kalva srinivasulu
-
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై కాల్వ శ్రీనివాస్ అసత్య ప్రచారం
-
అనంత టీడీపీలో రచ్చకెక్కిన గ్రూపు రాజకీయాలు
-
జేసీ టీడీపీలోకి వచ్చాకే గ్రూపు రాజకీయాలు పెరిగాయి
-
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు గురువారం ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది మార్చి నెలలో రాయదుర్గంలో ఎన్నికల అధికారులను బెదిరించిన కేసులో కాల్వ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రితో సహా 24 మంది టీడీపీ కార్యకర్తలకు అనంతపురం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కాగా గతంలో తన అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులను కాల్వ శ్రీనివాస్ బెదిరించిన విషయం తెలిసిందే. -
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ
-
టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గంలో టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ మాజీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు సోమమల్లేషప్ప, నాగప్ప, అరుడప్పలు టీడీపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయదుర్గం పట్టణ 2వవార్డు టీడీపీ అభ్యర్ధి అనుదీపిక కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వలసలతో పరువు కాపాడుకునేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ పాట్లు పడుతున్నారు. దీంతో మాజీ మంత్రి కాల్వ.. టీడీపీ అభ్యర్ధులను కర్ణాటకకు తరలించారు. సుమారు 30 మందిని రహస్య ప్రాంతాలకు తరలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవద్దంటూ పలువురు టీడీపీ అభ్యర్థులను నిర్బంధించారు. చదవండి: జగన్ మోహన్ రెడ్డి వందశాతం ఉత్తమం: కొట్టేటి శిరీష -
‘కాల్వ’ వీరంగం.. రాయదుర్గంలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఎన్నికల అధికారులపై రౌడీయిజం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లలు కలిగిన అభ్యర్థులతో ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ వేయించారు. అయితే ఎన్నికల అధికారులు దానిని తిరస్కరించారు. దీంతో తన అనుచరుల నామినేషన్‌ను ఆమోదించాలంటూ రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలోకి చొరబడి.. కాలువ శ్రీనివాస్ ఎన్నికల అధికారులపై వీరంగం సృష్టించారు. అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆయన దౌర్జన్యాలపై అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాలువ శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్ పులనాగరాజుతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాలువ శ్రీనివాస్ గూండాగిరిపై కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని ప్రభుత్వ విప్ చెప్పారు. -
పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు
-
టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం, వీడియో కలకలం
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఓటర్లను ప్రభావితం చేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఏకంగా మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లను బలవంతంగా టీడీపీకి వేయించినట్లు బయటపడుతోంది. బాధిత మహిళల వీడియో టేపులు ప్రస్తుతం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో మొత్తం ముగ్గురు అధికారుల ప్రమేయమున్నా కేవలం ఓ హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం పోలీసుశాఖలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల మహిళా పోలీసు వాలంటీర్లను ఎంపిక చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వారి సేవలను కూడా వినియోగించారు. విధుల్లో ఉండటంతో వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. అయితే రాయదుర్గం నియోజకవర్గంలో మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్లన్నీ ఏకపక్షంగా టీడీపీకి పడేలా పోలీసులు వ్యూహం రచించినట్లు తెలిసింది. రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓబుళపతి అనే హెడ్ కానిస్టేబుల్ అంతా తానై వ్యవహరించిన విషయం బయటపడింది. దీంతో ఇతనిపై రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. అతన్ని వీఆర్‌కు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయడమే కాకుండా రూ.లక్షలు ముడుపులు తీసుకొని మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బలవంతంగా టీడీపీకి వేయించారని తెలుస్తోంది. పలువురు బాధిత మహిళా వాలంటీర్లు కూడా ఏం జరిగిందనే అంశంపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో టేపులు బయటకు పొక్కడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఒక్కో వలంటీర్‌కు రూ. వెయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి లక్షల్లో పోలీసు స్టేషన్‌కు ముడుపులు వచ్చాయని, అయితే ఒక్కో మహిళా వలంటీర్‌కు పోస్టల్ బ్యాలెట్ వేయాలని రూ.1000 చొప్పున ఇచ్చినట్లు వీడియో టేపుల్లో పేర్కొన్నారు. కొంతమంది ఎదురు ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తామని బెదిరించినట్లు వాపోయారు. ఈ వ్యవహారంలో హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు మరో మహిళా కానిస్టేబుల్, ఓ ఎస్ఐ ఉన్నట్లు వీడియో టేపుల్లో బయటపడింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు మరోవైపు గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ హరికృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. హరికృష్ణ తోటలో బోర్ను సీజ్ చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు -
అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాస్ దౌర్జన్యం
-
రాయదుర్గంలో పోలీసులు అత్యుత్సాహం
-
పోలీసుల అత్యుత్సాహం.. రామచంద్రారెడ్డి ఇంట్లో సోదాలు
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి నివాసంలో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంపై రామచంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే పోలీసులు ఈ విధమైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు, పోలీసులు మంత్రి కాల్వ శ్రీనివాసులకు తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు. సోదాలు చేస్తున్న సమయంలో మీడియాను అనుమతించకపోవడంపైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కుట్రలకు పాల్పడటంపై ఆయన మండిపడ్డారు. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : టీడీపీ సర్కార్ తత్తరబాటు
-
ఐటీ గ్రిడ్స్ స్కాం : టీడీపీ సర్కార్ తత్తరపాటు
సాక్షి, అమరావతి : ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం తత్తరపాటు పడుతోంది. డేటా చోరీతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే.. తమ డేటాను తెలంగాణ పోలీసులు తస్కరించారని ఉల్టా ఆరోపణలు చేస్తోంది. పొంతనలేని సమాధానాలు చెబుతూ ప్రజల మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తమపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతుదంటూ గగ్గోలు పెడుతోంది. చోరీ చేయలేదంటూనే.. కేబినెట్ సమావేశాలు పెట్టి మరీ ఈ విషయంపై చర్చిస్తున్నారు. తమ దొంగతనాన్ని ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చడానికి నానాయత్నాలు చేస్తున్నారు. తాజాగా డేటా చోరీపై మంత్రి కాల్వ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. డేటా చోరీకి, ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పకొచ్చారు. తెలంగాణ పోలీసులే తమ డేటాను దొంగిలించారన్న మంత్రి కాల్వ.. డేటా చోరీ అయిందని అంగీకరిస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పలేక తడబడ్డారు. పొంతన లేని సమాధానం చెబుతూ నీళ్లు నమిలారు. ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే తెలంగాణ పోలీసు వైఖరిని విమర్శించారు. ఐటీ గ్రిడ్స్ సంస్థకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని మీడియా నిలదీయగా.. మంత్రి సమాధానం చెప్పలేక ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయారు. -
‘కాల్వ’కు ఎదురుదెబ్బ!
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసుకు ఎదురుదెబ్బ తగిలింది. కణేకల్ లో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో మంత్రి కాలువకు చేదు అనుభవం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి కాలువ శ్రీనివాస్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతేగానీ.. కాలువ శ్రీనివాస్‌కు మాత్రం సహకరించేది లేదని కణేకల్ టీడీపీ నేతల స్పష్టం చేశారు. -
గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక: కాల్వ
అమరావతి: రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. రేపటి నుంచి ఎన్నికల సన్నాహక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలతో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమవుతుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు బాధ్యతను తమ పార్టీ అధ్యక్షుడికి అప్పగించామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అక్కడ టీడీపీ శాఖ చూసుకుంటుందని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న టీడీపీ అగ్రనేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభించాలని భావించామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల మొదటి జాబితా ఉంటుందని, ఎన్నికల ఎత్తుగడల కోసం ఒక స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ పోలిట్‌బ్యూరో సమావేశంలో ఆంధ్రా నేతలతో పాటు తెలంగాణ శాఖకు చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. -
కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి రైతులకు సాయం
సాక్షి, అమరావతి: అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6 వేలతో కలిసి మొత్తం రూ.10 వేలు ఇవ్వనున్నారు. ఖరీఫ్‌లో మొదటి దశ, రబీలో రెండు దశలు మొత్తం మూడు దశల్లో ఈ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఎన్నికలు ముందు వరుసగా మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో బుధవారం మరోసారి నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 5 ఎకరాలలోపు ఉన్న 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.6 వేలను మూడు వాయిదాల్లో ఇవ్వనుందని, అది ఏమాత్రం చాలదని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అందుకే 54 లక్షల కుటుంబాలకు కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తాము రూ.4 వేలు కలిపి మొత్తం రూ.10 వేలు ఇస్తామని అన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లెక్కలోకి రాని 5 ఎకరాలకు పైగా భూములున్న రైతులు మరో 15 లక్షల మంది ఉంటారని, వారికి రాష్ట్రం నుంచే మొత్తం రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. 54 లక్షల మందికి కేంద్రం తొలివిడత ఇచ్చే రూ.2 వేలకు తాము రూ.3 వేలు కలిపి మొత్తం రూ.5 వేలు ఇస్తామన్నారు. కేంద్రమిచ్చేది తొలి విడత రూ.1,080 కోట్లుకాగా, తాము తొలి విడత (రూ.3 వేల చొప్పున) ఇచ్చేది రూ.1,620 కోట్లని వెల్లడించారు. కేంద్ర పథకం పరిధిలోకి రాని సుమారు 15 లక్షల మందికి రూ.10 వేలు రాష్ట్రం ఇస్తుంది కాబట్టి దానికి రూ.750 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. కౌలు రైతుల లెక్కలు తీసి ఖరీఫ్‌లో వారికి సుఖీభవ పథకం కింద డబ్బులిస్తామన్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు... సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేయాలని నిర్ణయం. ఫిబ్రవరి నెలాఖరులో అన్నదాత సుఖీభవ చెక్కులు పంపిణీకి చేసేందుకు ఆమోదం. కేంద్రం ప్రకటించిన రైతు పథకం పరిధిలోకి రాని రైతులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం. రైతు రుణమాఫీ కింద మిగిలినపోయిన చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయం. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు ఆమోదం. సిమ్ కార్డుతోపాటు మూడేళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం. ఏపీ వ్యవసాయ మండలి ఏర్పాటుకు ఆమోదం. వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఈ మండలి ఏర్పాటు. - పంచాయతీల్లో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపుపై నిర్ణయం. - 1998లో డీఎస్సీలో క్వాలిఫై అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయం. - 1983–96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయం. - వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం–తిరుపతి ఆధ్వర్యంలో తొమ్మిది పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, తొమ్మిది ఫిషరీస్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు ఆమోదం. - ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.1.23 కోట్లు, ఏపీ భవన్లో ఖర్చు రూ.1.60 కోట్లు) మొత్తం రూ.2.83 కోట్లకు ఆమోదం. - తిత్లీ, పెథాయ్ తుపాన్లలో నష్టపోయిన రైతులకు మిగిలిన పెండింగ్ సొమ్మును వెంటనే ఇవ్వాలని నిర్ణయం. - 78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల మంజూరుకు ఆమోదం. వీటితోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్స్, 28 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు, 28 మంది శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయం. భూ కేటాయింపులు - సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్) సంస్థకు అమరావతి కేపిటల్ సిటీ వెలుపల 10 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం. - తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి చెందిన 17.17 ఎకరాల భూమి ఉచితంగా కేటాయింపు. - విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మారుపల్లిలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి బదలాయింపు. - వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు. ఇందుకోసం 153.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు. - వైకుంఠపురం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం. అన్నదాత సుఖీభవతో రైతులకు సాయం: మంత్రి సోమిరెడ్డి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.10,000 సాయం చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం చెప్పారు. కేంద్రం ఒక్కో విడత ఇచ్చే రూ.2,000తో పాటు మరో రూ.3,000 కలిపి మొత్తం రూ.5,000 చొప్పున రెండుసార్లు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కేంద్రం ప్రకటించిన పథకం కింద రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు అర్హత సాధిస్తారని, వీరితోపాటు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారు 15 లక్షల వరకు ఉంటారని, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 చొప్పున సాయం చేస్తుందని మంత్రి ప్రకటించారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో మార్చి నెలలో రూ.4,000 కోట్లు, ఏప్రిల్‌లో మరో రూ.4,000 కోట్లు జమ చేస్తామని తెలిపారు. -
ఏయ్.. నీ అంతు చూస్తా : కాలవ శ్రీనివాసులు
సాక్షి, రాయదుర్గం (అనంతపురం జిల్లా) : కాలవ శ్రీనివాసులు..సమాచారశాఖ మంత్రి..అంతకుముందు దాదాపు పదిహేనేళ్లు జర్నలిస్టు.. ఇపుడు చూస్తున్నదీ సంబంధిత శాఖే..జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన పదవిలో ఉన్న ఆయన..విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్టును పరుష పదజాలంతో దూషించారు. ‘ఏయ్ .. వీడియో తీయొద్దువయ్యా...తమాషా చేస్తున్నావా..? నీ అంతుచూస్తా...నేను అంత మంచివాడిని కాదు’ అంటూ ‘సాక్షి’ టీవీ విలేకరి విష్ణుపై ఊగిపోయారు. ఇక నుంచి తన కార్యక్రమాలకు రావద్దంటూ హూకుం జారీ చేశారు. వివరాల్లోకవి వెళితే..రాయదుర్గం పట్టణంలోని జర్నలిస్టులకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కణేకల్లు రోడ్డులో ఇళ్లస్థలాలు ఇచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక..పాత పట్టాలు రద్దుచేసి, కొత్తపట్టాలను మంత్రి కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆ లేఅవుట్లో కొంతమంది విలేకరులకు ‘హౌస్‌ఫర్ ఆల్’ పథకంకింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ లేఅవుట్లో సౌకర్యాలను పరిశీలించేందుకు మంత్రి కాలవ ఆదివారం సాయంత్రం అక్కడికి వచ్చారు. ఇది తెలుసుకున్న సమీపంలోనే ఉన్న ఎంసీఏ లేఅవుట్ మహిళలు తాగునీటి సమస్య చెప్పుకునేందుకు ఖాళీ బిందెలతో మంత్రి వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డగించి.. వలి అనే వ్యక్తితో పాటు ఓ మహిళను మంత్రి వద్దకు పంపించారు. ‘ఏంటయ్యా ఖాళీ బిందెలతో వచ్చారు.. సమస్య చెప్పేందుకు ఒకరిద్దరు రావాలి గానీ ఖాళీ బిందెలతో వస్తావా..? ఆడవాళ్లతో నన్నే అడ్డుకోవాలని చూస్తావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను సాక్షి టీవీ రిపోర్టర్ విష్ణు చిత్రీకరిస్తుండగా మంత్రి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. ‘ఏయ్ .. ఎందుకు తీస్తున్నావ్’ అని గదమాయించారు. సార్ నీటి సమస్య చెబుతున్న విషయాన్ని తీస్తున్నా అని చెబితే ‘తీయొద్దు, ఇక కార్యక్రమాలకు సాక్షి విలేకరులు రావద్దు’ అంటూ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ‘లేనిపోనివి సృష్టిస్తున్నారు, పనికిమాలిన లం.కొ..లు మీడియాలో చేరి జర్నలిజం విలువలు తీస్తున్నారు’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. వాడికి ఎవడైనా సపోర్ట్ చేస్తే వారి అంతు కూడా చూస్తా..ఏమనుకున్నారో ఏమో? అంటూ అక్కడే ఉన్న జర్నలిస్టులనూ హెచ్చరించారు. -
‘కేంద్రం మోసాలు వివరిస్తున్నాం’
సాక్షి, అమరావతి: నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏటా ప్రజల్లోకి వెళ్తున్నామని, కేంద్రం నమ్మించి ఏపీని ఏవిధంగా మోసం చేసిందో వివరిస్తున్నామని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. రైతు బిడ్డలను సాంకేతిక నిపుణులుగా మార్చిన వైనంపై సమావేశంలో చర్చించామని తెలిపారు. మూడవ ధర్మపోరాటం రాజమహేంద్రవరం వేదికగా, నాలుగో ధర్మపోరాటం రాయలసీమ వేదికగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. వర్సిటీలు వేదికగా 10 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామదర్శినిలో ప్రతి కుటుంబాలను పలకరించినపుడు వారు పలు విషయాలు చెప్పారని, వాటిపై కూడా సమావేశంలో చర్చించామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. -
ఇళ్లు ఇవ్వకుండా రుణమెలా కట్టాలి
తుమ్మపాల (అనకాపల్లి): జిల్లాలో వుడా పరిధిలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో 276 గ్రామాల ప్రజలకు పట్టణ గృహ లబ్ధిదారులతో సమానంగా రూ.2.50 లక్షలు గృహనిర్మాణానికి మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖామంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మండలంలో శంకరం గ్రామంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప గృహసముదాయాన్ని మంగళవారం ఆయన ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. గృహనిర్మాణానికి రూ.1.60 లక్షలు బ్యాంకు రుణం మంజూరు చేయగా, ముందుగా 10వేలు బ్యాంకులో డిపాజిట్ చేశామని, మిగిలిన రూ.1.50 లక్షలు బ్యాంకు రుణం కట్టాల్సిందిగా బ్యాంకర్లు నోటీసులు కూడా జారీ చేశారన్నారు. గృహాలు అందివ్వకుండా రుణాలు ఎలా కట్టగలమని రుణ మొత్తం ప్రభుత్వమే భరించి గృహాలు మంజూరు చేయ్యాలని లబ్ధిదారులు కోరారు. మంత్రి మాట్లాడుతూ సుమారు పదెకరాల ప్రభు త్వ భూమిలో 13 ఏళ్లుగా అర్ధంతరంగా నిలిచిపోయిన గృహాలకు 9 కోట్లు వెచ్చించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. బ్యాంకు రుణం అంశం తన పరిధిలో లేనందున, రూ.1.83 లక్షలు హడ్కో నిధులపై ముఖ్యమంత్రితో చర్చించి నెలరోజుల్లో లబ్ధిదారులకు మంచి వార్త అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సత్యనారాయణపురం మేగా లే అవుట్‌కు సమీపంలో నిర్మిస్తున్న టిడ్కో భవన నిర్మాణాలను పరిశీ లించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ కార్పొరేషన్ ఎస్ఈ ప్రసాధ్, డిఈ జి.వి.రమేష్, డీఎస్పి వెంకటరమణ, తహసీల్దార్లు సత్యనారాయణ, జ్ఞానవేణి, పట్టణ సీఐ మురళి, హౌసింగ్ డిఈ ధనుంజయరావు, ఆర్‌డబ్లు్యఎస్ డిఈ ప్రసాధ్, రూరల్ ఎస్ఐ ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. -
'ఉరిశిక్ష కాదు..ఏ శిక్ష వేసినా తక్కువే'
-
నంద్యాలలో మారుతున్న పరిణామాలు
-
నంద్యాలలో వేగంగా మారుతున్న పరిణామాలు
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కాసేపట్లో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయన వారితో చర్చించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు,అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నిన్న తన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. శిల్పా చక్రపాణితో టీడీపీ నేతలు సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు, బీటెక్ రవి మంతనాలు జరిపి, బుజ్జగించే యత్నం చేశారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి కూడా శిల్పా చక్రపాణితో భేటీ అయ్యారు. కాగా శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత గత కొద్ది రోజులుగా టీడీపీ శిల్పా చక్రపాణి రెడ్డిని అనుమానిస్తోంది. పలు సందర్భాల్లో ఆయనను అవమానిస్తూ వస్తోంది. ముఖ్యంగా జిల్లాల్లో ఆయన పేరును చెడగొట్టే పనులు టీడీపీ పలుమార్లు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొనలేదు. ఇప్పటికే శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా అఖిల ప్రియల మద్య అంతర్యుద్ధం జరుగుతోంది. తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
నంద్యాల ఉప ఎన్నిక: టీడీపీలో కలకలం
-
నేడు మంత్రి కాలువ శ్రీనివాసులు రాక
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మంగళవారం కర్నూలుకు రానున్నారు. ఆరోజు వివిధ నియోజకవర్గాల్లో జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతపురం నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10.30 గంటలకు నంద్యాల చేరుకొని అక్కడ నిర్వహించే నవనిర్మాణ దీక్ష సభలో, ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం కర్నూలు చేరుకొని ఇక్కడ జరిగే నవనిర్మాణ దీక్షలో పాల్గొంటారు. -
బాబు సమక్షంలో మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం
విశాఖపట్టణం: టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యకర్తలను లోపలికి అనుమతించకపోవడంపై మంత్రి కాల్వ శ్రీనివాసులతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మంత్రి కాల్వ తన కార్యకర్తలపై వివక్ష చూపుతున్నారని వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వాసుపల్లిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం చినరాజప్ప రంగంలోకి దిగారు. -
నోరు జారి చీఫ్ విప్ పదవీ పొగొట్టుకున్న‘పల్లె’
అమరావతి: మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె రఘునాథరెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టు కూడా లేకుండా పోయింది. మంత్రి పదవి కుల సమీకరణల నేపథ్యంలో పోగా... నోరుజారి చీఫ్ విప్ పదవి పోగొట్టుకున్నట్టు మంగళవారం శాసనసభ లాబీల్లో తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణకు ముందు కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్‌గా ఉన్నారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గాన్ని ఎస్టీలలో చేరుస్తామని చంద్రబాబు నాయుడు 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అది సాధ్యపడే అవకాశం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విషయాన్నే చంద్రబాబు పల్లెకు వివరిస్తూ... ‘మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని లేదు. కానీ బోయల్ని ఎస్టీలలో చేర్చే పరిస్థితి లేదు. ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా. మీకు చీఫ్ విప్ పదవి ఇస్తా’నని చెప్పారు. దాంతో సంతృప్తి పడిన పల్లె రఘునాథరెడ్డి ఆగమేఘాల మీద సమాచార ప్రజా సంబంధాల శాఖ నుంచి మీడియాకు ప్రకటన ఇప్పించుకున్నారు. చీఫ్ విప్ పేరిట ఓ వాట్సాప్ గ్రూపును తయారు చేయించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాతే కథ చెడింది. మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వస్తుందో తనకు రహస్యంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని తన అనుచరుల వద్ద బహిర్గతం చేశారు. అది కాల్వ శ్రీనివాసులుకు తెలిసి చంద్రబాబు చెవిన పడేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పల్లెకు ప్రకటించిన చీఫ్ విప్ పదవిని కూడా పీకేశారు. అందువల్లనేనేమో మంగళవారం శాసనసభలో కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్ పాత్ర కూడా పోషించారు. -
కొత్త మంత్రులకు టీడీపీ నేతల షాక్
-
కాల్వ శ్రీనివాసులుకు అసమ్మతి సెగ
-
కొత్త మంత్రులకు టీడీపీ నేతల షాక్
కొత్తగా మంత్రి పదవులు స్వీకరించిన కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్‌బాబులకు టీడీపీ నేతలే షాకిచ్చారు. కాల్వ శ్రీనివాసులు సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కార్యక్రమానికి అసమ్మతి నేతలంతా గైర్హాజరయ్యారు. ఒక్క పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి తప్ప మిగిలిన వాళ్లు అంతా డుమ్మాకొట్టారు. సొంత జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీకే పార్థసారథి, యామినీబాల, ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి... వీళ్లెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈసారి మంత్రి పదవుల కోసం పయ్యావుల కేశవ్, బీకే పార్థసారథి చిట్టచివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు గానీ ఫలితం లేకపోయింది. దాంతో అసమ్మతి వర్గీయులంతా కాల్వ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. ఇక మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. ఐనవోలులో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు వెళ్లారు. అయితే, ఆయనను స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గీయులు అడ్డగించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించకుండా మంత్రి నేరుగా రావడం ఏంటని శ్రావణ్ మండిపడినట్లు తెలిసింది. ఆయన వర్గీయులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. -
పరిటాలకు డిమోషన్
- పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కేటాయింపు - కాలవకు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణం - శాఖల కేటాయింపుల్లో ‘అనంత’కు దక్కని ప్రాధాన్యం - జిల్లా అభివృద్ధికి దోహదం చేసే శాఖలు కాకపోవడంతో మంత్రుల్లో అసంతృప్తి! - 2004–14 మధ్య కాలంలో జిల్లా మంత్రులకు కీలక పోర్టుఫోలియోలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) కొత్తగా కేబినెట్లోకి చేరిన వారితో పాటు పాత మంత్రులకూ ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు కేటాయించారు. మంత్రి పరిటాల సునీతకు డిమోషన్ ఇచ్చారు. ఆమె ఇప్పటి వరకూ చూస్తున్న పౌరసరఫరాల శాఖను తప్పించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన కాలవ శ్రీనివాసులుకు సమాచార, పౌరసంబంధాల శాఖతో పాటు గ్రామీణ గృహనిర్మాణ శాఖను కేటాయించారు. సమాచార శాఖను ఇదివరకూ పల్లె రఘునాథరెడ్డి చూశారు. ప్రస్తుతం ‘అనంత’ మంత్రులకు కేటాయించిన శాఖలు అంతగా ప్రాధాన్యత లేనివే. ‘అనంత’ లాంటి కరువు జిల్లాకు, పైగా 2014 ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టిన జిల్లాకు చంద్రబాబు కేటాయించిన శాఖలు చూస్తే జిల్లా అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదన్న విషయం ఇట్టే తెలుస్తోందని పలువురు అంటున్నారు. అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష ప్రాంతం. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. పారిశ్రామిక అభివృద్ధిలోనూ నిర్లక్ష్యానికి గురైంది. ఇలాంటి జిల్లాపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. కానీ టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లా మంత్రులకు మంచి శాఖలు కేటాయించకుండా ఎప్పుడూ అన్యాయమే చేస్తోంది. 1999–2004 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక మంత్రి పదవిని జిల్లాకు కేటాయించారు. నిమ్మల కిష్టప్పను మంత్రిగా చేసి ఏమాత్రమూ ప్రాధాన్యత లేని పశుసంవర్ధక, చేనేత, జౌళిశాఖలను కేటాయించారు. ఆ ఐదేళ్లలో జిల్లా అభివృద్ధికి మంత్రిగా కిష్టప్ప చేసింది, బాధ్యతగా ప్రభుత్వం చేసేందీ ఏమీ లేవు. తీవ్ర కరువుతో జిల్లా వ్యాప్తంగా తినేందుకు తిండిలేక గ్రామీణ ప్రాంత ప్రజలు గంజి కేంద్రాలను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం జిల్లాకు ఎలాంటి సాయమూ చేయలేదు. ఆపై 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 8 కాంగ్రెస్, 6 టీడీపీ దక్కించుకున్నాయి. అధికస్థానాలు గెలిపించినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు మంత్రి పదవులను జిల్లాకు కేటాయించి.. కీలకశాఖలను కట్టబెట్టారు. రఘువీరారెడ్డికి వ్యవసాయ శాఖను, జేసీ దివాకర్‌రెడ్డికి పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. 2009లోనూ వైఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘువీరారెడ్డిని అదేశాఖలో కొనసాగించారు. అనివార్య కారణాలతో జేసీని తప్పించారు. ఆపై రోశయ్య సీఎం అయిన తర్వాత అదే కేబినెట్‌ను కొనసాగించారు. వైఎస్ హయాంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సురెన్స్‌తో పాటు వ్యవసాయపరంగా జిల్లాకు మంచి ప్రయోజనం కలిగింది. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రఘువీరారెడ్డికి రెవెన్యూ శాఖను కేటాయించారు. శైలజానాథ్‌ను కేబినెట్లోకి తీసుకుని విద్యాశాఖను ఇచ్చారు. టీడీపీ హయాంలో మళ్లీ అన్యాయమే.. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె రఘునాథరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఐటీ శాఖను కేటాయించారు. దీని నిర్వహణలో పల్లె ఘోరంగా విఫలమయ్యారు. జిల్లాకు సంబంధించి ఒక ఎంఓయూ కూడా తీసుకురాలేకపోయారు. సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీసంక్షేమ శాఖలు కూడా ‘పల్లె’ వద్దె ఉండేవి. ఆయన పనితీరు బాగోలేకపోవడంతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనమూ ఒనగూరలేదు. పరిటాల సునీతకు ఇంతకుముందు పౌరసరఫరాల శాఖ కేటాయించారు. సంక్రాంతి కానుక, రంజాన్‌తోఫా, క్రిస్మస్ కానుకల్లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు పలుసార్లు వచ్చాయి. పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ శాఖ వల్ల జిల్లాకు మేలు కలగడం కంటే వ్యక్తిగతంగా పరిటాల కుటుంబానికి ప్రయోజనం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పరిటాల సునీతకు డిమోషన్ ఇచ్చి స్త్రీ, శిశుసంక్షేమ శాఖను కేటాయించారు. చీఫ్‌విప్ నుంచి మంత్రిగా ప్రమోషన్ పొందిన కాలవ శ్రీనివాసులుకు సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణశాఖ కేటాయించారు. మూడేళ్లలో గృహనిర్మాణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఒక్క ఇల్లూ నిర్మించలేదు. పట్టణ గృహనిర్మాణశాఖ మంత్రి నారాయణ వద్దే ఉంచారు. పోతే సమాచార, పౌరసంబంధాల శాఖ వల్ల కూడా జిల్లాకు ఒరిగేదేమీ లేదు. ‘అనంత’పై తనకు అలివిమాలిన ప్రేమ ఉందని పదేపదే వల్లెవేసే చంద్రబాబు శాఖల కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి చూపారని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. టీడీపీలో మాత్రం ప్రస్తుత శాఖల కేటాయింపుపై సంతోషం వ్యక్తమవుతోంది. సునీతకు డిమోషన్ ఇవ్వడంతో పరిటాల వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. తమకు కాకుండా కాలవకు మంత్రి పదవి కేటాయించడంపై రగిలిపోతున్న సీనియర్లు.. ఆయనకు కేటాయించిన శాఖలను చూసి ..‘తగినశాస్తి జరిగింది. ఇలాంటి శాఖలు ఉండే మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత?’ అని తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. -
పల్లె ఔట్.. కాలవ ఇన్
చివరి నిమిషంలో చాంద్‌కు చేజారిన అవకాశం – కాలవకు మంత్రి పదవి కట్టబెట్టడంతో మెజార్టీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల్లోనూ వ్యతిరేకత – పార్టీకోసం శ్రమించిన బీకే పార్థసారథి, పయ్యావులకు చంద్రబాబు మొండిచేయి – సిసలైన కార్యకర్తలను గుర్తించడంలో అధిష్టానం విఫలమైందని పెదవివిరుపు – ‘అనంత’ టీడీపీలో చిచ్చురేపుతోన్న మంత్రివర్గ విస్తరణ (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై చంద్రబాబు వేటు వేశారు. చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులుకు పదోన్నతి కల్పించి కేబినెట్లో చోటు కల్పించారు. పార్టీ కోసం సుదీర్ఘంగా శ్రమించిన తమకు మంత్రి పదవి లభిస్తుందని బీకే పార్థసారథి, పయ్యావుల కేశవ్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి కాకుండా ‘రిజర్వేషన్ల’ పేరుతో రాజకీయం చేసేవారికి మంత్రి పదవి కట్టబెట్టడంపై బీకే, కేశవ్ తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ‘అనంత’లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కాలవకు పదోన్నతి కల్పించడంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్గ విభేదాలతో జిల్లాలో బలహీనపడిన టీడీపీలో తాజా మంత్రివర్గ విస్తరణ చిచ్చురేపుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 12 అసెంబ్లీస్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి అధికారం దక్కిన తర్వాత పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు చంద్రబాబు కేబినెట్లో చోటు కల్పించారు. అయితే వీరిద్దరి పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవులు అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా, ఆర్థికంగా లబ్ధి పొందడం మినహా పార్టీ బలోపేతానికి వీరు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరినీ తప్పించి కొత్తవారిని తీసుకోవాలని భావించారు. అయితే పల్లె రఘునాథరెడ్డిని మాత్రమే తప్పించి సునీతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఖాళీ స్థానంలో బీసీలకు కేటాయించాల్సి వస్తే పార్టీలో సీనియర్ నేత అయిన తనకే ప్రాధాన్యం ఉంటుందని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి భావించారు. పదేళ్ల పాటు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఉన్నతి కోసం శ్రమించానని, తనకు చోటు ఖాయమనుకున్నారు. ఇదే క్రమంలో 2004–14 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా జిల్లాలో పార్టీ ఉన్నతి కోసం పాటుపడిన వారిలో తాను కూడా ఉన్నానని, 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతోనే మంత్రి పదవి దూరమైందని, విస్తరణలో తనకూ చోటు దక్కుతుందని కేశవ్ ఆశపడ్డారు. పైగా కేబినెట్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా కేశవ్‌ను నియమించడంతో విస్తరణలో తన ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ కోసం శ్రమించిన వారికి మొండిచేయి చూపించి ‘లాబీయింగ్’కే చోటు కల్పించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలవకు చోటుపై ఎమ్మెల్యేల మండిపాటు కాలవ శ్రీనివాసులు 1999 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. అనంతపురం ఎంపీగా బీసీ, బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో కాలవ శ్రీనివాసులు పేరును పయ్యావుల కేశవ్ అప్పట్లో సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో కాలవ విజయం సాధించారు. ఆపై 2004, 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూశారు. ఆపై 2014 ఎన్నికల్లో కూడా రాయదుర్గం టిక్కెట్టును కేశవ్ ఇప్పించారని చెబుతున్నారు. 2004–14 వరకు ఓడిపోయిన పదేళ్లు మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం మినహా పార్టీ అభివృద్ధి కోసం ఏ రకంగానూ కాలవ పాటుపడలేదని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కాలవకు ఓ కేడర్ లేదని, వ్యక్తిగతంగా కనీసం 500 ఓట్లను సాధించే చరిష్మా కూడా లేదంటున్నారు. ఇలాంటి వ్యక్తికి చీఫ్‌విప్‌గా చోటు కల్పించారని, అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని శిరసావహించామంటున్నారు. కానీ పని చేసిన వారికి న్యాయం చేయాల్సిన సమయంలో చంద్రబాబు రిజర్వేషన్లను సాకుగా చూపి తమకు మొండిచేయి చూపారని కేశవ్, పార్థ తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకు ఇవ్వాల్సి వస్తే తనకంటే కాలవకు ఉన్న అర్హతలేమిటో చెప్పాలని బీకే తన సన్నిహిత ఎమ్మెల్యేతో వాపోయినట్లు తెలుస్తోంది. నిర్వేదంలో కేశవ్ మంత్రివర్గంలో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విశ్వప్రయత్నాలు చేశారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, ప్రభాకర్‌చౌదరితో పాటు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా కేశవ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకోవడంతో రాష్ట్రంలో మరో కమ్మ సామాజిక వర్గం వారికి చోటు కల్పించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది. మంత్రి పరిటాల సునీతను దాదాపు మూడేళ్లపాటు కొనసాగించారని, పార్టీ కోసం శ్రమించినా తనకూ రెండేళ్లు అవకాశం ఇవ్వలేరా? అని కేశవ్ సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంత శ్రమించినా ఫలితం లేదన్నపుడు, ఎందుకు పార్టీ ఉన్నతి కోసం పాటుపడాలని కేశవ్ వారితో వేదనపడ్డారని తెలుస్తోంది. విస్తరణలో పార్టీ సమన్యాయం చేయకపోగా పార్టీ కోసం శ్రమించినవారిని కాదని పత్రికా యజమానులు చెప్పిన వారికి చోటు కల్పించారని, వచ్చే ఎన్నికల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మెజార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి కోల్పోయిన పల్లె రఘునాథరెడ్డికి చీఫ్ విప్ ఇస్తారని సమాచారం. అయ్యో అత్తార్ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు మైనార్టీ కోటాలో తొలుత కేబినెట్లో బెర్త్ ఖరారు చేశారు. దీంతో ‘అనంత’కు మూడు మంత్రుల పదవులు వచ్చినట్లు అయ్యింది. తనకు మంత్రి పదవి ఖరారు అయిందనే సమాచారాన్ని చాంద్‌బాషా కదిరిలోని తన కుటుంబ సభ్యులు, అనుచరులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో కదిరిలో అత్తార్ అనుచరులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో మునిగి ఉండగానే టీవీలో షాకింగ్ న్యూస్ వెలువడింది. ఆఖరి నిమిషంలో చాంద్‌బాషా స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు బీసీ కోటాలో చంద్రబాబు మంత్రి పదవి ఖరారు చేశారు. దీంతో అత్తార్ మంత్రి పదివి ఆశలు అడియాసలు అయ్యాయి. -
మావాళ్ల దాడి.. చిన్న విషయం: చీఫ్ విప్ కాల్వ
రవాణా శాఖ అధికారులపై తమ పార్టీ నాయకులు చేసిన దాడి చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాన్ని వివాదం చేయడం దారుణమని, తమవాళ్లు సారీ చెప్పారు కాబట్టి అంతా అయిపోయినట్లేనని చెప్పారు. అయితే, ఉద్యోగులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు అసెంబ్లీలో ప్రస్తావించారు. అధికారులపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు. మొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నడివీధిలో రౌడీయిజం చేశారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై స్పీకర్ ఆగ్రహం
అమరావతి: ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి ప్రశ్నకు మాట్లాడేందుకు మైక్ ఇస్తున్నారని కాల్వ బుధవారం సభలో ప్రశ్నించారు. దీంతో ఛైర్‌ను ప్రశ్నించవద్దని స్పీకర్ ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులును హెచ్చరించారు. తన అధికారాలనే ప్రశ్నిస్తావా ...సిట్ డౌన్ అంటూ కాల్వకు స్పీకర్ హితవు పలికారు. అంతేకాకుండా అందరూ దాడి చేస్తే ఎలా అంటూ కాల్వపై ఆగ్రహం చెందారు. కాగా స్పీకర్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని, తమ హక్కులను కాపాడాలని మాత్రమే స్పీకర్‌ను కోరినట్లు కాల్వ శ్రీనివాసుతు తెలిపారు. -
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగాలు
-
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రసంగాలు
అమరావతి: ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రసంగాలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఘనత తమదేనని అధికారపక్షం సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే పోలవరంపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం కూడా విజ్ఞప్తి చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యయం పెరిగిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం అయితే ఈ పాటికే ప్రాజెక్ట్ పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా భూ సేకరణ కష్టతరం అయ్యిందన్నారు. పోలవరం ఏడు దశాబ్దాల కల.. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ...‘పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏడుదశాబ్దాల కల. ప్రాజెక్ట్ పూర్తయిన రోజు ఏపీలో ఏ మూల కూడా కరువు అనేది ఉండదు. పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్. గత ప్రభుత్వాలు మట్టిపనులు చేయడానికి తాపత్రయపడ్డారు తప్ప, పోలవరం నిర్మించాలనే ఆలోచనే చేయలేదు.’ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దటానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. రాయలసీమ భవిష్యత్‌ను మార్చే పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. కరువురహిత రాష్ట్రంగా ఏపీ.. కాగా ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చంద్రబాబు కృషి చేశారని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. పోలవరంతో ఏపీ కరువు రహిత రాష్ట్రంగా మారుతుందన్నారు. -
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు కుదరదు
చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలను పొడిగించలేమని ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. బీఏసీ సమావేశం నిర్ణయానికి విరుద్దంగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగం బాగుందని చెప్పారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, ఎ.నాగేశ్వర్‌రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, కేఏ నాయుడు, కాగిత వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు. -
చేతులు కాలాక..
- హెచ్చెల్సీ కోటా అయిపోయాక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హడావుడి - డెడ్ స్టోరేజీ సమయంలో అదనపు నీటి కోసం కసరత్తు - టీబీబోర్డుకు లేఖ రాసిన చీఫ్ విప్ కాలవ - ముందే మేల్కొని ఉంటే ప్రయోజనం ఉండేదంటున్న నిపుణులు అనంతపురం సెంట్రల్ : కరువు పారదోలతానంటూ ఆగస్టు చివర్లో జిల్లాకు వచ్చి హడావుడి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే సమయంలో కేసీ కెనాల్ డైవర్షన్ కోటా నీటిని కర్నూలుకు మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై నోరెత్తని టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి వచ్చిన సమయంలో అదనపు కోటా కోసం లేఖలు రాయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. 22.6 టీఎంసీలు వస్తాయని మొదట్లో అంచనా వేశారు. చివరకు 10 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. దీంతో ఽనీటి పంపిణీ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఆయకట్టు కింద పంటలను నిషేధించారు. ముందస్తుగా సాగు చేసుకున్న అరకొర పంటలను కాపాడటమే అధికారులకు గగనంగా మారింది. ఈ సమయంలో కేసీ కెనాల్ డైవర్షన్ కోటా నీరు కొంత వరకు ఆదుకుంటుందిలే అని అధికారులు భావించారు. అయితే.. సీఎం నిబంధనలకు విరుద్ధంగా ఈ నీటిని కర్నూలు జిల్లాకు మళ్లిస్తూ జీవో విడుదల చేశారు. ఈ విషయంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేసినా.. అధికారపార్టీ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదు. డెడ్‌స్టోరేజీకి నీటిమట్టం తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 24 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరో నాలుగు టీఎంసీలు తగ్గిపోతే హెచ్చెల్సీకి నీళ్లు ఎక్కవు. ఇవి తగ్గిపోవడానికి కూడా రెండు,మూడు రోజులకు మించి పట్టదు. ఆ తర్వాత ఎల్ఎల్సీ, బళ్ళారి జిల్లా రైతులు మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చెల్సీకి అదనంగా నీళ్లు విడుదల చేయాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లేఖలు రాయడం మొదలుపెట్టారు. నీళ్లు ఉన్నప్పుడే ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతి అమలు చేసి ఎక్కువ నీళ్లు రాకుండా చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన కేసీ కెనాల్ డైవర్షన్ కోటాను మళ్లించారు. ఇప్పుడు అంతా అయిపోయాక నీళ్ల రాజకీయం మొదలు పెట్టారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ముగిసిన హెచ్చెల్సీ కోటా : శేషగిరిరావు, ఎస్ఈ, హెచ్చెల్సీ హెచ్చెల్సీకి దామాషా ప్రకారం నికర జలాల కోటా బుధవారంతో పూర్తయ్యింది. ఇప్పటి వరకూ 10.1 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి. అదనంగా నీటిని విడుదల చేయాలని బోర్డు అధికారులకు లేఖ రాశాం. కేసీ కెనాల్ వాటా దామాషా ప్రకారం 3 టీఎంసీలు ఇవ్వాలి. అయితే..ఇప్పటికే కర్నూలుకు దాదాపు 2.6 టీఎంసీలు విడుదల చేశారు. మిగిలిన నీటిని జిల్లాకు ఇవ్వాలని పట్టుబడుతున్నాం. ఈ నీళ్లొస్తే ఈ నెల 17వరకూ హెచ్చెల్సీకి విడుదలవుతాయి. లేదంటే బుధవారంతోనే నీటివిడుదల ముగిసిపోయినట్లే. -
'ఏ అంశంపై డిమాండ్ చేసినా.. చర్చకు సిద్ధం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మంగళవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సరిపోదని టీడీఎల్పీ భావనగా పేర్కొన్న కాల్వ.. మిగతా నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షం ఏ అంశంపై డిమాండ్ చేసినా.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అభివృద్ధి పథఖాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. -
స్పీకర్ గారికి క్షమాపణ చెప్పాలి
-
అధికార ‘కాలవ’లో ఇసుక దందా!
డ్వాక్రా మహిళల ముసుగులో దోచుకుంటున్న టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్, అనంతపురం టౌన్: తివిరి ఇసుమన (ఇసుక నుంచి) తైలంబు తీయవచ్చునో లేదో గానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నా అధికార యంత్రాంగం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తన అనుచరగణంతో సాగిస్తున్న ఇసుకదందా శనివారం రాత్రి బట్టబయలైంది. నియోజకవర్గంలో వేదవతి నది, వాగులు, వంకలను గుప్పిట్లోకి తెచ్చుకున్న శ్రీనివాసులు.. తన అనుచరులతో అక్రమంగా ఇసుకను తవ్వేస్తూ కర్ణాటకకు తరలిస్తూ రూ.కోట్లను వెనకేసుకుంటున్నారు. ఈ ఇసుక దందాపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనేకల్లు మండలం రచ్చుమర్రి శివారులోని వేదవతి నదిలో ఇసుకను తవ్వేస్తున్న ఒక జేసీబీ, ఐదు టిప్పర్లు, రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. 15 మంది కాలవ అనుచరులను అరెస్టు చేశారు. ఈ సమాచారం అందుకున్న కాలవ.. పోలీసులపై కస్సుబుస్సులాడారు. తన అనుచరులను వదిలేసి.. వాహనాలను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం వారి దోపిడీకి, వంతపాడటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ‘పచ్చదండు’ రెచ్చిపోయి ఇసుక లూటీ కొనసాగిస్తోంది. సీసీ కెమెరాలేవీ? : అక్రమాలను నిరోధించడం, పారదర్శకంగా ఇసుక రవాణా సాగేందుకు వీలుగా ప్రతి క్వారీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఎక్కడా వాటిని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తమ పార్టీ నేతల దోపిడీకి దన్నుగా ఉండేందుకే వీటిని ఏర్పాటు చేయడంలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ ఆదాయానికంటే 20 రెట్లు అధికం.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం (ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో) ఇప్పటి వరకూ 1.07 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయం ద్వారా రూ.653.25 కోట్ల ఆదాయం వచ్చింది. అధికార పార్టీ నేతలు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలించి విక్రయించడం ద్వారా హీనపక్షం రూ.12 వేల కోట్లు కొల్లగొట్టారని అధికార వర్గాలు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అంటే.. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే కనీసం 20 రెట్లు అధికంగా టీడీపీ నేతలు దండుకున్నట్లు తెలుస్తోంది. అడ్డొస్తే దాడులే... * పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి యత్నించిన తహశీల్దారు వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఆయననే వెనుకేసుకొస్తూ తహశీల్దారు చర్యలను తప్పుబట్టడం, కేబినెట్ వంతపాడటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. * తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు నేతృత్వంలో సాగుతున్న ఇసుక దందాను అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై టీడీపీ కార్యకర్తలు ఏకంగా దాడికి పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోయారు. * తాజాగా.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం రచ్చుమర్రిలో వేదవతి నదిలో ఇసుకను తవ్వుతున్నారని వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కణేకల్లు ఇన్‌ఛార్జి ఎస్.ఐ. శేఖర్ తన సిబ్బందితో ఇసుక క్వారీలో దాడులు నిర్వహించి అయిదు టిప్పర్లు, రెండు లారీలు, ఒక జేసీబీని సీజ్ చేసి 15 మందిని అరెస్టు చేశారు. ఇది తెలిసిన చీఫ్ విప్ కాలువ ఆగ్రహోదగ్రుడయ్యారు. వాహనాలను, అరెస్టు చేసిన వారిని వదిలేయాలంటూ పోలీసు అధికారులకు హుకుం జారీ చేశారు. దోపిడీకి సాక్ష్యాలివీ... * శ్రీకాకుళంజిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి సోదరుడు నాగావళి నదిలో అనధికారికంగా ఇసుక రీచ్‌లను నిర్వహిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రేయింబవళ్లు లారీలు, టిప్పర్లతో ఇసుకను విశాఖపట్నానికి తరలిస్తున్నారు. రోజుకు హీనపక్షం రూ.20 లక్షలకు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ఓ తహశీల్దారును కీలక ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో బెదిరించారు. * తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో యనమల కృష్ణుడు నేతృత్వంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుకను కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు తరలిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. * పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాలో మెజారిటీ ఇసుక క్వారీలను బినామీ పేర్లతో నిర్వహిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. * కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు సన్నిహితుడైన ఒక మంత్రి ఇసుక మాఫియాకు దిశానిర్దేశం చేస్తూ పర్సంటేజిలు తీసుకుంటున్నారు. ఆయన మాట వేదంగా సాగుతోంది. * గుంటూరు జిల్లాలో స్వయంగా ఒక మంత్రి ఇసుకాసురుడిగా మారిపోయారు. పేరు డ్వాక్రా సంఘాలదైనా పెత్తనం, నిర్వహణ మొత్తం మంత్రి, ఆయన భార్యదే. * కర్నూలు జిల్లాలో కీలక ప్రజాప్రతినిధి సోదరులు నిత్యం వందలాది లారీల ఇసుకను బెంగళూరు, హైదరాబాద్‌లకు తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. * అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని వేదవతి నదిని ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు చెరబట్టారు. తన అనుచరగణంతో అడ్డగోలుగా రేయింబవుళ్లు ఇసుకను తవ్వించి బళ్లారికి తరలించి సూట్ కేసులు నింపుకుంటున్నారు. ఇదే జిల్లాలో ‘బ్రదర్స్’గా ప్రసిద్ధికెక్కిన ప్రజాప్రతినిధులు పెన్నానదిని గుండుగుత్తగా కబ్జా చేసేశారు. పొక్లెయిన్లతో తవ్వి రాత్రింబవుళ్లు క్వారీల వద్దే క్యూబిక్ మీటరు రూ.3,500 నుంచి రూ.4,000 ధరతో విక్రయిస్తున్నారు. * చిత్తూరు జిల్లా సీఎం నియోజకవర్గం కుప్పంలో పాలారు నదిని టీడీపీ నేతలు ఆక్రమించి అడ్డగోలుగా ఇసుక తవ్వి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మహిళా సాధికారత పేరుతో.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత పేరుతో ఇసుక క్వారీలను డ్వాక్రా మహిళా సంఘాలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. 356 ఇసుక క్వారీలను అధికారికంగా లీజుకిచ్చినట్లు ప్రకటించింది. అనధికారింగా వెయ్యికిపైగా క్వారీల్లో టీడీపీ నేతలు తవ్వకాలు సాగిస్తూ లూటీ చేస్తున్నారు. పర్మిట్లు లేకుండా, రాయల్టీ చెల్లించకుండా ఇసుక తరలించి విక్రయించడం ద్వారా రూ.వేలకోట్లు కొల్లగొడుతున్నారు. డ్వాక్రా మహిళల పేరిట లీజుకిచ్చిన 356 ఇసుక క్వారీల్లోనూ 90 శాతం టీడీపీ ప్రజాప్రతినిధుల చేతిలోనే ఉన్నాయి. ఒకే పర్మిట్‌పై 30కిపైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి క్యూబిక్ మీటరు రూ.3,500 నుంచి రూ.4,000 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
'కాల్వ శ్రీనివాసులుపై కేసు నమోదు చేయాలి'
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులు తీరును తప్పుబట్టారు. ఇసుక అక్రమ రవాణాకు వత్తాసు పలుకుతూ కాల్వ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని కాపు ధ్వజమెత్తారు. ఏపీలో రెవెన్యూ అధికారులకు రక్షణ లేదని చెప్పారు. కణేకల్ ఇసుక అక్రమ రవాణా కేసులో కాల్వ శ్రీనివాసులపై కేసు నమోదు చేయాలని కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. -
రాయదుర్గంలో టీడీపీ నేతల బరితెగింపు
-
'బొత్స సవాల్‌ను స్వీకరిస్తున్నాం'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చేసిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని టీడీపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం కాల్వ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అంతకుముందు యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలకు కౌంటర్‌గా వైఎస్ఆర్ సీపీ.. చంద్రబాబుకు, టీడీపీకి 23 ప్రశ్నలు సంధించింది. ఇవి వాస్తవమో కాదో చెప్పాలని బొత్స సవాల్ విసిరారు. ఆవేదనతో తమ పార్టీ నాయకులు కొందరు గవర్నర్ నరసింహన్‌పై వ్యాఖ్యలు చేశారని, వాటిని వెనక్కు తీసుకుంటున్నామని కాల్వ చెప్పారు. తాము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని అన్నారు. -
వైఎస్ఆర్సీపీ నిర్ణయం అభినందనీయం: కాల్వ
ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేని చోట్ల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అయితే.. కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీకి తగినంత బలం లేకపోయినా ఎందుకు పోటీకి నిలబడ్డారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తగినంత బలం లేకపోయినా పోటీకి దిగడం.. ఓటుకు నోటు కుంభకోణం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా ఆసక్తికరంగా మారింది. -
2001 నుంచే అక్కడున్న సంగతి తెలీదా?
హైదరాబాద్ : ప్రతిపక్షంతో సమన్వయం సాధించుకుంటూ అసెంబ్లీలో చర్చను కొనసాగించాల్సిన ప్రభుత్వమే... బెదిరింపు ధోరణులకు పాల్పడటం టీడీపీ ప్రభుత్వానికే చెల్లింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుకోవటమే కాకుండా అవాస్తవాలను సభలో ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సతీమణి విజయమ్మతో వ్యక్తిగత సంభాషణలు చేసిన విషయాలను కొణిజేటి రోశయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటూ కాల్వ శ్రీనివాసులు తీసుకొచ్చిన ప్రస్తావన అసెంబ్లీలో గందరగోళానికి దారి తీసింది. ప్రియతమ నేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ వైఎస్ జగన్ చెబుతున్నారని... అలాంటి ఆయన కన్నతండ్రే... వైఎస్ జగన్‌తో వేగలేకపోతున్నామని, అతడిని బెంగళూరు నుంచి హైదరాబాద్ రాకుండా చూసుకోవాలన్నారని, జగన్ ఇక్కడకు వస్తానంటే ఎలా వద్దని చెబుతామని వైఎస్ విజయమ్మ... రోశయ్యతో అన్నట్లు కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు పలికారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2001 బెంగళూరులో ఉంటున్నారన్న విషయాన్ని కాల్వ శ్రీనివాసులు కావాలనే విస్మరించారు. ఆయన తానా అంటే... తాము తందానా అంటూ మంత్రులు రావెల కిశోర్ బాబు ఓ వైపు... అచ్చెన్నాయుడు మరోవైపు తిట్ల పురాణం అందుకున్నారు. కేవలం వైఎస్ జగన్‌ను విమర్శించేందుకే అన్నట్టు అధికార పక్ష సభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. -
'ప్రభుత్వం చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవు'
-
'ప్రతిపక్షం సలహాలిస్తే పరిశీలిస్తాం'
హైదరాబాద్: ప్రభుత్వంలోని ప్రతిపక్షం సలహాలిస్తే.. పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ సీపీ సలహాలిస్తే తాము తప్పకుండా పరిశీలిస్తామన్నారు. చట్టాలను జనరల్ గా చేస్తారని.. తరువాత దానికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేస్తారన్నారు. మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టిన అంశాలు ప్రభుత్వం చెప్పిన వాటిలో లేవని జగన్ స్పష్టం చేయగా.. చంద్రబాబు తన అసహనం వ్యక్తం చేశారు. ఎవరైనా మాట్లాడితే రూల్స్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. మంత్రి నారాయణ ఏదో నేరం చేసినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మంత్రి చెప్పినవన్నీ రూల్స్ పరిధిలోకి వస్తాయని బాబు తెలిపారు. -
'ప్రభుత్వం చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవు'
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం శాసససభలో మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం జగన్ మాట్లాడారు. బిల్లులో ఒకటి.. మాటల్లో ఒకటి ఉంటే అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు మంత్రి నారాయణ చెప్పినవన్నీ సీఆర్డీఏ బిల్లులో లేవని జగన్ తెలిపారు. వైఎస్సార్ సీపీ సభ్యులకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఏ విషయమూ లేదన్నారు. ఏ విషయమూ లేకుండా చర్చలో ఎలా పాల్గొనాలని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు ఏమిస్తున్నారో ఎమ్మెల్యేలకు ఇచ్చిన 120 డాక్యుమెంట్లలో అయితే లేవని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
సవాల్‌కు దీటుగా స్పందించిన వైఎస్ జగన్
-
సవాల్‌కు దీటుగా స్పందించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా జరిగింది. రైతుల ఆత్మహత్యల అంశంలో చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటే నిరూపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ప్రతిపక్షాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకోవాలని ఆయన సవాల్ విసిశారు. దీనిపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీటుగా స్పందించారు. 'యావత్ టీడీపీ పార్టీకే..సవాల్ విసురుతున్నా...ఇప్పుడు ఎన్నికలకు వెళ్దాం, అందుకు సిద్దమేనా' అని ప్రతి సవాల్ విసిరారు. -
'అనంతను కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి'
హైదరాబాద్: రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలోని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురంలో ఏర్పడిన కరువు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదర్భ, బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కాల్వ అన్నారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించడం వలన జిల్లా ప్రజలు సమస్యల నుంచి గట్టేక్కుతారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన చీఫ్ విప్ కాల్వ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కలిశారు. రాష్ట్ర విభజన అనంతర సమస్యలపై అసెంబ్లీలో 344 నిబంధన కింద టీడీపీ నోటీసుపై సభలో చర్చిద్దామని కాల్వ శ్రీనివాసులు కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిద్దామని ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. అయితే, ఈ అంశం మీద సమగ్రంగా చర్చించాల్సి ఉంటుందని, హడావిడిగా చర్చ వద్దని వైఎస్ జగన్ అన్నారు. అందువల్ల మరో రోజు ఈ అంశంపై చర్చిద్దామని కాల్వ శ్రీనివాసులుకు వైఎస్ జగన్ సూచించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన, విష్ణుకుమార్, తలసాని
హైదరాబాద్ : సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా.. తమకు కేటాయించిన సమయంలో కాస్తంత ప్రతిపక్ష నేతకు ఇవ్వాలని బిజెపి సభ్యుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు సూచించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యానించడంతో.. ఆయన కూడా గట్టిగానే బదులిచ్చారు. తానేం మాట్లాడుతున్నానో తనకు తెలుసని విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతకు ముందు అసెంబ్లీ చాంబర్లో వైఎస్ జగన్‌ను విష్ణుకుమార్ రాజు కలిశారు. మరోవైపు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. కాగా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఈరోజు ఉదయం వైఎస్ జగన్‌ను ఆయన ఛాంబర్లో సమావేశం అయ్యారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. -
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
-
సోమవారం నుంచి ఏపి శాసన మండలి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో మండలి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు సహా పలు మూడు బిల్లులపై చర్చించనట్లుగా తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలు సోమ, మంగళవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుందన్నారు. మూడు తీర్మానాలు, ఒక బిల్లు సభలో ప్రవేశపెడతామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు సంతాపం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలలకు అభినందన తీర్మానం, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాపై తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగుల వయో పరిమితి బిల్లును ప్రవేశపెడతామని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. -
డిప్యూటీ స్పీకర్ గా గొల్లపల్లి సూర్యారావు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం అయిద గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు ఖరారు అయ్యింది. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్‌గా కాలువ శ్రీనివాసులు పేరు ఖరారు కాగా, మరో ముగ్గురు విప్ లపై టీడీపీ కసరత్తు చేస్తోంది. విప్ లుగా బొండా ఉమా మహేశ్వరరావు, కూన రవికుమార్, జయనాగేశ్వరరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఏకే జవహర్ పేర్లు పరిశీలిస్తోంది. -
కోడ్ ఉల్లంఘించిన కాల్వ శ్రీనివాసులు
అనంతపురం : రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా బీసీరేహల్లో శివలింగస్వామి ఆలయంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ...కోడ్ ఉల్లంఘించిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు మహిళా సంఘాలతో పాటు సామాన్య, మధ్య తరగతికి చెందిన మహిళలను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. విందు ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళా సంఘాల సభ్యులు, ఇతర మహిళలకు బిర్యానీతో పాటు విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్కరికి రూ.100 నగదుతో పంచిపెట్టారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తారని నమ్మబలికారు.