
సాక్షి, ఖమ్మం : ఓ స్వల్ప వివాదం పోలీసులు కాల్పుల వరకు దారితీసింది. ఈ ఘటనలో ట్రైన్ క్యాంటీన్ నిర్వాహకులు సునీల్ తీవ్రంగా గాయపడగా.. మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్ క్యాంటీన్ నిర్వాహకులకు, అదే రైలులో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మధ్య వివాదం చోటు చేసుకుంది. చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఓ కానిస్టేబుల్ క్యాంటీన్ మేనేజర్ పై తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్యాంటీన్ మేనేజర్ సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. రైలు వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే దారి మధ్యలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే తొలుత సునీల్‌ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment