సాక్షి, ఖమ్మం: విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను, హోంగార్డును ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు హద్దులు దాటి ప్రవర్తించారు. (చదవండి: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి..)
అమ్మపాలెం గ్రామంలో ఓ ఫంక్షన్‌కు హజరయ్యేందుకు నలుగురు కానిస్టేబుళ్లు, హోంగార్డు బయలుదేరారు. దారిలో ఓ బెల్ట్ షాపులో ఆగారు. పుల్‌గా మద్యం సేవించి అక్కడ నానా హంగామా చేశారు. తాము కానిస్టేబుళ్లమన్న విషయాన్నే మరిచిపోయి చిందులు వేశారు. చివరకు వీరి చిందులు వేస్తున్న దృశ్యాలను స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో వీరి బండారం బయటపడింది. ఆ వీడియో వాట్సాప్ ద్వారా ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ వద్దకు వచ్చింది. విధి నిర్వహణలో ఉండి మద్యం సేవించడంపై నలుగురు కానిస్టేబుళ్లకు సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పు చేస్తే ఏంతటి వారినైన ఊరుకునేది లేదని హెచ్చరించారు.
చదవండి: పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment