శిథిలావస్థలో పాఠశాల భవనం
ఆసిఫాబాద్‌రూరల్ : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(పీటీజీబీ) వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటర్‌హీటర్లు లేక విద్యార్థులు చలిలో గజగజ వణుకుతూ స్నానాలు చేస్తున్నారు.
శిథిలావస్థలో భవనం..
అసంపూర్తిగా మరుగుదొడ్లు, తలుపులేని కిటికిలు, నేలపైనే పడకా తదితర సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 498 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల నిర్మించి 30 ఏళ్లు గడుస్తోంది. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తరగతి గదులకు ఉన్న కిటికిలకు తలుపులు ఉండిపోయాయి. ఆ కిటికీలలోంచి చల్లటి గాలులు వీస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.
చలికి వణుకుతున్న విద్యార్థులు
విద్యార్థులు పడుకోవడానికి ఎనిమిది గదులు ఉన్నాయి. ఏ ఒక్క గదికి కూడా కిటికిలకు తలుపులు లేవు. కనీసం వాటర్ హీటర్లుకుడా లేకపోవడంతో చలికాలం ఉదయమే చన్నిటి స్నానం చేస్తున్నారు. పడుకునేందుకు బెడ్‌లు కూడా లేక పోవడంతో నేలపైనే పడుకుంటున్నారు.
చాలా ఇబ్బందిగా ఉంది
పాఠశాల గదులకు ఉన్న కిటికిలకు తలుపులు లేవు. పక్క క్లాసులో చేప్పే పాఠాలు మాకు వినపిస్తున్నాయి. దీనితో ఏకగ్రత కొల్పతున్నాం. టీచర్లు చెప్పేది సారిగా వినబడడం లేదు. కొత్త భవనం మంజూరు చేయాలి.
– ప్రభాకర్, విద్యార్థి
స్నానం చేయలేక పోతున్నాం
పడుకునే గదుల కిటికీలకు తలుపు లేవు. చలికాలం కాబట్టి చల్ల గాలి వీస్తోంది. బెడ్లు లేకపోవడంతో నేలపైనే పడుకుంటున్నాం. వాటర్ హీటర్లు లేవు. దీంతో చన్నీటి స్నానమే మూడు రోజులకోసారి చేస్తున్నాం.
– రజేందర్, విద్యార్థి
నివేదిక పంపించాం
గతంలో ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిచాం. కాని ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు రాలేదు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి కొత్త భవనం మంజూరు చేయాలి.
– శ్రీనివాస్, ప్రిన్స్‌పాల్
Comments
Please login to add a commentAdd a comment