సాక్షి, విశాఖపట్నం : మంత్రి అండదండలతోనే విశాఖలో రేవ్ పార్టీ జరిగిందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఆ మంత్రి పలుకుబడితోనే రేవ్ పార్టీ నిర్వహించారని పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవ్ పార్టీలో పదిమంది యువతులు ఉన్నారని, కోడ్ ఉల్లంఘించి మద్యం తాగేందుకు ఎక్సైజ్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మంత్రి పేషీనుంచి 8ఫోన్లు ఎక్సైజ్ అధికారులకు వెళ్లాయని అన్నారు.
బీచ్ ఫ్రంట్ నిర్వాహకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు ధైర్యంలేదన్నారు. డీజీపీ చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి ఒత్తిడి వల్లే బీచ్‌ఫ్రంట్ నిర్వాహకులను కనీసం విచారించడం లేదన్నారు. చర్యలు తీసుకోకుంటే డ్రగ్స్ రాజధానిగా విశాఖ మారుతుందని అభిప్రాయపడ్డారు. రేవ్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment