St Hostel
-
కలుషితాహారం: విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, వైఎస్సార్ కడప: రాయచోటి గిరిజన హాస్టల్లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎస్టీ హాస్టల్లో అగ్నిప్రమాదం
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని ఎస్టీ హాస్టల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యార్థుల పరుపులు, పుస్తకాలు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిపుడు పిల్లలెవరూ హాస్టల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేదు. ఇన్వర్టర్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ కూడా అందుబాటులో లేరు..స్థానికులు గమనించి వెంటనే మంటలు ఆర్పడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. -
ఎస్టీ హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అధికారి
జహీరాబాద్: స్థానిక ఎస్టీ హాస్టల్‌ను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పి.మణెమ్మ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజన ఇస్తున్నదీ లేనిది తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, అరటిపళ్లు, స్నాక్స్ ఇస్తున్నారని విద్యార్థులు వివరించారు. నోటు పుస్తకాలు, బెడ్‌షీట్స్ ఇచ్చిందీ.. లేనిది ఆరా తీశారు. 186 మంది విద్యార్థులకు గాను 168 మంది విద్యార్థులు హాజరయినట్లు ఆమె పేర్కొన్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో పాటు హాస్టల్లో నిద్రించారు. -
సమస్యల్లో పాఠశాల
ఆసిఫాబాద్‌రూరల్ : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(పీటీజీబీ) వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటర్‌హీటర్లు లేక విద్యార్థులు చలిలో గజగజ వణుకుతూ స్నానాలు చేస్తున్నారు. శిథిలావస్థలో భవనం.. అసంపూర్తిగా మరుగుదొడ్లు, తలుపులేని కిటికిలు, నేలపైనే పడకా తదితర సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 498 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల నిర్మించి 30 ఏళ్లు గడుస్తోంది. ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. తరగతి గదులకు ఉన్న కిటికిలకు తలుపులు ఉండిపోయాయి. ఆ కిటికీలలోంచి చల్లటి గాలులు వీస్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. చలికి వణుకుతున్న విద్యార్థులు విద్యార్థులు పడుకోవడానికి ఎనిమిది గదులు ఉన్నాయి. ఏ ఒక్క గదికి కూడా కిటికిలకు తలుపులు లేవు. కనీసం వాటర్ హీటర్లుకుడా లేకపోవడంతో చలికాలం ఉదయమే చన్నిటి స్నానం చేస్తున్నారు. పడుకునేందుకు బెడ్లు కూడా లేక పోవడంతో నేలపైనే పడుకుంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది పాఠశాల గదులకు ఉన్న కిటికిలకు తలుపులు లేవు. పక్క క్లాసులో చేప్పే పాఠాలు మాకు వినపిస్తున్నాయి. దీనితో ఏకగ్రత కొల్పతున్నాం. టీచర్లు చెప్పేది సారిగా వినబడడం లేదు. కొత్త భవనం మంజూరు చేయాలి. – ప్రభాకర్, విద్యార్థి స్నానం చేయలేక పోతున్నాం పడుకునే గదుల కిటికీలకు తలుపు లేవు. చలికాలం కాబట్టి చల్ల గాలి వీస్తోంది. బెడ్లు లేకపోవడంతో నేలపైనే పడుకుంటున్నాం. వాటర్ హీటర్లు లేవు. దీంతో చన్నీటి స్నానమే మూడు రోజులకోసారి చేస్తున్నాం. – రజేందర్, విద్యార్థి నివేదిక పంపించాం గతంలో ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిచాం. కాని ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు రాలేదు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి కొత్త భవనం మంజూరు చేయాలి. – శ్రీనివాస్, ప్రిన్స్‌పాల్ -
పోట్లాడుకున్నారని తలకిందులుగా నిలిపి..
-
రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థిని మృతి
కర్నూలు(హాస్పిటల్): రోడ్డు ప్రమాదంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా మన్ననూరు గ్రామానికి చెందిన ముత్యాలు కుమార్తె పి. లింగమ్మ(19) కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజిలో బిఎస్సీ నర్సింగ్ కోర్సు మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె నగరంలోని గిరిజన హాస్టల్లో ఉంటోంది. ఇదే హాస్టల్లో ఆమెకు తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని బి. సుజాత పరిచయమైంది. ఆదివారం ఆమె సుజాత ఊరికి వెళ్లేందుకు గుత్తికి వెళ్లింది. అక్కడ నుంచి బైక్‌పై ఆమెను సుజాత సోదరుడు ఎం. స్వామినాయక్‌తో కలిసి వెళ్లారు. మార్గమధ్యంలో జొన్నగిరి గ్రామం వద్ద స్పీడ్‌బ్రేకర్ రావడంతో అదుపు తప్పి బైక్‌పై నుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'సున్నిపెంట ఘటనపై విచారణకు ఆదేశం'
హైదరాబాద్: కర్నూలు జిల్లా సున్నిపెంట గిరిజన హాస్టల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనపై సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో మనోధైర్యం నింపడానికి చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు రావెల సూచించారు. సున్నిపెంట గిరిజన సంక్షేమ హాస్టల్లోని ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్‌లు ఇంటర్ పరీక్షల్లో డిబార్ అయ్యారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం
కర్నూలు: కర్నూలు జిల్లా సున్నిపెంట గిరిజన సంక్షేమ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్‌లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థులు ఆ విషయాన్ని గమనించి హాస్టల్ అధికారులకు తెలిపారు. దాంతో వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో డిబార్ కావడంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని హాస్టల్ అధికారులు వెల్లడించారు. -
అసలేమైంది..?
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ‘కాపాడండి.. రక్షించండి.. నన్ను విడిచిపెట్టండి.. అమ్మా...’ అని బిగ్గరగా ఏడుస్తూ యువతి చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. మొదట ఏదోలే అనుకున్నా సుమారు రెండు గంటల పాటు వినిపించిన అరుపులు వారిని కదిలించాయి. తొలుత భయపడ్డా తర్వాత సాహసించి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు.. విద్యార్థులు భ్రమపడ్డారని పోలీసులు కొట్టిపారేస్తున్నా.. ఏదో జరిగిందని విద్యార్థులు కచ్చితంగా చెబుతున్నారు. ఆలస్యంగా వెల్లడైన ఈ సంఘటన గురించి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలోని మహిళా కళాశాల సమీపంలో ఎస్టీ హాస్టల్ ఉంది. రోజూ సాయంత్రం వేళ సమీపంలోని ఆలయం నుంచి వచ్చే పాటలు హాస్టల్ విద్యార్థులు వింటూంటారు. గత నెల 28న సాయంత్రం 6.30 గంటల సమయంలో పాటలకు బదులుగా రక్షించమని రోదిస్తూ యువతి చేసిన అరుపులు వినిపించాయి. ఏడుస్తున్న అమ్మాయి గొంతు నొక్కినట్లుగా కూడా వినిపించింది. ఊపిరి కూడా పీల్చుకోలేనట్లు అనిపించడంతో ఎవరో యువతి ప్రమాదంలో ఉందని విద్యార్థినులకు అనుమానం కలిగింది. వెంటనే 100 నంబరుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గంట తర్వాత పోలీసులు తాపీగా వచ్చారు. ఈలోగా విద్యార్థినుల ద్వారా సమాచారం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ ఎర్రన్నాయుడు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, హాస్టల్ వార్డెన్, కొందరు విద్యార్థినులు కళాశాల పరిసరాలు గాలించారు. అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయని భావించారో అక్కడికి కూడా వెళ్లి చూశారు. ఎవరూ కనిపించలేదు. కళాశాల గదుల్లోనూ గాలించారు. ఎవరూ కనిపించకపోగా అరుపులు కూడా ఆగిపోయాయి. దీనికి కారణం గుర్తించలేకపోయినా ఏదో జరిగిందని చెబుతున్న ఎస్టీ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఈ మిస్టరీ తేలే వరకూ విద్యార్థినుల భయాందోళనలు తొలగవు. అప్పుడప్పుడూ శబ్దాలు వస్తాయి దీనిపై హాస్టల్ వార్డెన్ ఎర్రన్నాయుడును ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, అమ్మాయి అరుపులు వినిపించాయని విద్యార్థినులు చెప్పారని, కళాశాల వద్దకు వెళ్లి వెతికామన్నారు. ఎవరైనా వచ్చారా అని వాచ్‌మాన్‌ను అడిగితే ఎవరూ రాలేదన్నాడన్నారు. రోజూ ఏవో అరుపులు వినిపిస్తుంటాయని, గాజుల శబ్దం, ఎవ రో నడిచి వెళ్తున్నట్లు, చిన్న శబ్దాలు రాత్రి వేళ వినిపిస్తుంటాయని వాచ్‌మన్ చెప్పాడన్నారు. విద్యార్థినుల భ్రమ దీనిపై శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావును ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, సమాచారం తెలిసిన వెంటనే తమ సిబ్బంది వెళ్లి వెతికినా ఏ జాడ కనిపించలేదన్నారు. తాను హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడానని, ఏదో భ్రమతో అలా ఊహించుకుని ఉంటారే త ప్ప ఏం జరగలేదన్నారు. అధ్వానంగా పరిసరాలు కళాశాల పరిసర ప్రాంతాలు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.అపారిశుద్ధ్య వాతావరణంలోనే విద్యార్థులు భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కళాశాల ప్రాంగణంలో తుప్పలు భయాన్ని కలిగిస్తున్నాయి. పగలు కూడా వంటరిగా తిరగలేని విధంగా ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. కళాశాల ఆవరణలో విద్యుత్ దీపాలు పూర్తి స్థాయిలో లేవు. సాయంత్రమైతే కళాశాల ఆవరణలో ప్రవేశించాలంటే విద్యార్థులు భయపడే విధంగా వాతావరణం ఉంది. -
గిరిజనుల సంక్షేమానికి రూ.18.75 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు పూర్తిగా వారికే అందేలా సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని, అందులో భాగంగా జిల్లాకు 12 ఎస్టీ వసతిగృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మంత్రి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఎస్టీల అభివృద్ధికిగాను రూ.18.75 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, పరిగి, సరూర్‌నగర్, బాలానగర్, రాజేంద్రనగర్, మేడ్చల్‌లో బాలుర హాస్టళ్లు... కుత్బుల్లాపూర్, ఘట్కేసర్ గిరిజనుల సంక్షేమానికి రూ.18.75 కోట్లు (బాలురు/బాలికలు) వసతిగృహాలను రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే కుల్కచర్ల మండలంలోని బండివెల్కచర్ల, రాంపూర్‌లో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల క్వార్టర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.60 లక్షలు విడుదల చేసిందన్నారు. మహ్మదాబాద్, తాండూరు, కుల్కచర్లలోని హాస్టళ్లను బాలికల ఆశ్రమ పాఠశాలలుగా స్థాయి పెంచాలని నిర్ణయించినట్లు, ఈ మూడింటికి రూ.3 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పరిగి నియోజకవర్గ కేంద్రంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి కార్యాలయం/గోడౌన్ నిర్మాణానికి రూ.15 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రసాద్ తెలిపా రు. రాజేంద్రనగర్‌లో యువత శిక్షణ కేంద్రాన్ని నిర్మిం చేందుకు రూ.3 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని అగ్గనూర్ - బషీరాబాద్ మార్గానికి ఆర్అండ్బీ శాఖ రూ.14 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. అలాగే తాండూరు - కోట్‌పల్లి, కోట్‌పల్లి - సదాశివపేట్, వికారాబాద్ - సదాశివపేట్, శంకర్పల్లి - మోమిన్‌పేట్ రహదారుల అభివృద్ధికి రూ.52 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలకు త్వరలోనే ఆమోదముద్ర పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంసీహెచ్ పరిధిలోనే కేంద్ర పాలన కేంద్రం పర్యవేక్షణలో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ప్రసాద్ తెలిపారు. ఈ పాలనను పాత ఎంసీహెచ్ పరిధికే పరిమితం చేయాలని కేంద్రానికి నివేదించామన్నారు. కేవలం శాంతిభద్రతలను మాత్రమే కేంద్ర సర్కారు పర్యవేక్షించనుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని, ఆయన సమైక్యరాష్ట్రానికి సీఎం అని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.