Upadi Hami Scheme (NREGS)
-
పేదల ‘ఉపాధి’కి కోత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(Upadi Hami Pathakam) కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది.గత ఆర్థిక సంవత్సరం(2023–24)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పని దినాలకు, ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పనిదినాలను పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేరకు నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతిరాజకీయ కారణాలతో పనికి ఎసరు!కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది జూన్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ పథకంలో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్లను పెద్ద ఎత్తున తొలగించేలా చేశారు.క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమ పార్టీల కార్యకర్తలను నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి ఉపాధి హామీ పథకం అమలుపై అవగాహన లేకపోవడంతోపాటు వాళ్లు గ్రామాల్లో రాజకీయాలకు ప్రభావితమై తమకు ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులకు పనుల కల్పనకు ఇష్టపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల రాష్ట్రంలోని పేదలు ఆరు నెలల్లోనే రూ.700 కోట్ల వరకు నష్టపోవాల్సి వచి్చంది. ఉపాధి పనుల కల్పన ఇలా..⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంలోని 2023 జూన్ నుంచి 2024 జనవరి మధ్య రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. ⇒కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలోని 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించారు. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి జనవరి వరకు ఎస్సీలకు 22.41 శాతం పని దినాలు కల్పించారు. అదే కాలానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 21.87 శాతానికి తగ్గిపోయింది. ⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2024 ఏప్రిల్, మే నెలల్లో కూడా 12.72 కోట్ల పనిదినాలు కల్పించడం విశేషం. ⇒ ప్రస్తుతం ఉపాధి కూలీలకు సగటున రోజుకు రూ.255 చొప్పున వేతనాలు లభిస్తున్నాయి.⇒ కూటమి ప్రభుత్వం గత ఏడాది మాదిరిగా పనులు కల్పించినా గ్రామీణ పేదలకు రూ.700 కోట్ల వరకు లబ్ధి కలిగేది. -
అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్లైన్ వేదికగా చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవతవకలకు ఆస్కారం ఎలా ఉంటుందని టీడీపీ ఎంపీలను నిలదీశారు కేంద్రమంత్రి. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. అన్ని పనులకు జియో ట్యాగ్గింగ్, పనుల, కూలీల ఫోటోలు ఉంటాయని అధికారులు కూడా చెప్పడంతో టీడీపీ ఎంపీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఒకపక్షం వాదనలు విని చర్యలు తీసుకోలేమని మంత్రి తేల్చిచెప్పేశారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి తదుపరి చర్యలు మంత్రి స్పష్టం చేశారు. దాంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ ఎంపీలు , ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైబి రాజేంద్రప్రసాద్‌లకు ఏమి చేయలో పాలుపోక అలానే తిరుగుముఖం పట్టారు. చదవండి: ఏపీ అప్పులపై పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
ఉపాధి హామీ పథకం పనులు కల్పించడంలో ఏపీ నెంబర్ వన్
-
తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు
మంచిర్యాల రూరల్: ఉపాధి హామీ పథకం అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ఉపేక్షించేది లేదని డీఆర్డీఓ బి.శేషాద్రి స్పష్టం చేశారు. మంగళవారం హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం 2వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 17గ్రామ పంచాయతీల్లో 2020 డిసెంబర్ ఒకటి నుంచి 2023 మార్చి 31వరకు చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాయి. ఈ సందర్భంగా పనుల్లో జరిగిన తప్పులు, నిధుల దుర్వినియోగం గుర్తించారు. పక్కదోవ పట్టిన నిధులను రికవరీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మండలంలో 835 ఉపాధి పనులు చేపట్టగా రూ.7.45 కోట్లపై విలువైన పనులు జరిగాయని, పంచాయతీ రాజ్ పరిధిలో 160 పనులకు రూ.4.51 కోట్లకు పైగా విలువైన పనులు జరిగాయని, అటవీ శాఖ పరిధిలో రూ.2.68 లక్షలతో పనులు జరిగినట్లు తెలిపారు. కొలతలు, రికార్డుల విషయంలో లోపాలు జరిగాయని, ఉపాధి హామీ పనులు తప్పుల తడకగా జరిగాయని తనిఖీ బృందాలు తేల్చిచెప్పాయి. డీఆర్డీఓ శేషాద్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, జెడ్పీ కో ఆప్షన్ నహీంపాషా, అదనపు డీఆర్డీఓ దత్తారావు, డీవీఓ సురేశ్, ఎస్టీఎం నరేందర్, అంబుడ్స్‌మెన్ పర్సన్ శివరామ్, క్వాలిటీ కంట్రోలర్ చంద్రశేఖర్, విజిలెన్స్ మేనేజర్ కిరణ్, ఎస్ఆర్పీ భగవంత్‌రావు, ఎంపీడీఓ అబ్దుల్‌హై, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, ఏపీఓ మల్లయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అప్పట్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్
-
ఉపాధి హామీ పథకం మా గ్రామంలోని 600 మందికి జీవనాధారం
-
AP: రోజూ జిల్లాకో లక్ష మందికి ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజను ముగుస్తుండటంతో పేదలు పనుల్లేక వలస పోయే పరిస్థితి లేకుండా ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ ప్రతి జిల్లాలో లక్ష మందికి పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మార్చి నెలాఖరుకి కనీసం ఐదు కోట్ల పని దినాల పాటైనా పేదలకు పనులు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఐదేళ్లుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా పేదలకు సొంత గ్రామాల్లో పనుల కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పను22ళ కల్పనపై గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ రోజూ జిల్లా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పనుల గుర్తింపుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 4,022 కోట్ల మేర ఉపాధి పనులు గత వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనులతో కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి) ఇప్పటివరకు 19.07 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. 43.08 లక్షల కుటుంబాలకు చెందిన 76.08 లక్షల మంది వారి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకొని ఇప్పటికే రూ. 4,022 కోట్లు లబ్ధి పొందారు. వీరిలో దాదాపు 34 శాతం ఎస్సీ, ఎస్టీలే. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన దాదాపు 70 రోజుల్లో కనీసం ఐదు కోట్లు పనిదినాలు పని కల్పించాలని, మొత్తంగా ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. పని దినాల కేటాయింపులు పెంచిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది మూడో విడత పని దినాల కేటాయింపులు పెంచింది. ఈ ఆర్థిక ఏడాదికి మొదట రాష్ట్రానికి 14 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించిన కేంద్రం.. గతంలో ఒక విడత మరో ఐదు కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 19 కోట్ల పనిదినాలు కేటాయింపులు చేసింది. ఆ లక్ష్యం కూడా ఇప్పటికే పూర్తవడంతో మంగవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, రాష్ట్ర అధికారుల వర్చువల్ సమావేశంలో మరో 1.20 కోట్ల పని దినాను కేటాయించింది. దీనితో పాటు వచ్చే రెండు నెలల్లో అవసరం ఉన్న మేరకు మరిన్ని పని దినాల కేటాయింపులు పెంచేందుకు సిద్ధమంటూ కేంద్ర అధికారులు రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు. -
AP: ఉపాధిలో మార్కులు..
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణాభివృద్ధి శాఖ నూతన సంస్కరణకు నాంది పలికింది. ఇప్పటి వరకు కూలీల హాజరు, పనుల కల్పన, మేట్లుగా స్త్రీలను నియమించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చింది. తాజాగా అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తూ.. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి అవార్డులతో సత్కరించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇకపై విద్యార్థుల తరహా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు అందరికీ వీటి పరిధిలోకి తీసుకువచ్చింది మార్కుల ఆధారంగా వారి ప్రతిభను గుర్తించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఇటీవల మార్గదర్శకాలు వెలువరించారు. 100 మార్కులు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు ఉండగా 286 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు చేపడుతున్నారు. 2.96 లక్షల ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉండగా.. 5,27,000 మంది పనులను వినియోగించుకుంటున్నారు. ఈ ఏడాది రూ.26 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.94 కోట్లు వేతనాలు, సామగ్రికి వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కూలీలకు పనులు కల్పించడం, పర్యవేక్షణకు జిల్లాలో ప్రాజెక్టు డైరెక్టర్, 10 మంది ఏపీవోలు, 262 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీటిలో కొందరు నిబద్ధతతో పనిచేస్తున్నా.. కొందరు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. మరి కొందరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో బాధ్యతను పెంపొందించేందుకు మార్కుల విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు. ఉద్యోగుల కేడర్ వారీగా పనితీరు, వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి 100 మార్కులు కేటాయించారు. మార్కులను బట్టి ఎక్సలెంటు(ఏ–గ్రేడ్), గుడ్(బీగ్రేడ్) ఫెయిర్ (ఎఫ్‌ఏఐఆర్–సీగ్రేడ్ ), తక్కువ (డీ–గ్రేడ్)లో ఉన్న వారు పనితీరును మెరుగుపరుచుకునేందుకు రెండు నెలల అవకావం ఇస్తారు. మార్పు లేకపోతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తారు. సీ–గ్రేడ్‌లో ఉన్న వారు బీగ్రేడ్‌లో రాణించే విధంగా ప్రోత్సహిస్తారు. 90 ఆపైన మార్కులు సాధించిన ఎక్కలెంటుగా గుర్తింపు పొందిన వారిని రాష్ట్ర స్థాయి అవార్డులకు గ్రామీణాభివృద్ధి శాఖ నామినేట్ చేస్తుంది. ప్రగతిని పరిగణిస్తారిలా..! పనుల్లో ఉత్తమ పురోగతి సాధించిన వారిని ఎంపి చేస్తారు. వాటిలో కొన్ని పనులు ఎంపిక చేశారు. పండ్లతోటల అభివృద్ధి, అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలి. మొక్క ఎండితే దాని స్థానంలో మరొకటి నాటాలి. ప్రతి కూలీకి సగటు వేతనం అందేలా చూడాలి. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి జాబ్ కార్డులు అప్డేట్ చేయడం, ఏడు రకాల రికార్డులను నిర్వహించాలి. పని ప్రదేశంలో బోర్డుల ఏర్పాటు, పని వారీగా ఫైల్స్ నిర్వహించాలి. సామాజిక తనిఖీల రికవరీలు, మస్టర్ వెరిఫకేషన్‌లో నిర్లక్ష్యాన్ని సహించరు. వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాల్లో 60 శాతం ప్రగతి చూపాలి. పారదర్శకంగా గ్రేడింగ్ ఉపాధి సిబ్బందికి మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వమని గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు వెలువరించింది. అందుకు అనుగుణంగా గ్రేడింగ్ విధానం పారదర్శకంగా చేపడతాం. 30 అంశాల్లో స్పష్టమైన ప్రగతి ఉండాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి పీడీ వరకు ఉద్యోగ నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం పెంపొందిస్తాం. పనితీరును బట్టి ప్రతి ఒక్కరికీ గ్రేడ్లు ఇస్తారు. ప్రతి అంశానికి మార్కులు ఉంటాయి. –రామ్‌గోపాల్, డ్వామా పీడీ -
ఉపాధి జాతర: కోటికిపైగా పనిదినాల కల్పన
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కష్టకాలంలో పేదలకు భరోసాగా నిలుస్తోంది. ఏలూరు జిల్లాలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో అధికారులు కోటికి పైగా పనిదినాలు కల్పించారు. వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ కలిపి రూ. 227.85 కోట్ల మేరకు ఖర్చు చేశారు. జిల్లా ఉపాధి హామీ చరిత్రలో ఇదో రికార్డుగా నిలిచింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క ఏలూరు జిల్లాలోనే కోటికి పైగా పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేయడంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది, అధికారులు విశేష కృషి చేశారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర దిన వేడుకల్లో అవార్డు ఇచ్చి సత్కరించింది. అడిగిన ప్రతిఒక్కరికీ పని కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలో బాసటగా.. కరోనా ప్రభావంతో పూర్తిగా ఛిన్నాభిన్నమైన పేదల బతుకులు తేరుకునేందుకు ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది. ఏలూరు జిల్లాలో 2022–23లో 1.50 కోట్లు పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా మొదటి ఐదు నెలల్లోనే 1.03 కోట్ల పనిదినాలు కల్పి ంచారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడు నెలలు పనిచేసి లక్ష్యానికి రెట్టింపు పనులు చేయాలనే దృఢ సంకల్పంతో డ్వామా సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పనులను గుర్తించి పేదలకు ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో స్థానికంగానే పనులు కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల జీవనానికి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 706 కుటుంబాలకు వంద రోజుల పని జిల్లాలో 5.35 లక్షల జాబ్ కార్డులు ఉండగా వీటిలో మొత్తం 5.82 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు. ఇప్పటివరకూ 3.26 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు చెందిన దాదాపు 4.50 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 103.38 లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 706 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు ఒక్కరికి రూ.206.16లు వేతనాలుగా చెల్లించారు. ఐదు నెలల్లో రూ.227.85 కోట్ల నిధులు ఖర్చు చేయగా దీనిలో రూ. 203.13 కోట్లు కూలీల వేతనాలుగా, రూ. 24.72 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్గా వెచ్చించారు. కూలీలకు వేతనాలను 15 రోజుల వ్యవధిలో 95.84 శాతం మేర చెల్లిస్తున్నారు. అడిగిన వారందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా పనులు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరి«ధిలో జరుగుతున్న అన్ని పనులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్‌బాబు సహకారంతో నిరంతరం పనులు కల్పించేలా పనిచేస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
ఉపాధి హామీలో రికార్డు
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం ముందు చూపుతో లక్ష్యాలకు మించి పనులను కల్పించి ఉపాధి హామీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో జిల్లాలో అత్యధిక పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేశారు. 170.63 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం కాగా 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. మొత్తంగా రూ.653.79 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాలుగా రూ.365.89 కోట్లు అందించారు. మెటీరియల్ చెల్లింపుల కోసం రూ.287.90 కోట్లను వెచ్చించారు. 15 ఏళ్ల ఉపాధి హామీ చరిత్రలో ఇది ఆల్‌టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్ సమయంలో పేదలకు ఉపాధి హామీ పథకం బాసటగా నిలిచింది. 1.50 కోట్ల పనిదినాల లక్ష్యం : 2022–23లోనూ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. వేసవితో పాటు ఏడాది పొడవునా పనులు చూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 1.50 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా కూలీలకు వేతనాలుగా రూ.320 కోట్ల వరకూ అందించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి హమీ నిధులతో చేపట్టారు. ఆయా పనులు వివిధ పనుల్లో ఉన్నాయి. దీంతోపాటు కొత్తగా పనులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా వంటి విపత్కర సమయం లోనూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. లక్ష్యానికి మించి.. 2021–22లో ఉపాధి హామీలో లక్ష్యానికి మించి పనులు కల్పించడంతో పాటు అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 5.70 లక్షల కుటుంబాలకు చెందిన 9.99 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. 27,619 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించారు. సగటున రోజుకు రూ.220.49 వేతనంగా అందించారు. అభివృద్ధికి బాటలు : ఉపాధి హామీ పథకంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం, జగనన్న లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జగనన్న లేఅవుట్లలో రూ.124 కోట్లతో 1,318 పనులు పూర్తి చేశారు. మొక్కలు, తోటల పెంపకానికీ నిధులు అందించారు. ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్‌లో భాగంగా 118 ప్రభుత్వ సంస్థల్లో 7,231 మొక్కలు నాటారు. 1,090 జలసంరక్షణ పనులు పూర్తి చేశారు. అడిగిన అందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. 2022–23లోనూ లక్ష్యానికి మించి పనులు చేపట్టేలా కృషిచేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో పనులనూ సత్వరం పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
గ్రామాల్లో సగం కుటుంబాలకు.. ఉపాధి
అనంతపురం జిల్లా చినకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో 1,166 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 79,739 పనిదినాల ద్వారా రూ.1,85,69,000 వేతనాలుగా పొందాయి. అంటే.. సగటున ప్రతి కుటుంబం ఏడు నెలల కాలంలో రూ.15,925 చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద దోర్నాలలో 1,858 కుటుంబాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 82,422 రోజుల పనిదినాల ద్వారా రూ.1,84,33,000 వేతనాలుగా పొందాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దాదాపు సగం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో 96 లక్షల కుటుంబాలు ఉన్నాయని అంచనా. ఇందులో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 46,39,981 కుటుంబాలకు పథకం కింద ప్రభుత్వం పనులు కల్పించినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు కూలీలు రూ.4,913 కోట్ల మేర పనులు చేయగా..రూ.4,858 కోట్లు మేర చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. 2006లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 14 ఏళ్ల కాలంలో.. ఒక ఆర్థిక ఏడాది సమయంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఇంత ఎక్కువ సంఖ్యలో కుటుంబాలకు పథకం కింద పనులు కల్పించిన దాఖలాలు లేవని.. ఇదో రికార్డని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రమంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గ్రామాల్లో వ్యవసాయ పనులు పెద్దగా లేకపోయినప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించలేకపోయారు. 2016–17 ఆర్థిక ఏడాదిలో 39.91 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందగా.. 2017–18లో 39.94 లక్షల కుటుంబాలే పనులు పొందాయి. యాక్టివ్ కూలీ కుటుంబాలు.. 54.89 లక్షలు ఉపాధి హామీ పథకంలో పనుల కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,43,508 కుటుంబాలు నమోదు చేసుకొని జాబ్‌కార్డులు పొందినప్పటికీ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరాల ప్రకారం యాక్టివ్ కూలీ కుటుంబాలు 54.89 లక్షలుగా ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో కనీసం ఒక్క రోజు అయినా పనులు కావాలని కోరి, చేసిన వారినే యాక్టివ్ జాబ్‌కార్డు కుటుంబాలుగా ఆ శాఖ గుర్తిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో యాక్టివ్ జాబ్‌కార్డు కుటుంబాలుగా గుర్తింపు పొందిన వాటిలో దాదాపు 90 శాతం ఈ ఆర్థిక ఏడాది పనులు పొందాయి. 3,33,989 కుటుంబాలు పూర్తి స్థాయిలో వంద రోజుల పనులు పూర్తిచేశాయి. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 60,01,097 కుటుంబాలు పనులు పొందాయి. కరోనా, లాక్డౌన్ వంటి కారణాలతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. -
రూ.37 లక్షలు మెక్కేశారు!
సాక్షి, బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలో ఉపాధి నిధులతో చేపట్టిన మొక్కల పెంపకం వ్యవహరంలో వెలుగు అధికారులు, సిబ్బంది రూ.36,72,910 స్వాహా చేశారని శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సామాజిక బహిరంగ సభ బట్టబయలు చేసింది. ఈ అవినీతి, అక్రమాలపై డ్వామా ఏపీడీ, సభ నిర్వహకులు శ్రీనివాస ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చొని ఉద్యో గం చేశారా అంటూ మండిపడ్డారు. సామాజిక తనిఖీ బృందం వెల్లడి చేసిన వివరాల మేరకు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.2.90 కోట్ల పనులు, ఉపాధి నిధులతో పీఆర్ ద్వారా రూ.1.05 కోట్లతో సిమెంటు రోడ్ల పనులు, సర్వశిక్ష అభియాన్ ద్వారా రూ.5.23 లక్షలతో పాఠశాలకు ప్రహరీగోడ నిర్మించారు. సెర్ఫ్ ద్వారా పండ్లతోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం పనుల కోసం రూ.1.44కోట్లు ఖర్చు చేశారు. అటవీ శాఖ ద్వారా మొక్కల పెంపకం కోసం రూ.49లక్షల ఖర్చు చేశారు. వాటర్‌షెడ్ పథకం ద్వారా ఫాంపాండ్లు, నీటి సంరక్షణ చర్యల కోసం రూ.57 లక్షలు ఖర్చు చేశారు. ఈ మొత్తం రూ.6.70కోట్ల నిధులు వినియోగంపై లెక్క తేల్చేందుకు సామాజిక తనిఖీ బృందం వారం పాటు పనులను పరిశీలించింది. ఇందులో అన్ని శాఖలకంటే సెర్ఫ్ (వెలుగు) ద్వారా చేపట్టిన మొక్కల పెంపకం అక్రమాలతో నిండిపోయినట్టు అధికారులు తేల్చారు. ఈ శాఖ మొక్కల పెంపకం కోసం రూ.1.44 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క చూపగా అందులో రూ.33,32,820 నిధులు స్వాహా అయ్యాయని లెక్కించారు. ఊహించని అక్రమాలు ప్రధానంగా బీరంగి, బి.కొత్తకోట, గుమ్మసముద్రం, బయ్యప్పగారిపల్లెలో ఊహించని స్థాయిలో అక్రమాలు లెక్కించారు. భూమిలేకపోయినా మొక్కల పెంపకం జరిగిందని బిల్లులు ఇచ్చారు. ఒకే భూమిలో ఐదుగురు మొక్కలు పెంచారని ఐదు బిల్లులు చెల్లించారు. లేని మొక్కలు ఉన్నట్టు చూపించారు. ఇష్టానుసారంగా బిల్లులు ఇవ్వగా కొందరు రైతు బిల్లుల విషయమే తమకు తెలియదంటూ సభలో వాపోయారు. బి.కొత్తకోటకు చెందిన వెంకటరమణ అర ఎకరంలో మొక్కలు పెంపకం చేపట్టితే 2 ఎకరాల్లో పెంచారని బిల్లులు చెల్లించుకున్నారు. అయితే అర ఎకరం పెంపకానికి బిల్లులు మాత్రమే ఇవ్వలేదు. కోటావూరు పంచాయతీలో రైతు శివన్న 210 మామిడి మొక్కలు పెంచుకుంటున్నాడు. తనిఖీల్లో 190 మొక్కలు బతికే ఉన్నాయని తేల్చారు. మొక్కలను బతికించుకునేందుకు శివన్న రోజూ సైకిల్‌పై నీటి బిందెలను తీసుకెళ్లి నీరు పోస్తున్నాడు. ఇతనికి 2019 మార్చి నుంచి నిర్వహణ బిల్లులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రైతు ఎం.రెడ్డెప్పదీ ఇదే పరిస్థితి. తనిఖీల్లో ఒక ఎకరం పొలంలో 60 కొబ్బరి మొక్కలు పెంచగా రూ.9వేలు చెల్లించారు. తనిఖీల్లో 58 మొక్కలు బతికే ఉన్నాయని గుర్తించి బిల్లులు చెల్లించలేని తేలింది. మొక్కల పెంపకం పేరుతో బీరంగి పంచాయతీలో రూ.10,24,663, బి.కొత్తకోట పంచాయతీలో 15,10,887, బయ్యప్పగారిపల్లె పంచాయతీలో రూ.2,29,263, గుమ్మసముద్రం పంచాయతీలో 9,18,727, గట్టు పంచాయతీలో రూ.1,11,852, కోటావూరు పంచాయతీలో రూ.75,795 అవినీతి జరిగిందని నిర్దారించారు. ఈ సొమ్మును రికవరీకి ఏపీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశాలిచ్చారు. నాలుగు పనులకు ఒకే ఫొటో బడికాయలపల్లె పంచాయతీలో మొక్కల పెంపకానికి సంబంధించి సంఘమిత్ర భారతి ఫొటోలను ఏపీడీకి చూపించారు. ఆయన వాటిని చూసి ఇక్కడైనా సవ్యంగా జరిగిందని అనుకుం టుండగానే ఫొటోలను పరిశీలించగా అన్ని పనులకు ఒకే ఫొటో పెట్టినట్టు గుర్తించి అవాక్కయ్యారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు. మిగతా శాఖల్లో.. ఉపాధి నిధులతో చేపట్టిన పనుల్లో ఇతర శాఖల్లోనూ అక్రమాలు వెలుగుచూశాయి. ఉపాధి హామీ పథకంలో రూ.60,249, పశుసంవర్దకశాఖలో రూ.32,963, పట్టు పరిశ్రమశాఖలో రూ.2,18,806, గృహ నిర్మాణశాఖలో 27,072, అటవీ శాఖలో రూ.1,000 అక్రమాలు జరిగి నట్టు తేల్చారు. వీటి రికవరీకి నోటీసులు జారీచేశారు. మండలంలో మొత్తం రూ.36,72,910 నిధులు దుర్వినియోగం అయినట్టు తేల్చారు. గాలిలో మేడలు కట్టారు వెలుగు సిబ్బంది గాలిలో మేడలు కట్టారని ఏపీడీ శ్రీనివాసప్రసాద్ ఈ అక్రమాలపై వ్యా ఖ్యానించారు. ‘‘అసలు వీరు పనులను చూడకనే బిల్లులు చేశారు. ఏపీఎం సహా సీసీలు, సంఘమిత్రలు నిధులను దుర్వినియోగం చేశా రు. వీరంతా విశ్రాంతి తీసుకోవాల్సిదే’’నంటూ సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీఎం సహా 22 మందిపై చర్యలు గత బి.కొత్తకోట వెలుగు ఏపీఎం ఈ.హరి నా«థ్, సీసీలు హనుమంతు, రామాంజులు, అరుణమ్మ, హంషీరాబేగం, చంద్రశేఖర్, బడికాయలపల్లె ఉపాధి క్షేత్ర సహాయకుడు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. తొలగించిన సంఘమిత్రల్లో బి.కొత్తకోటకు చెందిన అంబికా, రమణమ్మ, షమీమ్, దీల్షాద్, గోళ్లపల్లెకు చెందిన సుజాత, గుమ్మసముద్రంకు చెందిన లీలావతి, బీరంగికి చెందిన బి.శంకరమ్మ, కవిత, కే.శంకరమ్మ, గట్టుకు చెందిన నరసమ్మ, శివమ్మ, బయ్యప్పగారిపల్లెకు చెందిన పద్మావతి, బడికాయలపల్లెకు చెందిన భారతి, నరసింహులు, కోటావూరుకు చెందిన పద్మజ ఉన్నారు. -
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని కలిసిన ఉపాధి హామీ ఉద్యోగులు
-
సంరక్షణే సవాల్!
హరితహారం పథకం కింద గతేడాది జిల్లాలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఉపాధి హామీ నిధులతో నాటిన 90.43 లక్షల మొక్కల్లో 35.69 లక్షల మొక్కలు బతికినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే నాటిన మొక్కల్లో 39 శాతం మొక్కలు మనుగడ సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవాని కి 20 శాతం కూడా మొక్కలు మనుగడ సాధించలేదు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో హరితహారం పథకం కింద నాటిన మొక్కల సంరక్షణ సవాల్‌గా మారింది. రూ.కోట్లు వెచ్చించి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నప్పటికీ.. అవి నాటుకుని మనుగడ సాధించడం లేదు. నాటినప్పుడు ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో ఉండటం లేదనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోంది. ఏటా కోట్లలో మొక్కలు నాటుతోంది. ఒక్కో గ్రామంలో సుమారు 40 వేల మొక్కలు ఏటా నాటుతూ వస్తోంది. కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, పాఠశాలలు, ఇతర సంస్థల ప్రదేశాలు, దేవాలయాలు, ఈత వనాలు, రహదారికి ఇరువైపున ఉన్న ఖాళీ స్థలాలు, రైతుల పొలం గట్ల మీద ఇలా వివిధ ప్రదేశాల్లో ఏటా భారీ సంఖ్యలో మొక్కలను నాటుతున్నారు. కానీ మొక్కలు మూడు రోజుల ముచ్చటే అవుతోంది. మొక్కలు నాటడంలో చూపిన ఉత్సాహం వాటి సంక్షరణపై పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రెండింతల లక్ష్యం ఈ ఏడాది హరితహారం లక్ష్యం రెండింతలైంది. ఏటా నాటే మొక్కల సంఖ్య కంటే రెండు రెట్లు అధికంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో హరితహారం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఏటా 1.85 కోట్ల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈసారి ఏకంగా 4.80 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం అటవీశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించే పనిలో అటవీశాఖ పడింది. మరోవైపు లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద నర్సరీల పెంపకంతో పాటు అటవీశాఖ నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. -
పంచాయతీకి ‘ఉపాధి’ అనుసంధానం
నల్లగొండ : గ్రామపంచాయతీలకు ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేయనున్నారు. కూలీలకు వంద రోజులు తప్పనిసరిగా పనులు కల్పించాలన్న ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గ్రామపంచాయతీలకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పనుల్లో మరింత జవాబు దారీతనం పెరిగే అవకాశం ఉంది. గ్రామాలకు అవసరమైన పనులనే గ్రామ సర్పంచ్, కార్యదర్శుల తీర్మానాల మేరకు చేపట్టి గ్రామాభివృద్ధికి బాటలు వేయనున్నారు. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పిస్తారు. ఉపాధి హామీ పథకం పనులను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో జరిగే ఉపాధి పనులను గ్రామ పంచాయతీల పర్యవేక్షణలోనే చేపట్టాలని నిర్ణయించింది. దీనిని ప్రస్తుతం డీఆర్డీఏ పరిధిలోని సిబ్బందే పర్యవేక్షిస్తున్నారు. పనులపై పెద్దగా పంచాయతీలకు పర్యవేక్షణ ఉండడం లేదు. దాంతో జవాబుదారీతనం లేకపోవడం వల్ల చేపట్టే వాటితో ఇటు గ్రామపంచాయతీకి ఉపయోగపడకపోనూ, కూలీలకు కూడా వంద రోజులు పని కల్పించలేని పరిస్థితి నెలకొంది. అయితే క్షే త్రస్థాయిలోని గ్రామ పంచాయతీ సహాయకులు, ఇటు గ్రామ కా ర్యదర్శులను కూడా భాగస్వాములను చేసే విధంగా గ్రా మీ ణా భివృద్ధి శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో వన నర్సరీలు ఇప్పటికే చేపడుతున్నారు. ఐదో విడత హరితహారం కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నారు. వీటికి తోడు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పనులను కూడా వారికే అప్పగిస్తే బాగుంటుందనేది వారి ఉద్దేశం. వంద రోజుల పని తప్పనిసరి గ్రామాల్లో నమోదు చేసుకున్న కూలీకి వంద రోజుల పని తప్పనిసరి కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఎవరు కూలీలు అనేది పంచాయతీ పాలకవర్గానికి కచ్చితంగా తెలుస్తుంది. దాంతో ఎవరికైతే వంద రోజులు పని రాదో వారిని గుర్తించి కల్పించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి పర్యవేక్షణలోనే పనులు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే ఉపాధి హామీ పనులన్నీ పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి పర్యవేక్షణలో చేపట్టనున్నారు. పనుల గుర్తింపుతో పాటు పనుల నిర్వహణలో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించనున్నారు. దీనికి తోడు వచ్చే ఫిర్యాదులను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం పంచాయతీలో ఇప్పటికే నూతన కార్యదర్శుల నియామకం ప్రభుత్వం చేపట్టింది. వారికే ఉపాధి పనుల అదనపు బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. ఇక పంచాయతీలకు అవసరమైన పనులను సర్పంచ్, కార్యదర్శులు ఆ గ్రామాభివృద్ధికి వాటిని గుర్తించి చేపట్టుకునేందుకు కూడా ఆస్కారం ఉంది. గ్రామాల అభివృద్ధికి మరింత అవకాశం పంచాయతీలకు ఉపాధి పనులు అనుసంధానం చేయడం వల్ల మరింత అభివృద్ధి పనులు జరగనున్నాయి. సర్పంచులు ప్రత్యేక దృష్టిని సారిస్తే కోట్లాది రూపాయల విలువ చేసే పనులు గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉంది. పారిశుద్ధ్య పనులకు సంబంధించి డంపింగ్ యార్డుల నిర్మాణానికి పంచాయతీ నిధులు కాకుండా ఉపాధి నిధులను వాడవచ్చు. చెత్తను తరలించడం ద్వారా కూలీలకు నిత్యం పని కల్పించే అవకాశం ఉంది. ఈ నిధులతోనే వైకుంఠదామాలు నిర్మించుకునేందుకు కూడా అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రతి ఇంట్లో భూగర్భజలాలు పెరిగేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేందుకు ఉపాధి పథకం ద్వారా రూ. 4వేలు ఇవ్వనుంది. స్వచ్ఛభారత్ కా>ర్యక్రమాలు, మరుగుదొడ్లు, పశువులకు నీటితొట్లు, వర్మికంపోస్టు తదితర వాటిని చేపట్టేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. గ్రామాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి ఉపాధి హామీ పనులు పంచాయతీలకు అనుసంధానం చేయడం వల్ల గ్రామాల్లో ఏయే పనులు అవసరమో గుర్తించడంతోపాటు అత్యవసరమైనవాటికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. పనుల గుర్తింపు పంచాయతీల పరిధిలోనే జరుగుతుండడం వల్ల ఆ గ్రామంలో ఏది అవసరమో వారికి తెలుస్తుంది. తద్వారా గ్రామంలో ప్రజలకు అత్యవసరమైన పనులను వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గ్రామ పంచాయతీ భవనంలోనే ఉంటారు. తద్వారా అంతా కలిసి గ్రామాభివృద్ధికి బాటలు వేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. – డీపీఓ విష్ణువర్థన్ రెడ్డి -
42.40 లక్షల మందికి ‘ఉపాధి హామీ’
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు తీసుకుంటోంది. గడువులోగా లక్ష్యం చేరేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 12 కోట్ల పని దినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా ఇప్పటికే రూ. 947.2 కోట్లు ఖర్చు చేసి 5.70 కోట్ల పనిదినాలు కల్పించారు. గత నెలాఖరు వరకు రాష్ట్రంలోని 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.20 లక్షల మంది కూలీలకు పనులు ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి 2018–19 సంవత్సరంలోనే అత్యధికంగా 25.20 లక్షల కుటుంబాలకు చెందిన 42.40 లక్షల మంది కూలీలకు పనులు ఇవ్వగా వారిలో 2,24,366 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించారు. ఈ పనుల కోసం రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి హామీ అమలుపై గ్రామీణాభివృద్ధిశాఖ తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ మండలి నాలుగో సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నివేదికలను సమీక్షించారు. 2018–19లో తెలంగాణకు హరితహారంలో భాగంగా రూ. 688 కోట్లతో 11,933 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 11.43 కోట్ల మొక్కలు నాటారు. అలాగే రూ. 670 కోట్లతో 61,116 భూసార/నీటి పరిరక్షణ పనులు పూర్తి చేశారు. రూ. 46.7 కోట్లతో 2,031 శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టారు. రూ. 470.8 కోట్లు ఖర్చు చేసి 22,037 సిమెంటు రోడ్లు వేశారు. రూ. 63.5 కోట్లతో 1,219 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు, రూ. 14.86 కోట్ల వ్యయంతో 634 కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించారు. పనుల ప్రాధాన్యతలో భాగంగా వ్యవసాయ నీటి గుంతలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వంట గదుల నిర్మాణం, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పశువుల కొట్టాలు, మేకలు–గొర్రెల షెడ్లు, కూరగాయల పందిళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సి.హెచ్. మల్లారెడ్డి, ఉపాధి హామీ మండలి సభ్యులు గద్దల పద్మ, తుల ఉమ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహెష్‌దత్ ఎక్కా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉపాధి అమల్లో ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల అమల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలపాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ది మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఉపాధి హామీ పథకం అమలులో గ్రామ పంచాయతీలు క్రీయాశీలపాత్ర పోషించాలి. పంచాయతీల ఆదేశాల మేరకు పనుల గుర్తింపు, అమలు జరగాలి. గ్రామసభ ఆమోదించిన పనులనే చేపట్టాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత గ్రామ పంచాయతీకి నివేదిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీపై ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో తెలంగాణకు హరితహారం, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, పంట కాల్వలు, నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శ్మశానాలు, మరుగుదొడ్లు, వంట గదులు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల వంటి పనులు చేపట్టాలి. ఉపాధి కల్పించే వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణకు హరితహారంలో భాగంగా చింత, వేప చెట్లను విరివిగా నాటి వాటి సంరక్షణలో సర్పంచులను, కార్యదర్శులను భాగస్వాములను చేయాలి. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకీ భవనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి’అని అన్నారు. -
ఆవిరవుతున్న ప్రాణాలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత తో ఉపాధి హామీ కూలీలకు ప్రాణసంకటం గా మారింది. పనులకు వెళ్తున్న వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారంటీ లే కుండా పోయింది. నెల రోజుల్లో ఇద్దరు కూలీలు ఎండదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణాగ్రతలు 44 డిగ్రీలు దాటుతుండగా.. ఎలాంటి రక్షణ, వసతులు లేకుండా నే కూలీలు ఉపాధిహామీ పనులను చేయా ల్సి వస్తోంది. జిల్లాలో 394 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం జాబ్ కార్డులు 2,59,338 ఉండగా, ఇందులో 5,32,044 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. అప్పుడప్పుడూ పనులకు వస్తున్న కూలీలతో కలిపి 2,16,819 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే పనులకు వస్తున్న వారి సంఖ్య 90 వేలు దాటడం లేదు. చాలా మంది వడదెబ్బతో అస్వస్థతకు గురవుతూ పనులకు వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో కూలీల హాజరు శాతం తక్కువగా నమోదవుతోంది. హాజరు శాతం పెంచాలనే ఉద్దేశంతో పనులు కల్పిస్తున్న అధికారులు మండుటెండలో అవస్థలు పడుతున్న కూలీలకు మాత్రం ఎలాంటి రక్షణ కల్పించడం లేదు. తాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో కనిపించడం లేదు. కూలీలే వారి వెంట తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 11 గంటల వరకు పనుల్లోనే.. వాస్తవానికి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పని వేళలను ప్రభుత్వం మార్చింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పని చేయించాలని అధికారులకు సూచించింది. అయితే ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. 9 గంటల నుంచి 11 గంటల వరకు 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. చెరువుల్లో పనులు చేయిస్తున్నందున అక్కడ అధిక ఉష్ణోగ్రతతో కూలీలు పనులు చేయలేకపోతున్నారు. ఇచ్చిన కొలతల ప్రకారం గుంతను తవ్విన తరువాతే ఇంటికి వెళ్లాలని ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్పడంతో ఎండలో కూడా కూలీలు పనులు చేయాల్సి వస్తోంది. ఎండాకాలం కావడంతో నేల గట్టిగా ఉండటం కారణం చేత పని త్వరగా జరగడం లేదు. దీంతో ఒక్కో సారి మధ్యాహ్నం 12 గంటలు కూడా దాటుతోంది. పత్తాలేని టెంట్లు, మెడికల్ కిట్లు.. వేసవిలో పనిచేసే కూలీలు సేద తీరడానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం టెంట్లు అందజేసింది. వీటిని గ్రూపునకు ఒకటి చొప్పున మేట్లకు అందజేశారు. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలుగా ఉన్న సమయంలో టెంట్లను అందజేశారు. అవి కూడా అందరికి సరిపడా ఇవ్వలేదు. ఒక్కో టెంటును రూ.540 చొప్పున టెండరు ద్వారా 29,129 కొనుగోలు చేశారు. ఇప్పుడా టెంట్లు కొన్ని చోట్ల కనిపిస్తున్నా, చాలా చోట్ల వాటి ఆచూకీ లేదు. వాటిని ఎప్పుడో మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా మేట్లు పనికి వచ్చే సమయంలో వెంట తేవడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. అలాగే ఎండలో పని చేస్తున్న కూలీలు డిహైడ్రేషన్కు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాల్సి ఉండగా, కొంత మేరకే సరఫరా అవుతున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. ఒక్కో గ్రూపునకు రెండు, మూడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం అవి కూడా అయిపోయాయన్నారు. ప్రాథమిక చికిత్సను అందించడానికి ప్రభుత్వం గతేడాది సరఫరా చేసిన మెడికల్ కిట్లూ కనిపించడం లేదు. మందుల గడువు తేదీ ముగియడంతో వాటిని వినియోగించడం లేదు. మండల పీహెచ్‌సీల నుంచి మందులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎండలో పని చేసే సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలపై కూలీలకు డ్వామా అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
పనే ప్రామాణికం
నల్లబెల్లి: పల్లెల నుంచి పట్నాలకు వలసలను నివారించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. గ్రామాల్లో వ్యవసాయం పనులు లేనప్పుడు కూలీలకు స్థానికంగానే పనులు కల్పించాలనేది ఈ పథక ఉద్దేశం. ఇప్పటివరకు పల్లెల్లో సత్ఫలితాలు ఇస్తూ వచ్చింది. అసలు సమస్య ఇక్కడే వచ్చింది.. పథకం ప్రారంభం నుంచి క్షేత్ర సహాయకులుగా పని చేసిన వారికి ప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయంతో ఆందో ళన చెందుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్‌తో ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని దిగులుగా ఉన్నారు. సర్క్యూలర్ జారీ తర్వాత కూలీలకు కనీస పనిదినాలు ఖచ్చితంగా కల్పించాల్సిందే. లేదంటే సదరు ఫీల్డ్ అసిస్టెంట్లను తగ్గించడం, లేదా తొలగించేలా కఠిన చర్యలు తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. కనీస పనిదినాలు కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలని ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యూలర్ 9333 జారీ చేశారు. జిల్లాలో 264 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తుండగా ఈ ఆదేశాలతో సుమారు 60 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటుపడే అవకాశాలున్నాయి. చిన్న గ్రామాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేనట్టే..! జిల్లాలో 15 మండలాల పరిధిలో 264 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఉపాధి హామి పథకం ప్రారంభంలో గ్రామానికి ఒకరి చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించారు. అయితే చిన్న గ్రామాలకు సైతం క్షేత్ర సహాయకులను నియమించడంతో ప్రభుత్వ ఉద్యోగమని భావించి ఉన్నత చదువులు ఆపేసి కొందరు.. ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి మరికొందరు ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేరారు. పని అడిగిన కూలీలకు పనులు కల్పిస్తూ వస్తున్నారు. కాగా పని నిర్థారణ, కేటాయింపు, కూలీల విషయంల్లో పలు మార్పులు చోటు చేసుకోగా సరికొత్తగా కూలీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతూ సర్క్యులర్ జారీ చేసింది. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధి హామి సిబ్బందిపై చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి 25 రోజులకు తగ్గకుండా పని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 40 రోజులకు పైగా పని కల్పించేలా నిర్ణయించి.. పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు చూపించాలి. దినసరి ససగటు కూలి రూ.180 కంటే తగ్గకుండా చూడాలి. 100 శాతం జాబ్ కార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో మస్టర్‌రోల్‌ను నిర్వహించాలి. కూలీలకు పే స్లిప్‌లు తప్పకుండా పంపిణీ చేయాల్సి ఉంది. గ్రామాల్లో నర్సరీ పనులను తప్పకుండా పర్యవేక్షించాలి. పని దినాలను బట్టే వేతనం.. ఉపాధి హామి పథకంలో పని అడిగిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం జాబ్ కార్డు అందించింది. ప్రస్తుతం ఈ పథకంలో గ్రామాల్లో కూలీలకు కల్పించే పనిదినాలను బట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాల చెల్లింపు అర్హత లిస్టులను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఏడాదిలో 40 పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. ఆయా గ్రామ పంచాయతీల జాబితా 1, 2, 3 గా విభజించారు. సగటున 40 దినాల పనిచూపితే ఆ గ్రామ పంచాయతీ లీస్టు–1 అర్హత పొందుతుంది. ఈ గ్రామపంచాయతీల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్‌కు నెలకు వేతనం రూ.10 వేలు అందిస్తారు. 25 నుంచి 40 రోజుల మధ్యలో పని కల్పిస్తే లీస్టు–2 గ్రామపంచాయతీగా పరిగణిస్తారు. వీరికి రూ.5 వేల వేతనం అందిస్తారు. 25 రోజులలోపు పని దినాలు కల్పిస్తే లిస్ట్–3 గ్రామ పంచాయతీగా పరిగణిస్తారు. ఇక్కడ సీనియర్ మేట్‌తో పనులు నిర్వహిస్తారు. 2018 జూలై 1 నుంచి 2019 జూన్ 30 వరకు ఆయా గ్రామపంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కల్పించిన పని దినాలను లెక్కించి కుటుంబాల వారీగా విభజించి వారిని లిస్ట్–1, 2, 3 గా విభజించనున్నారు. ఈ నిబంధనలతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు పాటించాల్సిందే ఉపాధి హామి పథకానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ పాటించాల్సిందే. కూలీలకు ఎ క్కువ పనిదినాలు కల్పించాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొ చ్చింది. దానికి అనుగుణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేయాల్సి ఉంటుంది. పనులకు సక్రమంగా రాని ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దుచేసే అవకాశాలు ఉన్నాయి. – పంజ వెంకట్‌నారాయణ, ఏపీఓ, నల్లబెల్లి -
ఉపాధి‘హామీ’ గాలికి!
ఆదిలాబాద్‌రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరుగుతున్న పనులను సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. కూలీలు పడుతున్న పలు ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. మండే ఎండల్లో పని చేసేందుకు వారు నానా అవస్థలు పడుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించలేదు. పనులు జరుగుతున్న చోట దగ్గర టెంట్లు, తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లే తాగుతున్నామని కూలీలు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్యం వంటి సౌకర్యాల జాడే కానరాలేదు. చాలా మందికి పనులు కల్పించకపోవడం వల్ల కూడా వలసబాట పడుతున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌రూరల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు క్షేత్రస్థాయిలో వసతులు కరువయ్యాయి. రోజురోజుకూ జిల్లాలో ఎండలు మండుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు సేదతీరడానికి టార్పిన్లు అందించకపోవడంతో ఎండలోనే సేదతీరాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పంపిణీ చేస్తారు. కానీ ఈ ఏడాది వాటి పంపిణీ కూడా జరగకపోవడంతో ఏదైనా గాయమైతే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదికి సంబంధించిన పస్ట్ ఎయిడ్ బాక్సులను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నా.. అవి మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా 2018–19లో కూలీలకు కనీస వేతనంగా రూ.205 అందించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతన కొలమానం ప్రకారం.. ఈ ఏడాది 2019–20 ప్రకారం కూలీలకు రోజు వారీ వేతనాన్ని మరో రూ.6 పెంచారు. కానీ నిధులు అందుబాటులో లేకపోవడంతో వాటిని కూడా సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. పెంచిన వేతనంతో జిల్లాలో లక్షలాది మందికి మేలు కలుగనుంది. జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 38 లక్షల పని దినాలను కల్పించారు. ఇందులో 6,550 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కూలీలకు ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.64 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో కూలీలకు డబ్బులు రాకపోవడంతో పనులకు సైతం వెళ్లేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని కూలీలు పేర్కొంటున్నారు. రెండు నెలల కూలి పెండింగ్.. ఎండల్లో పని చేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పనులు చేసి కూడా సకాలంలో డబ్బులు రాకపోతే తమ కుటుంబాలను పోషించుకేనేదేలా అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొంతమంది కూలీలకు గతేడాది డిసెంబర్ నుంచి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో 13 మండలల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా, రెండు నెలల నుంచి ఒక్కో మండలానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం 40 దినాల పని లభించేనా.. ఉపాధి పనుల్లో జాబ్ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. హరిత హారం కోసం పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఎక్కువ పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రోజుకు కనీసం రూ. 190 వేతనం వచ్చేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా 2018–19లో జిల్లాలో కూలీలకు సగటు వేతనం 178 మాత్రమే అందింది. పనికి వెళ్తున్న కూలీలు.. 63 వేల మంది.. వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలు ఉదయం పూటనే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 63 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్ష మంది కూలీలకు ఉపాధి కల్పిం చేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా ఇందులో 13 మండలలోని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పిస్తున్నారు. లక్ష్యం నేరవేరేనా.. జిల్లాలో ఆయా మండలల్లోని ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో లక్ష మందికి రోజు కూలీ పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సకాలంలో డబ్బులు రాకపోవడంతో కూలీలు పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో వారి లక్ష్యం చేరడం కష్టంగా మారింది. డబ్బులు రాలేదు.. వడూర్‌లో ఉపాధి పనులు చేసిన. ఇప్పటికీ డబ్బులు రాలేదు. అధి కారులకు తెలిపినా పట్టించుకోవడంలేదు. కూలీలను ఆదుకుం టామని చెప్పే మాటలు మాటలకే పరిమితమైనాయి. అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. – సింగం పరమేశ్వర్, కూలీ, వడూర్ ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం పనులు చేస్తున్న చోట నీళ్ల సరఫరా లేదు. తాగే నీళ్లను ఇంటి నుంచే తెచ్చుకోవాలని చెప్తున్నరు. నీళ్లకు డబ్బులు ఇస్తున్నామంటున్నారు కానీ అవి వస్తున్నాయో లేదో నాకు మాత్రం తెలియదు. మెడికల్ కిట్లు లేవు. ఎండ ఎక్కువగా ఉన్నందున కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లైనా ఇస్తే బాగుంటుంది. నీడ కోసం టెంట్లు లేవు. సేదతీరాలంటే ఎక్కడైనా చెట్టు ఉంటే కొద్దిసేపు ఉంటున్నం లేకపోతే లేదు.– హెచ్‌కే రమేష్, కూలీ, చిట్యాల్బోరి -
నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించవద్దు. కనీసం చెట్ల నరికివేత, మట్టిని కూడా తొలగించవద్దు. అయితే, నింబంధనలకు విరుద్ధంగా డ్వామా అధికారులు నక్కర్తమేడిపల్లిలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్ భూముల్లో నిత్యం వందలాది మంది కూలీలతో భూమి చదును, కరకట్టల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు చేయిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా కూలీల ద్వారా ఫార్మాసిటీ భూముల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. యాచారం: నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 సర్వే నంబర్లల్లోని 600 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను అధికారులు ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించారు. అసైన్డ్ భూముల్లో పట్టాలు పొంది కబ్జాలో ఉన్న రైతులు, పట్టాలున్న రైతులకు ఎకరాకు రూ. 8 లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ.7.70 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. పరిహారం ఇవ్వడమేకాకుండా సేకరించిన పొలాల్లోని సర్వే నంబర్లలో ఉన్న రైతుల పేర్లు తొలగించి ఫార్మాసిటీకి చెందిన భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. భూసేకరణ చేసిన పొలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దు. ఈ నేపథ్యంలో యంత్రాంగం రక్షణ నిమిత్తం సేకరించిన భూములకు ప్రత్యేకంగా సిబ్బందిని కూడా కాపలాగా నియమించింది. పరిహారం సరిపోలేదని రైతుల గగ్గోలు ఫార్మాసిటీకి సేకరించిన భూములకు తమకు న్యాయమైన పరిహారం చెల్లించలేదని నక్కర్తమేడిపల్లి రైతులు వాదిస్తున్నారు. భూసేకరణ చట్టం నింబంధనలకు విరుద్ధంగా పరిహారం చెల్లించారని, పట్టాదారు, పాసుపుస్తకాల్లో ఉన్న ఎకరాలకు పూర్తి పరిహారం ఇవ్వలేదని, రాళ్లు, రప్పలు, గుట్టల నెపంతో పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కోత పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే వరకు సదరు భూములు తమవేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో న్యాయమైన పరిహారం ఇవ్వని పక్షంలో వచ్చే ఖరీఫ్‌లో పంటలు కూడా సాగుచేస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు. -
‘ఉపాధి’కి ఎండదెబ్బ
సాక్షి, వరంగల్ రూరల్: పల్లెల నుంచి పట్నాలకు వలసలను నివారించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పథకం మాట అట్లుంచితే కూలీలకు కనీస వసతులు లేక అల్లాడుతున్నారు. మహబూబ్‌నగర్ ఘటనలో మట్టి దిబ్బ కూలి పది మంది మహిళా కూలీలు మృత్యువాత పడినా అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఉపాధి కూలీలకు రక్షణ లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టి పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధిహామీ చట్టంలో పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉంచాలని రాజీలేని అంశాలుగా చేర్చారు. నీటి వసతి నీడ, ప్రథమచికిత్స ఏర్పాటుచేయకపోవడంవల్ల కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి పల్లెలోనూ వ్యవసాయ పనులు ముగయడంతో ఎక్కువగా ఉపాధి హామి పనులకు వెళుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,31,280 జాబ్ కార్డులుండగా 16,67,339 మంది కూలీలున్నారు. వేసవిలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పనులు చేయాలని నిబంధన ఉంది. భానుడు భగ్గున మండి పోతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకే కూలీలు వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాని కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం వరకు పనులు చేస్తున్నారు. మండుటెండలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కనిపించని ఫస్ట్ ఎయిడ్ కిట్లు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపాధి హామీ పథకంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్ల క్రితం ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందించారు. అవి కొందరు మెట్ల దగ్గరనే ఉండి పోయాయి. కూలీలు పని చేసే ప్రదేశంలో అనుకోని ప్రమాదం జరిగితే.. ప్రాథమికంగా చికిత్స చేసేందుకు మెడికల్ కిట్లు తప్పని సరి. ఇందు కోసం సీనియర్ మేట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ జిల్లాలో ఎక్కడా కూడా మెడికల్ కిట్లు కనిపించడం లేదు. కాలుపై గడ్డపార పడినా.. క్రిమికీటకాలు కరిచినా.. వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కో సారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. ఈజీఎస్ అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ముందస్తు చర్యల్లో భాగంగా కూలీలు డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా టెంట్లు ఏర్పాటు చే యాలి. జాడ లేని టార్పాలిన్ షీట్లు.. రెండేళ్ల కిందట వేసవిలో కూలీలకు రక్షణగా ఉండేందుకు టార్పాలిన్ కవర్లను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లోని సీనియర్ మేట్లకు టార్పాలిన్ కవర్లను అప్పగిస్తూ పని ప్రదేశంలో వాటిని వేసే బాధ్యతను అప్పగించారు. గ్రూపులోని ప్రతి ఒక్కరూ రూ.100 కూలీ పని చేస్తే, మేట్‌కు ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 వేతనం వస్తుంది. ఈ డబ్బులను నేరుగా మేట్ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి పనికి డబ్బులు ఇస్తున్నప్పటికీ, అనుకున్న మేర ‘ఉపాధి’ లక్ష్యం నెరవేరడం లేదు. ఇదిలా ఉంటే టార్పాలిన్ కవర్లు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఉన్న కొంత మంది మేట్లను తొలగించడంతో టార్పాలిన్ కవర్లు వారి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అధికారుల లెక్కల ప్రకారం పని ప్రదేశంలో టెంట్లు ఉన్నట్లు భావిస్తున్నా కనిపించిన దాఖలాలు లేవు. కూలీలు భోజనం చేసేందుకు, సేద తీరేందుకు నిలవ నీడ లేకపోవడంతో చెట్ల నీడకు వెళ్లాల్సి వస్తోంది. చెట్లు దుర ప్రాంతాల్లో ఉంటే అంత దూరం ఏం వెళ్లుతామని ఎండలోనే భోజనాలు, సేద తీరుతున్నారు. తాగు నీటి సౌకర్యం లేకపోవడంతో దాహంతో తండ్లాడాల్సిన పరిస్థితి ఉంది. పనుల వద్ద నీడ కల్పించాలి ఎండలు బాగా కొడుతున్నాయి. పనులు చేసే కాడా సేదా తీరేందుకు టెంట్లు వేస్తే బాగుండు. నీడకోసం కట్ట వెంబడి ఉన్న తాటి మట్టలతో నీడ ఏర్పాటు చేసుకున్నాం. ఎదైన దెబ్బతగిలితే ఇబ్బంది పడుడే. మందులు అందుబాటులో ఉంచాలి. కనీసం పని ప్రదేశంలో గ్లూకోజ్ ప్యాకెట్లు లేవు. అధికారులు అర్హత కలిగిన గ్రుపులకు టెంట్లు పంపిణీ చేయాలి.– పెరుమాండ్ల వసంత, ఉపాధి కూలి, శనిగరం ఎండలోనే ఉండాల్సి వస్తోంది.. బయట కూలి పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వస్తున్నాం. వ్యవసాయం పనులు లేకపోవడంతో ఈ కూలి పనుల ద్వారా వచ్చే డబ్బులతో ఎంతో లబ్ధి చేకురుతుంది. కానీ పనుల దగ్గర సేద తీరేందుకు నీడ లేదు భోజనం ఎండలోనే చేస్తున్నాం. మేం తీసుకువచ్చిన నీళ్లు ఎండకు వేడి అవుతున్నాయి. నీడ కోసం ఏమైనా ఏర్పాట్లు చేయాలి. – అన్నెపు సాంబలక్ష్మి, రాయపర్తి ఉపాధి పనులే దిక్కు.. ఈ ఏడాది వ్యవసాయ పనులు అంతగా లేవు. రోజు పనిచేస్తేనే పూట గడిచేది. కుటుంబంతో బతుకు దెరువు కోసం వలస వెళుదామనుకున్నాం. వారం రోజుల క్రితం శనిగరం మైసమ్మ చెరువులో ఉపాధి పనులు చేపట్టారు. పనులు చేపట్టిన రోజు నుంచి నా భార్యతో కలిసి పనికి పోతున్న. ఈ పనులే లేకపోతే వలస వెళ్లేవాళ్లం. పనులు లేక బతుకు దెరువులేని మాలాంటి కుటుంబాలకు ఉపాధి పనులే దిక్కుగా మారాయి. – మాట్ల రమ సూరయ్య దంపతులు, ఉపాధి కూలీలు, నల్లబెల్లి -
నీళ్లు లేవు.. నీడా లేదు!
నల్లగొండ : వేసవిలో ఇతర పనులు దొరకని పరిస్థితి. అలాంటి వారు వలస వెళ్లకుండా, కుటుంబ పోషణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద సౌకర్యాలు కరు వయ్యాయి. అసౌకర్యాల నడుమ కూలీలు పనులు చేస్తున్నారు. పనిచేసే చోట కూలీలకోసం టెంట్లు ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు తాము అన్ని గ్రూప్‌లకు టెంట్లు ఇచ్చామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 8,76,807 మంది ఉపాధి హామీ కూలీలు నమోదై ఉన్నారు. 3,69,000 జాబ్‌కార్డులు ఉన్నాయి. వేసవిలో ప్రత్యేక పనుల కోసం అధికారులు ఇటీవల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ అనుమతి పొందారు. ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు 77 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. ఇందుకు సుమారు 240 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉపాధి హామీ పనులను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కూలీలకు 5 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చేసిన పనులకుగాను 9 కోట్ల రూపాయలను కూలీల ఖాతాలో జమచేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. భానుడి విశ్వరూపం.. ఎండాకాలంలో భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకుడుగుంతలు, కందకాలు, చెరువుల పూడిక, చెట్ల తొలగింపు, నర్సరీలు, కాల్వ పూడిక తదితర పనులు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ సుర్రుమంటోంది. కూలీలు ఎండ తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ఉదయం పూట వెళ్లి పనులు చేస్తున్నారు. ఉపాధి నిబంధనల ప్రకారం కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. అధికారులు ఎప్పుడో గ్రామాల వారీగా అందించారు. ఎక్కడా అటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అసలు అవి ఉన్నాయా లేవా అన్నది తెలియని పరిస్థితి.. దీంతో కూలీలు చెట్లకింద సేదదీరుతున్నారు. కూలీలే తట్టలు, మంచి నీరు కూడా తెచ్చుకుంటున్నారు. అందుకు అధికారులు డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. సౌకర్యాలు లేవు మేము పక్షం రోజులుగా కడపర్తి పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్నాం. మంచీనటి సౌకర్యం కూడా లేదు. కనీసం టెంట్లు కూడా వేయలేదు. పనులు చేసేందుకు గడ్డపారలు కూడా ఇవ్వలేదు. ఎండకు ఎండుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నాం... – నూనె లింగయ్య, ఉపాధి కూలీ, కడపర్తి, నకిరేకల్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు పెట్టాలి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాలలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కూడా ఇవ్వాలి. వడదెబ్బకు గురైనప్పుడు కూలీలకు ఇబ్బందులు ఎదురవుతాయి. పని చేస్తున్న ప్రదేశాలలో టెంట్లు కూడా వేయాలి. – జీడిపల్లి లక్ష్మమ్మ, ఉపాధి హామీ మేట్, కడపర్తి, నకిరేకల్ మండలం -
శ్మశాన వాటికలకు కొత్తరూపు
బజార్హత్నూర్(బోథ్): ఒకప్పుడు చెట్లు, పుట్టల మధ్య దర్శనమిచ్చే శ్మశాన వాటికలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఉపాధిహామీ పథకం పుణ్యమా అని వీటి రూపురేఖలు మారుతున్నాయి. గతంలో కాటికి కాలు చాచిన వారు సైతం తన అంత్యక్రియలు జరిగే చోటును తలచుకుని తల్లడిల్లిపోయేవారు. జీవితంలో మంచి ఇంట్లో కాలం వెళ్లదీయకున్నా మరణించిన తర్వాత అయినా మూడడుగుల స్థలం దొరుకుతుందా? అని మదనపడే వారు. ఇప్పుడా సమస్యకు తావులేకుండాపోయింది. రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికలను స్వర్గధామాలుగా తీర్చిద్చిద్దేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా 2017లో ఒక్కో శ్మశానవాటిక అభివృద్ధి కోసం రూ.10లక్షలు వెచ్చించాలని ప్రతిపాదించింది. ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటే ఏళ్ల నాటి సమస్య తీరనుంది. ఆదిలాబాద్ జిల్లాలో 2019 సంవత్సరానికి ఉపాధిహామీ పథకం ద్వారా 154 శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.15.53 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటిలో 87 శ్మశాన వాటికల నిర్మాణ పనులు జరుగుతుండగా, మిగతా 67 గ్రామపంచాయతీలకు కేటాయించాల్సి ఉంది. దయనీయంగా గ్రామీణ శ్మశాన వాటికల పరిస్థితి జిల్లాలోని జైనథ్, బేల, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నూర్, తాంసి, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని 95 శాతం గ్రామాల్లో శ్మశాన వాటికల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని శ్మశాన వాటికలు ఆనవాళ్లు కోల్పోయాయి. మరికొన్ని గ్రామాల్లో కబ్జాకు గురవుతున్నాయి. గ్రామాల్లో ఒకరు చనిపోయారంటే ఆ వ్యక్తి అంత్యక్రియలు ఇంకొకరి చావుకు వచ్చేలా ఉన్నాయి. శ్మశాన వాటికలు ముళ్లపొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి అంత్యక్రియలు జరిపే వీలులేకుండా పోయింది. శ్మశాన వాటికలకు అంతిమయాత్ర తీసుకెళ్లేందుకు కనీసం దారి సౌకర్యం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక చెరువుగట్లు, రహదారుల పక్కన, ఒర్రెల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. బజార్హత్నూర్ మండలం గిర్నూర్, గుడిహత్నూర్ మండలంలో మన్నూర్, బోథ్ మండలంలో కౌట గ్రామాల్లో ఇప్పటికీ రోడ్డు పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి ఈజీఎస్ నిధులు ఆయా గ్రామాల్లో శ్మశాన వాటికలకు 5 గుంటల స్థలం చూపిస్తే ఉపాధిహామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.10.35 లక్షలు ఖర్చు చేసే వీలు కల్పించింది. అయితే వీటిని అభివృద్ధి చేయాలన్న సంకల్పం స్థానిక సం స్థల ప్రతినిధులకు ఉండాలి. అందుకు రెవె న్యూ అధికారులు సహకరించాలి. శ్మశాన వాటికల భూ విస్తీర్ణం గుర్తించి హద్దులు వేస్తే అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించవచ్చు. శ్మశాన వాటికల్లో దహనం చేసేందుకు రెండు ప్లాట్‌ఫాంలు, పిచ్చిమొక్కల తొలగింపు, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మూత్రశాలలు, మరుగుదొడ్లు, లెవలింగ్, స్టోర్‌రూంతో పాటునీటి వసతి కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించుకోవచ్చు. శ్మశాన వాటికల్లో హరితహారం పథకంలో మొక్కలు పెంచుకోవచ్చు. దీనంతటికీ స్థానిక సర్పంచ్, గ్రామస్తులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్మశాన వాటికలకు కొత్తరూపు రోడ్డు పక్కనే అంత్యక్రియలు చేస్తున్నాం మా గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం లేక అర్అండ్బీ రోడ్డు పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం శ్మశాన వాటికకు స్థలం కేటాయించి దహనానికి ప్లాట్‌ఫాం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించాలి.– గవ్వల సాయిచైతన్య,గిర్నూర్ నిధులు కేటాయిస్తే నిర్మిస్తాం దేగామలో 3వేల జనాభాకు ఒకే ఒక శ్మశాన వాటిక ఉంది. కాని అభివృద్ధికి నిధులు లేక పిచ్చిమొక్కలతో నిండి ఉంది. ఇక్కడ దహనానికి ప్లాట్‌ఫాం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంక్ లేదు. శ్మశాన వాటికలో అడుగువేద్దామంటే ముళ్లపొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. చేసేదేమి లేక అంత్యక్రియల కోసం కడెం నది ఒడ్డున రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తున్నాం. ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తే శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. – దుర్వ లక్ష్మణ్, సర్పంచ్ దేగామ -
‘ఉపాధి’లో ధీర
రాయికోడ్(అందోల్): మహిళలు పిల్లల ఆలనాపాలన చూడటం, ఇంటి పనులు చక్కదిద్దుకోవడంతోపాటు కుటుంబ ఆర్థిక అవసరాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుతం కుటుంబ యజమాని సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతుండడంతో మహిళలు బయట పనికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వారు కష్టపడుతూ ఇంటి ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పట్టణ ప్రాంత మహిళలు విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో రాణిస్తుండగా గ్రామీణ మహిళలు శ్రామిక రంగంలో బాధ్యతాయుతంగా పని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ మేము సైతం అంటూ పురుషులతో సమానంగా చెమటోడ్చి వారి కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో మహిళలే అధికంగా పనులు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తద్వారా వచ్చే కూలీ డబ్బును తమ కుటుంబాల పోషణకు వినియోగించుకుంటున్నారు. గ్రామీణ మహిళలకు వరంగా ఉపాధి పథకం గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకే తగిన పనులు దొరకడం కష్టంగా ఉండేది. ఇక మహిళలకు పని దొరకడం అత్యాశగానే ఉండేది. ఈ నేపథ్యంలో పనులు లేక పొట్ట నింపుకోవడానికి పల్లెను వదిలి పట్టణాలు, నగరాలకు కూలీలు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో ఉన్న చోటే పని కల్పించాలని 2005వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. పేద ప్రజలకు అండగా నిలిచిన ఈ పథకం ప్రారంభంలో పురుషులే పనులకు వెళ్లేవారు. పెరిగిన ధరలు, ఆర్థిక అవసరాలు, పిల్లల పోషణ తదితర కుటుంబ అవసరాలకు పురుషుల పనితో వచ్చే ఆదాయం సరిపోక గ్రామీణ కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. ఈ పరిస్థితులను అధిగమించడం కోసం మహిళామణులు మేము సైతం అంటూ పనుల్లోకి దిగారు. కొన్ని సంవత్సరాలుగా పురుషులతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నారు. వంద రోజుల పనులు పూర్తి చేసి వారికి వచ్చే ఆదాయాన్ని కుటుంబ పోషణ కోసం ప్రణాళికతో ఖర్చు చేసుకుంటున్నారు. అదేవిధంగా పొదుపు కోసం మహిళా సంఘాలుగా ఏర్పడి ఈజీఎస్ పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి రాక దిగాలు చెందుతున్న తమ కుటుంబాలకు ఉపాధి పథకం వరంగా మారిందని మహిళా కూలీలు చెబుతున్నారు. ప్రతీ ఏడాది వంద రోజుల పాటు పనులు చేసి ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. వర్షాలు కురవక వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో ఉపాధి పథకంలో పని చేయగా వచ్చిన డబ్బును మహిళలు పిల్లలను చదివించేందుకు ఫీజుల కోసం, ఇతర కుటుంబ ఖర్చుల కోసం వినియోగిస్తున్నారు. జిల్లాలో ఉపాధి పథకం వివరాలు ఉపాధి పథకం పనుల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,19,245 జాబ్ కార్డులు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సర లెక్కల ప్రకారం 79,313 కుటుంబాలకు చెందిన 1,33,947 మంది కూలీలు ఉపాధి పనులు చేశారు. అందులో 75,708 మంది మహిళా కూలీలు ఉండగా 58,239 మంది కూలీలు పురుషులు ఉన్నారు. అంటే ఉపాధి పథకంలో పురుషుల కంటే 17,469 మంది మహిళా కూలీలు అధికంగా పని చేస్తున్నారు. గతేడాది జిల్లాలో పూర్తయిన ఉపాధి పనుల్లో 56.53 శాతం ఉపాధి పనులను మహిళా కూలీలు చేస్తే 43.47 శాతం పనులను పురుష కూలీలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2018–2019 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు సంబంధించి రూ.71.97 కోట్ల డబ్బును ఖర్చు చేశారు. అందులో 46.77 కోట్లను కూలీలకు వేతనంగా చెల్లించగా 16.3 కోట్లను మెటీరియల్ కోసం వెచ్చించారు. కోరిన ప్రతి కూలీకి పనులు కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు. వేసవి కాలం దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వం కూలీలకు 30 శాతం అలవెన్సుగా ప్రకటించింది. అంటే రోజులో చేసే పనిలో 30 శాతం తగ్గించి ఇచ్చే కొలతల ప్రకారం పని చేస్తే కూలీగా రూ.211 పొందవచ్చు. ఈ అవకాశం మహిళా కూలీలకు కొంతమేర ఊరట కలిగే అంశంగా చెప్పవచ్చు. ఉపాధి పథకంలోని వివిధ రకాల పనుల్లో మహిళా కూలీలు పోటీగా పని చేస్తుండటంతో అధికారులు వారి శ్రమశక్తిని అభినందిస్తున్నారు. ఆర్థికంగా అండ.. నేను 2006వ సంవత్సరం నుంచి ఉపాధి పనులకు వెళుతున్నా. కూలీగా వచ్చిన డబ్బును నా కుమారుడి చదువు కోసం, ఇంటి ఆర్థిక అవసరాల కోసం వినియోగిస్తున్నా. ఉన్న ఊర్లోనే పని చేసి ఉపాధి పొందడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ప్రతీ ఏడాది వంద రోజులు పని చేయాలని అధికారులు చెబుతున్నారు. వారి సూచనలు పాటించి ఉపాధి పథకంలో పాల్గొని ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఊరట పొందుతున్నాం. –జె.రామమ్మ, మహిళా ఉపాధి కూలీ, కర్చల్ గ్రామం, రాయికోడ్ మండలం పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి మండలంలో కొనసాగుతున్న ఉపాధి పనుల్లో పురుషులతో సమానంగా పని చేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళా కూలీలు వస్తున్నారు. ఉపాధి పథకంపై మహిళా కూలీలకు పూర్తి అవగాహన వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. వారి ఆసక్తి మేరకు పనులు కల్పిస్తున్నాం. వేసవి అలవెన్సులు అమలు చేస్తున్నాం. ఉపాధి పనుల్లో మహిళా కూలీల పాత్ర కీలకంగా ఉంది. అన్ని రకాల ఉపాధి పనుల్లో మహిళలు వెనుకాడకుండా పాల్గొంటున్నారు. – గురుపాదం, ఏపీఓ రాయికోడ్ -
‘ఉపాధి’కి ఊతం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. సాక్షి, వరంగల్ రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు కొంత ఊరట లభించింది. ఇప్పటివరకు చెల్లిస్తున్న రోజు వారీ కూలి రూ.205కు మరో రూ.6 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులు ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16,67,339 మంది కూలీలకు కొంతమేర ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ ఆధారమే అధికం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే ఎక్కువ. రెండో పంట లేకపోవడంతో కూలీలు ఇతర పనులు చేస్తూ ఏడాది పాటు కుటుంబాలను పోషించుకుంటారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు ఊపందుకున్నాయి. రోజురోజుకూ పనులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించిన అధికారులు అడిగిన వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,31,280 జాబ్ కార్డులు ఉండగా 16,67,339 మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. పేదలకు వరం.. పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లా వాసులకు వరంగా మారిందని చెప్పవచ్చు. పనిదినాలు సైతం ఎక్కువగా ఉండటంతో నిధులు అధిక మొత్తంలో వస్తున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంపిక చేసి కూలీలకు పని కల్పించాల్సి ఉంటుంది. తద్వారా కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం. ఏటా కూలీల బడ్జెట్ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధుల బలోపేతానికి, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బావులు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం, కందకాలు, ఊట కుంటలు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి తొట్లు, పండ్ల తోటల పెంపకం, నీటి నిల్వలకు సంబంధించిన పనులు, ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల నిర్మాణాలు చేపడుతున్నారు. కనీసం 40 పనిదినాలు.. ఉపాధి పనుల్లో జాబ్ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పని దినాలు కల్పిస్తారు. ఒకరిద్దరు సభ్యులున్న కుటుంబాలే అధికంగా ఉన్నాయి వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం కోసం గ్రామపంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. వీటిలో పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని, వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. కూలి రేట్లు పెరగడం సంతోషకరం.. ఉపాధి హామీ పథకంలో కూలి రేట్లు పెరగడం సంతోషంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ పనులు లేక ఇంటి వద్దనే ఉండే వారికి ఉపాధి హామీ పథకం చాలా దోహదపడుతోంది. ఉపాధి దొరక్క వలస వెళ్లే వారికి స్థానికంగానే కొంత మెరుగైన ఆదాయం సమకూరనుంది. కూలి పెంచడం వల్ల చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. – కొన్కటి మోహన్, ధర్మరావుపేట, ఖానాపురం ఏప్రిల్ 1 నుంచి అమలు ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు పెరిగిన కూలి డబ్బులతో కలిపి రోజుకు రూ.211 చొప్పున ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో రూ.6 పెంచారు. గతంలో రూ.205 కూలీ అందేది. అడిగిన కూలీందరికి ఉపాధి పథకం ద్వారా పనులు చూపిస్తున్నాం. ఎండాకాలంలో 30శాతం అధికంగా కూలి కట్టిస్తున్నాం. – సంపత్‌రావు, డీఆర్డీఓ -
అక్రమాలకు హామీ!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఉపాధి హామీ పథకం పేరుతో జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి అంతాఇంతా కాదు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచేయడంతోపాటు పేదలకు అందాల్సిన ఉపాధి వేతనాలను కూడా ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. పనులు చేపట్టకుండానే జరిగినట్టు చూపించేస్తున్నారు. తక్కువ పనిచేసి ఎక్కువ కొలతలు వేసి స్వాహా చేసిన ఘటనలు ఉన్నాయి. కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు దిగమింగేసిన దాఖలాలు అనేకం. చెరువుగట్లలో అవినీతి.. కూరగాయల పందిర్లలో అక్రమాలు.. ఉద్యానవన మొక్కల పెంపకంలో నిధులు స్వాహా.. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అవకతవకలు.. నీరు చెట్టులో నాసిరకం పనులు.. సీసీ రోడ్ల పేరుతో దోపిడీ.. మరుగుదొడ్ల నిర్మాణాల్లో చేతివాటం... ఇలా ఒకటేమిటి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులన్నీ అక్రమాలకు హామీగా మార్చేశారు. విచారణపేరుతో బోలెడు ఖర్చు జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సోషల్ ఆడిట్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వారు పనుల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏమేరకు నిధులు మింగేశారో తేల్చుతారు. అయితే దీనికోసం చేసే ఖర్చే ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క ఏడాదిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా రూ..300 కోట్లు ఖర్చుచేశారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో గడచిన ఎనిమిదేళ్లుగా జరిగిన అక్రమాలు పరిశీలించేందుకు చేసిన ఖర్చు దాదాపుగా రూ.5.60 కోట్లు. ఇంతా చేసి వీరు తేల్చిన అక్రమాల విలువ కేవలం రూ.4.10 కోట్లే. అంటే పరిశీలనకు అయ్యే ఖర్చుకంటే అక్రమాల విలువే తక్కువన్నమాట. రికవరీల్లో రాజకీయ జోక్యం జిల్లా వ్యాప్తంగా రూ.4.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించగా ఇంతవరకు రూ.1.52 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఈ విషయంలో రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. 16 మంది ఏపీఓలు, ఆరుగురు ఇంజినీరింగు కన్సల్టెంట్లు. 66 మంది టెక్నికల్ అసిస్టెంట్లు.. ఇలా వివిధ హోదాల్లో పనిచేసిన 10,447 మంది అక్రమాలకు పాల్పడినట్టు సోషల్ ఆడిట్లో తేల్చారు. కానీ రికవరీ విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. కనీసం అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులైనా జారీ చేశారా అంటే అందులోనూ అలసత్వం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 34 మండలాలకు గాను 2017–18 ఆర్థిక సంవత్సరంలో 9 మండలాల్లో, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 30 మండలాల్లో సోషల్ ఆడిట్ జరిగింది. ఇందులో గుర్తించిన అక్రమాల విలువ రూ.2,35,21,296. అందులో నేటి వరకు రూ.20,30,788 రికవరీ చేశారు. అవినీతికి పాల్పడిన 986 మందికి నోటీసులు జారీచేశారు. అక్రమాలకు ‘బాట’లు ఉపాధిలో తమవారికి లబ్ధి చేకూర్చేందుకు అనువుగా మెటీరియల్ కాంపొనెంట్ పనులను తెరమీదకు తీసుకువచ్చారు. తెలుగు తమ్ముళ్లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ఈ పనులు దక్కించుకుని పనులు చేయకుండానే బిల్లులు నొక్కేశారు. ఇక చంద్రన్న బాటల పేరుతో నిర్మించిన సీసీరోడ్లలో జరిగిన అవినీతి తారాస్థాయికి చేరుకుంది. అవసరం లేనిచోట్లకు కూడా నాశిరకం నిర్మాణాలు చేపట్టి అడ్డగోలుగా దోచుకున్నారు. పంటపొలాలకు... వ్యవసాయ పనులు చేసుకునే కళ్లాలకు ఇష్టానుసారం సిమెంట్ రోడ్లు నిర్మించారు. కానీ డబ్బులు మాత్రం మొత్తం కొట్టేశారు. కూలీలకు అందని వేతనాలు ఉపాధి హామీ పథకం పేరుచెప్పి కమీషన్లు వెనకేసుకుంటున్న ప్రజాప్రతినిధులు, అక్కమార్కుల పాలవుతున్న నిధులు కోట్లలో ఉంటే ఎండనకా, వాననకా కాయకష్టం చేస్తున్న ఉపాధి కూలీలకు మాత్రం అన్యాయం జరుగుతోంది. వారికి అందాల్సిన వేతనాలను నెలల తరబడి ఇవ్వకుండా ప్రభుత్వాలు వారిని పస్తులుంచుతున్నాయి. జిల్లాలో గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకూ నాలుగు నెలలకు రూ.100 కోట్ల బకాయి ఉంచింది. ఉపాధి హామీ పథకం వివరాలు: జిల్లాలో 921 పంచాయతీల్లో శ్రమశక్తి సంఘాలు: 42,432 జిల్లాలో ఉన్న జాబ్‌కార్డులు సంఖ్య:3.80లక్షలు కూలీలకు రావాల్సిన బకాయిల మొత్తం (4 నెలలకు): రూ.100 కోట్లు -
‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు
సాక్షి, పాల్వంచరూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నిర్వహించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడ్డాయి. అవకతవకలపై ఈజీఎస్ ప్రిసైడింగ్ అధికారి కరుణాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. అవకతకలు జరిగిన పంచాయతీల్లో లక్షా నాలుగువేల రూపా యలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఓపెన్‌ఫోరం జరిగింది. ఈజీఎస్ కింద 2017 డిసెంబర్ 1నుంచి 2018 జనవరి 31 వరకు మండలంలోని 11 పంచాయతీలలో జరిగిన రూ.6 కోట్ల 5 లక్షల19వేల 516 విలువగల పనులు నిర్వహించారు. ఈ పనుల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో అవకతవకలు వెలుగుచూశాయి. పనులకు రాకున్నా కూలీలకు మస్టర్లు వేసినట్లు, తీర్మానాలు లేకున్నా అనుమతులు ఇవ్వకున్నా అధికంగా భూమి చదును పనులు నిర్వహించారు. మృతి చెంది మూడు సంవత్సరాలైన కూలీకి వేతనం చెల్లించినట్లు, తక్కువ పనులు చేసి ఎక్కువ పని చేసినట్లుగా ఎంబీలో రికార్డులు నమోదు చేసి నట్లు, రైతులకు ఇచ్చిన మొక్కలు సగం కూడా బతకకపోవడం, చేసిన పనుల వద్ద ఉపాధి నేమ్ బోర్డులను ఏర్పాటు చేయక పోవడం వంటి పలు అక్రమాలు బయటపడ్డాయి. యానంబైల్ పంచా యతీలో పట్టా పాస్‌పుస్తకాలు, ఇతర ఆధారులు లేకుండానే భూమి లెవల్ పనులు నిర్వహించారని, ఎక్కడ ఎంత పని చేశారో కూడా రికార్డులో రాయకపోవడం, ప్లే స్లిప్‌లు పంపిణీ చేయలేదు. వంద రోజులు దాటిన తర్వాత కూడా కొంతమంది కూలీలకు పనులు కల్పించి వేతనాలు చెల్లించారు. ఎడ్ల ఉమ అనే కూలి 18 రోజులు కూలీ పనులు చేసిన వేతనం చెల్లించలేదు. మరి కొంతమంది జాబ్‌కార్డులు అడిగినా ఇవ్వలేదు. ఏపీఓ, ఎంపీడీఓ సంతకాలు లేకుండానే మస్టర్ల పేమెంట్ చేశారని, పనిచేయని కూలీకి రూ.421 వేతనం చెల్లించారని, గొగ్గిల శంకర్ అనే కూలీ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందినా 6 రోజుల వేతనం చెల్లించినట్లు వెలుగు చూశాయి. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశించారు. 37 మంది కూలీలకు రూ.7,450 అడ్వాన్స్ పేమెంట్ చేసిన విషయం బయటపడింది. సోములగూడెం పంచాయతీలో రూ.1 కోటి 73 లక్షల మంజూరు కాగా ఇందులో కేవలం రూ.77 లక్షల75 వేల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకుడు గుంత నిర్మాణం చేయని పద్మ అనే మహిళకు పేమెంట్ చేశారు. ఒకేరోజు ఒక కూలీకి రెండు మస్టర్లు వేశారు. రెండు రోజులు పనిచేసిన ఒక కూలీకి ఒక రోజు వేతనం చెల్లించారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, సోములగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో కూలీలతో చేయాల్సిన గంతులు తీసే పనులను యంత్రాల సహాయంతో నిర్వహించినట్లు బయటపడింది. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశాలు జారీచేశారు. నీటికుంట నిర్మాణంలో 5.25 క్యూబిక్ మీటర్లు నిర్మాణం జరుగగా ఎంబీ రికార్డులో మాత్రం 6.04 క్యూబిక్ మీటర్లు నమోదు చేసినట్లు బయటపడటంతో విచారణకు ఆదేశించారు. పాండు రంగాపురంలో కూడా మస్టర్లలో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూశాయి. ఇలా మిగిలిన పం చాయతీలో కూడా పలు అవకతవకులు జరి గాయి. కార్యక్రమంలో ఈజీఎస్ ఏడీలు రాం మోహన్, మధుసూదన్‌రాజు, డీవీఓ. సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్.భాస్కర్‌రావు, అనిల్‌కుమార్, ఎంపీడీఓలు అల్బర్ట్, ధన్సింగ్, సీఆర్పీ సీహెచ్. గంగరాజు, ఏపీఓ.రంగా పాల్గొన్నారు. -
పనులు చేసినా పైసలు లేవు
సాక్షి, కొమరాడ: గ్రామాల్లో వలస నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో కూలీలకు వంద రోజులు పనులు కల్పించడంతో వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునని ప్రభుత్వం సంకల్పించింది. అయితే పథకం కూలీలకు చేతి నిండి పనులున్నా కూడా వలసలు ఆగడం లేదు. దీనికి కారణంగా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడమే. కూలీలు ఉన్న చోటికి ఉపాధి కల్పించి వలసలు నివారించాలని ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది మూడు నెలల నుంచి వేతనదారులు కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం చీమ కుట్టినట్లు అనిపించడం లేదని వేతనదారులు మండిపడుతన్నారు. గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండంల్లోని నెలలు తరబడి కూలి డబ్బులు అందకపోవడంతో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చేస్తున్న చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కూలి డబ్బులు కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పనులు చేసినా సకాలంలో కూలి డబ్బులు అందకపోవడంతో గ్రామీణులు వలస బాట పడుతున్నారు. పనులు ఫుల్.. డబ్బులు నిల్.. ఆరు నెలలుగా సరైన వర్షం లేకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలు పొట్టకూడి కోసం ఉపాధి పనులవైపు మొగ్గు చూపారు. అయితే పనులకు ఇబ్బంది లేకపోయినా డబ్బులు విషయానికి వచ్చే సరికి వారికి తిప్పలు తప్పడం లేదు. దీంతో పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు స్థానికంగా ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వాలన్నా ప్రభుత్వం లక్ష్యం మరుగు పడుతోంది. వాస్తవానికి ఉపాధి హామీ వేతనదారులకు 100రోజులు నుంచి 200 రోజులు పనికల్పించి వారం వారం బిల్లులు చెల్లించాలి. కానీ క్షేత్ర స్థాయిలో కనీసం 100రోజులు కూడా పని కల్పించడం లేదు. చేసిన పనులకు బిల్లులు అందడం లేదు. కొమరాడ- సంఘాలు 960 వేతనదారులు 6542 బకాయాలు రూ.1.65కోట్లు కురుపాం.. సంఘాలు 661 వేతనదారులు 4468 బకాయాలు రూ.2కోట్లు జియ్యమ్మవలస: సంఘాలు 788 వేతనదారులు 4991 బకాయాలు రూ.2.08 కోట్లు గరుగుబిల్లి.. సంఘాలు 828 వేతనదారులు 6042 బకాయిలు రూ.2.30 కోట్లు గుమ్మలక్ష్మిపురం.. సంఘాలు 779 వేతనదారులు 6042 బకాయిలు రూ.2కోట్లు మూడు నెలలు డబ్బులు లేవు మూడునెలలు కూలీ డబ్బులు పడలేదు. కార్యాలయాలు, బ్యాంకు చుట్టూ తిరుగుతన్నా డబ్బులు పడడంలేదు. అనేక ఇబ్బందులు పడుతున్నా కుటుంబ పోషణ భారమైంది. నిత్యవసర వస్తువులు కూడా కొనక్కోలేక పోతున్నాం.– ఆకులు జయలక్ష్మి, వేతనదారులు, గుణానపురం ఇబ్బంది పడుతున్నాం నెలల తరబడి ఉపాధి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కొన్ని కుటుంబాలు వలస పోతున్నాయి. అధికారులు దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేదు.– బుగత ఆదినారాయణ, వేతనదారుడు, గుణానపురం అధికారులు స్పందించాలి ఉపాధి వేతనదారులకు కూలి డబ్బులు అందక వలస బాట పడుతున్నారు. పొట్ట కూటి కోసం వారు కష్ట పడినా డబ్బులు రావడం లేదు. కూలి డబ్బులు ఇవ్వకపోతే వారు ఎలా బతికేది. – అధికారి శ్రీనివాసురావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శివిని -
సమస్యల ‘పని’ పట్టేలా!
వైరా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సరికొత్తగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ఈ పనుల ద్వారా జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు దినసరి కూలి డబ్బులు గిట్టుబాటయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించి కొనసాగించారు. ఇకపై ఎంపిక చేసిన నిర్మాణాలు, అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయబోతున్నారు. తద్వారా..ఇటు కూలీలకు, అటు పల్లెలకు ఒకే విడతలో లబ్ధి, మేలు జరిగే సరికొత్త విధానం రూపుదాల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. పథకానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులను పుష్కలంగా విడుదల చేస్తుండడంతో జిల్లాలోని 20 మండలాల కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.52,278కోట్లతో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2,92,016 జాబ్ కార్డులు ఉండగా..50.89 లక్షల పని దినాలు కల్పించనున్నారు. తాజాగా..ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, గొర్రెల కోసం షెడ్లు, చెరువుల్లో పూడికతీత, పారంఫాండ్స్, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, వంట గదులు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలు చేపట్టవచ్చు. వీటిద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు దీని ద్వారా వచ్చే ఈజీఎస్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. నిధుల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.6లక్షల వరకు, పాఠశాలల్లో ఒక్కో మరుగుదొడ్డికి రూ.50వేలు, వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.12వేల వరకు నిధులు అందుతాయి. వీటితోపాటు వర్మీ కంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవడానికి, ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ఆస్కారం ఉంది. ఇంకుడు గుంతలకు రూ.4వేలు, రైతులు తమ పొలాల్లో పారం పాండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50వేల వరకు లబ్ధి పొందవచ్చు. దీంతోపాటు గ్రామాల్లో ప్రస్తుతం గొర్రెల షెడ్లకు కూడా రూ.50వేల వరకు, పశువుల పాకకు రూ.80వేల వరకు మంజూరయ్యే అవకాశాలున్నాయి. ఇంకా.. ఊరిలో సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు అందుతాయి. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వలసలను ఉపాధి పనులతో అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయాలపై నూతన సర్పంచ్‌లు అవగాహన పెంపొందించుకొని ప్రజల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా త్వరలో వీరికి ప్రభుత్వం శిక్షణ కూడా ఇవ్వనుంది. జాతీయ ఉపాధిహామీ పథకంతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులు, బీఆర్జీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక, సీడీఎఫ్ నిధులు, ఎమ్మెల్యే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు ఆయా ఫండ్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని..కావాల్సిన పనులను ఎంపిక చేసుకుని, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకుంటే..పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీసేలా చేయొచ్చని కొందరు అధికారులు భావిస్తున్నారు. సౌకర్యాలు కల్పించుకుంటాం.. ఉపాధిహామీ పనులను సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకుని, గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటాం. ఊరి అభివృద్ధికి విశేషంగా కృషి చేసేలా చూస్తా. ఉపాధిహామీతో గ్రామం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన పనులను గుర్తించి..అధికారుల సూచనలతో చేయిస్తాం. – ఇటుకల మురళి, అష్ణగుర్తి సర్పంచ్, వైరా మండలం నిధులను సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. ఈజీఎస్ ఫండ్స్‌తో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. కూలీలకు ఉపాధితోపాటు..పలు నిర్మాణాలు చేపట్టేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇవి అందరూ తెలుసుకోవాలి. – బి.ఇందుమంతి, డీఆర్డీఓ -
మున్సిపాలిటీ వచ్చే.. ఉపాధి పోయే..!
ఇబ్రహీంపట్నంరూరల్: మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూలీలు ఉపాధి హామీ పనులు కోల్పోయారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకం వర్తించదు. ఇబ్రహీంపట్నం నియో జవర్గంలోని తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళ్‌పల్లి, యంపీ పటేల్‌గూడ, రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, ఆదిబట్ల గ్రామాలతో ఆదిబట్ల మున్సిపాలిటీ ఏర్పడింది. ఇంతకుముందు ఈ ఆరు గ్రామాల్లో 1728 మంది కూలీ లు ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందారు. ఉపా ధి పనులు జరిగే సమయంలో వీరు రోజుకు రూ. 150 నుంచి రూ.180 వరకు సంపాదిస్తారు. అయితే వారు ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఉపాధి కోల్పోయారు. సూమారు 5వేల మందికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారు. పనులు ఆగిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు భరోసా .. గత 12 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత కూలీలను పట్టించుకోని ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రం భరోసా కల్పించింది. మున్సిపాలిటీల్లో విలీనం అయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను ఇతర గ్రామాల్లో ఖాళీగా ఉన్న చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కూలీలకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. -
‘ఉపాధి’ రాజకీయం
కోవెలకుంట్ల (కర్నూలు): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాజకీయం చోటు చేసుకుంటోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులంటూ టార్గెట్ చేసి మరీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, జూనియర్ మేటీలు గ్రామానికి ఒకరు చొప్పున పనిచేస్తున్నారు. ఏడాదిలో 7,500 పనిదినాలు కల్పించలేదన్న నెపంతో ఇటీవల సుమారు వంద మందినితొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లపై కక్ష సాధింపు ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్ ఆఖరు వరకు గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేటీలకు 7,500 పనిదినాల చొప్పున, జూనియర్ మేటీలకు 5వేల పనిదినాల చొప్పున కేటాయించారు. పదిదినాలతో పాటు కూలీలకు రోజుకు రూ.205 వేతనం పడాలన్న నిబంధన విధించారు. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకోలేని ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేటీలపై వేటు పడగా.. మరి కొన్ని గ్రామాల్లో ఫీల్ట్ అసిస్టెంట్లు లక్ష్యాన్ని అధిగమించినప్పటికీ ఇతర కారణాలు చూపి తొలగించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా లేని వారిని అధికారులు బలిపశువులు చేసినట్లు ఆరోపణలున్నాయి. అనుకూలంగా ఉన్నవారు కొనసాగింపు లక్ష్యాన్ని చేరుకోలేదన్న సాకుతో ఫీల్ట్ అసిస్టెంట్లు, సీనియర్ మేటీలను తొలగించిన అధికారులు గ్రామాల్లో టీడీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని మాత్రం తిరిగి కొనసాగిస్తున్నారు. వారికి అనుకూలంగా లేనివారిని మాత్రం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ముద్ర చేసి తొలగించారు. కోవెలకుంట్ల మండలంలోని పెద్దకొప్పెర్ల, వెలగటూరు, బిజనవేముల, సంజామ ల మండలం ఎగ్గోని, కొలిమిగుండ్ల మండలం నందిపాడు, బందార్లపల్లె, బెలూం గ్రామాల్లోని సీనియర్ మేటీలు 7,500 పనిదినాల కంటే తక్కువ కల్పించడంతో వారిని తొలగించారు. అయితే.. వీరి స్థానాల్లో ఇతరులను నియమించకుండా తిరిగి వారినే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు అనుకూలంగా లేని సిబ్బందికి మాత్రం ఇలాంటి అవకాశం ఇవ్వడం లేదు. లక్ష్యాన్ని చేరుకోకపోయినా కొనసాగింపు కోవెలకుంట్ల మండలంలోని వెలగటూరు, బిజనవేముల, పెద్దకొప్పెర్ల గ్రామాల్లో సీనియర్ మేటీలుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. నిబంధనల ప్రకారం వీరిపై వేటు పడింది. అయితే.. వీరిని జూనియర్ మేటీలుగా పరిగణించేందుకు తిరిగి పథకంలో కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానూభూతి పరుడినని.. పదేళ్ల పాటు ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశా. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడినని ఏడాది క్రితం అన్యాయంగా తొలగించారు. గ్రామంలో 3,700 పనిదినాలు కల్పించాలని టార్గెట్ ఇవ్వగా నేను 6,300 కల్పించాను. అయినప్పటికీ కూలీలకు 7,500 పనిదినాలు కల్పించలేదన్న సాకుతో తొలగించారు. టీడీపీకి అనుకూలంగా లేని ఫీల్డ్ అసిస్టెంట్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. –గోవిందరెడ్డి, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం న్యాయపోరాటం చేస్తాం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను టార్గెట్ చేస్తున్నారు. ఉపాధి పథకం ఫీల్ట్ అసిస్టెంట్లుగా ఉన్నవారిని అన్యాయంగా తొలగిస్తున్నారు. ఫీల్ట్‌అసిస్టెంట్ల పనితీరు బాగుందని, ఉపాధి పథకం కింద పనులు కల్పిస్తున్నారని ఆయా గ్రామాల కూలీలు చెబుతున్నా.. టీడీపీ నాయకులు మాత్రం ఓ పథకం ప్రకారం తొలగింపజేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలకు పోస్టులు కట్టబడితే మస్టర్లలో బినామీ పేర్లు చేర్చి దోచుకోవచ్చనే ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అన్యాయంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేస్తాం. – కాటసాని రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త -
ఊరు మారె.. ‘ఉపాధి’ చేజారె!
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో నేరేడుచర్ల, రామాపురం, నేతాజీనగర్, నర్సయ్యగూడెం, రామగిరి గ్రామాలతో కొత్తగా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏర్పాటైంది.. ఇకపై ఆ గ్రామాలను వార్డులుగా పరిగణిస్తారు.. 14,826 మంది జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో 3,076 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.. మున్సిపాలిటీలో భాగమైనందున ఈ గ్రామాల్లో ఉపాధి పథకం నిలిచిపోనుంది.. 3,076 మందికి ‘ఉపాధి’దూరం కానుంది! ..ఇలా ఒక్క నేరేడుచర్లలోనే కాదు. కొత్తగా ఏర్పడిన 71 మున్సిపాలిటీల్లో భాగంగా ఉన్న 384 గ్రామాల పరిస్థితి కూడా ఇంతే! మున్సిపాలిటీలుగా మారిన గ్రామాల్లో ఆగస్టు 2 నుంచి ఉపాధి హామీ పథకం కింద కొత్త పనుల ప్రతిపాదనలు, మంజూరు ఆగిపోయాయి. దీంతో ఆ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. 173 గ్రామాలను కలిపి ప్రభుత్వం 71 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉన్న 41 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరో 136 గ్రామాలను కలిపింది. ఇలా మొత్తంగా 384 గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒక్కో మున్సిపాలిటీలో 3 వేల నుంచి 4 వేల మంది చొప్పున ఉపాధి హామీ కూలీలున్నారు. ఈ లెక్కన 2.50 లక్షల మందికి జీవనోపాధి సమస్యగా మారింది. కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన దాదాపు అన్ని ఆవాసాలు పట్టణ లక్షణాలు లేనివే ఉన్నాయి. ఈ గ్రామాల్లోని ఎక్కువ మందికి వ్యవసాయం, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకమే దిక్కు. ఇప్పుడు ఆ పథకం వర్తించకపోవడంతో వీరందరికీ జీవనోపాధి దూరం కానుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని వేసవిలో పనుల కోసం తిప్పలు తప్పేలా లేవు. రాష్ట్రంలో 1.11 కోట్ల మంది కూలీలు రాష్ట్రంలో 50,82,970 కుటుంబాలకు జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఉన్నాయి. 1.11 కోట్ల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.11,075 కోట్లను వెచ్చించింది. కూలీలకు వేతనంగా రూ.6,812 కోట్లను చెల్లించింది. కూలీలకు చెల్లించే గరిష్ట వేతనాన్ని ప్రతి ఏటా పెంచుతారు. ప్రస్తుతం ఇది రూ.205 ఉంది. అయితే చేసిన పని ఆధారంగా వేతన చెల్లింపులు ఉంటాయి. తెలంగాణలో దినసరి సగటు వేతనం రూ.140 చొçప్పున అందుతోంది. మంజూరైన పనుల వరకే.. గ్రామాల్లో ఉపాధి పథకం కింద వివిధ రకాల పనులు చేస్తున్నారు. పడావు భూముల అభివృద్ధి, నీటి వనరుల నిర్మాణం, వ్యవసాయ భూములకు రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమగ్ర అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలల్లో వంటగదులు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, మండల సమైక్య కార్యాలయాలు, గొర్రెలు/మేకలు/పశువుల షెడ్లు, శ్మశాన వాటికలు, కూరగాయల సాగుకు అవసరమైన పందిరి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే చేసేవి కావడంతో అక్కడి వారికి ఉపాధి దొరుకుతోంది. మున్సిపాలిటీలుగా మారిన/విలీనమైన గ్రామాల్లో ఈ పనులకు కొత్తగా మంజూరు ఉండదు. ఇప్పటికే మంజూరైన పనులు పూర్తి కాగానే పథకం పూర్తిగా నిలిచిపోనుంది. పట్టణాల్లోనూ ‘ఉపాధి’ఉండాలి గ్రామాల్లో మాదిరే పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం ఉండాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. వాస్తవానికి జనాభాలో సగం మంది వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి పొందే ప్రాంతాలను మాత్రమే మున్సిపాలిటీలుగా మార్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి లేదు. దీంతో పట్టణ ప్రాంతాల్లోనూ ‘ఉపాధి హామీ పథకం అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఎలాంటి ఆదేశాలూ రాలేదు మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు ఆగుతాయన్న అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఆదేశాలు వచ్చేంతవరకూ గతంలో పనులు ఎలాగో జరిగియో అలానే ఉంటాయి. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను, అదే మండలంలో ఇతర గ్రామాల్లో ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. -ఎస్.కిరణ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ, సూర్యాపేట ఇప్పుడే పనులు నిలిపేయం మున్సిపాలిటిలో విలీనం అయిన గ్రామాల్లో ఇప్పుడే పనులు నిలిపి వేయము. ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో మంజూరైన పనులు పూర్తయ్యే వరకు కూలీలకు పనులు కల్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు గుర్తించిన పనులు పూర్తి కావాలంటే కనీసం 3–6 నెలలు పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు కల్పించడం జరుగుతుంది. - అర్సనపల్లి వెంకటేశ్వర్రావు, డీఆర్డీఓ, కరీంనగర్ మా బతుకులు రోడ్డున పడతాయి మాకు ఎలాంటి భూమి లేదు. ఉపాధి హామీ పథకం పనులే జీవనాధారం. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేశారు. మా ఊరు నర్సయ్యగూడెంను మున్సిపాలిటీలో కలిపారు. ఇలా కలిపితే ఉపాధి పని ఉండదంటున్నారు. అలా చేస్తే మా బతుకులు రోడ్డున పడతాయి. - కూరపాటి వెంకటమ్మ, నర్సయ్యగూడెం, ఉపాధి కూలీ, నేరేడుచర్ల, సూర్యాపేట -
వైఎస్ జగన్‌ను కలిసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
-
ఉపాధి పనుల్లో తప్పులు చేస్తే చర్యలు
పిట్లం(జుక్కల్) నిజామాబాద్ : ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న సిబ్బంది తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీడీ సాయన్న హెచ్చరించారు. శుక్రవారం నాడు పిట్లం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉపాధిహామి సామాజిక తనిఖీ ప్రజావేదికకు హాజరై మాట్లాడారు. మండలంలో 2017–18 సంవత్సరానికి రూ.5.70 లక్షల పనులు జరగాయన్నారు. వీటికి సంబంధించి మండలంలోని గ్రామాల్లో వారం రోజులపాటు సామాజిక తనిఖీ చేశామన్నారు. గతంలో మండలంలో రూ.9 కోట్ల వరకు పనులు జరిగితే ఈసారి తక్కవగా జరగాయని, రానున్న రోజుల్లో ఇలా జరిగితే సహించేది లేదని, పని దినాలను పెంచాలన్నారు. ఈసారి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.61 లక్షల పని దినాలను కల్పించామన్నారు. ఉపాధి పనులు తక్కవగా జరిగితే గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, ఈ వర్షకాలం కాగానే పనులు జోరుగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక సామాజికి తనిఖీ బృందం వారు గ్రామాల్లో చేసిన ఆడిట్ నివేదికను చదివి వినిపించారు. అయితే సిబ్బంది చిన్న చిన్న తప్పులకు పాల్పడినట్లు తెలిసిందని, ఇటువంటి వాటిని మానుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, డీవీవో భూమేశ్వర్, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, నిజాంసాగర్ ఎంపీడీవో పర్బన్న, ఎస్ఆర్పీ రంజిత్ కుమార్, ఏపీవోలు శివ కుమార్, టీఏలు బల్రాం, హకీం, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అడవిలో తప్పిపోయిన ఉపాధి కూలీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : మండలంలోని దుమాల గ్రామానికి చెందిన ఉపాధి కూలీ బట్టు లచ్చవ్వ(68)ఈనెల 8న మంగళవారం కూలీ పనులకు వెళ్లి అడవిలోనే తప్పిపోయింది. అప్పటి నుంచి లచ్చవ్వకోసం కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చవ్వ కుమారుడు రాజు మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. భర్త కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా లచ్చవ్వ ఉపాధి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తల్లి తప్పిపోయినట్లు తెలుసుకున్న కుమారుడు రాజు ఈనెల 10న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబసభ్యులంతా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
పొట్టలో గుచ్చుకున్న గడ్డపార..
ఏన్కూరు (ఖమ్మం జిల్లా) : ఉపాధికూలీలు గాయాలయిన సంఘటన మండల పరిధిలోని రాజలింగాల లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెం దిన పెరబోయిన అప్పారావు తన భార్య అలి వేలుతో కలసి ఉపాధి పనికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ద్విచక్ర వాహనానికి గడ్డపార కట్టుకున్నాడు. గోతుల్లో ద్విచక్ర వాహనం నడుపుతుండగా గడ్డపార జారి కింద పడి అప్పారావు కుడికాలుతో దిగింది. దీంతో అప్పారావు కింద పడ్డాడు. అప్పారావు మీద భార్య అలివేలు పడటంతో ఆమెకు పొట్టలో గడ్డపార గుచ్చుకుంది. దీంతో ఇరువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
ఉపాధికి ఊతం
ఏటూరునాగారం : రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాలు, గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే స్థానిక పంటలతో ఆహార వస్తువులను తయారు చేసే యూనిట్లను పెట్టేందుకు ట్రైకార్, గిరిజన సహకార సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉట్నూరు. భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మినీ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రణాళికలను సిద్ధం చేయడానికి ట్రైకార్ స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, జీసీసీ డీజీఎం విజయ్‌కుమార్, ఇతర అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఎక్కువగా లభించే పప్పు ధాన్యాలు, పసుపు, తేనేను ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్న ఉప్పత్తులను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల పెట్టుబడితో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ పంట పండుతుందని అక్కడ ఉన్న హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో ట్రైకార్, జీసీసీ అధికారులు సమావేశమై ఇన్‌పుట్స్‌ను సేకరిస్తున్నారు. సమగ్రంగా నివేదికను తయారు చేసి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోమిర్చి, పసుపు యూనిట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాంతంలో ఏటా సుమారు 17,500 క్వింటాల మేర మిర్చి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మిర్చితో కారం పొడిని తయారు చేసి స్థానిక గిరిజన విద్యాసంస్థలకు జీసీసీ ద్వారా సరఫరా చేస్తే బాగుటుందని ప్రణాళికలను రూపొందించారు. దీనిద్వారా స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి లభించే అవకాశం ఉందని, ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చర్చించారు. కారం పొడిని నాణ్యంగా తయారు చేసి ఈ ఉత్పత్తిని ప్రైవేటు మార్కెట్లోకి జీసీసీ ద్వారా ప్రవేశపెడితే మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడ జిల్లాలోని ఇల్లందులో జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన కారం, పసుపు యూనిట్లు ఉన్నాయి. దీనిద్వారా మూడు ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యాసంస్థలు, సహకార సంస్థలకు కారం, పసుపు రవాణా చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే తరహాలో ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఇలాంటి యూనిట్లు పెట్టి గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టియానా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సుమారు ఆరు వేల మంది గిరిజనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అధికారులు టార్గెట్లను కూడా రూపొందించారు. ట్రైకార్ ద్వారా గతంలో ఎకానమికల్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్ఎస్) కింద 175 రకాల యూనిట్లను అందజేసేవారు. ఇప్పుడు నేరుగా ట్రైకార్ యూనిట్‌ను ఏర్పాటు చేసి గిరిజన మహిళలతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ఆ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ కొనసాగించాలనే ఉద్దేశంతో అర్హులైన మహిళా సంఘాల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే గిరిజన ప్రజలకు ఉపాధి లభించి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
‘ఉపాధి’ ఉసురు తీసింది
మల్లాపూర్ (కోరుట్ల): మూడు గంటల పని పూర్తయింది. మరో గంట గడిస్తే చాలు.. ఇంటికి చేరేవారు. 35 మంది కూలీలు ఎవరి పనిలో వాళ్లున్నారు.. అంతలోనే పై నుంచి మట్టి పెళ్లలు కూలిన శబ్దం.. చుట్టూ దుమ్ము. ఐదు నిమిషాలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. తేరుకుని చూసేసరికి మట్టి పెళ్లల కింద ఆరుగురు మహిళలు. వీరిలో ముగ్గురు ప్రాణాలు విడవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుందీ ఘటన. సొరంగంలా తవ్వడం వల్లే..: కుస్తాపూర్ శివారులోని జానకీకుంట వద్ద మట్టిరోడ్డు పనులను చేపట్టేందుకు 3 గ్రూపులకు చెందిన 36 మంది ఉపాధి కూలీలు వెళ్లారు. మూడు రోజులుగా సమీపంలోని దిబ్బ నుంచి మట్టిని తీసి రోడ్డుకు వేస్తున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 గంటల నుంచి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తూ రోడ్డు పనులు చేపట్టారు. సుమారు 8 ట్రాక్టర్ల మట్టిని తరలించారు. మరో రెండు ట్రాక్టర్ల మట్టిని తరలిస్తే.. పని పూర్తి అవుతుంది. కూలీలు దిబ్బ కింది భాగంలో మరింత లోతుగా మట్టిని తవ్వడం ప్రారంభించారు. అది కాస్త సొరంగంలా మారడంతో మట్టిగడ్డలు ఉన్నట్టుండి కూలిపోయాయి. దీంతో దిబ్బ కింది భాగంలో పని చేస్తున్న 35 మంది కూలీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. దూరంగా పరుగులు తీశారు. కూలిపడ్డ మట్టిగడ్డల వద్దకు చేరుకుని వాటిలో ఇరుకున్న ఆరుగురిని బయటకు తీశారు. వీరిలో కుస్తాపూర్‌కు చెందిన సరికెల ముత్తమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సరికెల రాజు (55), జెల్ల పోశాని (55)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ జెల్ల సుజాత (38), గుండ రాజు (40)లకు కాళ్లు విరిగిపోయాయి. మరో మహిళ గంగు(42)కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కూలీల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కుస్తాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ దండు పెద్ద రాజం, టెక్నికల్ అసిస్టెంట్ ప్రణయలను సస్పెండ్ చేశారు. తక్షణ సాయంగా రూ.20 వేలు కూలీల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జేసీ రాజేశం, సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు.. మెట్పల్లి ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.20 వేలను అందించనున్నట్లు తెలిపారు. బాధితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఎకరం వ్యవసాయ భూమి, పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ఉచిత విద్య, అపద్బంధ పథకం క్రింద పరిహారం అందించేందుకు కృషి చేస్తామని విద్యాసాగర్‌రావు హమీ ఇచ్చారు. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా:జూపల్లి సాక్షి, హైదరాబాద్: మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కూలీల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంట గడిస్తే.. ఇంటికి పోయెటోళ్లం: గడ్డం పోశాని మూడు రోజుల నుంచి మట్టి దిబ్బను తవ్వి ట్రాక్టర్లలో పంపుతున్నం. తవ్వుడు.. మోసుడు.. ఎవరి పనిలో వాళ్లం ఉన్నం.. మరో గంట పని చేస్తే చాలు. ఇంటికి పోయెటోళ్లం. ఇగో అప్పుడే.. మట్టి దిబ్బ కింది భాగంలో సొరంగం లెక్క తయారై మట్టిపెల్లలు మా మీదకి వచ్చి పడ్డయ్. అందరం ఉరికినం.. మన్ను కింద పడ్డవాళ్లు సరిగా కానరాలె. ఏం చేయాలో ఎవరికి తోయలే.. ఏడుసుకుంటనే మట్టి పెల్లలు పక్కకు జరిపి కొంత మందిని తీసినం. ఊరోళ్లకు.. ఉపాధి సార్లకు చెప్పినం. అందరు వచ్చిండ్రు.. మట్టి కింద ఇరుక్కున్న వారిని దవాఖానాకు పంపించిండ్రు. ముగ్గురి ప్రాణాలు పోతయని అనుకోలె. -
నెలాఖరులోగా పనులు పూర్తి
గుమ్మలక్ష్మీపురం : మండలంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.రాజ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు 90 శాతం, శాఖపరమైన నిధులు పది శాతంతో గ్రామాల్లో చేపడుతున్న సీసీరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, గృహనిర్మాణాలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులంతా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఆయా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించినందునా సంబంధిత శాఖ అధికారులు ఈ నెలాఖరుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
ప్రకటనలకే పరిమితం..
బొండపల్లి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడానికి... వలసల నివారణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు. వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ మొదట్లో వంద రోజుల పని కల్పించాలని నిర్ణయించారు. తర్వాత 150 పని దినాలను కల్పిస్తామని అధికారులు, పాలకులు ప్రకటనలు గుప్పించారు. దీంతో వేతనదారులు ఎంతో సంతోషించారు. అయితే టీడీపీ సర్కార్ పథకం అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వేతనదారులకు కూడా 150 రోజుల పని కల్పించలేకపోయారు. దీంతో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారు పనికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. 150 రోజుల ఉపాధి పని ప్రకటనలకే పరిమితం కావడంతో వేతనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 16,452 వేతనదారులు జాబ్‌కార్డులు కలిగి ఉండగా వీరంతా పనులకు వెళ్తున్నారు. వీరిలో సుమారు పది వేల మంది వంద రోజుల పని పూర్తి చేసుకోగా... మిగిలిన వారు వంద రోజుల పని కూడా పూర్తి చేసుకోలేదు. వంద రోజుల పని పూర్తి చేసుకున్న వారు తమకు 150 రోజుల పని కల్పించాలని కోరుతుండగా, మిగిలిన వారు ప్రస్తుతం పనులకు వెళ్తున్నారు. అందని బిల్లులు అనుకున్న ప్రకారం పనులు కల్పించలేని అధికారులు మరో పక్క చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేకపోతున్నారు. మండలంలోని దేవుపల్లి, బొండపల్లి, గ్రహపతిఅగ్రహారం, ఎం. కొత్తవలస, బి.రాజేరు, సీటీపల్లి, మరువాడ, జే గుమడాం, వెదురువాడ, ఒంపల్లి, కొండకిండాం, రాచకిండాం, కనిమెరక, రయింద్రం, గరుడబిల్లి, గొట్లాం, ముద్దూరు, నెలివాడ, గొల్లుపాలెం, తదితర గ్రామాల్లో ఎక్కువ మంది వేతనదారులు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు. ఇందులో చాలా గ్రామాలకు చెందిన వేతనదారులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పనులు కల్పించడం లేదని, అలాగే చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా మంజూరు చేయడం లేదని వేతనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించడంతో పాటు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వేతనదారులు కోరుతున్నారు. కరువు మండలాల్లోనే.. కరువు మండలాల్లోనే 150 రోజులు పనిదినాలు కల్పిస్తున్నారు. బొండపల్లి మండలంలో 100 రోజులు పనిదినాలు మాత్రమే కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు కూడా 100 రోజులు పనిదినాలే కల్పిస్తున్నాం. కె.రవిబాబు,ఏపీఓ,బొండపల్లి మండలం -
‘ఉపాధి’ జోరు
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకానికీ అనుసంధానం చేస్తోంది. ఎక్కడ చూసిన ఉపాధి.. ఏ పథకం ప్రవేశపెట్టినా ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతోంది. ఇలా ప్రతి దానికి ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు చేతినిండా పని లభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయం, హరితహారం, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం, పశువుల పాకలు, ఫారంఫండ్లు.. డంపింగ్‌యార్డు, పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు.. ఇలా ప్రతీ దాన్ని ఉపాధి హామీ పథకంలో చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశమంతటా ఈ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతాఇంత కాదు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. దీంతో ఉపాధి కూలీలకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ఆ పథకం కింద సుమారు 52 రకాల పనులు చేస్తున్నారు. జిల్లాలో 1,51,583 మంది జాబ్‌కార్డులు ఉండగా.. 3,22,000 వేల మంది కూలీలు ఉన్నారు. గత ఏడాది 60 లక్షల పని దినాలు లక్ష్యం కాగా.. 31.22లక్షల పని దినాలు కల్పించారు. తాజాగా సంతల ఏర్పాటు.. గ్రామాల్లో సంతలు(అంగళ్లు) నిర్వహించుకోవడానికి వీలుగా గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద షెడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానికుల అవసరాలు తీర్చడంలో భాగంగా పండ్లు, కూరగాయలు, తినుబండరాలు, సామగ్రి తదితర వాటిని విక్రయించుకునేందుకు వసతులు కల్పించనుంది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, దాతలు చొరవ తీసుకుంటే త్వరగా అంగళ్ల నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరమైన మౌలిక వసతులను రెండు కేటగిరీల్లో కల్పించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 20 గదులు, 30 గదుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసుకునేలా అవకాశం ఇచ్చారు. గ్రామ జనాభా, స్థలం, నిధుల లభ్యత తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీలే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 30 గదులకు రూ.15 లక్షలు, 20 గదులకు రూ.10 లక్షలు కేటాయించనున్నారు. వీటిని ప్లాట్‌ఫాం, నీటి వసతి, మూత్రశాలలు, డ్రైనేజీలు, పార్కింగ్ స్థల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంగళ్ల నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. వేలం పాట స్థలం కేటాయింపు లేదా అంగళ్లలో విక్రయించే వారి నుంచి పన్నులు కూడా వసూలు చేసుకోవచ్చు. వ్యవసాయ పనులకు.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశపెట్టే దేశ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తోంది. గ్రామీణులకు ఉన్న ఊర్లోనే పనిచేసుకుని జీవించేందుకు రూపొందించిన ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చుతోంది. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం వల్ల బీడు భూములు సాగులోకి రావడంతోపాటు పాడిపరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పాకల నిర్మాణాలు చేపడుతోంది. ఊటకుంటలు, ఫారంఫండ్లు, నీటి నిల్వ కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేసుకొని వర్మీకంపోస్టు యూనిట్లు తయారు చేసుకోవచ్చు. పశువుల తొట్టెలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. హరితహారంలో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే హరితహారం కింద నాటే మొక్కలు ఉపాధి పనులతోనే చేయిస్తున్నారు. జిల్లాలోని వివిధ నర్సరీల్లో ఉపాధి కూలీలతో మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది కోటి మొక్కల లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడం, వాటి రక్షణ చర్యలకు సైతం ఉపాధి పనుల్లోనే వినియోగిస్తున్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. సీసీ రోడ్లకు 90 శాతం నిధులు ఈ పథకం నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని చాలా గ్రామాల్లో ఉపాధి కింద వేసిన రోడ్లు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ కింద చేపట్టే పనులు సైతం చేపడుతున్నారు. చెరువులో తీయడం ఈ పథకం కింద చేస్తున్నారు. అటవీ భూముల్లో.. ఉపాధి పథకం కింద అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. పెద్ద ఎత్తున నీటి, ఊటకుంటల తవ్వకాలు చేపడుతున్నారు. అటవీభూములు ఆక్రమణలకు గురికాకుండా సరిహద్దు చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. దీని ద్వారా బయట నుంచి భూమిని కాపాడుకోవచ్చు. ఈ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టికోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఈ ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతోపాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు రైతులకు సంబంధించిన నిర్మాణాలు ఈ పథకం కింద చేపడుతున్నాం. ఎక్కువగా వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం, నీటి లభ్యతను పెంచే నిర్మాణాలు చేపడుతున్నాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీవో -
దయనీయం..మేదర జీవనం
అడవికెళ్లి కంకతెచ్చి.. నిలువునా చీల్చి.. ఎండకు ఆరబెట్టి.. ఓపికతో అల్లి.. మార్కెట్‌కు తీసుకెళ్లి.. అమ్మితే వచ్చే డబ్బులతో జీవనం సాగించే మహేంద్రులకు (మేదరులకు) ఉపాధి లేకుండా పోతోంది. వాళ్లు అల్లిన తట్టలకు, బుట్టలకు ఆదరణ తగ్గిపోతుండడంతో మేదరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్లాస్టిక్ దెబ్బకు మేదరుల అల్లికలకు ఆదరణ తగ్గుతోంది. వృత్తిని నమ్ముకుని దుర్భర స్థితిలో కుటుంబాలు వెళ్లదీస్తున్న మేదరి కుటుంబాలపై ‘సాక్షి’ ప్రేత్యేక కథనం.. కౌటాల(సిర్పూర్): కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుటుంబాలు ఉండగా వీటిలో 283 కుటుంబాలు వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుటుంబమంతా కష్టపడితే కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఖర్చులు పోను పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అడవి నుంచి అధికారులు వెదురును తీసుకెళ్లని వ్వకపోవడంతో చేతినిండా పనిదొరకక కొన్ని నెలలుగా మేదరులు ఆర్థికంగా ఇబ్బందులు ప డుతున్నారు. చాలా మంది మేదరి కులస్తులు వృత్తికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్ర భుత్వం ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. వెదురుతో రూపు దిద్దుకునేవి ఇవే.. మేదరులు వెదురుతో తడకలు, వెదురు బుట్టలు, గొర్ల తడకలు, చాటలు, గంపలు, పెళ్లి పందిళ్లు, మొక్కల పెంపకానికి చిన్నచిన్న బుట్టలు తయారు చేస్తారు. గంపలు, నిచ్చెనలు, పూలతొట్టీలు, విసనకర్రలు, పొయ్యి గొట్టాలు, ఆటవస్తువులు, తరాజు, బుట్టలు, ధాన్యం నిల్వ చేసే గంపలు, వస్తువులను మేదరులు తయారు చేస్తారు. దొరకని ముడిసరుకు.. గతంలో అడవులు ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడపడితే అక్కడ కంకబొంగు లభిస్తుండేది. దీని ద్వారా మేదరుల అల్లికలకు ముడి సరుకు విరివిగా లభించేది. అడవులు అంతరిస్తుండడంతో అధికారులు కంకబొంగును అడవి నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో మేదరులకు చేతినిండా పనిదొరకక కుటుంబం నడవని స్థితి. హరితహారంలో అధిక సంఖ్యలో వెదురు మొక్కలు నాటాలని మేదరులు కోరుతున్నారు. వెదురుతో తయారు చేసిన తట్టలు, బుట్టలు ముత్తంపేటలో తట్టలు అల్లుతున్న మేదరులు అన్నింటా ప్లాస్టిక్.. ప్రస్తుతం అన్ని వస్తువులు ప్లాస్టిక్‌లో లభిస్తుండడంతో మేదరులకు ఉపాధి కరువవుతోంది. అడవి నుంచి వెదురును తీసుకెళ్లడానికి అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాలాని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందించి ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు. మేదరి కులస్తులను ఆదుకోవాలి కుమురం భీం జిల్లాలో 304 మేదరి కుంటుబాలు ఉన్నాయి. వీటిలో 283 మేదరి కుటుంబాలు మేదరి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం మేదరుల అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించి వెదురు బొంగుతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలి. అడవుల్లో వెదురు మొక్కలను ఎక్కువగా నాటాలి. ప్రభుత్వం రుణాలు అందించాలి. – సుల్వ కనకయ్య, మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుటుంబ పోషణ భారంగా మారింది నా పేరు రాచర్ల లక్ష్మి నారాయణ. మాది కౌటాల మండలం గురుడుపేట. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. 30 ఏళ్లుగా మేదరి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. అధికారులు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి మేదరులను ప్రోత్సాహించాలి. లేకుంటే కులవృత్తి కనిపించకుండాపోతుంది. ఆర్నెళ్ల నుంచి అటవీ అధికారులు వెదురును అడవిలో నుంచి తీసుకురానివ్వడం లేదు. దీంతో పని లేక పస్తులుంటున్నాం. ఆరు నెలల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది. మా తమ్ముడు అడవి నుంచి వెదురు తెస్తే నేను ఇంటి వద్దే ఉంటూ వెదురు వస్తువులు తయారు చేస్తాను. తయారు చేసిన వెదురు వస్తువులను మా తమ్ముడు గ్రామాల్లో, వార సంతల్లో అమ్ముతాడు. మేదరి వృత్తిపైనే నేను. నా భార్య, నా కూతురు, మా తమ్ముడు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఆదరణ తగ్గిపోవడంతో, అటవీ అధికారుల ఆంక్షలతో వృత్తిని వీడాల్సి వస్తోంది. -
ఉపాధి కష్టాలు
వారంతా శ్రమజీవులు.. రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. పల్లెల్లో పనులు లేక వారంతా ఉపాధి హామీ కూలీలుగా మారారు. పనులు చేస్తే వచ్చే నాలుగు రూపాయలతో కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఏకైక లక్ష్యం వారిది. రోజంతా మండుటెండలో పనిచేస్తున్నారు. అయితే కూలి చెల్లించాల్సిన అధికారులు వివిధ కారణలతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో శ్రమనే నమ్ముకున్న వేలాది మంది ఉపాధి హామీ కూలీల దయనీయ స్థితి ఇది. అధికారులు ఆడిట్లో చేసిన తప్పుల ఫలితంగా కూలీలు ఆర్థిక కష్టాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. సక్రమంగా పనులు ఉండకపోవటంతో జిల్లాలో వలసలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తేనే వలసలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే అధికారుల బాధ్యతారాహిత్యం, ఉపాధి హామీ లో చోటుచేసుకుంటున్న అవినీతి వల్ల కూలీలు అంతిమంగా నష్టపోతున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని ప్రభుత్వం ఆమోదించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగం అభివృద్ధికి సంబంధించిన పనులు, కాలువలు, జంగిల్‌క్లియరెన్స్, చెరువుల్లో మట్టితీయడం, రోడ్లు, పంటకుంటలు, వర్మీకంపోస్టులు తదితర పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నారు. అనుమతి ఇచ్చిన తరువాత గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు పనులు కల్పిస్తారు. జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పించేందుకు, పనులను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఏలు, మేట్లు, టీఏలు, టీటీఏలు, ఏపీఓలు, ఎంపీడీఓలు, ఏపీడీలను నియమించారు. ఉపాధి పనులు డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఉపాధిలో ప్రతి ఏటా కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ఆడిట్ నిర్వహించారు. దాని వలన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతోంది. పర్యవసానంగా జిల్లాలోని ఉపాధి కూలీలకు నాలుగు నెలల్లో రూ.20 కోట్ల బకాయి పడ్డారు. బ్యాంక్‌లకు ఆధార్‌కార్డ్ లింకేజీ కాని కారణంగా మరో రూ.2.37 కోట్లు నిలిచిపోయింది. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా అందని వేతనం జిల్లాలో 5.85 లక్షల మందికి ప్రభుత్వం అధికారికంగా జాబ్ కార్డులు మంజూరు చేసింది. వీరికి నిబంధనల ప్రకారం ఏటా వంద పనిదినాలు కల్పించాలి. వీరికి రోజు కూలి రూ.140 తగ్గకుండా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గత డిసెంబర్ నుంచి జిల్లాలో సుమారు 85 వేల మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానంగా 62 వేల మందికి ఉపాధి కూలి అందని పరిస్థితి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 55వేల నుంచి 61 వేల మంది ప్రస్తుతం పనుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో 2017 డిసెంబర్ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కూలి మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు జరిగాయని తరచూ విచారణలు చేపడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. అయితే కూలీల వేతనాల మంజూరుకు మాత్రం దీనిని సాకుగా చూపుతున్నారు. ∙ఉదాహరణకు వాకాడు మండలంలో 665 గ్రూపుల్లో 10,075 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రసుత్తం వీరిలో వెయ్యి మందికి మాత్రమే ఉపాధి పనులు దక్కాయి. వీరికి గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూలీలకు రూ.3 లక్షలు వరకు ఉపాధి సొమ్ము రావాల్సి ఉంది. ఉపాధి కూలీలు మూడు నెలలుగా పనులు చేస్తున్నప్పటికీ కూలి సొమ్ము అందక పస్తులుంటున్నారు. కూలీలకు సంబంధించిన వేతనాలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నోడల్ బ్యాంక్‌లకు విడుదల చేసి అక్కడ నుంచి వివిధ బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాలకు పంపుతుంది. అనంతరం క్షేత్ర స్థాయిలో ఉన్న బ్రాంచ్‌ల్లో జమ అవుతుంది. కూలీలు తమ ఖాతా నంబర్లు, ఆధార్ కార్డులు అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా అనుసంధానం చేసిన నంబర్లు ఎన్సీపీఐ(నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో సింక్ అయితే ఆయా వేతనాలు కూలీల ఖాతాలో జమ అవుతాయి. కూలీలకు సంబంధించిన ఆధార్, ఖాతా నంబర్లు ఎన్సీపీఐలో సింక్ చేయడంలో అధికార్లు జాప్యం, చేసిన పొరపాట్లు కారణంగా వేతనాలు జమకాకుండా రిజెక్ట్ అవుతున్నాయి. పూర్తిగా అధికారులు చేసిన తప్పులకు కూలీలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు వారాలుగా కూలీ అందక పస్తులుంటున్నాం ఐదు వారాలుగా ఉపాధి పనులు చేస్తున్నా.. ఇప్పటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగితే బ్యాంక్‌లో జమ చేశామని, అక్కడ అడిగితే జమకాలేదని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. వారం రోజులుగా పనులు సైతం మానుకుని కూలి డబ్బుల కోసం తిరుగుతున్నాం. ఇల్లు గడవక కుటుంబం పస్తులుండాల్సి వస్తోంది. –వేమాల మస్తానయ్య ఉపాధి కూలీ, వాకాడు చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నాం సెంటు భూమిలేని మా లాంటి పేదోళ్లంతా ఉపాధి పనులను నమ్ముకుని బతుకుతున్నాం. 48 రోజులుగా పనులు చేస్తున్నా ఇంతవరకు డబ్బులు జమకాలేదు. ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు. మాత్రలు కొనడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అల్లాడుతున్నాం. అధికారులను అడిగితే ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప డబ్బులైతే ఇవ్వట్లేదు. పాస్ పుస్తకాలు పట్టుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నాం. –వంజివాక పిచ్చమ్మ, ఉపాధి కూలీ, వాకాడు -
పల్లెకు సీసీ కళ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్లెల్లో అంతర్గత దారుల ముఖచిత్రం సమూలంగా మారనుంది. మురుగు నీరు, చెత్తాచెదారంతో కంపుకొడుతున్న గ్రామాల్లో సీసీ రోడ్లు వేసేందుకు కసరత్తు మొదలైంది. మండలాల వారీగా సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 602 పనులకుగాను కలెక్టర్ రఘునందన్‌రావు తాజాగా ఆమోదం తెలిపారు. వీటిని నిర్మించేందుకు రూ.21.55 కోట్లు కేటాయించారు. ఆరు నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఏడాది మార్చి 31లోపు పనులు పూర్తి చేయాలని యంత్రాంగం లక్ష్యం నిర్దేశించుకుంది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందుగానే నిర్మాణ పనులను ముగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. 90 శాతం ‘ఉపాధి’ నిధులు కేటాయించిన నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద 90 శాతం నిధులను గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే విడుదల చేయనున్నారు. కూలీల వేతనాలు, సిమెంట్, ఇసుక, కంకర తదితర నిర్మాణ సామగ్రికి ఉపాధి నిధులు చెల్లించనున్నారు. మిగిలిన పది శాతం నిధులను నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం (సీడీపీ), ఎంపీలాడ్స్, జెడ్పీ నుంచి ఖర్చు చేయనున్నారు. నియోజకవర్గం మంజూరైన పనులు కేటాయింపులు (రూ.కోట్లలో) చేవెళ్ల 105 2.67 ఇబ్రహీంపట్నం 184 6.67 మహేశ్వరం 52 2.22 షాద్‌నగర్ 140 5.55 రాజేంద్రనగర్ 15 1.11 కల్వకుర్తి 106 3.33 -
బోర్డులపై ‘ఉపాధి’ వివరాలు
భైంసా(ముథోల్) : ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పారదర్శకత కోసం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సామాజిక తనిఖీలు పకడ్బందీగా నిర్వహిస్తుండగా, మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చింది. ఏటా గ్రామసభలు, మండలస్థాయిలో సామాజిక తనిఖీలు, జియో ట్యాగింగ్ చేపడుతోంది. ఇప్పుడు చేసిన పనులు మళ్లీ చేయకుండా వివరాలతో కూడిన బోర్డులను క్షేత్రస్థాయిలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామాలకు ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలు తెలుపుతూ రాసిన బోర్డులను పంపించింది. ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 1,53,551 జాబ్‌కార్డులను అందించింది. 3,20,829 మంది కూలీలు పని చేశారు. 40లక్షలకుపైగా పని దినాలు పూర్తిచేసిన కూలీలకు వేతనం కింద రూ.63.23కోట్లు చెల్లించారు. చేపడుతున్న అభివృద్ధి పనులు.. ఉపాధిహామీ పథకం కింద వ్యవసాయానికి సంబంధించిన పనులే అధికంగా చేస్తున్నారు. ఇంకుడుగుంతలు, నీటి కుంటలు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పూడిక తొలగింపు, మట్టిరోడ్ల మరమ్మతుతోపాటు హరితహారం కింద మొక్కలు నాటుతున్నారు. ఇందుకు సంబంధించిన పనుల వివరాలు తెలుపుతూ ఇప్పటికే అధికారులు గ్రామాల్లో గోడలు నిర్మించి అందులో వివరాలు నమోదు చేశారు. చాలాచోట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు సూచిక బోర్డులు.. ఇప్పటివరకు ఇలా బోర్డుల ద్వారా ప్రదర్శించిన అధికారులు ఇక పనులను బట్టి సూచికలను మూడు రకాలుగా ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, మట్టి పనుల వివరాలపై ఒక్కో బోర్డుకు రూ.350 ఖర్చుచేసి అందులో వివరాలు రాయనున్నారు. ఇలా వివరాలతో రాసిన బోర్డును పనులు జరిగిన ప్రదేశం వద్దనే ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, కుంటల్లో పూడికతీత, రహదారుల నిర్మాణం, హరితహారం, నీటి నిల్వ గుంత, ఇంకుడుగుంతలు వంటి పనుల వివరాలు రూ.2వేల వ్యయంతో రాతి పలకంపై రాసి పని జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రామం మొత్తంలో జరిగిన పనుల వివరాలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలందరికీ తెలిసేలా గ్రామ సమాచార బోర్డుల పేరుతో గోడలపై రూ.3వేలు ఖర్చుచేసి రాయించనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఈప్రక్రియ ప్రారంభమైంది. ఆయా బోర్డుల్లో ఎనిమిది నుంచి పది రకాల సమాచారం రాయిస్తున్నారు. పనిపేరు, గుర్తింపు సంఖ్య, చేసిన ప్రదేశం, అంచనా విలువ, కూలీల వివరాలు, వ్యయం, సామగ్రి వ్యయం, చేసిన పని దినాలు, ప్రారంభం, ముగింపు తేదీ తదితర విషయాలన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. దీంతో చేసిన పనులు మళ్లీ చేసేందుకు వీలుపడదని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఏవైన అనుమానాలుంటే ఫిర్యాదు చేసేందుకు వీలుగా బోర్డుపైనే టోల్‌ఫ్రీ నంబర్లు రాయిస్తున్నారు. రికార్డుల నిర్వహణ బాధ్యత.. ఉపాధిహామీలో పనిచేసే ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు కీలకబాధ్యతలు అప్పగిస్తున్నారు. పనుల గుర్తింపు మస్టర్లు వేయడానికే పరిమితం కాకుండా మరింత బాధ్యతను ఇస్తున్నారు. ఉపాధికి సంబంధించి ఏడు రకాల దస్త్రాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. దస్త్రాల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండనుంది. పనులు, గ్రామసభలు, కూలీలు, ప్రతిపాదనలు, పనుల గుర్తింపు, ఖర్చు, వేతనాలు, చెల్లింపులు, ఫిర్యాదులు తదితర వివరాలన్నింటినీ ఇకపై ఈ సిబ్బంది రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ రికార్డుల పర్యవేక్షణ టీఏలు, ఏపీవోలు ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతీనెల మూడో బుధవారం గుడ్‌గవర్నెస్ నిర్వహణపై సమావేశం ఏర్పాటుచేసి పనుల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. ఈ నూతన విధానంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరిగినప్పుడు నోటిమాటలతో తప్పుడు లెక్కలు చెప్పే వీలుండదు. రికార్డుల రూపంలో ఉన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధానంతో ఉపాధిహామీ పనులు రాబోయే రోజుల్లో మరింత పారదర్శకంగా మారి దుర్వినియోగం, అవినీతిని నివారించే అవకాశం ఉంటుంది. పారదర్శకంగా పనులు ఉపాధిహామీ పథకం అమలుకు జిల్లావ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అన్నిచోట్ల పారదర్శకంగానే పనులు నడుస్తున్నాయి. ఉపాధి సిబ్బందిపై నిరంతర పర్యవేక్షణ ఉంది. ఇప్పటికే చేసిన పనులపై గ్రామాల్లో కూడళ్ల వద్ద, బోర్డులపై రాయించడం జరిగింది. ఇక పనుల వివరాలు తెలుపుతూ క్షేత్రస్థాయిలోనూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఆర్డీవో -
విలీనం లేనట్లే !
మున్సిపాలిటీల్లో విలీనం చేద్దామనుకున్న గ్రామాలపై వెనక్కు తగ్గినట్లు సమాచారం. విలీనం చేస్తే ఉపాధిహామీ పథకం వర్తించకపోవడం, సర్పంచ్ ఎన్నికలు ఉండకపోవడం.. తదితర కారణాలతో ఈ గ్రామాలను యథాస్థితిలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నేతలు మున్సిపాలిటీల్లో కలపొద్దని స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : సమీపాన ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు పంపాలని ఇటీవల ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు సూచించింది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు సంబంధించి విలీనం చేయాలనుకునే గ్రామాల జాబితాను పంపారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీలుగా ఉండే వాటిలో 5 కిలోమీటర్లు, గ్రేడ్ 2 పరిధిలోకి 3 , గ్రేడ్ 3 పరిధి లోకి వచ్చే వాటికి కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రా మాలను విలీనం చేసే ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ గ్రేడ్ 1, నగర పంచాయతీగా ఉన్న దేవరకొండ గ్రేడ్ 3 కేటగిరిలో వస్తుంది. అయితే నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల జాబితా ప్రతిపాదనలు అధి కారులు పంపారు. నల్లగొండ మున్సిపాలిటీలోనే ఎక్కువ గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనలు వెళ్లాయి. ఏ మున్సిపాలిటీలోకి ఏ గ్రామాలు .. నల్లగొండ మున్సిపాలిటీలోకి 14 గ్రామాలను విలీనం చేయవచ్చని ప్రతిపాదించారు. వీటిలో బుద్ధారం, అన్నెపర్తి, కంచనపల్లి, గుండ్లపల్లి, కొత్తపల్లి, జీకె. అన్నారం, చందనపల్లి, దండెంపల్లి, అమ్మగూడెం, మేళ్లదుప్పలపల్లి, పిట్టంపల్లి, తేందార్పల్లి, అనిశెట్టిదుప్పలపల్లి, ఖాజీ రామారం గ్రామాలున్నాయి. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీలో యాద్గార్పల్లి, వెంకటాద్రిపాలెం, వాటర్‌ట్యాంక్ తండా, గూడూరు, బాధలపురం, చింతపల్లి, శెట్టిపాలెం గ్రామాలను విలీనం చేయవచ్చని పంపారు. ఇక దేవరకొండ నగర పంచాయతీ కేటగిరి ప్రకారం దీని పరిధిలోకి వచ్చే గ్రామాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. వీటిని విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం వర్తించదని, సర్పంచ్ ఎన్నికలు ఉండవని.. తమ స్థానిక రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమేనా..? అని స్థానిక సర్పంచ్‌లు, నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఈ మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాల్లోనే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకపోవడంతో.. ఇప్పుడు ఈ గ్రామాలను కలిపితే ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్యెల్యేల దృష్టికి తెచ్చారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, ఉపాధిహామీ పథకం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి విలీన ప్రక్రియను దూరం పెట్టినట్లు సమాచారం. కొత్త పంచాయతీలు చేయొచ్చా.. విలీన గ్రామాల ప్రక్రియ వెనక్కు వెళ్లడంతో.. ఈ గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేయవచ్చా..? అనే విషయమై పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. మైదాన ప్రాంతంలో 500 జనాభా ఉన్న, దాటిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే అధికారులు పంపారు. వీటిల్లో కూడా ఇలా ఈ జనాభా పరిధిలో ఉన్న గ్రామాల ప్రతిపాదనలు పంపే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇవి కొత్త పంచాయతీలు అయితే మరికొంత మంది రాజకీయ ఉపాధి దొరికినట్లే. నగర పంచాయతీలకు ప్రతిపాదనలు.. కొత్తగా నగర పంచాయతీల ప్రతిపాదనల జాబితాలో అనుముల, చిట్యాలను చేర్చనున్నుట్లు తెలిసింది. అలాగే నకిరేకల్‌ను కూడా మున్సిపాలిటీగా చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకొస్తుండడంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. పనిలో పనిగా కొత్త నగర పంచాయతీల ప్రక్రియ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చిట్యాలకు వట్టిమర్తిని కలిపి, అనుములకు ఇబ్రహింపేటను కలిపి నగర పంచాయతీలుగా చేయవచ్చని.. వాటి జనాభాను అధికారులు ప్రభుత్వానికి పంపారు. -
వడదెబ్బతో ఒకరు మృతి
పాములపాడు: వడదెబ్బతతో పాములపాడుకు చెందిన బాలనాగశేషులు(24) బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఉదయం ఇతను ఉపాధి పనులకు వెళ్లాడు. ఎండ వేడిమి తట్టుకోలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. సాయంత్రం పెట్రోల్ బంకులో విధుల నిమిత్తం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధాకరరెడ్డి కేసు నమోదు చేశారు. లావణ్య నిండు గర్భిణి కాగా.. మృతుని తల్లి లింగమ్మ చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయింది. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
మద్దికెర: మండలపరిధిలోని బసినేపల్లికి చెందిన ఉపాధి కూలీ మల్లికార్జున(50) వడదెబ్బకు గురై ఆదివారం మరణించాడు. శనివారం ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన వెంటనే ఆస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా విజయలక్ష్మి
కర్నూలు(అర్బన్): డ్వామా విజిలెన్స్ ఆఫీసర్‌గా ఆళ్లగడ్డ ఎంపీడీఓ ఎం విజయలక్ష్మి నియమితులయ్యారు. గురువారం ఆమె డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డిని కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అభ్యంతరాలపై విచారణ, రికవరీలను వేగవంతం చేయడం, డ్వామా ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనుల పరిశీలన తదితర అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు. -
ఉపాధి హాని
ఉపాధి హామీ పథకం ఆదుకుంటుందని ఎంతో ఆశతో అటు వైపు అడుగులు వేసిన కష్ట జీవులకు కష్టాలే మిగులుతున్నాయి. పనులు ప్రారంభించే ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వారి ప్రాణం మీదకు తెస్తోంది. గ్రీష్మతాపం తోడవడంతో వడదెబ్బలకు గురవుతున్నారు. పాము కాటుకు గురవుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా కనీసం ప్రాథమిక వైద్యానికి కూడా నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ నెల 1వ తేదీన వడదెబ్బకు గురై కరప గ్రామానికి చెందిన నక్కా సుభద్రమ్మ (55) మరణించగా మంగళవారం కత్తిపూడి శివారు సీతంపేట గ్రామానికి చెందిన పిర్ల నాగేశ్వరరావు పాము కాటుకు గురై కన్నుమూశాడు. -
ఉపాధి మంటలు!
హడలిపోతున్న కూలీలు – జిల్లాలో తొమ్మిది వడదెబ్బ మరణాలు - ఇందులో ఐదుగురు ఉపాధి కూలీలే.. – జాడలేని షేడ్‌నెట్స్ ఏర్పాటు – కాగితాల్లోనే మజ్జిగ పంపిణీ కర్నూలు(అర్బన్): జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉపాధి కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది మంది వడదెబ్బతో మరణించగా.. ఇందులో ఐదుగురు ఉపాధి కూలీలే ఉన్నట్లు సమాచారం. అయితే త్రీమెన్ కమిటీ మాత్రం ఏడుగురు మాత్రమే వడదెబ్బతో మరణించినట్లు నివేదించారు. ప్రస్తుత వేసవిలో వ్యవసాయ పనుల్లేక గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం వ్యవసాయ కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. మండుతున్న ఎండల్లో ప్రభుత్వం కనీస ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో కూలీల పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కూలీల సంఖ్య కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. ఏప్రిల్ నెలలో 1.65 లక్షల మంది కూలీలు ఉపాధి పనులు చేపట్టాల్సి ఉండగా.. ప్రస్తుతం 1.45 లక్షల మంది మాత్రమే పనులకు వస్తున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. కాగా ప్రతి రోజు జిల్లాలో 2లక్షల మంది ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వివిధ కారణాలతో కూలీల సంఖ్య మందగిస్తోంది. జాడలేని షేడ్‌నెట్స్ ఉపాధి కూలీలకు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు వర్క్సైట్లలో షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కారణాలేవైనా ఇంకా జిల్లాలో వీటి ఊసే కరువైంది. మొత్తం 50,136 షేడ్‌నెట్స్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఒక్కచోట కూడా ఏర్పాటు చేయలేకపోయారు. అయితే గత ఏడాదికి సంబంధించిన షేడ్‌నెట్స్‌ను ప్రస్తుతం 20,441 వర్క్సైట్లలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా మెజారిటీ ప్రాంతాల్లో కూలీలు పనిచేస్తున్న వర్క్సైట్లలో వీటిని ఏర్పాటు చేయకపోవడంతో మండే ఎండల్లో చుక్కలు చూస్తున్నారు. స్థానికంగా మేటీలే షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలనే అధికారుల సూచన ఎక్కడా అమలుకు నోచుకోవట్లేదు. ఈ ఏడాది కొత్తగా షేడ్‌నెట్స్ ఏర్పాటు చేసేందుకు గత నెల 26న టెండర్లు ఓపెన్ చేసినా, ఇంకా రేట్ల నెగోషియేషన్ కారణంగా ఫైల్ జాయింట్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కూలీలకు అందని మజ్జిగ ఎండల్లో పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసే బాధ్యతను ఈ నెల 1వ తేదీ నుంచి సంబంధిత మేటీలకే అప్పగించారు. మజ్జిగకు రూ.4, మేటీకి రూ.1 ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే జిల్లాలోని మెజారిటీ ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం ఆయా వర్క్సైట్లలో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేశారే కానీ, కూలీలకు మాత్రం మజ్జిగ సరఫరా చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు 3.18 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని చెబుతున్నా, ఇంకా అనేక గ్రామాలకు ఇవి అందకపోవడం గమనార్హం. షేడ్‌నెట్స్ ఏర్పాటుకు చర్యలు జిల్లాలోని అన్ని వర్క్సైట్లలో షేడ్‌నెట్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. గత నెల 26న టెండర్లు ఓపెన్ చేసి జేసీకి పంపాం. జేసీ రాగానే ఫైల్ క్లియర్ అవుతుంది. మజ్జిగను కూడా కచ్చితంగా 1వ తేదీ నుంచి పనులకు వచ్చే కూలీలందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మండలానికి 5వేల ప్రకారం ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ గత నెల 29న ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. సరఫరా చేసిన ప్యాకెట్లు అయిపోగానే తిరిగి ఇండెంట్ పెట్టి తీసుకుంటాం. - డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ -
ఏం తినాలి.. ఎలా బతకాలి?
- కదం తొక్కిన ఉపాధి కూలీలు - డ్వామా కార్యాలయ ముట్టడికి యత్నం - ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్ అనంతపురం టౌన్ : నెలల తరబడి ఉపాధి బిల్లులు రాకుంటే ఏం తినాలి? ఎలా బతకాలంటూ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు తక్షణమే ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ఎదుట బైఠాయించి అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లో ఉపాధి కూలి డబ్బు ఇవ్వాల్సి ఉన్నా నెలల తరబడి కాలయాపన చేస్తోందన్నారు. జిల్లా యంత్రాంగం కాకిలెక్కలతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మూడు నెలల నుంచి సక్రమంగా బిల్లులు రాక కూలీల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అధికారులకు ఒక నెల జీతం రాకుంటే తెగ హైరానా పడతారని, మరి కూలీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వలసలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. ఉపాధి పనులను ఏడాదికి 200 రోజులు పెంచాలన్నారు. రోజు వేతనం రూ.300 ఇవ్వాలని, పోస్టాఫీసుల ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలకు ‘ఉపాధి’ కల్పించేదిగా ఈ పథకాన్ని మార్చేశారన్నారు. డ్వామా పీడీ నాగభూషణం వచ్చి నాయకులతో మాట్లాడారు. గతంలో పోస్టాఫీసుల ద్వారానే బిల్లుల చెల్లింపులు జరిగేవని, జనవరి నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు వేస్తున్నట్లు చెప్పారు. కూలీలందరి ఖాతాలు, ఆధార్ అనుసంధానం కాకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు వివరించారు. ఈ విషయమై కలెక్టర్ వీరపాండియన్‌తో చర్చించామని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని కూలీలు డిమాండ్ చేయడంతో మరో మూడు, నాలుగు వారాలు పడుతుందని పీడీ చెప్పారు. దీంతో వారు ఒక్కసారిగా ముందుకు తోసుకెళ్లారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మరో నాలుగు వారాలంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో టూటౌన్ సీఐ యల్లంరాజు ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెద్దన్న, కృష్ణమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు ముగ్గురి మృతి
వెల్దుర్తి రూరల్ / తుగ్గలి / రుద్రవరం : జిల్లావ్యాప్తంగా వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒకరు ఉపాధి కూలీ ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన మీసాల ఎల్లమ్మ(55)భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందగా పుట్టింట్లోనే ఉంటోంది. రెండు రోజులుగా పొలంలో కంది కొయ్యలు కోసి కాల్చివేస్తోంది. ఇందులో భాగంగా శనివారం పొలంలో పని చేస్తుండగా ఎండ ధాటికి అస్వస్థతకు గురైంది. తర్వాత ఇంటికి వెళ్లి పడుకుంది. ఈక్రమంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచింది. ఇక తుగ్గలికి చెందిన చాకలి లక్ష్మన్న(37) శనివారం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని అనంతరం ఇంటికి రాగానే ఒక్కసారి సొమ్మసిల్లిపడిపోయాడు. స్థానికంగా చేయించుకున్నాడు. అయితే కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. అలాగే రుద్రవరం మండలం టి లింగందిన్నెకు చెందిన బీగాల రాముడు(65) వరి కోతల పనికి వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థతకు గురికావడంతో ఇంటికి మంచంపై పడుకున్నాడు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు పిలిచినా లేవకపోడంతో వెళ్లి చూశారు. ఆయన అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
అవుకు: మెట్టుపల్లె గ్రామంలో ఉపాధి కూలీ ఒకరు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. స్థానికులు, ఫీల్డ్ అసిస్టెంట్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పుల్లయ్య (35)ఉదయం ఉపాధి పనికి వెళ్లి.. 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతునికి భార్య రమాదేవి, ఒక కూతురు, కూమారుడు ఉన్నారు. -
అడిగిన వారందరికీ పనులు కల్పిస్తాం
– వేసవిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు – పనుల కోసం 0866–2432064 ఫోన్ చేయవచ్చు.. – డ్వామా పీడీ పుల్లా రెడ్డి వెల్లడి కర్నూలు (అగ్రికల్చర్) : వలసలను నివారించేందుకు అడిగి ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వలసలు వెళ్లే గ్రామాన్ని సందర్శించి అందుకు గల కారణాలను తెలుసుకొని పనులు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 36 కరువు మండలాల్లో ఇప్పటికే 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా 50 రోజులు పనిదినాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రత్యేక వేసవి అలవెన్సులు ఇస్తున్నామని, ఉపాధి పనులు సంబంధిత గ్రామానికి 5కి.మీల దూరంలోనే పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఐదు కిలో మీటర్లు దాటి పనులు కల్పిస్తే 10 శాతం రవాణా భత్యాన్ని అందజేస్తామని తెలిపారు. పనులు కావాలనుకునే వారు 0866–2432064కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
దాహంపై గరం..గరం!
- వాడివేడిగా జెడ్పీ సమావేశం - దాహార్తి తీర్చాలని సభ్యుల పట్టు - అనర్హులకు జన్మభూమి కమిటీల వత్తాసు - చర్చకు రాని అజెండాలోని అంశాలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నారని ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాని మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్, జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్ హాజరయ్యారు. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తి అయిన వెంటనే తాగునీటి సమస్యపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలుగోడు జెడ్పీటీసీ లాలిస్వామి మాట్లాడుతూ.. మండలంలోని పాత స్కీంకు 200 మీటర్ల పైప్‌లైన్ వేసి మోటారు ఫిట్ చేస్తే వెలుగోడుకు కొంత మేర నీటి సమస్య తీరుతుందన్నారు. కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురవుతున్నాయని, కొండమీదిపల్లె గ్రామం ఇంకా ఇబ్బంది పడుతోందని జెడ్పీటీసీ సభ్యురాలు సరస్వతి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నీరు లేదని చెప్పగానే కలెక్టర్ జోక్యం చేసుకుంటూ.. ఆయా గ్రామాలను పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు మీనాక్షినాయుడు మాట్లాడుతూ.. మండలంలోని ఏరూరు గ్రామంలో ప్రజలందరు కుంటలోని నీటినే తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజీపురం రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వేసి ఎస్ఎస్ ట్యాంకు నిర్మించాలని రూ.40 లక్షలతో ఎస్టిమేట్లు వేయించి రెండు సంవత్సరాలు అవుతున్నా అతీగతీ లేదన్నారు. వెంటనే కలెక్టర్ విజయమోహన్ జోక్యం చేసుకుంటూ తనకు ప్రతిపాదనలు పంపారా? అని ఎస్ఈ హరిబాబును ప్రశ్నించారు. దీంతో ఎస్ఈ పంపలేదని సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ అసహనానికి గురై, వెంటనే సంబంధిత ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఫిల్టర్ బెడ్లు పనిచేయడం లేదని మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆలూరులో కూడా తీవ్ర మంచినీటి సమస్య ఉందని జెడ్పీటీసీ రాంభీంనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చింతకుంట ఎస్ఎస్ ట్యాంకులో నీరు నిల్వ లేదని, వెంటనే ఎల్ఎల్సీ నీటితో ట్యాంకు నింపేందుకు చర్యలు చేపట్టాలని హాలహర్వి జెడ్పీటీసీ కోరారు. తర్తూరు, కిష్టదొడ్డి జాతర్లు ఉన్నందున నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు కోరారు. సి. బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయ్లెట్ల సౌకర్యం కల్పించాలని జెడ్పీటీసీ చంద్రశేఖర్ కోరారు. కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నీటి కరువు అధికంగా ఉందని జెడ్పీటీసీ సభ్యురాలు వాకిటి మాధవీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి బిల్లులకు లంచం ఇవ్వాలంట ...! గూడురు మండలం పెంచికలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వర్మికంపోçస్టు యూనిట్ బిల్లులు ఇవ్వమంటే సంబంధిత ఏపీఓ 10 శాతం మామూళ్లు ఇస్తే చేస్తామని చెబుతున్నారని గూడురు జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్..డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. మండలంలోని పెంచికలపాడు, కే నాగలాపురం గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురవుతున్నాయని, వెంటనే ఆయా గ్రామాల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టాలని నాగజ్యోతి కోరారు. గాజులదిన్నె నీటితో పెంచికలపాడు చెరువు నింపేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ నీటి పారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. అనర్హులకు జన్మభూమి కమిటీల వత్తాసు ... ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, అనర్హులను జన్మభూమి కమిటీలు రెకమెండ్ చేస్తున్నాయని సంజామల జెడ్పీటీసీ సభ్యురాలు బాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ భరోసా కింద అందజేస్తున్న పెన్షన్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. పాలేరు వాగుకు అవుకు రిజర్వాయర్ నుంచి నీరు వచ్చేలా చూడాలని బాబు కోరారు. చర్చకు రాని అజెండాలోని అంశాలు ... జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనేక అంశాలు చర్చకు వస్తాయని భావించినా, పాలకవర్గం మాత్రం త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయం, పశు సంవర్ధకశాఖ, విద్యుత్ శాఖలపై సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. అయితే వ్యవసాయం, పశు సంవర్ధకశాలను వదిలేశారు. కేవలం తాగునీరు, సాగునీటిపై సమీక్ష ఆశించిన స్థాయిలో చర్చ జరిగినా, మిగిలిన శాఖలపై చర్చ జరపకపోవడం పట్ల సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో కరువు తాండవిస్తున్నా, కరువుపై చర్చ జరపకపోవడాన్ని పలువురు సభ్యులు తప్పుపడుతున్నారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల నిధులు జిల్లాలోని అందరు జెడ్పీటీసీ, ఎంపీపీలకు తమ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ప్రకారం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రకటించారు. ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలకు గత ఏడాది ఇచ్చిన విధంగానే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు కేటాయించాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్.. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఉపాధి నిధులు రూ.2.50 లక్షలు, ఎస్డీఎఫ్ నిధులు రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షలు విడుదల చేసేందుకు అంగీకరించారు. అలాగే 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16 మంది జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన బడ్జెట్‌ను కూడా రెండు రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. -
‘ఉపాధి’లో అక్రమాల పథకం
అవకతవకలపై నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకులు తనిఖీలపై ఎమ్మెల్యే వర్గీయుల అసంతృప్తి రసాభాసగా సోషల్ ఆడిట్ విచారణ పిఠాపురం రూరల్ (పిఠాపురం) : పిఠాపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన సోషల్ ఆడిట్ విచారణలో గత ఏడాది నిర్వహించిన ఉపాధి పథకం పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. మండల పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకూ రూ.8,53,03,598తో 24 గ్రామ పంచాయతీల్లో 3190 పనులు నిర్వహించారు. ఈ పనులపై ఆయా పంచాయతీల్లో సామాజిక తనిఖీ బృందం సభ్యులు గత నెల 24 నుంచి పర్యటించి తనిఖీలు జరిపారు. మండల స్థాయిలో బుధవారం నిర్వహించిన బహిరంగ విచారణలో తనిఖీ బృందం సభ్యులు పి.తిమ్మాపురం పంచా యతీలో అక్రమాలను వెల్లడిస్తుండగా, అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. రైతుల పొలాల్లో పనులు చేసినట్టుగా చూపించి బిల్లులు స్వాహా చేయడంతో పాటు తమ గ్రామంలో జరిగిన రూ.49, 61,742తో చేసిన పనుల్లో జరిగిన అక్రమాలపై తక్షణం చర్యలు చేపట్టాలంటూ పి.తిమ్మాపురం సర్పంచి పైల లక్ష్మి అనుచరులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడడంతో పాటు ప్రభుత్వం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌గా జీతం తీసుకుంటూ అదే సమయంలో రోజు వారి కూలీ వేతనం తీసుకున్న సీనియర్ మేట్ (ఇ¯ŒSచార్జి ఫీల్డ్ అసిస్టెంట్) బర్ల సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీలు సక్రమంగా జరపలేదని, అక్రమాలు జరగలేదని అదే గ్రామానికి చెందిన అధికార తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు బర్ల అప్పారావు వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. చర్యలు తీసుకోని అధికారులు వారం రోజులుగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు పలు అక్రమాలను గుర్తించి ఆధారాలతో సహా విచారణలో వెల్లడించినా కారకులపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉపాధి పథకం ప్రాజెక్టు డైరెక్టర్ విచారణాధికారిగా వ్యవహరించాల్సి ఉండగా ఏపీడీలు ఎం.శ్రీరంగనాయకులు, ఎస్.బులి్లబాబు హాజరయ్యారు. తమకు సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారం లేదని చెప్పడంపై అధికార పార్టీ నేతలు వారిపై ఒత్తిడి తెచ్చినట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, 9 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఒక సీనియర్ మేట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు ఏపీడీ రంగనాయకులు ప్రకటించారు. సిబ్బంది నుంచి రూ.4,800 జరిమానాతో పాటు కూలీలకు చెల్లించాల్సి న రూ.8,966 కలిసి మొత్తం రూ.39,175 తక్షణ రికవరీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. 9 అంశాలపై ఏపీడీ స్థాయి అధికారి విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఉపాధి అవకతవకలపై జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని పి.తిమ్మాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత పైల కృష్ణమూర్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కేఎస్ఎస్ సుబ్బారావు, ఎంపీపీ ఎం.విజయలత, జెడ్పీటీసీ సభ్యుడు బర్ల అప్పారావు, వైస్ ఎంపీపీ మలిరెడ్డి వెంకటరమణ, స్టేట్ రీసోర్స్ పర్స¯ŒS సిహెచ్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి వీక్లీ ప్లాన్!
= డ్వామా అధికారుల ప్రత్యేక ప్రణాళిక = రోజూ 2 లక్షల మందికి ఉపాధి పనులు = మండలాల వారీగా లక్ష్యాలు = సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ = నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు అనంతపురం టౌన్ : కరువు కోరల్లో చిక్కుకున్న ‘అనంత’లో వలసల నివారణ కోసం ‘ఉపాధి’ పనులు వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో లక్ష్య సాధన కోసం అధికారులు ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా ‘వీక్లీ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ నెలవారీ లక్ష్యాలతో ముందుకు సాగిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు మరో నాలుగు వారాల్లో ప్రగతి సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. రోజుకు 2 లక్షల మందికి ఉపాధికల్పన జిల్లాలో 47,826 శ్రమ శక్తి సంఘాలుండగా 7,86,159 మందికి జాబ్‌కార్డులున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.461 కోట్లను ఖర్చు చేశారు. కోటి 50 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా, ఇప్పటికే కోటి 65 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. కరువు మండలాలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు అదనంగా కోటి పనిదినాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేరకు అదనపు లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు రోజూ వేలల్లో కూలీలు పనులకు వచ్చే వారు. అయితే ఇప్పుడు లక్షన్నర మంది పనుల్లో పాల్గొంటున్నారు. దీన్ని మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల రోజులూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రోజూ 2 లక్షల మందికి పని కల్పించాలి్సందేని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మండలాల వారీగా ‘వీక్లీ’ టార్గెట్లు : జిల్లా వ్యాప్తంగా అధికారులకు మండలాల వారీగా ‘వీక్లీ’ లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి మండలంలో 125 ఫారంపాండ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు 100, వర్మీకం పోస్ట్‌లు 100 పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. రోజూ పంచాయతీకి కనీసం 300 మంది కూలీలను పనులకు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏరోజుకారోజు ప్రగతి వివరాలు సేకరిస్తూ నిర్లక్ష్యం గా ఉన్న అధికారులకు నోటీసులు చేస్తున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. అవసరమైతే విధుల్లోంచి తొలగించడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు. ‘ఉపాధి’ కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఉపాధి పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. డ్వామా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది పని చేస్తుంది. హెల్ప్ లైన్ నంబర్ : 18004258554. ఎక్కడైనా ఫీల్డ్ అసిస్టెంట్లు పని కల్పించని పక్షంలో ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. వలస వెళ్లినట్లు తెలిస్తే చర్యలు జిల్లాలో ఉపాధి పనులను ఉద్యమంలా చేపడతాం. అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేసి వలసలు వెళ్లకుండా చూడాలి. ఎవరైనా ఉపాధి పనులు కల్పించలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వలస వెళ్లిన వారి ఫోన్ నంబర్లు మా వద్ద ఉన్నాయి. అలాంటి వారిందరికీ ఫోన్లు చేసి పిలిపించాలని ఆదేశించాం. వలసల నివారణే ధ్యేయంగా పని చేయాలి. పనులు చేసే చోట అన్ని సదుపాయాలు ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలి. కూలీల చెల్లింపులో సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావచ్చు. హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – నాగభూషణం, డ్వామా పీడీ -
ఉపాధిలో నిర్లక్ష్యంపై కొరడా
-ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి వారం వేతనాలు నిలుపుదల - 22 మండలాలకు కలెక్టర్ ఉత్తర్వులు - ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు కోవెలకుంట్ల: జిల్లాలో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్ విజయమోహన్ కొరడా ఝుళిపించారు. ఫిబ్రవరి నెల లక్ష్యాన్ని చేరడంలో అలసత్వం వహించిన 22 మండలాల ఎంపీడీఓలు, ఉపాధి పథకం సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఆ పథకం ప్రోగ్రాం ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఆయా మండలాల ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలకు వారం రోజులపాటు వేతనాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖరీఫ్, రబీసీజన్లలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం జిల్లాలో 36 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లో కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి పనుల నిర్వహణపై జిల్లా అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా జిల్లాలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేబర్ బడ్జెట్ మార్చి 196 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి నెలవరకు 140 లక్షల పనిదినాలు పూర్తి కాగా 56 లక్షల పనిదినాలు మిగిలిపోయాయి. వలసల నియంత్రణే ధ్యేయంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలన్న ఉద్ధేశ్యంతో కలెక్టర్ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆయా మండలాలకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఒక్కో మండలంలో రోజుకు కనీసం 5 వేల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు. 22 మండలాలకు వేతన నిలుపుదల ఉత్తర్వులు.. నంద్యాల రెవెన్యూ డివిజన్లో జనవరి నుంచి వ్యవసాయ పనులు ముఖ్యంగా మిరప కోత పనులు ముమ్మరంగా ఉండడంతో కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా ఆయా మండలాల్లో కూలీల సంఖ్య తగ్గిపోయింది. దీంతో లక్ష్యం మేరకు కూలీలకు పనులు కల్పించలేకపోయారు. బేతంచెర్ల, కర్నూలు, నంద్యాల, గూడూరు, కౌతాళం, బనగానపల్లె, మిడుతూరు, చాగలమర్రి, అవుకు, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, పాణ్యం, మహానంది, వెలుగోడు, సంజామల, గడివేముల, కోవెలకుంట్ల, నంద్యాల, రుద్రవరం, గోస్పాడు, బండిఆత్మకూరు, శిరువెళ్ల మండలాల్లో పనిచేస్తున్న ఏపీఓలు, ఈసీలు, కొందరు టెక్నికల్ అసిస్టెంట్లకు వారం వేతనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మార్చినెలకు సంబంధించిన వారం రోజుల వేతనాన్ని ఏప్రిల్ నెల వేతనంలో కట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు నిర్ధేశించిన లక్ష్యంలో 25శాతం మించని ఆ పథకం పీఓలుగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓలకు షోకాజ్Œ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి సిబ్బందికి వేతనాలు నిలుపుదల, ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు అందటంతో అధికారులు, సిబ్బంది నివ్వెరపోయారు. -
‘ఉపాధి’ కూలీల సంఖ్య పెంచండి
– డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): ఈ నెల 6వ తేదీ నాటికి జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్య 1.50 లక్షలకు పెరగాలని అధికారులకు డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి సూచించారు. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులన్నీ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. గురువారం సాయంత్రం ఆయన జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్‌తో కలిసి జిల్లాలోని ఎంపీడీఓ, ఏపీడీ, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. ప్రస్తుతం 1.05 లక్షల మంది కూలీలు వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నారన్నారు. కూలీల సంఖ్య పెరగకుంటే నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. జిల్లాలో 10 వేల ఫారంపాండ్స్, తొమ్మిది వేల వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు. ఉపాధి కూలీలకు పోస్టాఫీసు నుంచి కాకుండా బ్యాంకుల ద్వారా వేతనం చెల్లిస్తున్నామన్నారు. వివిధ కారణాలతో ఆయా బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాలో 1.80 కోట్లు ఉన్నాయన్నారు. ఉపాధి పనుల్లో 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన మండలాలకు చెందిన 22 మంది ఎంపీడీఓలు, తొమ్మిది మంది ఏపీడీలు, 22 మంది ఏపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఒక వారం జీతం కట్ ... ఉపాధి హామీ పనుల్లో అలక్ష్యం వహిస్తూ.. కూలీల సంఖ్యను పెంచకుండా ఉన్న మండలాలకు సంబంధించి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, వాటర్‌షెడ్ పీఓలకు ఒక వారం జీతం నిలిపివేస్తున్నట్లు పీడీ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ పీడీలు మురళీధర్, రసూల్ పాల్గొన్నారు. -
ప్రతి మండలంలో లక్ష మందికి ‘ఉపాధి’
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు (అర్బన్): ప్రతి మండలంలో నాలుగు వారాల్లోగా లక్ష మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవలం 10 శాతం పనులు కల్పించడంలోనే ఉన్నారని, పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. పనులు జరగడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొలాల్లో పంటలు లేవని, రైతులకు ఉపయోగపడే పనులతో పాటు చెక్‌డ్యామ్‌లు, పూడికతీత పనులు చేపడితే పెద్ద ఎత్తున కూలీలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, జీరో ప్రగతి ఉన్న గ్రామాలపై నిఘా పెంచాలని డ్వామా పీడీ పుల్లారెడ్డికి సూచించారు. బండిఆత్మకూరు, రుద్రవరం, నంద్యాల, గోస్పాడు మండలాల్లో పది శాతం కూలీలకు మాత్రమే పనులు కల్పిస్తున్నారని.. సంబంధిత అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మండలాల్లో ఉండని ఏపీఓ, టీఏలపై వేటు తప్పదని హెచ్చరించారు. కోడుమూరు మండలంలో అధికారుల పనితీరు బాగాలేదని, కచ్చితంగా కూలీల సంఖ్యను పెంచి వలసలను నివారించాలన్నారు. అనేక గ్రామాల్లో ఉపాధి పనుల కల్పన జీరో శాతం ఉందన్నారు. 23 మండలాల్లో వంకలు, వాగులు ఉన్నాయని, జంగిల్ క్లియరన్స్ కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు కోట్ల పనిదినాలు లక్ష్యం
ఏలూరు సిటీ : జిల్లాలో మార్చి 31 నాటికి పేదలకు రెండు కోట్ల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చాలంటే రోజుకు 2 లక్షల పనిదినాలను కల్పించాలని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన ఉపాధి పనుల ప్రగతి తీరును సమీక్షించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం రోజుకు కల్పిస్తున్న లక్ష పనిదినాలను మార్చి మొదటివారం నాటికి రెండు లక్షల పనిదినాలకు పెంచాలని కలెక్టర్ చెప్పారు. డెల్టాలోని మండలాల్లో రోజుకు వెయ్యి పనిదినాలు, మెట్ట ప్రాంతంలోని మండలాల్లో రోజుకు మూడు వేల పనిదినాలు కల్పించి తీరాలని, ఆ దిశగా క్షేత్రస్థాయిలో రైతులతో మమేకం కావాలన్నారు. 1.13 కోట్ల పనిదినాలు కల్పించి రూ.158.67 కోట్ల వేతనాల రూపంలో కూలీలకు ఇవ్వడం జరిగిందని, రాబోయే 40 రోజుల్లో 87 లక్షల పనిదినాలు కల్పించి 2 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు. ఫామ్పౌండ్స్ అమలులో వెనుకబాటెందుకు జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయని, రాష్ట్రంలోనే భూగర్భజలాలు బాగా అడుగంటిన జిలా?్లల్లో పశ్చిమ అగ్రస్థానంలో ఉందన్నారు. రెండేళ్లలో కరువు జిల్లాల్లో పశ్చిమ చేరుతుందని ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సోమవారం నుంచి జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి, టీ.నరసాపురం, కొయ్యలగూడెం మండలాల్లో రోజుకు 3 వేల మందికిపైగా కూలీలకు ఉపాధి కల్పించాలని, గురువారం భీమడోలు, చింతలపూడి, దెందులూరు, ద్వారకాతిరుమల, ఏలూరు, గోపాలపురం, తణుకు, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజర్ల, పెదవేగి, టి.నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాల్లో రోజుకు 4 వేల పనిదినాలు కల్పించేస్థాయికి పెరగాలని ఆదేశించారు. ఏప్రిల్ 30 నాటికి నూరు శాతం డంపింగ్ యార్డు షెడ్డులు నిర్మాణం పూర్తికావాలన్నారు. క్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు మార్చి 20 నాటికల్లా పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. పీడీ ముళ్లపూడి వెంకట రమణ పాల్గొన్నారు. -
ఉపాధి కల్పనలో 50లక్షల పనిదినాలు వెనుకబడ్డాం
– అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు మంజూరు – తన అనుమతి లేనిదే ఎంపీడీఓలు సెలవుల్లో వెళ్లేందుకు వీల్లేదు – జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడంలో 50 లక్షల పనిదినాలు వెనుకబడ్డామని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేబర్ బడ్జెట్ పెంపుపై ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో మంజూరు చేసిన పనులకు లేబర్ బడ్జెట్ పెరిగేలా ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 50 లక్షల పనిదినాలు వెనుకబడ్డామని, పూర్తిస్థాయిలో లేబర్ బడ్జెట్‌ను అధిగమిస్తే రూ.50 కోట్లు లేబర్ కాంపోనెంట్ వస్తుందని.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడ్డ మండలాలు వచ్చే సోమవారం నాటికి ప్రతి మండలంలో 1.50 లక్షల మందికి పనులు కల్పించాలన్నారు. రానున్న మూడు మాసాలు గ్రామాల్లో కూలీలకు ఎలాంటి పనులు ఉండవని.. వారందరినీ ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు పురమాయించాలన్నారు. ఏపీడీ, ఏపీఓ, క్షేత్రస్థాయి అధికారుల టూర్ డైరీలను తాను ప్రతి శనివారం సమీక్షిస్తానని.. ప్రతి ఒక్కరూ లక్ష్యం మేరకు పనులు చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. అలాగే ఎంపీడీఓలు కూడా తన అనుమతి లేనిదే సెలవుల్లో వెళ్లరాదని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఐదు ఫారంపాండ్స్ ప్రకారం పనులు ప్రారంభించాలన్నారు. ఇంకా మంజూరుకు సంబంధించి ఏవైనా ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలన్నారు. ఓడీఎఫ్ కింద 135 గ్రామాల్లో మార్చి నెలాఖరులోగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాగులన్నీ చెరువులకు అనుసంధానం చేసేందుకు వాగుల్లో పేరుకుపోయిన మట్టి, జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు ఉపాధి హామీ కింద పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణకు ఆదేశం
కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం : నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కేంద్ర ప్రభు త్వం ఆదేశించినట్లు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలంయలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధి హామీ నిధులతో నీరు–చెట్టు కార్యక్రమం కింద యంత్రాలతో పనులు చేపట్టారన్నారు. కూలీల కడుపు కొడుతున్న నీరు–చెట్టు పనులు, పక్క దారి పడుతున్న ఉపాధి హామీ బిల్లులపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాను గత నెలలో ప్రధానమంత్రికి లేఖ రాశానన్నారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాల యం ఈ అక్రమాలపై సమగ్ర విచార ణకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసిందన్నారు. ఆ ప్రతిని తనకు కూడా పంపిందని చెప్పారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు నభీష్, ప్రధానకార్యదర్శి అబ్బాస్, మండల కన్వీనర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కరువు
453 గ్రామాల్లో ప్రారంభం కాని పనులు – నందికొట్కూరు, నంద్యాల మండలాల్లో శూన్యం – అమలు కాని కలెక్టర్ ఆదేశాలు - వలస బాటన కూలీలు పనుల్లేక సగం ఊరు ఖాళీ నెల రోజుల క్రితమే గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తిగా ముగిసినాయి. ఈ యేడాది రైతులు సాగుచేసిన పంటలు వర్షాల్లేక ఖరీఫ్‌లో ఎండిపోయాయి. అరకొరగా వచ్చిన వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కొర్ర తదితర పంటల దిగుబడులను రైతులు కూలీల చేత ఇంటికి తరలించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పనుల్లేవు. మూడు వారాల క్రితమే పనులు లేక సగం ఊరు ఖాళీ అయ్యింది. అధికారులు పనులు కల్పిస్తే స్థానికంగానే ఉపాధి ఉంటుంది. - అల్లప్ప, ఉపాధి కూలీ, కమ్మరచేడు కర్నూలు(అర్బన్): జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు అటకెక్కాయి. తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కరువు మండలాల్లో ఉపాధి కూలీలకు 150 రోజుల పని కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జిల్లాలోని మెజారిటీ మండలాల్లో.. ప్రధానంగా పడమటి ప్రాంతాలైన ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఉపాధి పనులు చేపట్టని కారణంగా వలసలు అధికమయ్యాయి. వలసలను నివారించడంతో పాటు వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 17న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 18వ తేదీ నుంచి కచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జాబ్‌కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించేలా ఎంపీడీఓలు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి పనులు, హాజరైన కూలీల సంఖ్యను పరిశీలిస్తే ఎంతమేర జిల్లాలో ఉపాధి పనులు జరుగుతున్నాయో తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద రైతులు తమ పొలం పనులు పూర్తి అయ్యేంత వరకు ఉపాధి పనులు ప్రారంభించవద్దని అనధికారికంగా ఆజ్ఞలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు దాదాపు అయిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో పనుల్లేక కూలీలు వలస బాట పట్టారు. 453 గ్రామాల్లో ప్రారంభం కాని పనులు జిల్లాలోని 900 గ్రామాల్లో పనులు చేపట్టాల్సి ఉండగా, 447 గ్రామాల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. కాగా నందికొట్కూరు, నంద్యాల మండలాల్లో ఒక్క పని కూడా ప్రారంభం కాకపోవడం గమనార్హం. పనులు ప్రారంభం అయిన మండలాల్లో కూడా వందకు లోపు కూలీలు హాజరు కావడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈనెల 21న కూలీల హాజరు ఇలా.. మండలం, హాజరైన కూలీలు సంఖ్య మంత్రాలయం 10 గూడూరు 50 వెలుగోడు 37 బండిఆత్మకూరు 84 మహానంది 52 పాములపాడు 54 శిరివెళ్ల 41 సంజామల 53 రుద్రవరం 20 దొర్నిపాడు 18 ఉయ్యాలవాడ 22 -
పేదల పథకం...పెద్దల భోజ్యం
– ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం - అరకొర రికవరీకి ఆదేశం – ఎఫ్ఏ, ఇద్దరు టీఏలతో పాటు మరో ముగ్గురు సీనియర్ మేట్ల తొలగింపు – సామాజిక తనిఖీల్లో వెలుగుచూసిన అవినీతి భాగోతం – నేతల ఒత్తిళ్లతో బయటకు పొక్కకుండా అధికారుల జాగ్రత్తలు ఓర్వకల్లు : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి వలసలను అరికట్టాలని ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతుంది. పర్యవేక్షణ లేమి, అధికారులు ఉదాసీనతతో ఈ పథకం పెద్దలకు భోజ్యంగా మారింది. సమాజిక తనిఖీల్లో వెలుగుచూస్తున్న అక్రమాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఓర్వకల్లు మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో దాదాపు రూ.6 కోట్లకు సంబంధించిన పనులు చేపట్టారు. అందులో పండ్ల తోటల పెంపకం, మట్టి రోడ్ల నిర్మాణం, ఫారంపాండ్్స తవ్వకాలు, వర్మికంపోస్టు తయారీ, చెరువులు, వాగులో పూడిక తీత, మొక్కలు నాటడం తదితర పనులను చేపట్టారు. ఈ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాలకు వెళ్లి పరిశీలించింది. దాదాపు వారం రోజుల పాటు నిర్వహించిన గ్రామ స్థాయి విచారణలో పలు అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఉపాధి పనుల బాధ్యతలు తెలుగుతమ్ముళ్లకే.. మండలంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చాలా గ్రామాల్లో ఆ పార్టీ వారికే ఉపాధి పనులు చేపట్టే బాధ్యతలను అప్పగించారు. వాటిలో ప్రధానంగా పూడికతీత పనులు, మట్టిరోడ్లు, సీసీ రోడ్లు, నిర్మాణాలో్ల భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఫీల్డు అసిస్టెంట్లు, సీనియర్ మేట్ల ఆధ్వర్యంలో చేపట్టిన వర్మికంపోస్టు తయారీ, ఫారంపాండ్స్, పండ్ల తోటల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనులలో అక్రమాలు కొంత తక్కువేనని సమాచారం. 17 గ్రామాలో చేపట్టిన ఫారంపాండ్స్ తవ్వకాలలో 345 యూనిట్లకు గాను 245 యూనిట్ల నిర్మాణాలు పూర్తికాగా, అందుకు రూ.65.65 లక్షలు ఖర్చుచేసినట్లు తనిఖీ బృందం గుర్తించింది. 10 గ్రామ పంచాయతీలలో చేపట్టిన వర్మికంపోస్టు యూనిట్లలో 100 యూనిట్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో 58 యూనిట్లకు రూ.6.22 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో మొత్తం 10 గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టారు. దుర్వినియోగం భారీ..రికవరీ అరకొర మండలంలో మొత్తం రూ.6 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టగా అందులో దాదాపు రూ.80 లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. బాధ్యుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అధికారులు నాలుగైదు లక్షల రికవరీకి మాత్రమే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఒక ఫీల్డు అసిస్టెంటు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు మరో ముగ్గురు సీనియర్ మేట్లను విధుల నుంచి తొలగించాలని డ్వామా అధికారుల ఆదేశించినట్లు సమాచారం. ఈ వివరాలతో పాటు ఉపాధిలోని అక్రమాల భాగోతం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. -
నేటి నుంచి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు
– నగదు రహిత చెల్లింపుల బాధ్యత ఎంపీడీఓలదే – జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): అన్ని గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి ఉపాధి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయన జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ, జన్‌ధన్ ఖాతాలు, నగదు రహిత లావాదేవీలు తదితర అంశాలపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో కూలీలు వలస పోకుండా చూడాలన్నారు. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ పనులు కల్పించాలన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాబ్‌కార్డులను అప్డేట్ చేయడం, ఫారంపాండ్ల పూర్తి, వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. 15 రోజుల్లో ఆయా పనులపై పురోగతి చూపించాలని ఆదేశించారు. ఎక్కడైనా కరువు పనులు చేపట్టకుంటే ఫోన్ ద్వారా కలెక్టరేట్‌కు సమాచారం అందించేలా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు, ఉపాధి కూలీలు, డ్వాక్రా సభ్యులు పలు ఇబ్బంధులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పాస్ విధానం ద్వారా చౌక ధరల దుకాణాలు, మందుల షాపుల్లో నగదు రహిత లావాదేవీలు జరిగేలా ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. జన్‌ధన్ ఖాతాలు లేని వారికి కొత్తగా ప్రారంభించేందుకు బ్యాంకర్లు సమ్మతించారని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ బీఆర్ ఈశ్వర్, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ సీహెచ్ పుల్లారెడ్డి, ఎల్డీఎం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
దారిమళ్లుతున్న సబ్‌ప్లాన్ నిధులు
∙రూ.10 లక్షల వరకూ స్వాహా ∙అపహాస్యమవుతున్న జీవనోపాధి పథకం రౌతులపూడి : గ్రామీణప్రాంతాల్లోని దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడానికి, వారి ఆర్థ్ధికపరోభివృద్ధిని మెరుగుపరచడానికి ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకం ఆచరణలో విఫలమౌతోంది. వారి ఆర్థికాభివృద్ధికి జీవనోపాధి పథకం ద్వారా మేకలు, గొర్రెలు, గేదెలు పెంపకానికి, కిరాణా, కూరగాయల వ్యాపారం, ఇటుక తయారీవంటి ఇతర వ్యాపారాల కోసం అందించే నిధులను దారిమళ్లు తున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవనోపాధి పెంచడానికి రూ.30వేలు నుంచి రూ.50వేలకు పైగా ఇవ్వాల్సి ఉండగా, వెలుగుసిబ్బంది అధికారపార్టీ నేతలతో కుమ్మక్కై రూ.పది నుంచి రూ.15 వేల వరకు ఇచ్చి దీనిలో మళ్లీ రూ.వెయ్యి తిరిగి వేరే పథకానికి అని వసూలు చేస్తున్నారు. మండలంలోని 2015–16లో ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకంలో ఇప్పటివరకు ఐదు గ్రామైఖ్య సంఘాలద్వారా 22 డ్వాక్రా సంఘాల్లోని 79 మంది లబ్థిదారులకు రూ.19,60,900 నిదులు పంపిణీ చేశారు. ఎస్సీ సబ్‌ప్లా¯ŒS పథకంలో 15 గ్రామైఖ్య సంఘాల ద్వారా 26 డ్వాక్రాల సంఘాల్లోని 131మంది లబ్ధిదారులకు రూ. 53,51,660లు అందజేశారు. ఈ సొమ్ముల నుంచి లబ్ధిదారులను మభ్యపెట్టి వారివద్దనుంచి సుమారు రూ.10 లక్షల వరకు స్వాహాకు పాల్పడినట్లు ’సాక్షి’ నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోంది. మండలంలోని ఉప ప్రణాళికా ప్రాంతానికి చెందిన రాఘవపట్నం శివారు దబ్బాది, సార్లంక గ్రామాలకు చెందిన ఇందిరా గ్రామైక్య సంఘంలోని బోడకొండమ్మ డ్వాక్రా సంఘంలోని పదిమంది సభ్యులకు రూ.3లక్షలు అందించారు. ఈ సొమ్ముల్లోని రూ.1.70లక్షలువరకు వారివద్దనుంచి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా వెలుగుసిబ్బంది వసూలు చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా వారికి అందజేసిన రోజే ఒకవాయిదాతోబాటు ఒక్కొక్క డ్వాక్రాగ్రూపునుంచి రూ.4వేలు ఖర్చుల నిమిత్తం సిబ్బందివసూలు చేసినట్లు తేలింది. జల్దాం శివారు గిన్నిలారంగ్రామానికిచెందిన పెద్దూరు గ్రామైఖ్యసంఘంలోని అల్లూరి సీతారామరాజు, లావణ్య డ్వాక్రాగ్రూపుల్లోని 11 మంది సభ్యులకు రూ.40 వేల చొప్పున రూ.4.28 లక్షలు అందించారు. ఈ సొమ్ములునుంచి ఒక్కొక్కరి నుంచి రూ.18వేల చొప్పున రూ.1.98 లక్షలు వసూలు చేశారు. మొదటి వాయిదా కోసం ఒక్కొక్కరివద్దనుంచి వెయ్యిచొప్పున 11 వేలు, ఖర్చులకోసం ఒక్కొక్క గ్రూపునుంచి రూ.నాలుగువేలు చొప్పున వసూలు చేసారని తెలిసింది. రాఘవపట్నం శివారు సత్యవరం గ్రామైఖ్యసంఘంలోని రెండు డ్వాక్రాసంఘాల్లోని 27మంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.14 వేల చొప్పున రూ.నాలుగు లక్షలు అందించారు. వీటిలో పెరటికోళ్ల పెంపకానికి ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు. అంతేకాకుండా మొదటివాయిదాకని చెప్పి మరో వెయ్యి వసూలు చేశారు. మండలంలోని రాజవరంలో పాడిగేదెల పెంపకానికి నాలుగు డ్వాక్రా సంఘాల్లోని ఆరుగురి ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.45వేల చొప్పున రూ.2.70 మంజూరుచేసి అందించారు. అయితే ఒక్కొక్కరి నుంచి బీమా, ఇతర ఖర్చులు కోసం రూ.2,500 వరకు వెలుగు సిబ్బంది వసూలు చేశారు. ఇలా మండల వ్యాప్తంగా రూ.పది లక్షల వరకు స్వాహాకు పాల్పడినట్లు సాక్షి పరిశీలనలో వెల్లడవుతోంది. ఇప్పటికైనా డీఆర్డీఏ జిల్లా ఉన్నతాధికారులు స్వాహాకు గురైన నిధులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని స్వాహాకు గురైన సొమ్ములను లబ్ధిదారులకు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రూ.1.7 లక్షలు తిరిగి చెల్లించాం ఎస్టీ సబ్‌ప్లా¯ŒSలో తమ గ్రూపులోని పదిమంది సభ్యులకు ఒక్కొక్కరికి రూ.30వేలు చొప్పున రూ.3లక్షలు మంజూరు చేశారు. వీటిలో అదే రోజు తిరిగి చెల్లించాలంటే రూ.1.7 లక్షలు తిరిగి వెలుగుసిబ్బందికి చెల్లించాం. వీటితోబాటు ఒక్కొక్క గ్రూపునుంచి ఖర్చుల నిమిత్తం రూ.4వేలు ఇచ్చాం. తొలి వాయిదా కూడా అప్పుడే చెల్లించాం. – కాకురి దేవుడమ్మ, బోడకొండమ్మ డ్వాక్రా గ్రూపు ప్రెసిడెంట్, దబ్బాది రూ.18 వేలు వసూలు చేశారు పెద్దూరు గ్రామైక్య సంఘంలోని రెండు డ్వాక్రా సంఘాలకు మేకల పెంపకానికి ఒక్కొక్కరికి రూ.40వేలు చొప్పున మంజూరు చేసి అందించారు. వీటిలో ఒక్కొక్కరి నుంచి రూ.18 వేలు వసూలు చేసి వెలుగు సిబ్బంది తీసుకెళ్లారు. వాటికి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. తీసుకున్నరోజే తొలి వాయిదా సొమ్ములు రూ.11 వేలు ఇచ్చాం. – చడ్డా చిన్ని, లావణ డ్వాక్రాగ్రూపు, గిన్నిలారం. బీమాకోసం రెండువేలిచ్చాం ఎస్సీ సబ్‌ప్లా¯ŒS పథకంలో పాడి గేదెల పెంపకానికి రూ.45వేలు అప్పుతీసుకున్నాను. వీటిలో బీమా కోసం రూ.రెండువేలు, ఖర్చులకని మరో రెండువందలు వెలుగు అధికారికి ఇచ్చాను. మరో 15 వందలు మొదటి వాయిదా సొమ్ములు కూడా తగ్గించుకొన్నారు. – ఏడిద కృష్ణవేణి, క్రాంతి డ్వాక్రా గ్రూపు బాధ్యులపై చర్యలు చేపడతాం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లా¯ŒS పథకంలో సత్యవరంలో ఒక్కొక్కరి నుంచి పెరటికోళ్ల పెంపకానికి ఒక్కొక్కరు రూ.వెయ్యి చెల్లించారు. మిగిలిన స్వాహాకు గురైన నిధులు గురించి తనకు తెలియదు. సంబంధిత బాధితులను విచారించి స్వాహాపై పరిశీలించి బాధ్యులపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – కె. శ్రీనివాస్, వెలుగు ఏపీఎం -
కరువు మండలాల్లో 150 పని దినాలు
– డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన 36 కరువు మండలాల్లో ఉపాధి కూలీ పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచినట్లు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి తెలిపారు. గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ పని దినాలను పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలు(లేఖ నెంబర్ 2133) జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కరువు మండలాల్లో ఉపాధి కూలీలు 150 రోజుల వరకు ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. కరువు మండలాలుగా ప్రకటించిన గ్రామాల్లో ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు అదనంగా 50 రోజుల పనులు చేసే అవకాశం వచ్చిందన్నారు.ఽ జిల్లాలో ప్రకటించిన కరువు మండలాలు పెద్దకడుబూరు, హొళగుంద, ఆలూరు, శిరువెళ్ల, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, గోస్పాడు, కోయిలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని. మార్చి నాటికి 70వేల ఫాంఫాండ్స్ పూర్తి జిల్లాలో 70వేల ఫాంపాండ్స్‌ను 2017 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు పీడీ తెలిపారు. ఇప్పటి వరకు 34వేల ఫాంఫాండ్స్ పనులు చేపట్టామని, ఇందులో దాదాపు పూర్తయ్యాయని.. మిగిలిన 36వేలను నెలకు 6 వేల ప్రకారం మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఒక్కో ఫాంఫాండ్ నిర్మాణానికి రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. 6,500 వర్మీ కంపోస్టు యూనిట్ల పూర్తి జిల్లాలో వర్మీకంపోస్టు యూనిట్లను కూడా మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. మొత్తం 15వేల యూనిట్లలో ఇప్పటి వరకు 6,500 పూర్తి చేశామమన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోని గ్రామ ఐక్య సంఘాల ద్వారా కూడా వర్మీ కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పుల్లారెడ్డి వివరించారు. -
ఉపాధి నిధులతో ఆటస్థలాలు, శ్మశాన వాటికలు
– డ్వామా పీడీ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసుకునేందుకు, శ్మశాన వాటికలను అభివృద్ధి పరచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డ్వామా పీడీ సీహెచ్ పుల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణాభివృద్ధి వాఖ కమిషనర్ నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు తమ గ్రామాల్లో శ్మశాన స్థలాలు, ఆట స్థలాలు లేక మైదానాలను గుర్తించి సంబంధిత వివరాలను ఎంపీడీఓకు తెలియజేయాలన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఆయా గ్రామాల్లోని ఆట మైదానాలు, శ్మశాన స్థలాలు, గ్రామ పంచాయతీ భవనాలను గుర్తించి జియో ట్యాగింగ్ చేసి వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. -
వలసల నివారణకు ‘ఉపాధి’ పనులు
– డ్వామా అడిషనల్ పీడీ మురళీధర్ నంద్యాలరూరల్: వలసలు నివారించేందుకు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఉపాధి పనులను ప్రారంభించాలని సిబ్బందిని డ్వామా అడిషనల్ పీడీ పి.మురళీధర్ ఆదేవించారు. శుక్రవారం నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి పనులపై లక్ష్యాన్ని ఇచ్చామని, దానిని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 48 వేల ఫాంపాండ్లు పూర్తి చేశామని, మరో 40వేలు మిగిలి ఉన్నాయని, మార్చి నెలాఖరులోగా వీటిని పూర్తి చేయాలన్నారు. అలాగే 16వేల వర్మీకంపోస్టు యూనిట్లు పూర్తి చేయాలని చెప్పారు. పనులు చేసిన ఉపాధి కూలీలకు మస్టర్ వేసిన 15రోజుల్లోగా వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన వెంట నంద్యాల ఎంపీడీఓ స్వర్ణలత ఉన్నారు. -
లక్ష్యానికి మించి ‘ఉపాధి హామీ’
నిధుల కొరతతో నిలిచిన వేతన చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం పనులు నిర్దేశిత లక్ష్యాన్ని మించి జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేవలం 10 కోట్ల పనిదినాలు మంజూరు చేసింది. అక్టోబర్ చివరి నాటికి 7.5 కోట్ల పనిదినాలు లక్ష్యం కాగా, తీవ్ర కరువు నేపథ్యంలో ఇప్పటికే 8.5 కోట్ల పనిదినాలను కల్పించారు. డిసెంబర్ నాటికి 10 కోట్ల పనిదినాలు పూర్తవుతాయని, ఆపై మార్చి వరకు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశ మున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన రూ.1200 కోట్లు ఖర్చయిపోగా, నెలరోజులుగా చేపట్టిన ఉపాధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా తొమ్మిది జిల్లాల్లో లక్షలాది మంది ఉపాధి కూలీలకు రోజూవారీ వేతనాలు నిలిచిపోయాయి. వరుస పండుగల నేపథ్యంలో వేతనాల కోసం కూలీలు ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరుకోట్ల పనిదినాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ఈ నెలాఖరుకల్లా కనీసం 4 కోట్ల పనిదినాలైనా మంజూరు కావచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపునకు యోచన ఉపాధిహామీ పనులకు వచ్చిన కూలీలకు సకాలంలో వేతన చెల్లింపులు చేసే నిమిత్తం జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎన్ఈఎఫ్ఎంఎస్) వ్యవస్థను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పనుల నిమిత్తం అవసరమైన నిధులను తాము ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలకు జమ చేస్తున్నప్పటికీ, అవి సకాలంలో విడుదల చేయని కారణంగా ఉపాధిహామీ పథకం ఉద్దేశం దెబ్బతింటోందని కేంద్రం భావిస్తోంది. పనులు చేసిన కూలీల వేతన వివరాలను కేంద్రానికి పంపితే వారి ఖాతాలకు నేరుగా వేతనసొమ్మును జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్‌ఈఎఫ్‌ఎం వ్యవస్థపై అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. నవంబర్ నుంచే నూతన చెల్లింపు వ్యవస్థ అమలుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. -
మహిళల ఉపాధికి ప్రణాళిక
కడప కార్పొరేషన్: టైలరింగ్ వృత్తినే నమ్ముకొని పనిచేస్తున్న మహిళలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ కేవీ సత్యనారాయణ తెలిపారు. గురువారం పాతరిమ్స్లో ఉత్తర నగర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నాలుగవ సంవత్సరం యూనిఫారం దుస్తులు కుట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బట్ట కటింగ్, గుండీలు, ఖాజాలు వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గార్మెంట్స్ యూనిట్లు లేనందున టైలరింగ్ చేసే మహిళలకు ఏడాదంతా పని ఉండటం లేదన్నారు. మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా త్వరలో ప్రొద్దుటూరు, మైలవరంలలో రానున్న గార్మెంట్ యూనిట్లకు వీరిని టై అప్ చేస్తామన్నారు. బెంగళూరులో ఇలాంటి టైలరింగ్ కేంద్రాలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కృషి.. కుట్టు శిక్షణ కేంద్రంలో బాత్రూములు, తాగునీరు లేదని, వర్షం వస్తే బిల్డింగ్ ఉరుస్తోందని మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఒక జత కుట్టినందుకు ఇచ్చే రూ.40లు ఏ మాత్రం సరిపోలేదని, దాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇక్కడ చాలా లోపాలున్నాయని తనకు నచ్చలేదని చెప్పారు. ఇక్కడి వసతులు మెరుగుపరచడంగానీ, వేరే బిల్డింగ్‌కు మార్చడంగానీ చేస్తామని భరోసా ఇచ్చారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, నగరపాలక సంస్థ కమీషనర్ పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, టీఎంసీ గంగులయ్య, సీఓలు పాల్గొన్నారు. -
రెండు వందల పనిదినాలు కల్పించాలి
నల్లగొండ టౌన్ : ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి రెండువందల రోజుల పనిదినాలను కల్పించాలని, కనీసం రోజుకు రూ.350 కూలి చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ విజయరాఘవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో జరిగిన ఉపాధి చట్టం దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయించేందుకు భూస్వాములు, పెట్టుబడిదారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అదే పరిస్థితి ఏర్పడితే తిరిగి భూస్వాములకు ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ఉపాధి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన, మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధిపథకం అమలుతీరుపై వ్యవసాయ కార్మిక సంఘం దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుందని, సర్వే పూర్తి అయిన తరువాత ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. చట్టం పూర్తి స్థాయిలో అమలుకు వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేయకుండా పక్కదారి పట్టిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జాతీయ కౌన్సిల్ సమావేశంలోపలు అంశాలపై చర్చించి చట్టాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవడానికి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు తిరుణవక్కరసు, జాతీయ సహాయ కార్యదర్శి సునిల్‌చోప్రా, కిసాన్‌సభ జాతీయ అధ్యక్షుడు హన్నన్‌మొల్లా, జాతీయ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్రామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్, సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.పద్మ, ములకలపల్లి రాములు, చినవెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు కావాలి
యాదగిరిగుట్ట: గ్రామీణా ప్రాంతాల్లో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలని యాత్ర స్వచ్చంధ సంస్థ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం కోరారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలపై జిల్లా స్థాయి చర్చ వేదిక మండలంలోని మహబూబ్‌పేటలో శనివారం జరిగింది. ఈ చర్చ వేధికకు సూర్యాపేట డివిజన్ ఉపాధి కూలీల నాయకులు, మహిళ సంఘాల నాయకురాలు పాల్గొని మండలంలో జరుగుతున్న ఉపా«ధి హామీ సమాఖ్యల సమావేశాలు, విద్యాహక్కు చట్టం పాఠశాల యాజమాన్య కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో ప్రముఖులు రేగు బాలనర్సయ్య, మార్తమ్మ, రేగు అశోక్, బాలలక్ష్మీ, గాజుల లక్ష్మీ, స్వామిలతో పాటు ఏపీఎస్‌ఎస్‌ఎస్ సంఘంకు చెందిన 60 మంది, ఏపీ ఎస్ఎస్ఎస్ సూర్యాపేట కో ఆర్డినేటర్లు, సభ్యులు హాజరయ్యారు. -
నిలిచిన ‘ఉపాధి’ కూలి
మూడు నెలలుగా ఎదురుచూపులు రూ.10కోట్ల వరకు వేతన బకాయిలు ఆందోళనలో కూలీలు జగిత్యాల రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం అభాసుపాలవుతోంది. జిల్లాలోని కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఓ వైపు వర్షాలు పడక వ్యవసాయ పనులు లేక, చేసిన ఉపాధిహామీ వేతనాలు రాక కూలీలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 1212 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద 6,62,579 కుటుంబాలకు జాబ్‌కార్డు ఉన్నాయి. వీరిలో 7,99,013 మంది పనిచేస్తున్నారు. వీరికి సంవత్సరం జిల్లాలో 1,56,701 పనులు దశలవారీగా నిర్వహించారు. హరితహారంలో గుంతలు తవ్వించడంతోపాటు మొక్కలు నాటించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు రూ.10 కోట్ల మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో నిత్యం పనిచేస్తేగానీ పొట్టగడవని కూలీలు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు రాకపోవడంతో ప్రస్తుతం అనుమతులు వచ్చిన పనులు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కష్టంగాఉంది రోజువారి కూలీ చేస్తేనే పొట్టగడిచేది.మూడు నెలలుగా ఉపాధిహామీ పనులు చేస్తూ వచ్చాం. కానీ పైసలు మాత్రం మూడు నెలలుగా రావడం లేదు. దీంతో పొట్టగడటమే కష్టంగా ఉంది. – తోట జమున, ఉపాధిహామీ కూలీ వ్యవసాయ పనులకు పోతున్న గత మూడు నెలలుగా ఉపాధిహామీ పథకంలో పనులు చేస్తూ వస్తున్నాం. మూడు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో ఇంట్లో చిల్లిగవ్వ లేక వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ పొట్టగడుపుకుంటున్నాం. – గొల్ల లక్ష్మి బకాయి వాస్తవమే ఉపాధిహామీ పథకంలో పనులు చేసిన కూలీలకు సుమారు రూ.10 కోట్ల మేరకు బకాయిలు ఉన్న మాట వాస్తవమే. ఇటీవలే హరితహారంలో పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించాం. మిగతా వారికి పది రోజుల్లో చెల్లిస్తాం. – వెంకటేశ్వర్రావు, పీడీ, కరీంనగర్ -
ఉపాధి సిబ్బందికి జరిమానాలు
వెల్దుర్తి: ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు రూ. 20, 576 వేల జరిమానాలు విధించారు. మండలంలో గత ఏడాది జరిగిన ఉపాధి పనులపై పది రోజులుగా గ్రామగ్రామాన ఆడిట్ నిర్వహించారు. ఈ నివేదికలపై బుధవారం ఉదయం నుండి రాత్రి రెండు గంటల వరకు ఎంపీపీ కార్యాలయంలో ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ కార్య క్రమానికి జిల్లా విజిలెన్స్ అధికారి శివయ్య, ప్రొసీడింగ్ అధికారిణి వసంత సుగుణలు హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహించడం వల్ల మేట్లు మస్టర్ రోల్లలో పనులు చేసిన కూలీలకు హాజరు వేయక, పనులు చేయకున్నా చేసినట్లు హాజరు వేసినట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఆగ్రహించి అలాంటి మేట్లను తొలగిస్తూ, నిర్లక్ష్యం వహించిన టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ జరిమానాలు విధించారు. -
‘ఉపాధి’ కొక్కులు..!
– పనులకు వెళ్లకపోయినా మస్టర్లు సృష్టి – వేతనాల పంపిణీలోనూ చేతివాటం – చిన్నతుంబళంలో వెలుగు చూసిన అక్రమాలు పెద్దకడబూరు/మంత్రాలయం : ఉపాధి పనుల్లో అక్రమాలు ఇవి. దొంగ మస్టర్లు సృష్టించి పేదల ధనాన్ని దండుకున్న అవినీతి బాగోతమిది. పేదల శ్రమను వీరు దోపిడీ చేశారు. తినమెరిగిన మేటీలు.. స్వార్థం మరిగిన బీపీఎం.. లాలూచీ అధికారులు..కుమ్మక్కై పాతిక లక్షల రూపాయలు కాజేశారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం ఉపాధి పనుల్లో సాగిన దందాపై ప్రత్యేక కథనం.. పనుల నిర్వహణ ఇలా.. గ్రామంలో ఈ ఏడాది పనులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.2.50 కోట్ల లక్ష్యంగా పెట్టింది. అందులో ఇప్పటి వరకు రూ.93 లక్షల మేర పనులు చేశారు. ఐదు నెలల కాలంలో కేవలం రెండు పర్యాయాలు వేతనాలు చెల్లించారు. ఇటీవల రూ.42 లక్షలు నిధులు డ్రా చేశారు. ఇంకా రూ.51 లక్షల వరకు నిధులు డ్రా కావాల్సి ఉంది. గ్రామంలో మొత్తం 2,700 జాబ్‌కార్డులు ఉన్నాయి. రోజుకు 800–900 వరకు కూలీలు పనులకు హాజరవుతూ వచ్చారు. ఇప్పటివరకు 42 వేల పనిదినాలు కల్పించారు. మస్టర్లలో మాయాజాలం : అవినీతి రుచి మెరిగిన మేటీలు మస్టర్లలో మాయాజాలం చేశారు. పనులకు రాకపోయినా వచ్చినట్లు, ఊళ్లో లేకున్నా పనులు చేసినట్లు మస్టర్లు సష్టించారు. గ్రామంలో అందరూ పనిచేస్తున్నట్లు రికార్డుల్లో ఎక్కించారు. గ్రామంలో బాబా (131772204006011667–01), జిలాన్ (131772204006011644–01), లక్ష్మి (131772204006011593–02), నరసింహ (131772204006010163–01), నారాయణమ్మ (131772204006010163–02) వీళ్లంతా ఏ ఒక్క రోజు పనికి వెళ్లలేదు. అయినా వాళ్ల పేర్లుపై వేతనాలు మంజూరు చేశారు. బాబాకు రూ.5,617, జిలాన్‌కు రూ.2,019, లక్ష్మికు రూ.2,234, నరసింహకు రూ.4,958, నారాయణమ్మకు రూ.4,958 వేతనం జమ చేశారు. నరసింహ, నారాయణమ్మ దంపతులు బతుకు తెరువు కోసం ముంబాయికి వలస వెళ్లారు. వారూ ఇక్కడ పనుల్లో పాల్గొన్నట్లు నమోదు చేశారు. దాదాపు 120 మందికిపైగా పనులకు వెళ్లలేకున్నా వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేగాక పనులకు వెళ్లిన వారి వేతనాల్లోనూ స్వాహాకార్యం చేశారు. ఉశేని(131772204006010782–03)కు రూ.9,772 గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010078–01) రూ.11,830 రావాల్సి ఉండగా రూ.1900, నల్లన్నకు (131772204006010717–02) రూ.14,484గానూ రూ.2 వేలు, పరిశప్పకు (131772204006010096–01) రూ.9,928కి గానూ రూ.702, అనుమంతమ్మకు (131772204006010207–04)కు రూ.10,920కి గానూ రూ.340 చేతికి చ్చారు. మిగతా నిధులు ముట్టినట్లు ఖాతా పుస్తకంలో రాసి ముద్ర సైతం వేశారు. ఇలా మోసపోయిన కూలీలు 500 మందికిపైనే ఉన్నట్లు అంచనా. దందా సాగిన తీరు.. పనులు చేయిస్తున్న మేటీలు, పోస్ట్‌మన్ ఏకమై దందాకు పాల్పడ్డారు. మేటీలందరూ ఒక్కటై దొంగ మస్టర్లను రెడీ చేశారు. నిధులు రాగానే రాబట్టుకునేందుకు వ్యూహం పన్నారు. పనులకు రాని వ్యక్తులు వేలి ముద్రల కోసం కొంత డ్రామా కట్టారు. ఎక్కువ కాలం పనులకు రాకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని బుకాయించారు. పనులకు రాకున్నా వారం పనులకు ఉచితంగా డబ్బులు ఇస్తామని ఆశపెట్టారు. వేలి ముద్రలు వేసి డబ్బు తీసుకుపోవాలని పేస్లిప్లు చేతుల్లో పెట్టారు. పాపం అమాయక జనం నిజమేనేమో..అని పాట్మిషన్లలో వేలి ముద్రలు సేకరించారు. ఒక్కసారి కాకుండా ప్రతి వారానికో ముద్ర చొప్పున ఒకేసారి నొక్కించారు. పాస్ పుస్తకాల్లో ఇష్టమెచ్చిన లెక్కలు రాసేశారు. అంతేగాక పనులకు వచ్చిన కూలీలకు వారం వారం పేస్లిప్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం అలా సాగలేదు. ఒక్కటీ రెండు పేస్లిప్లు ఇవ్వడం మిగతా స్లిప్‌లు మేటీలతోనే ఉంచుకున్నారు. పనులకు వచ్చిన కూలీలకు వారం కూలితో సరిపెట్టారు. మిగతా కూలీలు సైతం ఇచ్చేసినట్లు ఖాతా పుస్తకాల్లో నమోదు చేశారు. రూ.25 లక్షల స్వాహా : తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కూలీల సొమ్మును కాజేశారు. రూ.93 లక్షల పనుల్లో రూ.25 లక్షలు స్వాహా చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకు మించే ఉందని గ్రామస్తులు ఆరోపణ. ఆరు నెలల దోపిడీనే ఇంత ఉంటే. గతంలో భారీ మొత్తంలో నిధులు దండుకున్నారని కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా వెనక ఎన్ఆర్ఈజీఎస్ మండలాధికారులు ఉన్నట్లు సమాచారం. నిధులు కాజేసే కథనంతా బీపీఎం షాషావలీ ద్వారా నడిపిసున్నట్లు స్పష్టమవుతోంది. అవినీతిని నిలదీస్తే మేటీలు మీరు పనికి రాకున్నా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాం. తీసుకుపోండి ఎక్కువ మాట్లాడొద్దని ఎదురు తిరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. కూలి డబ్బులు సక్రమంగా ఇవ్వండని అడిగితే ఇంకోసారి పనుల్లో పెట్టుకోమంటూ భయపెడుతున్నారని వాపోయారు. -
ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు
ఆత్మకూరురూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జి.లక్ష్మీపతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.పుల్లయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్ చెర్లో రమణారెడ్డి భవన్లో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల వ్యవసాయ కార్మికుల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా తయారయ్యాయన్నారు. పేద ప్రజలు, వ్యవసాయ కార్మికుల కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నాయన్నారు. వ్యవసాయంలో కీలకమైన కూలీలకు కనీసవేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా పేదలకు అందడం లేదని ఆరోపించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శిలుగా గొరిపర్తి పెంచలయ్య, కార్యదర్శిగా ముత్యాల పెంచలయ్య, కమిటీ సభ్యులుగా పి.పెంచల రామయ్య, టి.రవి, పి.వెంకటయ్య, జి.రమణమ్మ, కత్తి ఎల్లయ్యలను నియమించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు ఎం.నాగేంద్ర, కేవీపీఎస్ నాయకులు కె.డేవిడ్‌రాజు, మహిళా సంఘం నాయకులు షేక్ గుల్జార్‌బేగం పాల్గొన్నారు. -
నగరపంచాయతీల్లో ’ఉపాధి’ పనులు కల్పించాలి
నల్లగొండ టౌన్ : దేవరకొండ, హుజూర్నగర్ నగర పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదలకు జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని నగర పంచాయితీల్లో రద్దు చేయడం వలన కూలీలకు, వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకటరాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, నగరపంచాయతీలలో అమలుచేస్తున్నప్పటì కీ కేవలం దేవరకొండ, హుజూర్‌నగర్‌లలో నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారి అయిలయ్య, ఎం.రాములు, బొప్పని పద్మ, కె.నగేష్, కె.ఆనంద్, సీతయ్య, పాండు, వేముల మహేందర్, రొడ్డ అంజయ్య, ఎం.సైదులు, కత్తుల లింగస్వామి, పులుసు సత్యం, పద్మావతి, జిల్లా అంజయ్య, రమణ, బేగం తదితరులు పాల్గొన్నారు.