'సున్నిపెంట ఘటనపై విచారణకు ఆదేశం' | Ravela kishore babu order to enquiry on students suicide attempt | Sakshi
Sakshi News home page

'సున్నిపెంట ఘటనపై విచారణకు ఆదేశం'

Published Sun, Mar 15 2015 10:06 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

'సున్నిపెంట ఘటనపై విచారణకు ఆదేశం' - Sakshi

'సున్నిపెంట ఘటనపై విచారణకు ఆదేశం'

హైదరాబాద్: కర్నూలు జిల్లా సున్నిపెంట గిరిజన హాస్టల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనపై సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో మనోధైర్యం నింపడానికి చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు రావెల సూచించారు.

సున్నిపెంట గిరిజన సంక్షేమ హాస్టల్లోని ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్లు ఇంటర్ పరీక్షల్లో డిబార్ అయ్యారు. దాంతో తీవ్ర మనస్తాపం చెందిన వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement