
'ఉప్పు,కారం లేనట్లు చప్పగా సాగాయి'
హైదరాబాద్ : ప్రతిపక్షం లేని రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉప్పు,కారం లేనట్లు చప్పగా సాగాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన మంగళవారం సభలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తిచూపించాల్సిందేనన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభకు హాజరు కావటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు అన్నారు. కరెంట్ ఛార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.