
గాయపడ్డ అప్పారావు
ఏన్కూరు (ఖమ్మం జిల్లా) : ఉపాధికూలీలు గాయాలయిన సంఘటన మండల పరిధిలోని రాజలింగాల లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెం దిన పెరబోయిన అప్పారావు తన భార్య అలి వేలుతో కలసి ఉపాధి పనికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ద్విచక్ర వాహనానికి గడ్డపార కట్టుకున్నాడు. గోతుల్లో ద్విచక్ర వాహనం నడుపుతుండగా గడ్డపార జారి కింద పడి అప్పారావు కుడికాలుతో దిగింది.
దీంతో అప్పారావు కింద పడ్డాడు. అప్పారావు మీద భార్య అలివేలు పడటంతో ఆమెకు పొట్టలో గడ్డపార గుచ్చుకుంది. దీంతో ఇరువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment