GT express
-
ట్రైన్ క్యాంటీన్లో కాల్పులు.. తీవ్ర గాయాలు
సాక్షి, ఖమ్మం : ఓ స్వల్ప వివాదం పోలీసులు కాల్పుల వరకు దారితీసింది. ఈ ఘటనలో ట్రైన్ క్యాంటీన్ నిర్వాహకులు సునీల్ తీవ్రంగా గాయపడగా.. మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్ క్యాంటీన్ నిర్వాహకులకు, అదే రైలులో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మధ్య వివాదం చోటు చేసుకుంది. చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఓ కానిస్టేబుల్ క్యాంటీన్ మేనేజర్ పై తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్యాంటీన్ మేనేజర్ సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. రైలు వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే దారి మధ్యలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే తొలుత సునీల్‌ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా.. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. -
మత్తు పదార్థాలిచ్చి జీటీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
వరంగల్: రైలు ప్రయాణికుడికి మత్తు పదార్థాలు ఇచ్చి బంగారం, డబ్బు దోచుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్.శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కమ్మినేని శ్రీనివాసరావు(30) చైన్నైలోని తాజ్ హోటల్ పనిచేస్తున్నాడు. ఈ మేరకు స్వగ్రామానికి వెళ్లేందుకు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే జీటీ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి ఎక్కాడు. ఆయన విజయవాడలో అర్ధరాత్రి రైలు దిగి మరో రైలులో శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంది. అయితే, శ్రీనివాసరావు రైలు ఎక్కిన కొద్దిసేపటికే అదే బోగీలోని మరో ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు బాదం, పిస్తా పప్పులో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారు. అవి తిన్న ఆయన మత్తులోకి జారుకోగానే శ్రీనివాస్‌రావు బ్యాగులో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లతో పాటు రూ.5 వేల నగదు, బట్టలు అపహరించారు. మత్తులోకి జారుకున్న క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్ దాటిపోగా ఆయన నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉదయం అదే రైలులో వచ్చారు. ఇక్కడ రైలు ఆగినప్పుడు బాధితుడు శ్రీనివాస్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆయనను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
జీటీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్చల్
గుంటూరు : న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. గుంటూరు జిల్లా ఎడ్లపల్లి సమీపంలో ఓ మహిళా ప్రయాణికురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ లాగేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దొంగలు చైన్ లాగి రైలును ఆపి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన ఎస్కార్ట్ పోలీసులు వారిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు దుండగులు పరారీ అవుతూ రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.