ఉపాధి హాని
Published Tue, May 9 2017 11:54 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
ఉపాధి హామీ పథకం ఆదుకుంటుందని ఎంతో ఆశతో అటు వైపు అడుగులు వేసిన కష్ట జీవులకు కష్టాలే మిగులుతున్నాయి. పనులు ప్రారంభించే ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వారి ప్రాణం మీదకు తెస్తోంది. గ్రీష్మతాపం తోడవడంతో వడదెబ్బలకు గురవుతున్నారు. పాము కాటుకు గురవుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా కనీసం ప్రాథమిక వైద్యానికి కూడా నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ నెల 1వ తేదీన వడదెబ్బకు గురై కరప గ్రామానికి చెందిన నక్కా సుభద్రమ్మ (55) మరణించగా మంగళవారం కత్తిపూడి శివారు సీతంపేట గ్రామానికి చెందిన పిర్ల నాగేశ్వరరావు పాము కాటుకు గురై కన్నుమూశాడు.
Advertisement
Advertisement