వరంగల్: రైలు ప్రయాణికుడికి మత్తు పదార్థాలు ఇచ్చి బంగారం, డబ్బు దోచుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్‌పీ ఎస్సై ఎస్.శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కమ్మినేని శ్రీనివాసరావు(30) చైన్నైలోని తాజ్ హోటల్ పనిచేస్తున్నాడు. ఈ మేరకు స్వగ్రామానికి వెళ్లేందుకు చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే జీటీ ఎక్స్‌ప్రెస్లో బుధవారం రాత్రి ఎక్కాడు. ఆయన విజయవాడలో అర్ధరాత్రి రైలు దిగి మరో రైలులో శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంది. అయితే, శ్రీనివాసరావు రైలు ఎక్కిన కొద్దిసేపటికే అదే బోగీలోని మరో ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు.
ఈ సందర్భంగా వారు ఆయనకు బాదం, పిస్తా పప్పులో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చారు. అవి తిన్న ఆయన మత్తులోకి జారుకోగానే శ్రీనివాస్‌రావు బ్యాగులో ఉన్న మూడు తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లతో పాటు రూ.5 వేల నగదు, బట్టలు అపహరించారు. మత్తులోకి జారుకున్న క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్ దాటిపోగా ఆయన నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్‌కు గురువారం ఉదయం అదే రైలులో వచ్చారు. ఇక్కడ రైలు ఆగినప్పుడు బాధితుడు శ్రీనివాస్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆయనను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మత్తు పదార్థాలిచ్చి జీటీ ఎక్స్‌ప్రెస్లో చోరీ
Published Thu, Jun 23 2016 9:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement