వలసల నివారణకు ‘ఉపాధి’ పనులు
Published Fri, Oct 28 2016 11:47 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
– డ్వామా అడిషనల్ పీడీ మురళీధర్
నంద్యాలరూరల్: వలసలు నివారించేందుకు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఉపాధి పనులను ప్రారంభించాలని సిబ్బందిని డ్వామా అడిషనల్ పీడీ పి.మురళీధర్ ఆదేవించారు. శుక్రవారం నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి పనులపై లక్ష్యాన్ని ఇచ్చామని, దానిని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 48 వేల ఫాంపాండ్లు పూర్తి చేశామని, మరో 40వేలు మిగిలి ఉన్నాయని, మార్చి నెలాఖరులోగా వీటిని పూర్తి చేయాలన్నారు. అలాగే 16వేల వర్మీకంపోస్టు యూనిట్లు పూర్తి చేయాలని చెప్పారు. పనులు చేసిన ఉపాధి కూలీలకు మస్టర్ వేసిన 15రోజుల్లోగా వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన వెంట నంద్యాల ఎంపీడీఓ స్వర్ణలత ఉన్నారు.
Advertisement