సాయం చేయబోతే.. నగలు దోచుకెళ్లాడు | women theft by youth at ichapuram railway station | Sakshi
Sakshi News home page

సాయం చేయబోతే.. నగలు దోచుకెళ్లాడు

Published Wed, Apr 1 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

తోటి ప్రయాణికుడికి రైలు ఎక్కేందుకు చెయ్యందించి సాయం చేయబోయిన మహిళ మెడలోని ఆభరణాలను దోచుకెళ్లాడు ఓ చోరుడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

తోటి ప్రయాణికుడికి రైలు ఎక్కేందుకు చెయ్యందించి సాయం చేయబోయిన మహిళ మెడలోని ఆభరణాలను దోచుకెళ్లాడు ఓ చోరుడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.

పలాసకు చెందిన వైశ్యరాజ్ అరుణ ఒడిశా రాష్ట్రం ధరంపూర్ జిల్లా నుంచి పలాసకు ఇంటర్‌సిటీ రైలులో ప్రయాణిస్తున్నారు. ఇచ్చాపురం స్టేషన్‌లో రన్నింగ్ లో ఉన్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడికి అరుణ చేయి అందించి సాయం చేయబోయింది. అదే అదనుగా భావించిన యువకుడు ఆమె మెడలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. దీంతో మహిళ వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement