లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి చెంప చెల్లుమనిపించారు బీజేపీ ఎంపీ. ప్రభుత్వ కార్యాలయంలో భూమికి సంబంధించిన పట్టాల విషయంలో ఓ రైతు వద్ద లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగిపై బీజేపీ ఎంపీ చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని ప్రతాప్‌ఘడ్ జిల్లాలో బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్‌జోషి (సీపీ జోషి).. ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగి భూ పట్టాలకు సంబంధించి బదాయింపు విషయంలో ఓ రైతు నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేసినట్టు రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో సదురు ఉద్యోగిని పిలిపించిన ఎంపీ సీపీ జోషి.. ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఎంపీ సీపీ జోషి ఆ ఉద్యోగిని నిలదీస్తున్న సమయంలో.. 15వేలు లంచం అడిగినట్లు కొందరు రైతులు ఎంపీ ఎదుట నినాదాలు చేశారు. దీంతో, రైతులు, ఉద్యోగుల ముందే లంచం అడిగిన ఉద్యోగిపై ఎంపీ చేయిచేసుకున్నారు. అయితే, డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవడం వల్ల ఆ ఎంపీపై విమర్శలు వస్తున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment