ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఢిల్లీ నుంచి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర అవార్డు కమిటీ సభ్యులు మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం జిల్లాకు వచ్చారు. గురు, శుక్రవారాల్లో కూడా జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పనులు పరిశీలిస్తారు. బుధవారం ఇద్ద రు కమిటీ సభ్యులు గల బృందం ఇచ్చోడ, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, జన్నా రం, దండేపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ బృందంలో ప్రొఫెసర్ అశ్విన్‌కుమార్‌తోపాటు మరొకరు ఉన్నారు. ఉపాధి హామీ పనుల అమలులో పురోగతి సాధించిన దేశంలోని కొన్ని జిల్లాలకు అవార్డును ఏటా జాతీయ స్థాయిలో అందజేస్తారు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, ఆది లాబాద్ జిల్లాలను ఇందుకు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే సభ్యులు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కూలీలకు జాబ్‌కార్డులు, పనిదినాలు, కూలీ చెల్లింపు, వివిధ రి కార్డులు పరిశీలించడంతోపాటు కూలీలతో వివి ద అంశాలపై చర్చించారు. కాగా ఈ బృందం సభ్యులు తమ పర్యటనలో జిల్లా అధికారులను దూరంగా ఉంచి వివరాలు సేకరిస్తున్నారు. కేవ లం రూట్‌మ్యాప్ కోసం ఇద్దరు జిల్లాకు చెందిన సిబ్బందిని తీసుకెళ్లారు. ఈ వారం రోజుల్లో అవార్డు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరీ ఆదిలాబాద్‌కు వస్తుందా? శ్రీకాకుళంకు దక్కుతుందా వేచి చూడాలి.
ఫిబ్రవరి 2న అవార్డు ప్రకటన
దేశంలోని పలురాష్ట్రాల్లో పర్యటించిన బృందం జాతీయస్థాయిలో మొదట సుమారు 40 జిల్లాల ను పరిగణలోకి తీసుకుని 20 జిల్లాలతో జాబి తా తయారు చేశారు. ఇందులో రాష్ట్రంలోని ఆది లాబాద్‌తోపాటు శ్రీకాకుళం ఉన్నాయి. ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన రోజు కావడంతో ఆ రోజున దే శంలోని కొన్ని జిల్లాలకు అవార్డును అందజేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా శ్రమ శక్తి సం ఘాలు ఎలా ఉన్నాయి? కూలీలు ఎంత మంది ఉన్నారు? లబ్ధిపొందుతున్న కుటుంబాలు ఎ న్ని? వంద రోజుల పని ఎన్ని కుటుంబాలకు దక్కుతుంది? ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చే కూరుతుందా? వారిలో కూలీల సంఖ్య ఎంత? వేతనాల చెల్లింపు ఎలా ఉంది? అక్రమాలపరంగా దుర్వినియోగం అవుతున్న నిధులు, అవి నీతికి పాల్పడిన వారిపై చర్యలు ఎలా ఉన్నా యి? అనే తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఉపాధి హామీ 2006లో ప్రారంభం కాగా జిల్లాలో ఐదు విడతలుగా అమలు చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ. 28 కోట్లకుపైగా నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.
ఆదిలాబాదా? శ్రీకాకుళమా?
Published Thu, Jan 16 2014 4:20 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
Advertisement
Advertisement