irresponsible
-
అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు వక్ర భాష్యాలా?
ముంబై: భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డ్రాగన్ దేశం చైనాపై మరోసారి పరోక్షంగా నిప్పులు చెరిగారు. కొన్ని బాధ్యతారాహిత్యమైన దేశాలు సంకుచిత ప్రయోజనాలే లక్ష్యంగా ఆధిపత్య ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తున్నామని ఆరోపించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు(యూఎన్క్లాస్) వక్ర భాష్యాలు చెబుతూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయని విమర్శించారు. కొన్ని దేశాలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ చట్టాలను బలహీన పరుస్తుండడం ఆందోళనకరమని అన్నారు. దేశీయంగా నిర్మించిన క్షిపణుల విధ్వంసక వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం మహారాష్ట్రలోని ముంబై తీరంలో రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అరేబియాలో సముద్రంలో జల ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన భారత్ బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను గౌరవిస్తోందని చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని తాము కోరుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఇక్కడ అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ లభించాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో దేశాల స్థిరత్వం, ఆర్థిక పురోగతి, ప్రపంచాభివృద్ధి కోసం నిబంధనలతో కూడిన స్వేచ్ఛాయుత నౌకాయానం, సముద్ర మార్గాల రక్షణ చాలా అవసరమని వివరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలకు సొంత భాష్యాలు చెబుతూ ఉల్లంఘిస్తుండడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటివి స్వేచ్ఛాయుత నౌకాయానికి అడ్డంకులు సృష్టిస్తాయని చెప్పారు. భారత నావికాదళం పాత్ర కీలకం ఇండో–పసిఫిక్ ప్రాంతం కేవలం ఇక్కడి దేశాలకే కాదు, మొత్తం ప్రపంచానికి చాలా కీలకమని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఈ ప్రాంత భద్రత విషయంలో భారత నావికాదళం తనవంతు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశ ప్రయోజనాలు హిందూ మహాసముద్రంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇండో–పసిఫిక్ ప్రాంతం ఒక ఆయువు పట్టు అని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైనిక సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఆయుధాలు, సైనిక రక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రక్షణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో భారత్‌ను కేంద్ర స్థానంగా మార్చాలన్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నం ఐఎన్ఎస్ విశాఖపట్నం.. హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణలో కీలకంగా మారనుంది. సముద్ర ఉపరితలం నుంచి సముద్ర ఉపరితలానికి, సముద్ర ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోసుకెళ్లనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు వెడల్పు: 17.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు పరిధి: ఏకధాటిగా 4,000 నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగలదు ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ ర్యాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్లు నాలుగు, రెండు జలాంతర్గామి విధ్వంసక రాకెట్ లాంచర్లు, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, అటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. – సాక్షి, విశాఖపట్నం -
తప్పతాగి కానిస్టేబుళ్ల చిందులు.. సెల్ఫోన్లో వీడియోలు
సాక్షి, ఖమ్మం: విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను, హోంగార్డును ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు హద్దులు దాటి ప్రవర్తించారు. (చదవండి: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి..) అమ్మపాలెం గ్రామంలో ఓ ఫంక్షన్‌కు హజరయ్యేందుకు నలుగురు కానిస్టేబుళ్లు, హోంగార్డు బయలుదేరారు. దారిలో ఓ బెల్ట్ షాపులో ఆగారు. పుల్గా మద్యం సేవించి అక్కడ నానా హంగామా చేశారు. తాము కానిస్టేబుళ్లమన్న విషయాన్నే మరిచిపోయి చిందులు వేశారు. చివరకు వీరి చిందులు వేస్తున్న దృశ్యాలను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించడంతో వీరి బండారం బయటపడింది. ఆ వీడియో వాట్సాప్ ద్వారా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ వద్దకు వచ్చింది. విధి నిర్వహణలో ఉండి మద్యం సేవించడంపై నలుగురు కానిస్టేబుళ్లకు సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పు చేస్తే ఏంతటి వారినైన ఊరుకునేది లేదని హెచ్చరించారు. చదవండి: పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి.. -
కాల్వలు దాటడం కష్టమే!
సాక్షి, అమరచింత(వనపర్తి) : అమరచింత మున్సిపాలిటీ ఏర్పడక ముందే గ్రామపంచాయతీలో కొత్తగా నిర్మించిన మురుగు కాల్వలపై అవసరం ఉన్నచోట స్లాబ్‌లను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా కాలనీల్లోని ప్రజలు, చిన్నారులు మురుగు కాల్వలు దాటే క్రమంలో కిందపడి గాయపడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనదారులతో పాటు రిక్షాలు కూడా కాలనీ, వీధుల్లో వెళ్లలేని దుస్థితి నెలకొంది. పాతకల్లుగేరిలో స్లాబ్లేని మురుగు కాల్వ రూ.16లక్షలతో నిర్మాణం.. అమరచింత మున్సిపాలిటీలోని ఆయా వీధులలో సుమారు రూ.16లక్షల వ్యయంతో 7 చోట్ల మురుగు కాల్వల నిర్మాణం పనులను చేపట్టారు. ప్రస్తుతం సదరు కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించకపోవడంతో నిర్మించిన కాల్వలపై స్లాబ్‌లను ఏర్పాటు చేయడం మర్చిపోయారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారని ఆయా కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. స్లాబులు వేస్తేనే ప్రయోజనం.. అమరచింత మున్సిపాలిటీలోని సయ్యద్‌నగర్, రాణాప్రతాప్‌నగర్, ఆజాద్‌నగర్, శివాజీనగర్‌తో పాటు మరికొన్ని కాలనీల్లో రూ.16లక్షల వ్యయం తో కూడిన మురుగు కాల్వల నిర్మాణ పనులను మాజీ సర్పంచ్ పురం వెంకటేశ్వర్‌రెడ్డి హయాంలో నిర్మించారు. ప్రస్తుతం 7 కాల్వల నిర్మాణాలతో పా టు రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డుకిరువైపులా నూతనంగా డ్రెయినేజీ పనులను సుమారు రూ.20లక్షలవ్యయంతో నిర్మించారు. గతంలో నిర్మిచిన మురుగు కాల్వల నిధులతోపాటు ప్రస్తుతం నూతనంగా ని ర్మించిన కాల్వల పనులకు కూడా బిల్లులు రాలేదని అవసరం ఉన్న చోట్ల కాల్వలపై స్లాబ్‌లను ఏర్పాటుచేయలేక పోతున్నారు. అధికారులు స్పందించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించి మురుగు కాల్వలపై వెంటనే స్లాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపాధి హాని
ఉపాధి హామీ పథకం ఆదుకుంటుందని ఎంతో ఆశతో అటు వైపు అడుగులు వేసిన కష్ట జీవులకు కష్టాలే మిగులుతున్నాయి. పనులు ప్రారంభించే ప్రాంతంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వారి ప్రాణం మీదకు తెస్తోంది. గ్రీష్మతాపం తోడవడంతో వడదెబ్బలకు గురవుతున్నారు. పాము కాటుకు గురవుతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా కనీసం ప్రాథమిక వైద్యానికి కూడా నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ నెల 1వ తేదీన వడదెబ్బకు గురై కరప గ్రామానికి చెందిన నక్కా సుభద్రమ్మ (55) మరణించగా మంగళవారం కత్తిపూడి శివారు సీతంపేట గ్రామానికి చెందిన పిర్ల నాగేశ్వరరావు పాము కాటుకు గురై కన్నుమూశాడు. -
సీఎం బాటలోనే మంత్రులందరూ
-
ప్రాణం నిలిపే ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీళ్లపాలు
∙వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం ∙రానున్న వేసవి కోసం సరఫరా కాకినాడ వైద్యం : వేసవిలో వడదెబ్బబారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఓరల్ రీహైడ్రేష¯ŒS సాల్ట్స్ (ఓఆర్ఎస్) ప్యాకెట్లు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కార్యాలయానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేసింది. శిథిలావçస్థకు చేరిన ఫైలేరియా భవనంలోని ఓ పాడుబడ్డ గదిలో çసుమారు 200 బాక్స్‌లలో ఉన్న ఐదు వేల పేకెట్లను పడేశారు. ఈ గదిపై ఉన్న బాత్రూమ్ నుంచి నీరు కిందకి లీకవ్వడంతో ఆ ప్యాకెట్లన్నీ తడసి ముద్దయ్యాయి. ప్రాణాన్ని నిలిపే ఈ ప్యాకెట్లు పాడవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. -
వైద్యం మెరుగయ్యేనా?
ఉత్తమ ఆసుపత్రిలో వైద్యుల కొరత పనిభారంతో డాక్టర్ల సతమతం ఏళ్ల తరబడి ఇదే తంతు స్పందించని ఉన్నతాధికారులు సరైన వైద్యం అందక రోగుల అవస్థలు మెదక్: మెదక్ ఏరియా ఆసుపత్రి వైద్య సేవల్లో ముందుంది. లక్ష్యానికి మించి డెలివరీలు చేసి రికార్డు సృష్టించింది. ప్రభుత్వం నుంచి ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు కూడా అందుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా వైద్యులు మాత్రం పనిభారంతో సతమతమవుతున్నారు. వైద్యుల పోస్టులు భారీగా ఖాళీలుండడంతో అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇంకెంత కాలంగా ఈ భారం మోయాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను భర్తీ చేస్తే మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మెదక్ ఏరియా ఆస్పత్రి డివిజన్లో పెద్దది. ఈ ఆస్పత్రిలో వంద పడకలు ఉన్నాయి. మెదక్ మండలం, మెదక్ పట్టణం, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, కొల్చారం, కౌడిపల్లి, చేగుంట, టేక్మాల్, అల్లాదుర్గం, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర 13 మండలాలకు చెందిన రోగులు వస్తుంటారు. ఇరవై ఏళ్ల క్రితమే ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అందుకనుగుణంగానే సిబ్బందిని నియమించారు. కానీ నేడు రెండింతల జనం ఆస్పత్రికి వస్తున్నారు. సిబ్బందిని సైతం దానికనుగుణంగా పెంచాల్సింది పోయి రెండు దశాబ్దాల క్రితం నియమించిన వంద పడకల సామర్థ్యానికి సరిపోను సిబ్బందే కొనసాగుతోన్నారు. ఈ ఆస్పత్రిలో మొత్తం 22మంది వైద్యులు ఉండాలి. కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. గతంతో పోలిస్తే రోగుల తాకిడి రెట్టింపైంది. వైద్యులు, సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఆస్పత్రిలో ఇద్దరు మత్తు వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన అందుబాటులో లేకుంటే రోగులను గాంధీ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలవైద్యులు ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. మరో నాలుగు మెడికల్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ ఆస్పత్రిలో ఓ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు రాజీనామా చేయగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇలా వైద్యుల పోస్టులు ఏడు ఖాళీగా ఉండటంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతుందని పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారంటున్నారు. పని ఒత్తిడిని తట్టుకోలేక ఆస్పత్రిలోని కొంతమంది వైద్యులు దీర్ఘకాలిక సెలవు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో హైరిస్క్ సెంటర్ (ప్రసూతి కేంద్రం) ఏర్పాటు చేసిన నాటినుంచి మరింత భారం పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో రోజుకు 500 నుంచి 600 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. ఇందులో ఎక్కువగా విష జ్వరాలు, పాము, కుక్కకాటు, మలేరియా, డయేరియా వంటి బాధితులు ఉంటున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 15,870 మంది ఔట్పేషెంట్లు వస్తుండగా, 1740 మంది ఇన్ పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు. రికార్డు స్థాయి డెలివరీలు రోజూ 50మందికిపైగా గర్భిణులు చికిత్స పొందుతున్నారు. సోమ, శుక్రవారాల్లో గర్భిణులకు స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేస్తుండటంతో సుమారు 250నుంచి 350మంది వస్తున్నారు. ఇంత సిబ్బంది కొరత ఉన్నా గత ఏడాది 1,500 డెలీవరీలకు గాను 2,500 చేసిన ఆస్పత్రి వైద్యులు రికార్డు సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు కూడా అందజేసింది. కానీ ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదని ఉన్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేసి మరింత మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. -
వెళ్లాల్సి వస్తే ...వలసవాది కేసీఆరే వెళ్లాలి