
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగుల అభ్యున్నతికి వెనుకబడిన తరగతులు ఆర్థిక సహకార సంస్థ(బీసీ కార్పొరేషన్) కొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. శిక్షణ, ఉపాధి కల్పనకు కార్యాచరణ సిద్ధపరుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ఈ తరహా శిక్షణ, ఉపాధి కార్యక్రమాల అమలుతో మంచి ఫలితా లు సాధిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2019–20 వార్షిక సంవత్సరంలో కనిష్టంగా 10వేల మందికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపును సైతం క్రమంగా పెంచుతోంది.
గత రెండేళ్లుగా ఎంబీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించింది. రూ.50 వేల మొత్తంలో ఏర్పాటు చేసే అన్ని స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన బీసీ కార్పొరేషన్ ఆ మేరకు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చింది. 2018–19 సంవత్సరంలో దాదాపు రూ.300 కోట్లకుగాను చెక్కులు ఇచ్చారు. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకోనున్నట్లు చెబుతు న్నారు. ఉపాధి కల్పన వైపు దృష్టి సారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగం గా 2019–20 సంవత్సరంలో రూ.220 కోట్లతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
కులవృత్తుల్లో మెళకువల కోసం..
గతేడాది నాయీబ్రాహ్మణ ఫెడరేషన్, కుమ్మరి శాలివాహన ఫెడరేషన్‌ల ద్వారా వారి కులవృత్తుల్లో యువతకు మెళకువలు నేర్పి మినీ బ్యూటీపార్లర్ల, మట్టి విగ్రహాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. శిక్షణ పొందిన మెజార్టీ యువతకు ఉపాధి దక్క డంతో కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకుని ఆ మేరకు శిక్షణ చేప ట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనాన్ని ఇస్తారు. అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఆతిథ్య రంగం, హోటల్ నిర్వహణ, నిర్మాణ రంగాలను శిక్షణకు ఎంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment