slapping officer
-
ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. ఎందుకో తెలుసా?
లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించారు బీజేపీ ఎంపీ. ప్రభుత్వ కార్యాలయంలో భూమికి సంబంధించిన పట్టాల విషయంలో ఓ రైతు వద్ద లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగిపై బీజేపీ ఎంపీ చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్జోషి (సీపీ జోషి).. ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి భూ పట్టాలకు సంబంధించి బదాయింపు విషయంలో ఓ రైతు నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేసినట్టు రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో సదురు ఉద్యోగిని పిలిపించిన ఎంపీ సీపీ జోషి.. ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో.. 15వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు ఎంపీ ఎదుట నినాదాలు చేశారు. దీంతో, రైతులు, ఉద్యోగుల ముందే లంచం అడిగిన ఉద్యోగిపై ఎంపీ చేయిచేసుకున్నారు. అయితే, డిపార్ట్మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవడం వల్ల ఆ ఎంపీపై విమర్శలు వస్తున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పోలింగ్ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి
-
మహిళా కానిస్టేబుల్‌పై దాడి
ఖమ్మం జిల్లా: చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్‌లో మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ ఏఓ చెంపచెళ్లు మనిపించడంతో వివాదం చెలరేగింది. వివరాలు.. చింతకాని వ్యవసాయ శాఖ ఏఓ, పోలింగ్ బూత్‌లో మొదటగా మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. ఓటు వేసిన అనంతరం ఏఓ బయటకు వెళ్లకపోవడం, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోనట్లు వ్యవహరించడంతో మహిళా కానిస్టేబుల్ ఆయన చెంపచెళ్లు మనిపించారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికుడైన ఏఓ బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. దీంతో వివాదం మరింత ముదిరి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : పోలింగ్ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి -
చిన్న ఉద్యోగిని కొట్టాడు.. పెద్ద పదవి పోయింది
పనాజీ: గోవాలో ఓ ప్రభుత్వాధికారిపై చేయిచేసుకున్న ప్రజా ప్రతినిధిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆయన ముమ్మాటికీ ఈ విషయంలో దోషేనని తేల్చింది. దీంతో సదరు మంత్రి తన కేబినెట్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గోవా వికాస్ పార్టీకి చెందిన గోవా గ్రామీణాభివృద్ధిమంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచేకో 2006 జూలై 15న విద్యుత్ శాఖలో కపిల్ నటేకర్ అనే జూనియర్ ఇంజినీర్‌పై అవాకులు చెవాకులు పేలుతూ చేయిచేసుకున్నారు. దీంతో సదరు ఉద్యోగి కోర్టుకెక్కగా గోవా హైకోర్టు మంత్రిని తప్పుబట్టింది. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారిపై చేయిచేసుకోవడం ముమ్మాటికీ నేరమేనని పేర్కొంటూ ఆరు నెలల శిక్షను ఖరారు చేస్తూ, రూ.1500 అపరాధ రుసుము కూడా విధించింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టు వెళ్లగా ఇన్నాళ్లపాటు వాయిదాలు పడుతూ వచ్చిన కేసు చివరికి ఆయనను దోషిగా తేల్చింది. దీంతో ఆయన తన కేబినెట్ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్‌కు రాజీనామా పంపించారు. తన పార్టీకి అపవాదు తీసుకురావొద్దనే కేబినెట్‌నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ధృవీకరించి రాజీనామాను గవర్నర్‌కు పంపించినట్లు తెలిపారు.