
ఖమ్మం జిల్లా: చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లో మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ ఏఓ చెంపచెళ్లు మనిపించడంతో వివాదం చెలరేగింది. వివరాలు.. చింతకాని వ్యవసాయ శాఖ ఏఓ, పోలింగ్ బూత్‌లో మొదటగా మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు.
ఓటు వేసిన అనంతరం ఏఓ బయటకు వెళ్లకపోవడం, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోనట్లు వ్యవహరించడంతో మహిళా కానిస్టేబుల్ ఆయన చెంపచెళ్లు మనిపించారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికుడైన ఏఓ బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. దీంతో వివాదం మరింత ముదిరి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
పోలింగ్ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి