ప్రధాని నరేంద్ర మోదీ, వైఎస్‌ఆర్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. వైఎస్ జగన్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఆరోపించారని.. ఆధారాలు చూపించమని అసెంబ్లీలో అడిగితే లేవన్నారని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు స్థాయి మరిచి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీని, జగన్‌ను తిట్టి టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు.