్వాత తనను ఆగంతకులు కిడ్నాప్ చేశారంటూ పటీదార్ అనామత్ అందోళన్ నేత హార్దిక్ పటేల్ చెప్పేదంతా కట్టుకథలా ఉందంటూ గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అనవసరంగా కోర్టును దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని హార్దిక్‌ను, ఆయన న్యాయవాదిని మందలించింది.
మంగళవారం ఆరావళి జిల్లాలో ప్రజాసభ తర్వాత హార్దిక్ అదృశ్యం నేపథ్యంలో ఆయన అనుచరుడు హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను గురువారం డివిజన్ బెంచ్ విచారించింది. అవసరమనుకుంటే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తుచేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదావేసింది.