కలెక్టరేట్, న్యూస్‌లైన్: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనలో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రుణ మంజూరు లో 50 శాతం వరకు సబ్సిడీ పెంచుతున్నట్లు పేర్కొన్నా.. లబ్ధిదారులు పరిమితమయ్యేలాజీఓ 101 జారీ చేసింది. ఎంతో కాలంగా సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులైన నిరుద్యోగులు కొత్త జీఓతో అర్హత కోల్పోతున్నారు.
పుణ్యకాలం గడిచినా
వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు సారీ సెంటర్, బ్యాంగిల్ స్టోర్, కి రాణ మర్చంట్, ఫొటోస్టూడియో, జిరాక్స్ సెంటర్, గొర్రెల పంపకం త దితర యూనిట్లకు బ్యాంకులు రుణా లు మంజూరు చేస్తే ఆయా కార్పొరేషన్లు సబ్సిడీ ఇస్తున్న విష యం తెలిసిందే. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీ కార్పొరేషన్ ద్వారా 2,675 మందికి రుణాలు మంజూరు చెయ్యాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. కాగా 1,554 మంది బ్యాంకు పత్రాలతోపాటు అన్ని ధ్రువీకరణలను బీసీ కార్పొరేషన్‌లో అందించారు. డిసెంబర్ చివరి వరకు లక్ష్య సాధనలో సగం మందికి రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి రుణాల కోసం బీసీలు పెద్ద ఎ త్తున దరఖాస్తులు చేసుకోగా 1,554 మందినే అర్హులుగా గుర్తించారు.
ఊరించి.. ఉడికించి
వీరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయకముందే ప్ర భుత్వం డిసెంబర్ 31న జీఓ నెం 101 విడుదల చే సింది. ఈ జీఓ ప్రకారం బీసీలు, వికలాంగులకు 50 శా తం, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం వరకు సబ్సిడీ పెరిగిం ది. గతంలో 30 శాతం మా త్రమే సబ్సిడీ ఇచ్చేవారు. అయితే కొత్త జోఓతో పాటు ప్రభుత్వం కొ ర్రీలు అధికంగానే పెట్టింది. ఇంతకు ముందు ఏ వర్గానికి చెందిన నిరుద్యోగులైనా వయోపరిమితి లేకపోయింది. ఇప్ప డు బీసీలు, వికలాంగులకు 21 నుంచి 40 సంవత్సరా ల వరకు వయోపరిమితి విధించింది. ఎస్సీ, ఎస్టీలకు 21 నుంచి 45 ఏళ్ల వరకు వయోపరిమితి విధించింది. నిరుద్యోగి ఉన్నత చదువులు చదువుకుని ఉండాలి. దరఖాస్తుదారులు రుణం పొందే యూనిట్లకు సంబంధించి శిక్షణ పొంది ఉండాలి. దర ఖాస్తుదారుడు, అత ని కుటుంబ సభ్యులు గానీ గతంలో లబ్ధిపొంది ఉండకూడదు, ఒకే కుటుంబం నుంచి ఒకే వ్యక్తికి రుణ మం జూరు ఉంటుందన్న నిబంధనలు చాలా మంది నిరుద్యోగులను అనర్హులుగా తేల్చేస్తున్నాయి. కొంత మం ది అభ్యర్థులకు 40ఏళ్లు దాటిపోయారు. మరికొంత మంది కుటుంబాలలో ఇదివరకే రుణం పొందిన వారు ఉన్నారు. నిరక్షరాస్యులు తీవ్ర నిరాశకు లోనవుతున్నా రు. ఎప్పుడో మంజూరు చేయాల్సిన సబ్సిడీకి ఏడాది చివరలో కొర్రీలు పెట్టడం అసంతృప్తికి గురి చేస్తోంది.
సబ్సిడీకి సంకెళ్లు
Published Fri, Jan 10 2014 4:35 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
Advertisement