‘ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్‌ ముగిసినట్లే’ | AP 225 Assembly Seats Increase chapter closed, says MLA vishnukumar raju | Sakshi
Sakshi News home page

‘ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్‌ ముగిసినట్లే’

Published Thu, Sep 14 2017 4:26 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

‘ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్‌ ముగిసినట్లే’ - Sakshi

‘ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్‌ ముగిసినట్లే’

సాక్షి, విజయవాడ : ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాఫ్టర్‌ ముగిసినట్లేనని  బీజేపీ శాసనసభా పక్ష నేత, పీఏసీ సభ్యులు విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ 175 సీట్లను గెలుస్తామని చెబుతోందని ఆయన అన్నారు. విష్ణుకుమార్‌ రాజు బుధవారమిక్కడ మాట్లాడుతూ..రకరకాల సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తుంటే ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో మంత్రులు సచివాలయానికి రావడం లేదని విమర్శించారు. తాను కూడా వినతి పత్రాలు ఇద్దామంటే ఇక్కడ మంత్రులు లేరని అన్నారు. తాను మంత్రులను కలుద్దామని వచ్చి నిరుత్సాహపడ్డానని అన్నారు. సచివాలయంలో మంత్రులు ఉండకపోతే ప్రజల వినతులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.

ఇక ‘చంద్రబాబునాయుడు 175 సీట్లు గెలుస్తున్నానని చెబుతున్నారు, మరి మిత్రపక్షంతో కలిశా, లేదా ఒంటరిగానా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి. ఇన్నాళ్లూ 225 నియోజకవర్గాలు అని అన్నారు, ఇప్పుడు 175లోనే గెలుస్తున్నామంటే ఇక 225 ఇష్యూ క్లోజ్‌ అయినట్టేనా’  అని అన్నారు. బీజేపీ కూడా ప్రతి నియోజకవర్గంలో బలం పుంజుకుందని ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ రాజు అన్నారు. పలు సమస్యలపై ప్రజాపద్దుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చజరిగిందని, వీటిపై ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement