సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పడం అవాస్తవమని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుండానే డబుల్ డిజిట్ గ్రోత్‌ను రాష్ట్రం సాధించిందా? అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వకుండానే 24 గంటల విద్యుత్ సరఫరా వచ్చిందా? అని ప్రశ్నించారు. సాంకేతికంగా సాధ్యపడదు కాబట్టే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీని గతంలో చంద్రబాబు స్వాగతించిన విషయం నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఏపీ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు.
కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు వస్తున్నాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలుపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment