వైఎస్ జగన్ను కలిసిన, విష్ణుకుమార్, తలసాని | Talasani srinivas yadav, bjp mla vishnukumar raju meets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన, విష్ణుకుమార్, తలసాని

Published Tue, Aug 26 2014 2:35 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ను కలిసిన, విష్ణుకుమార్, తలసాని - Sakshi

వైఎస్ జగన్ను కలిసిన, విష్ణుకుమార్, తలసాని

హైదరాబాద్ : సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా.. తమకు కేటాయించిన సమయంలో కాస్తంత ప్రతిపక్ష నేతకు ఇవ్వాలని బిజెపి సభ్యుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు సూచించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యానించడంతో.. ఆయన కూడా గట్టిగానే బదులిచ్చారు. తానేం మాట్లాడుతున్నానో తనకు తెలుసని విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతకు ముందు అసెంబ్లీ చాంబర్‌లో వైఎస్ జగన్ను విష్ణుకుమార్ రాజు కలిశారు.

మరోవైపు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వైఎస్ జగన్ను కలిశారు. జగన్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. కాగా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఈరోజు ఉదయం వైఎస్ జగన్ను ఆయన ఛాంబర్లో సమావేశం అయ్యారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement