ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సీఎం చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజి నిధుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఈ పెద్దమనిషి కాదా? అని నిలదీశారు.