పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని సూచించారు.