vishnukumar raju
-
బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజుకు షోకాజ్ నోటీస్?
సాక్షి విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో విష్ణుకుమార్ రాజు సంబంధం లేని వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. పార్టీవర్గాల కథనం ప్రకారం.. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసు జారీ చేసింది. వ్యాఖ్యలపై ఆదివారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే సస్పెన్షన్‌కు గురికావలసి వస్తుందని హెచ్చరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై అసత్య ఆరోపణలు, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి పిలవకపోయినా పిలిచినట్లు ప్రస్తావిస్తూ అబద్ధపు మాటలు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తంచేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. -
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సభ జరగలేదు : ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
-
‘ఇంతకీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?.. టీడీపీనా.. బీజేపీనా..’
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారు..? ఇంతకీ మీది టీడీపీనా..? బీజేపీనా..? ప్రజలకు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడే మైక్ బీజేపీది.. మాట టీడీపీదని... అలాగే మాట్లాడే ఆఫీస్ బీజేపీది.. అజెండా టీడీపీదని ఎద్దేవా చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో కేకే రాజు మాట్లాడారు. చదవండి: సబ్బం హరి ఆస్తులు సీజ్! నా జెండా.. అజెండా వైఎస్సార్ సీపీనే అని... ఊపిరున్నంత వరకు సీఎం వైఎస్ జగనన్న వెంటేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సీటుపై, రాజకీయ భవిష్యత్‌పై బెంగలేదన్నారు. విష్ణుకుమార్ రాజుకు మాత్రం రాజకీయ భవిష్యత్‌పై బెంగ ఉంటే వైఎస్సార్ సీపీలో కార్యకర్తలా చేర్చుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉంటూ చంద్రబాబు, లోకేష్‌పై ప్రేమ ఒలకపోస్తూ జ్యోతిష్యుడి అవతారం ఎత్తుతున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే సీటు కోసం రాజకీయాల్లోకి రాలేదని, సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఊపిరున్నంత వరకూ జగనన్న వెంటే నిలుస్తానని సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 2024 ఎన్నికల్లో మీరు ఏ పార్టీ నుంచి పోటీచేస్తారో సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా...? అని విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరారు. అసలు నోట్ల రద్దు, కరెన్సీ ముద్రణ అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. 22 ఏ భూములపై నిర్లక్ష్యం వహిస్తున్నామంటున్నారని... అయితే గతంలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే దుష్ప్ర చారం రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణిపై టీడీపీ, బీజేపీ నాయకులు దు్రష్పచారం చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగితే భారతమ్మపై దు్రష్పచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీ‹Ù, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, జీవీఎంసీ ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరూరా సంబరాలు
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా ప్రజలు సంబరాలతో సందడి చేస్తున్నారు. బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి నూతన జిల్లా ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరానికి వచ్చే ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్ఛాపురం, టెక్కలిలో సంబరాలు ఘనంగా జరిగాయి. పలాస డివిజన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో అభినందన సభ జరిపారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టెక్కలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సోంపేటలో పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన అభినందన సభకు హాజరైన ప్రజలు తిరుపతి జిల్లా ఆవిర్భావ నేపథ్యంలో వెంకటగిరిలో బుధవారం నిర్వహించిన కృతజ్ఞతా ర్యాలీలో వేలాది మంది భాగస్వాములయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పాదయాత్ర జరిగింది. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు పాదయాత్రలు జరిగాయి. పెదగంట్యాడలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బుచ్చెయ్యపేట మండలంలో ఎమెల్యే ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి సుమారు పది వేల మంది హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో భారీ ర్యాలీ జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు శుభపరిణామం సీతమ్మధార (విశాఖ ఉత్తర): రాష్ట్రంలో జిల్లాలను పునర్విభజించటం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. బుధవారం సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’తో మహిళలకు ఎంతో మేలు
సాక్షి, అమరావతి/సీతమ్మధార (విశాఖ ఉత్తర)/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్‌కి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం అగ్రవర్ణాల పేదలైన లక్షలాది మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్, ఏపీ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజశ్వనిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. -
విశాఖలో రాజధాని ఏర్పాటుకు మద్దతిస్తున్నా
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్నారు. అమరావతి రాజధానికి పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ గతంలోనే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి వద్దని చెప్పినా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని విమర్శించారు. రాజధాని వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. చదవండి : అమరావతి.. విఫల ప్రయోగమే మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు వికేంద్రీకరణకే మొగ్గు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ -
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హైపవర్ కమిటీ నియమాకాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. లక్ష కోట్లు ఒక ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు చదరపు గజానికి రూ. 12వేలు వెచ్చించారని, అదే విశౠఖలో అయితే రూ. 4వేలతో పూర్తయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన రూ. వందల కోట్లతో విశాఖలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గతంలోనే విశాఖను రెండో రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా సూచించిందని చెప్పారు. -
'వైఎస్ జగన్ కర్తవ్య నిర్వహణ చాలా బాగుంది'
సాక్షి, విశాఖపట్నం : రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక సంతోషకరమైనదిగా ఉందంటూ బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కాగా కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సూచించే విధంగా ఉందంటూ ప్రశంసించారు. కమిటీ ఇచ్చిన నివేదికను నిర్లక్ష్యం చేయకుండా అందరు స్వాగతించాల్సిన విషయమని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఎన్ రావుతో రాష్ట్రమంతా సర్వే చేయించారని, ఒకవేళ నివేదికకు అనుకూలంగా పనిచేస్తే త్వరలోనే ఉత్తరాంధ్ర సస్యశామలమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరుల దృష్యా ఇది అద్భుత విజయమని, ఇది ఒక్క జగన్‌కే సాధ్యమైందని ఆయన వెల్లడించారు.' విశాఖకు చెందిన వాడిగా నేను దీనిని సమర్థిస్తున్నా. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని' ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీతో కలిసి పని చేసినప్పుడు తాను రాజధానికి 35 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. కానీ మా వాదన పట్టించుకోకుండా రైతులను మభ్యపెట్టి చివరకు తాత్కాలిక భవనాలు నిర్మించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా అచ్చెనాయుడు పని చేసినప్పటికి శ్రీకాకుళం ప్రాంతం అభివృద్ధి చెందలేదని వివరించారు. వైఎస్ జగన్ మొండి మనిషి అనుకున్నా, కానీ కర్తవ్య నిర్వహణను ఫెంటాస్టిక్‌గా చేస్తున్నారని ప్రశంసించారు. -
గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గంటా 25 ఏళ్ల రాజకీయ జీవితానికి నియోజకవర్గ ప్రజలు స్వస్తి చెప్పనున్నారని అన్నారు. సోమవారం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన తాను, లేక వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మంత్రి గంటా మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఏపీలో బీజేపీకి లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశం లేదన్నారు. మూడు అసెంబ్లీ సీట్లలో గట్టిపోటీ ఇచ్చామని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీడియా ప్రశ్నించగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ కోట్లాది రూపాయాల డబ్బు ఖర్చు చేశాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. కేంద్రంలో ఇక నుంచి నరేంద్ర మోదీ వ్యతిరేక ఆటల సాగవని అన్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే బీజేపీ 280 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమితో కలిపితే ఎవరూ ఊహించని ఫలితాలు రానున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని అన్నారు. బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తున్నాయని చాలామంది బాధపడేవారు ఎక్కువయ్యారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వచ్చి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయడం రెండు రోజుల ముచ్చటలా ఉందని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి 20 సీట్లు వస్తాయని అన్నారు. తమ దగ్గర ఉన్న పక్కా సమాచారంతోనే చెబుతున్నామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. -
‘విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారు’
సాక్షి, అమరావతి : విశాఖలో జరిగిన రేవ్‌పార్టీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. దీని వెనుక మంత్రి ఘంటా శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, హోమ్ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. విశాఖను డ్రగ్స్ సిటీగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను వాడారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు బీచ్‌లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ లైసెన్స్‌లు తీసుకున్నారని విమర్శించారు. విశాఖకు చెందిన మంత్రి పేషీ నుంచి 8సార్లు ఫోన్ చేశారని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుకు మంత్రి పీఏ ఫోన్ చేసి ఒత్తిడి చేశారని తెలిపారు. టీడీపీ మంత్రే కాబట్టి సీఎం మాట్లాడటం లేదని అన్నారు. విశాఖ నార్త్‌లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆరోపించారు. సీఎం అనవసరంగా మోదీపై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. సీఎంకు అసహనం ఎక్కవైపోతోందన్నారు. -
మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ
-
మంత్రి అండదండలతోనే రేవ్ పార్టీ
సాక్షి, విశాఖపట్నం : మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఆ మంత్రి పలుకుబడితోనే రేవ్ పార్టీ నిర్వహించారని పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో పదిమంది యువతులు ఉన్నారని, కోడ్ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మంత్రి పేషీనుంచి 8ఫోన్లు ఎక్సైజ్ అధికారులకు వెళ్లాయని అన్నారు. బీచ్ ఫ్రంట్ నిర్వాహకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ధైర్యంలేదన్నారు. డీజీపీ చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి ఒత్తిడి వల్లే బీచ్‌ఫ్రంట్ నిర్వాహకులను కనీసం విచారించడం లేదన్నారు. చర్యలు తీసుకోకుంటే డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందని అభిప్రాయపడ్డారు. రేవ్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. -
‘బాబు నటన ముందు వారు ఎందుకూ పనికిరారు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నటన ముందు చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎందుకూ పనికిరారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయంలో లేకపోతే సింగిల్ టేక్‌లో క్లిక్ అయ్యేవాడన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ విపరీతంగా జరిగిందని ఆరోపించారు. భూదోపిడీపై గొడవ చేస్తే సిట్ వేశారని, సిట్ నివేదికను బయటపెట్టకూడదని జీఓ ఇచ్చి బహిర్గతం చేయలేదన్నారు. సిట్ రిపోర్ట్ బయటపెడితే పసుపుపచ్చ రంగులో ఉన్న పాములు బయటకు వస్తాయనే భయం పట్టుకుందన్నారు. రెండుసార్లు అసెంబ్లీ సమావేశాల్లో సిట్‌పై చర్చను రెవెన్యూ మంత్రి దాటవేశారని తెలిపారు. పసుపు, కుంకుమ ద్వారా ఇస్తున్న సొమ్ము.. ఓట్లను కొనుక్కోవటమేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ఏయూ గ్రౌండ్స్ ఇవ్వకపోవటం పెద్ద కుట్ర, అప్రజాస్వామికమన్నారు. ఏయూలో టీడీపీ అధికారిక కార్యక్రమాల పేరిట రాజకీయ కార్యక్రమాలను చేస్తోందని తెలిపారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. -
గోరంతకు కొండంత ప్రచారంలో టీడీపీది గిన్నిస్ రికార్డు
సాక్షి, అమరావతి: గోరంతకు కొండంత ప్రచారం చేసుకోవడంలో టీడీపీ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. ‘సామాజిక సాధికారత, సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి’ పై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచామని చెప్పుకుంటున్నారు. కానీ మరోవైపు కుటుంబంలో ఇద్దరు దివ్యాంగులు పెన్షన్ పొందుతుంటే ఒకరిని తొలగిస్తున్నారు’ అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. కాగా, పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇచ్చిన ప్రసాదమైతే అధికారపార్టీ నేతలు ప్రపంచమంతా తమ ఘనతేనంటూ డప్పు కొట్టుకుంటున్నారని విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. గురువారం శాసనసభలో నదుల అనుసంధానంపై జరిగిన చర్చ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. దీంతో విష్ణుకుమార్‌రాజు పైవిధంగా ప్రతిస్పందించారు. విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలకు మంత్రి జవహర్ అభ్యంతరం తెలిపారు. ‘డప్పు’ అంటూ ఒక కులాన్ని కించపరిచేలా విష్ణుకుమార్ మాట్లాడుతున్నాడని తప్పుపట్టారు. విష్ణుకుమార్‌రాజు బదులిస్తూ.. డప్పు కాకపోతే హర్మోనియం వాయించుకుంటున్నారంటూ చురకలంటించారు. మంత్రి ఉమా కలుగజేసుకుంటూ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కట్టట్లేదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ.. పోలవరం ప్రాజెక్టు ప్రజల హక్కు అంటూ బదులిచ్చారు. అలాగైతే పెన్షన్లు, పసుపు–కుంకుమ కూడా ప్రజల హక్కు కిందకే వస్తాయని విష్ణుకుమార్‌రాజు అన్నారు. -
టీడీపీ ప్రతిదానికీ రాజకీయం చేస్తోంది
-
‘ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారు’
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్‌పై బుధవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లుతోందని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకూమార్ రాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యలపై కేంద్ర ప్రభుత్వం గతంలో అనేకసార్లు వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు దగ్గరు పడుతుండటంతో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారని విమర్శించారు. టీడీపీ నేతల వ్యవహారం చూస్తుంటే విశాఖ రైల్వేజోన్ కూడా చంద్రబాబే ప్రకటించుకునేలా ఉన్నారని విష్ణుకూమార్ రాజు ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా మంత్రి, ఎమ్మెల్యే మాటల యుద్ధం
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశాడో సమాధానం చెప్పాలని విష్ణుకుమార్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలని విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడంలేదని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. ‘ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలుసు. అందుకే ఆయన నల్ల చొక్కా ధరించలేదు’ అని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ పోరు ఉధృతం చేశారని గ్రహించిన టీడీపీ యూటర్న్ తీసుకుందని ఎద్దేవా చేశారు. ‘మొన్నటివరకు జగన్, పవన్, బీజేపీ ఒకటి అని విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్‌పై ప్రేమ కురిపిస్తున్నారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని విమర్శించారు. -
రాష్ట్రంలో మెడికల్ ఫీజుల దోపిడీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వమే అధిక ఫీజులను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకునే పరిస్థితులు లేకుండా చేస్తోందని, రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అది మెడికల్ ఫీజులే అని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మెడికల్ అడ్మిషన్లపై బుధవారం కాలింగ్ అటెన్షన్‌పై ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఫీజులు రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని విమర్శించారు. వసూలు చేసుకోండని స్వయానా ప్రభుత్వమే జీవో ఇవ్వడం దారుణమన్నారు. చంద్రన్న బీమా అంశంపై కూడా ఆయన మాట్లాడుతూ కేంద్రం 45 శాతం నిధులిస్తున్నా మోదీ ఫొటో పెట్టకుండా కేవలం సీఎం ఫొటోనే పెట్టడం అన్యాయమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పారదర్శకంగా కౌన్సెలింగ్ చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చెయ్యలేకపోయారని నిలదీశారు. దీనికి మంత్రి యనమల సమాధానమిస్తూ ఫీజుల పెంపుపై యాజమాన్యాలు సుప్రీం నుంచి ఆర్డరు తెచ్చుకున్నాయన్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌లో 30 అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయని మంత్రి యనమల వెల్లడించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యే కలమట అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానమిచ్చారు. వేతనాలు చాల్లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు మానేస్తున్నారని, అందువల్ల రెగ్యులర్ నియామకాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని మోదీని ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నందు వల్లే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంజేజేవై)కు ఆయన ఫొటో పెట్టలేదని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజైన బుధవారం రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ (రెండవ సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ (నెం.3) బిల్లులను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
‘ఆ మంత్రికి 10సార్లు ఫోన్ చేశా.. స్పందించలేదు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర సాక్షర భారత్ పథకంలో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లెటర్ ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబ్ అన్నారు.. 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్ చేశామని తెలిపారు. అయిన ఈ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24,470 మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగలను తొలగించారు.. 8ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని.. కానీ వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. ‘600మోమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పని అని చెప్పి విమర్శలు చేస్తారేమో. 21వేల మందిని తొలగించడం ప్రభుత్వంకు తెలుసో లేదో అర్ధం కావడం లేదు. రూ. 4కోట్ల రూపాయలు 21 వేలమంది ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదా? మానవతా దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మోమోని ఉపసంహరించుకోవాలని’ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
‘దాడులు సహించేది లేదు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ నేతలు పురందేశ్వరి, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ప్రభుత్వం బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మట్లాడుతూ.. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే నవయుగ పనులు వేగవంతం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ నవయుగ సంస్థను ఢిల్లీ పిలిపించి నితిన్ గడ్కరీ చేసిన ఒత్తిడి గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ నేతలపై జరుగుతున్న దాడులను సహించేదిలేదని పురందేశ్వరి హెచ్చరించారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం : విష్ణుకుమార్ రాజు బీజేపీతో కలిసి ఓట్లు అడిగిన టీడీపీ లాభం పొందినప్పటికీ స్వప్రయోజనాల కోసం మధ్యలోనే దోస్తీకి కటీఫ్ చెప్పిన ఘనత చంద్రబాబుదేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చారంటూ బీజేపీని విమర్శిస్తున్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలపై సిట్ నివేదిక బయటపెట్టాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంపుసెట్ల విషయంలో 60 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఒక్క క్యూబిక్ మట్టికి 21 వేల రూపాయలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు 69 కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. పెన్షనర్లను బెదిరించి మరీ నవనిర్మాణ దీక్షలకు తీసుకొచ్చారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు..
సాక్షి, తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎండగట్టారు. చంద్రబాబు తిరుపతిలో చేసింది అధర్మ దీక్ష అని ఆయన విమర్శించారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విష్ణుకుమార్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు సరిపోవడం లేదని చెప్పడం దారుణం. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి ఆదరణ వస్తుండటంతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి తెలుగువాళ్లు ఓటు వేయవద్దని చంద్రబాబు చెప్పడం సరికాదు. వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకోకుండా యూటర్న్ తీసుకున్న ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు సైకోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి వల్లే బ్రిటిష్ వారితో టీడీపీ పోరాటం చేసిందంటూ తిరుపతి సభలో చెప్పారు. అన్ని వర్గాలను మభ్యపెడుతున్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీని విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, వైఎస్సార్ సీపీ, జనసేన పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తాయి. ఇప్పటివరకూ ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. తెలుగుదేశం పార్టీనే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలవదు.’ అంటూ జోస్యం చెప్పారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
సాక్షి, విశాఖ: ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. -
ప్రధానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే కేసులు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/నెల్లూరు(బారకాసు)/ సాక్షి, అమరావతి: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు ఆయన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందని శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పకపోతే, కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సీఎం చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బాలకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
హరిబాబు రాజీనామా..చేశారా.. చేయించారా?
జాతీయ పార్టీకి మూడేళ్లకుపైగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు.. ఒక దశలో కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన్ను ఊరించింది.. టీడీపీ, బీజేపీ పొత్తు పెటాకులైన తర్వాత సీను మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలోని టీడీపీ సర్కారుపై అస్త్రశస్త్రాలు సంధించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కేంద్రంపై టీడీపీ సర్కారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పలు వేదికలపై తిప్పికొట్టడానికి ప్రయత్నించిన ఎంపీ హరిబాబు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలతో ప్రత్యేక బుక్లెట్ కూడా ఆవిష్కరించారు. అంతలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. చర్చోపచర్చలకు తావిస్తోంది. రాష్ట్రంలోని టీడీపీ సర్కారు పట్ల ఆయన మెతక వైఖరితో ఉన్నారని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. అందుకనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలూ వినిపించాయి. ఈ క్రమంలో హరిబాబు విమర్శలకు వగచి తనంత తానుగా రాజీనామా చేశారా?.. అధిష్టానం చేయించిందా?? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం : బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. హరిబాబు రాజీనామా స్వచ్ఛందంగానే చేశారా? లేక చేయమని ఒత్తిడి చేశారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. మిత్రపక్షంతో చెడిన తర్వాత అధ్యక్ష మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశారని ఓ వాదన విన్పిస్తుండగా, తనపై పార్టీలో అంతర్గతంగా వస్తున్న విమర్శలు నేపథ్యంలో మనస్తాపం చెంది పార్టీ పదవికి రాజీనామా చేసి ఉంటారని మరో వాదన బలంగా విన్పిస్తోంది.ఉమ్మడి ఆంధ్రఫ్రదేశ్‌కు బీజేపీ అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి ఉండేవారు. రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోయిన తర్వాత 13 జిల్లాలకు పార్టీ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడైన కంభంపాటి హరిబాబుకు అప్పగించారు. 2014 జనవరిలో బా«ధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం గతేడాదితోనే ముగిసింది. అప్పటి నుంచి అధ్యక్ష మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో సైతం ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. టీడీపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగంపై హరిబాబును మార్చాల్సిందేనంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు పార్టీ అధిష్టానంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పేరు ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి హరిబాబుకు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలో రాజధాని నుంచి వచ్చిన పిలుపుతో హరిబాబు ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. కాగా తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీ మంత్రులు కూడా రాజీనామాలు చేయడంతో కేంద్ర కేబినెట్లో ఏపీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. సొంత పార్టీలోనే విమర్శల సెగ ఆది నుంచి సౌమ్యునిగా ముద్ర పడిన హరిబాబు ఏనాడు విపక్షాలపై కూడా ఘాటైన విమర్శలు చేసిన పాపాన పోలేదు. నాలుగేళ్ల కాపురం తెగతెంపులు చేసుకోవడంతో టీడీపీపైన, ఆ పార్టీ పెద్దలపై సొంత పార్టీ నేతలు ఓ వైపు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే హరిబాబు మాత్రం కొద్దికాలం మౌనముద్ర వహించారు. దీంతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తన సహజశైలికి భిన్నంగా ఇప్పుడిప్పుడే టీడీపీ పెద్దలపై విమర్శలు చేయడం మొదలు పెట్టినప్పటికీ హరిబాబుపై పార్టీలో విమర్శలు మాత్రం తగ్గలేదు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తక్షణమే అధ్యక్ష మార్పు చేయకపోతే రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదన ఆయన వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎంపీ హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. ఆ లేఖను గుట్టుచప్పుడు కాకుండా పార్టీ అధినేత అమిత్‌షాకు పంపడం చర్చనీయాంశమైంది. సాధారణంగా రాజీనామా చేస్తే తాను ఫలానా కారణంగా రాజీనామా చేస్తున్నానని పత్రికా ముఖంగా చెప్పిన తర్వాత ఎవరైనా సమర్పిస్తారు. కానీ హరిబాబు సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అ«ధ్యక్షునికి పంపగా.. ఆ విషయాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం పార్టీని కుదుపేస్తోంది. ఆ తర్వాత తన రాజీనామా విషయాన్ని హరిబాబు ధ్రువీకరించారు. కొలిక్కి రాకుండానే.. సాధారణంగా కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఖరారైన తర్వాత పాత అధ్యక్షునితో రాజీనామా చేయిస్తారు. పాత అధ్యక్షుడి నుంచి కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ జరుగుతోంది. కానీ ఇక్కడ కొత్త అధ్యక్షుడెవరనేది కొలిక్కి రాకుండా హరిబాబు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ పెద్దలు చేస్తున్న విమర్శలను హరిబాబు సమర్ధ వంతంగా తిప్పికొట్టలేక పోతున్నారని తక్షణమే ఆయన్ని తప్పించాలంటూ పార్టీ అధినాయకత్వంపై ఆయన వ్యతిరేక వర్గీయులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెంది తనంతట తానుగా రాజీనామా చేసి ఉంటారని పార్టీలో ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షత పదవి మార్పు అనివార్యంగా మారిన నేపథ్యంలో అధిష్టానమే గౌరప్రదంగా తప్పుకోమని సూచించి ఉండవచ్చునని ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. రాజకీయ కోణం లేదన్న విష్ణుకుమార్‌రాజు ఆది నుంచి పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు ఈ వ్యవహారంపై ఆచీతూచి స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయకోణం ఏమీ లేదంటూ ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ కోణం లేనప్పుడు ఎందుకు రహస్యంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ కొట్టిపారేశారు. కొత్త అధ్యక్షుడు కావాలంటే ఆ పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాలి కదా? అని బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర వ్యాఖ్యానించారు. హరిబాబుకు కచ్చితంగా కేబినెట్లో స్థానం లభిస్తుందన్న విశ్వాసం తమకుందని ఈ ఇరువురు నేతలు ధీమా వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే రేసులో ఉన్న సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, పురందేశ్వరిలతో పాటు తాజాగా విశాఖకు చెందిన చెరువు రామకోటయ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం వీర్రాజు, పైడికొండలలో ఎవరో ఒకర్ని ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరిబాబు రాజీనామాపై బీజేపీ స్పందన
సాక్షి, విశాఖ: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సోమవారం సాయంత్రమే రాజీనామా లేఖను పంపించారు. ఈ అంశంపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయ కోణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని కితాబిచ్చారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేయాలన్న తన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు. పట్టిసీమ అక్రమాలపై ఇతర పార్టీలు స్పందించాలి ఆయన కోరారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కంభంపాటి హరిబాబును ఎవరు ఒత్తిడి తేలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనకు అనుగుణంగానే హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. దీనికి వెసులుబాటు కల్పిస్తూనే హరిబాబు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలకు సన్నద్దం కావడానికి ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని పేర్కొన్నారు. త్వరలోనే అమిత్ షా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని తెలిపారు. -
చంద్రబాబుకు విష్ణుకుమార్ రాజు లేఖ
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు లేఖ రాశారు. సీఎం అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలపక్షానికి తాము హాజరుకావడం లేదని విష్ణుకుమార్ రాజు లేఖలో పేర్కొన్నారు. సొంత లాభం కోసమే అఖిలపక్ష భేటీ పెట్టారన్నారు. రాజకీయ ప్రయెజనాల కోసమే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. మొదట కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఇపుడు ఏపీకి కేంద్రం, ప్రధాని మోదీ అన్యాయం చేశారనడం సరికాదన్నారు. టీడీపీ ఎంపీల ధర్నాలు, సైకిల్ ర్యాలీలు చవకబారు ప్రచారమన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ కడిగేసిందని, చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు పాలన సాగిస్తోందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని స్పష్టం చేశారు. రాయలసీమకు రెండో రాజధాని ప్రకటించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
అచ్చెన్నాయుడే వినడు.. వారెందుకు వింటారు..?
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల సంఘాల సమావేశంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అఖిల సమావేశానికి రాని పార్టీలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నిర్ణయం ప్రకారం తాము సమావేశానికి హాజరు కాలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టిన అఖిల పక్షానికి తామెందుకు వస్తామన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యారని టీడీపీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ‘ వైఎస్ జగన్‌కు మేం చేబితే ఎందుకు వింటారు..? మేం చెప్పిన మాట పవన్ వింటాడా..?, మేం చెబితే అచ్చెన్నాయుడే వినడు.. వారెందుకు వింటారు..’ అని ప్రశ్నించారు. టీడీపీ హఠాత్తుగా యూటర్స్ తీసుకుందని, అందులో తాము భాగస్వామ్యం కాకుడదని సమావేశానికి రాలేదని విష్ణుకుమార్ రాజు తెలిపారు. -
పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం
-
బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం..
సాక్షి, అమరావతి : ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు. 30 పంపులు ఏర్పాటు చేస్తామని 24 పంపులే ఏర్పాటు చేశారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.1170 కోట్లు అంచనా వేసి చివరకు రూ.1487 కోట్లు చెల్లించారన్నారు. ఆధారాలు లేకుండా తాము ఆరోపణలు చేయడం లేదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని అన్నారు. దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. దీంతో మంత్రులు...విష్ణుకుమార్ రాజుపై ఎదురుదాడికి దిగారు. ఓ దశలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టిసీమపై బీజేపీ చవకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. దమ్ముంటే రాజీనామాలు చేయండి.. ఇలాగైతే ప్రజల్లోకి వెళ్లలేరని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేయడంతో...దమ్ముంటే రాజీనామాలు చేద్దాం రండి అంటూ విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. అక్రమాలకు పాల్పడకపోతే మంత్రులకు భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదని, ఆ అవసరం తనకు లేదని అన్నారు. కాగ్ నివేదికను చదివే మాట్లాడుతున్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రుల భాష సరిగా లేదు ఏపీ మంత్రుల తీరును మంత్రి మాణిక్యాలరావు తప్పుబట్టారు. పట్టిసీమపై విష్ణుకుమార్ రాజు ఆధారాలతోనే మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు తప్పు చేయకపోతే విచారణకు సిద్ధంగ కావాలన్నారు. మంత్రుల భాష సరిగా లేదని, ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే ప్రజా ద్రోహులవుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. -
బీజేపీకి కుట్రలు చేయడం తెలియదు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కుట్రలు చేయడం బీజేపీకి తెలియదని ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తాను చెప్పిన తర్వాతే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిందని, అయినా అక్రమాలు తగ్గలేదని ఆయన అన్నారు. ఇసుక రీచ్‌లలో రౌడీయిజం పెరిగిందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టకుంటే అరాచకాలు జరుగుతాయని చెప్పినా చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు. ఏసీబీ దాడులు జరిగినా.. అవినీతి ఆగడం లేదు.. తాను ఎమ్మెల్యే అయినా.. అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేశానని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏసీబీ దాడులు జరిగిన కూడా అవినీతి ఆగడం లేదంటే నేతల ప్రమేయం ఉందని అంతా అనుకుంటున్నారని ఆయన వ్యాఖానించారు. ఇంతగా అవినీతి విస్తరించినందువల్ల తాను వచ్చేసారి సభకు వస్తానో రానో తెలియదన్నారు. వచ్చే ఎనికల్లో నోటుకు ఓటేస్తారో.. నిజాయితీకి ఓటేస్తారో నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారని విష్ణుకుమార్ రాజు అన్నారు. -
చంద్రబాబూ.. అది నిజం కాదా!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పడం అవాస్తవమని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుండానే డబుల్ డిజిట్ గ్రోత్‌ను రాష్ట్రం సాధించిందా? అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వకుండానే 24 గంటల విద్యుత్ సరఫరా వచ్చిందా? అని ప్రశ్నించారు. సాంకేతికంగా సాధ్యపడదు కాబట్టే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని గతంలో చంద్రబాబు స్వాగతించిన విషయం నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలుపాలని డిమాండ్ చేశారు. -
‘సీట్ల’ పెంపు కోసమేనా మిత్రభేదం?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం–బీజేపీ పొత్తుపై సీఎం చంద్రబాబు శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంలోనూ కేంద్రంతో సర్దుకు పోయిన చంద్రబాబు అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన రాజకీయ నిర్ణయంపై తుదకంటా మిత్రపక్ష బీజేపీపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే తీవ్ర వ్యాఖ్యలకు సిద్ధపడ్డారని చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘మాతో పొత్తు వద్దనుకుంటే చెప్పండి, ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటాం. ఆ తరువాత ఎవరి మాటలు వారు మాట్లాడుకుందాం’ అన్న వ్యాఖ్యల వెనుక ఉద్దేశమిదేనని భావిస్తున్నారు. గడువు ప్రకారం మరో 15 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో అసెంబ్లీ పెంపు విషయంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మిత్రపక్షంపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నెల 29వ తేదీ నుంచి మొదలు కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలే వచ్చే ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈ సమావేశాల్లోనే కేంద్రం సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టేలా తుదకంటా బీజేపీపై ఒత్తిడి తెవాలన్నది చంద్రబాబు వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని భేటీ తర్వాత.. ప్రత్యేకహోదాపై కేంద్రంపై రాజీపడిన చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన భేటీలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్నే ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే దీనిపై ప్రధాని నుంచి స్పష్టమైన సానుకూల సంకేతాలు వెలవడలేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విభజన హామీల అమలు కోసం కేంద్రంపై సుప్రీంకోర్టుకు వెళతామని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తామంటే దండం పెట్టి అప్పగిస్తామని రెండు నెలల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యలు చేయడం కూడా అప్పట్లో పెద్ద రాజకీయ దుమారాన్నే లేపింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ అంశాలపై కేంద్ర నిర్ణయాలను టీడీపీ నేతలు మాట్లాడుతుంటే పెద్దగా పట్టించుకోని చంద్రబాబు.. అదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఇక్కడి ప్రభుత్వ వైఫల్యాలను తప్పుపడితే మాత్రం మిత్రధర్మం అంటూ ఎదురుదాడికి సిద్ధపడడాన్ని కమలం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, పోలవరం కాంట్రాక్టు పనుల్లో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడడం, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టించడం, తాత్కాలిక భవనాల పేరిట తమ వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ కమీషన్లు దండుకోవడం వంటి అంశాలపై రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు అధికార పార్టీని నిలదీస్తూ వస్తున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు వీటికి నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై నిందలు వేయడాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశాలను వారు లేవనెత్తినప్పుడల్లా చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకుల ద్వారా విమర్శలు చేయించడం, ఆ తరువాత వారిని మందలిస్తున్నట్లుగా నటించడం షరామామూలుగా మారిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల గురించి ప్రశ్నిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని రాజీనామాలు కూడా చేయించకుండా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. వారితో రాజీనామాలు చేయించాలని, అలా కాకుంటే ఏ పార్టీ నుంచి గెలిచినా ఫర్వాలేదు అధికారపార్టీలోకి తీసుకొని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చనే చట్టం చేయాలంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం అవే విమర్శలు మిత్రపక్ష నేతల నుంచే ఎదురు కావడం తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినప్పుడల్లా తెలుగుదేశం నుంచి బీజేపీ పొత్తుపై ఇలాంటి విమర్శలు సాధారణమైపోయాయని బీజేపీ నేతలు పలు సంఘటనలను ఉదాహరిస్తున్నారు. అయితే, గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా విమర్శలకు దిగడంపై కమలం నేతలు సీరియస్‌గా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్ష బీజేపీ ప్రభుత్వంపై కేసులు వేస్తాననడం పొత్తు ధర్మం అవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల అవుతున్నప్పటికీ మిత్రపక్షానికి చెందిన ప్రధాని మోదీ ఫోటోను రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథక ప్రచారంలోనైనా పెడుతున్నారా? అని నిలదీస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. జనవరి 29వ తేదీ నుంచి మొదలుకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటుందేమోనన్న ఆశల్లో ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలు ఉన్నారని కమల నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అంశాన్ని బట్టి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత టీడీపీ– బీజేపీల మధ్య మైత్రి వచ్చే ఎన్నికల్లో కొనసాగే అంశంపై స్పష్టత వస్తుందని రెండు మిత్రపక్ష పార్టీ నేతలూ చెబుతున్నారు. అడుగడుగునా వెన్నుపోట్లే... గతంలో గుజరాత్‌తో సహా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసుకోనున్నామని సోము వీర్రాజు ప్రకటించగా ఏపీలో బీజేపీ తినిపారేసే ఐస్‌క్రీమ్ పుల్లలాంటిదని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శలు చేశారు. ఈ విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దీనిపై వివాదం రేగడంతో రాజేంద్రప్రసాద్‌ను బాబు మందలించినట్లు లీకులిప్పించారు. మరో సందర్భంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తువల్లే టీడీపీకి మెజార్టీ తగ్గిపోయిందని, లేకుంటే విజయవాడ పార్లమెంటు స్థానంలో తనకు 1.25 లక్షల మెజార్టీ వచ్చేదని వ్యాఖ్యానించడం రెండు పార్టీల మధ్య పెద్ద దుమారమే లేపింది. అధిష్టానం నానితో మాట్లాడి సంయమనంతో ఉండాలని సూచించిందని అనుకూల మీడియాలో రాయించారు. రాష్ట్రాభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని, కేంద్రం నుంచి నిధులు రానివ్వకుండా చేస్తున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి గతంలో మీడియా సమావేశంలోనే విమర్శలు గుప్పించారు. ఇవన్నీ చంద్రబాబు ప్రోద్బలం లేకుండా జరగడం లేదన్న విషయం తమకూ తెలుసునని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోలవరం విషయంలో కేంద్రం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా అనేక అవినీతి అక్రమాలతో పనులు ముందుకు వెళ్లకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పేర్కొంటున్నారు. కమీషన్ల కోసం కొత్తగా టెండర్లు పిలవడాన్ని కేంద్రం నిలిపివేయించగా బీజేపీపై టీడీపీ నేతలతో విమర్శలు చేయించడమే కాకుండా స్వయంగా చంద్రబాబునాయుడు అసెంబ్లీలో కేంద్రం తీరును తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ‘వద్దంటే చెప్పండి మీకో నమస్కారం పెట్టి ప్రాజెక్టును మీకే అప్పగించేస్తాం‘ తాజా వ్యాఖ్యల మాదిరే చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు. తాడేపల్లిగూడెంలో మంత్రి మాణిక్యాలరావుకు వ్యతిరేకంగా టీడీపీకి చెందిన జడ్పీ ఛైర్మన్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటున్నారు. కాకినాడ నగర పాలక ఎన్నికల్లో బీజేపీకిచ్చిన సీట్లలో టీడీపీ అసమ్మతి నేతలను నిలబెట్టి ఎన్నికలు అయినపోయిన వెంటనే వారిని పార్టీలో చేర్చుకోవడం మిత్ర ధర్మమేనా అని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షమైన తమను నంద్యాల ఉపఎన్నిక సమయంలో ప్రచారానికి రావద్దని, బీజేపీ జెండాలు కూడా ఏర్పాటు చేయనీకుండా అడ్డుకున్నారని, తమ ఉనికిని కూడా అంగీకరించలేకపోతున్నారని వారు గుర్తుచేస్తున్నారు. -
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి
-
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి
-
మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని తెస్తే...
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేకపోతే ఏ పార్టీ గుర్తుపై గెలిచినా... మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని విష్ణుకుమార్‌రాజు చమత్కరించారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమే... మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. మంత్రులుగా కొనసాగడం అనైతికం అన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా పరిగణిస్తున్నాం. వాటికి విలువలేదు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే టీడీపీలోకి వచ్చారు. వారి రాజీనామాల అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉంది. శాసనసభ వ్యవస్థలో స్పీకర్‌దే తుది నిర్ణయం. ఉప ఎన్నికలకు ఆ నలుగురు మంత్రులు సిద్ధంగా ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదు. ఇరు పార్టీల రాష్ట్ర, జాతీయ అద్యక్షులు చూసుకుంటారు. వారు స్పందిస్తేనే పార్టీ ప్రకటనగా భావిస్తాం. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు అని అన్నారు. -
బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్ రావాల్సిందే!
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను టార్గెట్ చేశారు. గవర్నర్ నరసింహన్‌ను వెంటనే మార్చాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన అల్టిమేటం జారీచేశారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన నాలా బిల్లు విషయమై గవర్నర్ తీరుపై విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. సంక్రాంతి పండుగ లోపు నాలా బిల్లును గవర్నర్ ఆమోదించి పంపాలని కోరారు. నాలా బిల్లుపై గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సర్కార్‌కు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. నాలా బిల్లుపై గవర్నర్ ఆమోదం పొందేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 3 నెలల కిందట పలు సలహాలు చేర్చి.. నాలా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ కు పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం సలహాలను గవర్నర్ తోసిపుచ్చి దాన్ని తిప్పిపంపారు. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ఆమోదించి.. గవర్నర్ నరసింహన్ కు ప్రభుత్వం మరోసారి పంపింది. కానీ గవర్నర్ మళ్లీ ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఈ బిల్లు విషయమై గతంలో చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని గవర్నర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘అలాంటివాళ్లను చంద్రబాబు అదుపులో పెట్టాలి’
సాక్షి, అమరావతి : టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్‌పై టీడీపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని బీజేపీ నేత సోము వీర్రాజు సూచించారు. చంద్రబాబు నాయుడు లోపల ఒకటి.. బయట మరొకటి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు శనివారమిక్కడ మాట్లాడుతూ...‘పోలవరం టెండర్లలో లోపాలను సవరించాలని అడగటం తప్పా?. టెండర్లలో లోపాలుంటే సరిదిద్దొద్దా? సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు కేంద్రాన్ని నిందించడం సరికాదు. కేంద్రంసహాకరించకపోతే 60 శాతం పనులెలా పూర్తవుతాయి. జేసీ దివాకర్ రెడ్డిలాంటి నేతలను చంద్రబాబు అదుపులో పెట్టాలి. తమిళనాడులో శశికళ వద్ద ప్రజల సొమ్ము ఉంది కాబట్టే ఐటీ దాడులు చేశారు. అవినీతిని కేంద్రం చూస్తూ ఊరుకోవాలా?.’ అని సూటిగా ప్రశ్నించారు. అలాగే పోలవరంపై అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తప్పుబట్టారు. నవంబర్ 16న 1395 కోట్లకు టెండర్ల నోటీసు ఇచ్చి... ఆ తర్వాత 1483 కోట్లకు ఎందుకు పెంచారని అన్నారు. 14 రోజుల్లోనే 88కోట్లు పెరగడంపై మాత్రమే లేఖలో ప్రశ్నించారన్నారు. పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని... ప్రాజెక్టును ఆపమని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. -
‘పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంది’
సాక్షి, అమరావతి : పోలవరంపై కేంద్రం పంపిన లేఖలో ఏమీ లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసిందని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం అసెంబ్లీ వేదికగా ఆయన ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. ప్రాజెక్టుకు పనులకు నవంబర్ 16వ తేదీన టెండర్లు పిలిచి, 30వ తేదీ వరకూ ఆన్లైన్లో ఎందుకు అప్లోడ్ చేయలేదని మాత్రమే కేంద్రం లేఖలో ప్రశ్నించినట్లు చెప్పారు. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వాన్ని కేంద్రం లేఖపై తప్పుదోవ పట్టించారని అన్నారు. తొలుత రూ. 1395 కోట్లకు ఆహ్వానించిన టెండర్లను కేవలం 14 రోజుల వ్యవధిలో 1483 కోట్లకు(88 కోట్లు పెరిగాయి) ఎందుకు పెంచారని కేంద్రం అడగటంలో తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమ ఆస్తులను ప్రజలకు పంచాల్సిన పని లేదని, వాళ్ల ఆస్తులను లాక్కోకుండా ఉంటే చాలునని అన్నారు. పోలవరంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు. అధికారులు వాస్తవాలు చెప్పి ఉంటే ఇంత రాద్దాంతం జరిగేది కాదని చెప్పారు. బీజేపీ ఏ కబ్జాలకు పాల్పడదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితిల్లో కేంద్రం పోలవరంను పూర్తి చేస్తుందని తెలిపారు. టెండర్‌కు 45 రోజుల గడువు ఇవ్వాల్సివుండగా.. 18 రోజులు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నారు. లోపభూయిష్టమైన టెండర్‌ను మాత్రమే ఆపమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది గానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపమని లేఖలో ఎక్కడా పేర్కొన్నలేదని చెప్పారు. -
‘ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్ ముగిసినట్లే’
సాక్షి, విజయవాడ : ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్ ముగిసినట్లేనని బీజేపీ శాసనసభా పక్ష నేత, పీఏసీ సభ్యులు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ 175 సీట్లను గెలుస్తామని చెబుతోందని ఆయన అన్నారు. విష్ణుకుమార్ రాజు బుధవారమిక్కడ మాట్లాడుతూ..రకరకాల సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తుంటే ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో మంత్రులు సచివాలయానికి రావడం లేదని విమర్శించారు. తాను కూడా వినతి పత్రాలు ఇద్దామంటే ఇక్కడ మంత్రులు లేరని అన్నారు. తాను మంత్రులను కలుద్దామని వచ్చి నిరుత్సాహపడ్డానని అన్నారు. సచివాలయంలో మంత్రులు ఉండకపోతే ప్రజల వినతులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక ‘చంద్రబాబునాయుడు 175 సీట్లు గెలుస్తున్నానని చెబుతున్నారు, మరి మిత్రపక్షంతో కలిశా, లేదా ఒంటరిగానా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. ఇన్నాళ్లూ 225 నియోజకవర్గాలు అని అన్నారు, ఇప్పుడు 175లోనే గెలుస్తున్నామంటే ఇక 225 ఇష్యూ క్లోజ్ అయినట్టేనా’ అని అన్నారు. బీజేపీ కూడా ప్రతి నియోజకవర్గంలో బలం పుంజుకుందని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అన్నారు. పలు సమస్యలపై ప్రజాపద్దుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చజరిగిందని, వీటిపై ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు తెలిపారు. -
సిట్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ వినతిపత్రం
-
సిట్‌కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ వినతిపత్రం
విశాఖ : బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం సిట్ అధికారులను కలిశారు. విశాఖ భూ కుంభకోణంపై ‘సిట్’ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు... ముదుపాక, చిట్టివలస, రాజవరం, మాధవధారలో జరిగిన భూ కబ్జాలు, ట్యాంపరింగ్‌పై సిట్ చీఫ్ వినిత్ బ్రిజిలాల్‌కు వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేల సిఫారస్సులతో ప్రభుత్వ లాయర్లను నియమించడం సరికాదన్నారు. వారికి సరైన పరిజ్ఞానం ఉంటే పర్వాలేదని, లేకుంటే ప్రభుత్వ భూములు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తుల సలహాలు తీసుకుని, కోర్టు పరిధిలో ఉన్న భూకేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలన్నారు. సుమారు 2వేల ఫిర్యాదులు అందాయంటే ఏ స్థాయిలో భూ దందాలు జరిగాయో అర్థం అవుతుందన్నారు. -
నేను హోంమంత్రినైతే భూ కబ్జాదారుల తొక్కతీస్తా
విశాఖపట్నం : తాను హోం మంత్రినైతే విశాఖ జిల్లాలో భూకబ్జాదారుల తొక్కతీస్తానని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, భూ కుంభకోణమంతా నగరం సమీపంలోని భీమిలి ప్రాంతం చుట్టూనే తిరుగుతోందన్నారు. జిల్లా అంతటా అక్రమాలు ఉన్నా... భీమిలిలో భూ దందా పతాకస్థాయికి చేరిందన్నారు. ఆ నియోజకవర్గంలో విచ్చలవిడిగా భూ కుంభకోణం జరిగిందని అందరూ చెబుతున్నా.. ఎవరూ పెద్ద వాళ్ల పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు. పక్కా ఆధారాలు తన వద్ద లేవు కాబట్టే తాను పేర్లు బయటపెట్టడం లేదని, అయితే అక్రమాలు జరిగిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిగితే గానీ వాస్తవాలు బయటకు రావని అన్నారు. భీమిలి ల్యాండ్ ఫూలింగ్‌తో పాటు జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలు, రికార్డుల ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భీమిలి, ముదపాక ప్రాంతాల్లో వుడా ల్యాండ్ పూలింగ్ పేరిట జరిగిన వందల రూ.కోట్ల కుంభకోణంపై తాను ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. అధికారుల్లోనూ కొంతమంది అవినీతిపరులు ఉన్నప్పటికీ, రాజకీయ నేతల అండ లేకుండా రికార్డుల ట్యాంపరింగ్ చేసేంతటి ధైర్యం వారికి ఉండదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యల ఆధారంగా విచారణ చేపట్టాలి: పురందేశ్వరి ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన నేతలే భూ దందాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి డిమాండ్ చేశారు. విశాఖలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. -
‘మోదీని, జగన్ ను తిట్టి స్థాయి తగ్గించుకోవద్దు’
-
‘మోదీని, జగన్ ను తిట్టి స్థాయి తగ్గించుకోవద్దు’
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. వైఎస్ జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఆరోపించారని.. ఆధారాలు చూపించమని అసెంబ్లీలో అడిగితే లేవన్నారని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు స్థాయి మరిచి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీని, జగన్‌ను తిట్టి టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. తాము కేసుల గురించి మాట్లాడుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రధాని మోదీ చెప్పారా అని కడిగి పారేశారు. వైఎస్ జగన్ ప్రధానమంత్రిని కలిస్తే తప్పేముందన్నారు. వైఎస్ జగన్ ఏమైనా ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. జగన్, ప్రధానిని కలిస్తే టీడీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. టీడీపీకి, వైఎస్ఆర్ సీపీకి 5లక్షల ఓట్లు వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా మద్దతు తెలపడంలో తప్పేముందన్నారు. టీడీపీ నేతలను అడిగి అపాయింట్ మెంట్ ఇచ్చుకునే దౌర్భగ్య స్థితిలో ప్రధాని లేరని స్పష్టం చేశారు. -
కుక్కలను కుప్పం పంపండి...: విష్ణుకుమార్‌రాజు
సీతమ్మధార (విశాఖపట్నం): ‘రాష్ట్ర వ్యాప్తంగా 3.47 లక్షల కుక్కలుంటే ఒక్క విశాఖపట్నంలోనే 1.39 లక్షల కుక్కలున్నాయి. నా ఇంటిచుట్టూ వందల కుక్కలు నిత్యం తిరుగుతుంటాయి. కుక్కల బారినపడి వందలాది మంది రోజూ గాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు కుప్పం, మంత్రి నారాయణ సొంతూరు నెల్లూరుకు ఇక్కడి కుక్కలను పంపిస్తే వారికి ఈ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది’ అని బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో కుక్కల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య విశాఖలోనే ఎక్కువగా ఉందన్నారు. ఈ బాధ చంద్రబాబుకు తెలియాలంటే ఇక్కడి కుక్కలను కుప్పం పంపాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కుక్కలను చంపడానికి వీల్లేదంటున్న వారే రోజూ లక్షలాది ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లను చంపి తింటున్నారని, ఇవి మూగ జీవాలు కావా? వీటికో న్యాయం.. కుక్కలకో న్యాయమా? అని ప్రశ్నించారు. కుక్కలను చంపరాదన్న సుప్రీం తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలని సూచించారు. -
'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు'
-
'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటికాలిపై లేచారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కలజేసుకున్న విష్ణుకుమార్ రాజు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. సభలో ఆందోళన చేయడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో తాము తల్చుకుంటే రెండు నిమిషాలు పట్టదంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం తగదంటూ చంద్రబాబును వెనకేసుకొచ్చారు. సభకు దారికి తీసుకొచ్చేందుకు ఓపిగ్గా ప్రయత్నిస్తున్న స్పీకర్ కు జోహార్లు అర్పించారు. స్పీకర్ తో వాదించడం సమంజసం కాదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాను సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిపై కూడా చర్య తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. -
'డోంట్ టచ్ మీ' అంటే బూతు మాటా?
హైదరాబాద్ : 'డోంట్ టచ్ మీ' అంటే బూతు మాటా? అలా అన్నందుకే కేసులు బుక్ అవుతున్నాయి. అదృష్టవశాత్తు నా మీద కేసు నమోదు అవలేదు. డోంట్ టచ్ మీ అంటే బూతు మాటా... అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు. గురువారం అసెంబ్లీలో జీరో అవర్‌లో... డోంట్ టచ్ మీ అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఇటీవల తాను తిరుపతి వెళ్లానని, అక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో క్యూలో నిలబడ్డానని, అయితే కొందరు తనను నెట్టివేసే ప్రయత్నం చేయగా డోంట్ టచ్ మీ అన్నానని.. ఆ విషయంలో వివాదం ఏర్పడిందన్నారు. అదేమైనా అసభ్యకరమైన పదమా, దుర్భాషలా అని ప్రశ్నించారు. అయితే బై లక్... తనపై కేసు నమోదు అవలేదని ఆయన తెలిపారు. విష్ణు కుమార్ రాజు ప్రశ్నకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సమాధానం ఇస్తూ... డోంట్ టచ్ మీ...(నన్ను ముట్టుకోవద్దు) అనేది అసభ్యకరమైన పదం కాదని, ఆ సంఘటన వివరాలు తెలుసుకుని అందుకు సంబంధించి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. కాగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా... డోంట్ టచ్ మీ అన్నందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
'డోంట్ టచ్ మీ' అంటే అరెస్ట్ చేస్తారా..?
-
'కలాం శతాబ్దపు యుగపురుషుడు'
-
'కలాం శతాబ్దపు యుగపురుషుడు'
హైదరాబాద్: అబ్దుల్ కలాంగారు శతాబ్దపు యుగపురుషుడు అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన 46 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన మహనీయుడని చెప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ తరుపున కలాం మృతిపట్ల విష్ణుకుమార్ రాజు నివాళులు అర్పించారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను గొప్పశక్తిమంతమైన దేశంగా భావించిన వ్యక్తి కలాం అని చెప్పారు. కేవలం సైంటిస్టు సంబంధ విషయాలే కాకుండా మానవాళికి సంబంధించిన సేవలు కూడా అందించారని కొనియాడారు. కలాం భారత దేశపు ముద్దుబిడ్డ, ఆణిముత్యం అని ఆయన చెప్పారు. -
'ఉప్పు,కారం లేనట్లు చప్పగా సాగాయి'
-
'ఉప్పు,కారం లేనట్లు చప్పగా సాగాయి'
హైదరాబాద్ : ప్రతిపక్షం లేని రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉప్పు,కారం లేనట్లు చప్పగా సాగాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తిచూపించాల్సిందేనన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభకు హాజరు కావటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అన్నారు. కరెంట్ ఛార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. -
వైఎస్ జగన్‌కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విజ్ఞప్తి
హైదరాబాద్ : ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభ ప్రారంభం అయిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రతిపక్షం అనేది సభలో ఉండాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుంచి అసెంబ్లీకి హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకు రావాలని, సభకు గైర్హాజరు కావటంపై పునరాలోచన చేయాలని విష్ణుకుమార్ రాజు సభాముఖంగా వైఎస్ జగన్‌ను కోరారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన, విష్ణుకుమార్, తలసాని
హైదరాబాద్ : సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా.. తమకు కేటాయించిన సమయంలో కాస్తంత ప్రతిపక్ష నేతకు ఇవ్వాలని బిజెపి సభ్యుడు పెన్మత్స విష్ణుకుమార్ రాజు సూచించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యానించడంతో.. ఆయన కూడా గట్టిగానే బదులిచ్చారు. తానేం మాట్లాడుతున్నానో తనకు తెలుసని విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతకు ముందు అసెంబ్లీ చాంబర్లో వైఎస్ జగన్‌ను విష్ణుకుమార్ రాజు కలిశారు. మరోవైపు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. కాగా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఈరోజు ఉదయం వైఎస్ జగన్‌ను ఆయన ఛాంబర్లో సమావేశం అయ్యారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు.