రెండు కోట్ల పనిదినాలు లక్ష్యం
ఏలూరు సిటీ : జిల్లాలో మార్చి 31 నాటికి పేదలకు రెండు కోట్ల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చాలంటే రోజుకు 2 లక్షల పనిదినాలను కల్పించాలని కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన ఉపాధి పనుల ప్రగతి తీరును సమీక్షించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం రోజుకు కల్పిస్తున్న లక్ష పనిదినాలను మార్చి మొదటివారం నాటికి రెండు లక్షల పనిదినాలకు పెంచాలని కలెక్టర్ చెప్పారు. డెల్టాలోని మండలాల్లో రోజుకు వెయ్యి పనిదినాలు, మెట్ట ప్రాంతంలోని మండలాల్లో రోజుకు మూడు వేల పనిదినాలు కల్పించి తీరాలని, ఆ దిశగా క్షేత్రస్థాయిలో రైతులతో మమేకం కావాలన్నారు. 1.13 కోట్ల పనిదినాలు కల్పించి రూ.158.67 కోట్ల వేతనాల రూపంలో కూలీలకు ఇవ్వడం జరిగిందని, రాబోయే 40 రోజుల్లో 87 లక్షల పనిదినాలు కల్పించి 2 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు.
ఫామ్‌పౌండ్స్ అమలులో వెనుకబాటెందుకు
జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయని, రాష్ట్రంలోనే భూగర్భజలాలు బాగా అడుగంటిన జిలా?్లల్లో పశ్చిమ అగ్రస్థానంలో ఉందన్నారు. రెండేళ్లలో కరువు జిల్లాల్లో పశ్చిమ చేరుతుందని ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సోమవారం నుంచి జంగారెడ్డిగూడెం, గోపాలపురం, దేవరపల్లి, టీ.నరసాపురం, కొయ్యలగూడెం మండలాల్లో రోజుకు 3 వేల మందికిపైగా కూలీలకు ఉపాధి కల్పించాలని, గురువారం భీమడోలు, చింతలపూడి, దెందులూరు, ద్వారకాతిరుమల, ఏలూరు, గోపాలపురం, తణుకు, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం, నల్లజర్ల, పెదవేగి, టి.నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాల్లో రోజుకు 4 వేల పనిదినాలు కల్పించేస్థాయికి పెరగాలని ఆదేశించారు. ఏప్రిల్ 30 నాటికి నూరు శాతం డంపింగ్ యార్డు షెడ్డులు నిర్మాణం పూర్తికావాలన్నారు. క్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు మార్చి 20 నాటికల్లా పూర్తిచేసి బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. పీడీ ముళ్లపూడి వెంకట రమణ పాల్గొన్నారు.