ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు రెండోసారి విజ్ఞానపత్రం ఇచ్చామని వైఎస్సార్‌సీపీ నాయకులు వి. విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.