విద్యార్థులతో మాట్లాడుతున్న మణెమ్మ
జహీరాబాద్: స్థానిక ఎస్టీ హాస్టల్‌ను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పి.మణెమ్మ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజన ఇస్తున్నదీ లేనిది తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం, గుడ్లు, అరటిపళ్లు, స్నాక్స్ ఇస్తున్నారని విద్యార్థులు వివరించారు. నోటు పుస్తకాలు, బెడ్‌షీట్స్ ఇచ్చిందీ.. లేనిది ఆరా తీశారు. 186 మంది విద్యార్థులకు గాను 168 మంది విద్యార్థులు హాజరయినట్లు ఆమె పేర్కొన్నారు. రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో పాటు హాస్టల్‌లో నిద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment