విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచలేదని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో ప్రధాని హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. శనివారం విజయవాడలో మంత్రి రావెల ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధానితో మాట్లాడతామని చెప్పారు.