సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్‌పై బుధవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లుతోందని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకూమార్ రాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యలపై కేంద్ర ప్రభుత్వం గతంలో అనేకసార్లు వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు దగ్గరు పడుతుండటంతో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారని విమర్శించారు. టీడీపీ నేతల వ్యవహారం చూస్తుంటే విశాఖ రైల్వేజోన్ కూడా చంద్రబాబే ప్రకటించుకునేలా ఉన్నారని విష్ణుకూమార్ రాజు ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment