ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : మండలంలో చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో రూ.16.61లక్షల అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం అధికారులు తేల్చారు. 2012 ఆగస్టు 1 నుంచి 2013 అక్టోబర్ వరకు జరిగిన పనులు, స్కాలర్‌షిప్‌లు, పింఛన ్లపై ఈ నెల 21 నుంచి 29 వరకు గ్రామాల్లో డీఆర్పీలు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాఆవరణలో ప్రజావేదిక నిర్వహించారు. తనిఖీల్లో బయటపడిన అవకతవకలను అధికారులు వెల్లడించారు. పనులు చేసినా డబ్బులు చెల్లించలేదని, కొలతల్లో తేడాలు, ఎంబీ రికార్డులో తప్పుడు లెక్కలు, నాలుగు రోజుల పనులు చేస్తే మూడు రోజుల కూలి చెల్లించడం వంటి పనులపై రూ.16,61,032 అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అత్యధికంగా చిం చూఘాట్ గ్రామ పంచాయతీలో రూ. 3,75,171 అతి తక్కువగా బట్టిసావర్‌గాంలో రూ.95 అక్రమాలు జరిగినట్లు తనిఖీల్లో తేలయాని సామాజిక తనిఖీ బృందాలు ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా డ్వామా ఏపీడీ, ప్రిసైడింగ్ అధికారి గణేశ్ జాదవ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో వివిధ తప్పులు చేసినా ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. అవకతవకలకు పాల్పడితే ఎవరిని కూడా ఉపేక్షించేందిలేదన్నారు.వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెలుగులోకి వచ్చిన డబ్బులను త్వరలో రికవరీకి ఆదేశిస్తామని, పెండింగ్‌లో ఉన్న కూలీల డబ్బులను చెల్లిస్తామన్నారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు బ్లూ ఫామ్‌లపై కూలీలకు అవగాహన కల్పించడం లేదని తనిఖీల్లో తేలిందన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన డబ్బులు కాజేసిన అనుకుంట సీఏను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈజీఎస్ అంబుడ్స్‌మన్ మేస్రం నాగోరావు, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, ఎస్‌ఆర్పీ సాయిలు, పీవో శామ్యూల్, సర్పంచులు పాల్గొన్నారు.
ఏ జీపీలో ఎంత?
సామాజిక తనిఖీల్లో చించూఘాట్ గ్రామపంచాయతీలో రూ.3,75,171, కుంభ ఝరి రూ.37,152, బట్టిసావర్‌గాంలో రూ.95, జంధాపూర్ రూ.13,813, కచ్‌కంటిలో రూ. 5,777, అనుకుంటలో రూ.52,057, తంతోలి రూ.3,934, లోకా రి రూ.4180, వాఘాపూర్ రూ.38,930, యాపల్‌గూడ రూ.15,037, అంకోలి రూ.13,380, అర్లి(బి) రూ.19,716, చాంద(టి) రూ.1,188, మావల రూ.44, 938, రామాయి రూ.35,744, ఖండాల రూ.2,46,339, రాంపూర్ రూ.18,781, వాన్వాట్ రూ.28,364, లాండసాంగ్వి రూ.19,445, పిప్పల్‌ధరి రూ. 3,54, 630, భీంసరి రూ.2,385, ఖానాపూర్ రూ.3,29,976 అక్రమాలు వెలుగులోకివచ్చాయి.