defected MLAs
-
ఉప ఎన్నికలకు సిద్ధం కండి: కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం(ఫిబ్రవరి3) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఒక కీలక ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని,ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం అసాధ్యమని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ సోమవారం వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయమని, ఉప ఎన్నికలకు సిద్ధమవండని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. -
సుప్రీం కోర్టులో కేటీఆర్ ‘ఫిరాయింపుల పిటిషన్’ వాయిదా
న్యూఢిల్లీ,సాక్షి: తెలంగాణ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు(KTR) వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పేర్కొంది.ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్‌ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్‌రావు మరో పిటిషన్ వేశారు.మహారాష్ట్ర కేసులో..రాజ్యాంగంలోని పదో షెడ్యూల్.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది. -
రాజ్యాంగ సంస్థలు పరిధి దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: చట్టసభలు, న్యాయస్థానాల లాంటి రాజ్యాంగ సంస్థలు తమ పరిధి దాటి ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగం పేర్కొంటోందంటూ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, న్యాయశాఖ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దేనికదే హుందాతనాన్ని పాటించాలని, స్పీకర్ పరిధిలోని అంశాల్లో న్యాయ సమీక్ష సాధ్యం కాదని పేర్కొన్నారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు కొంత వీలుంటుందని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆలోగా దీనికి సంబంధించిన వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని సెప్టెంబర్ 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. ‘కైశం మేఘాచంద్ర సింగ్’లో ముగ్గురు జడ్జిల తీర్పు చెల్లదు ‘చట్టప్రకారం తహసీల్దార్ లాంటి వారి నిర్ణయానికి కూడా నెల సమయం ఉంటుంది. అలాంటిది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పిటిషనర్లు కనీసం ఆ సమయం కూడా ఇవ్వలేదు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్దిష్ట వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇస్తే, భవిష్యత్‌లో స్పీకర్ చట్టసభలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కిహోటో హోలోహన్ (1992) కేసు విచారణ సందర్భంగా ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్‌ను ట్రిబ్యునల్‌గా పేర్కొన్నందున.. ఆయన నిర్ణయాలపై సమీక్ష జరపొచ్చు. కానీ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుల జోక్యం కూడదు. కైశం మేఘాచంద్ర సింగ్ (2020) కేసు విచారణ సందర్భంగా ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఐదుగురు జడ్జిల తీర్పు తర్వాత ముగ్గురు జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పే పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా స్పీకర్ పరిధిలో జోక్యం చేసుకున్నట్లే ఉన్నాయి..’అని రవీంద్ర శ్రీవాస్తవ, శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఫిరాయింపులపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె.ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు, పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి తరçఫున మయూర్‌రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలయ్యాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖల చేశారు.గత విచారణలో స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం హైకోర్టుకు లేదన్న ఏజీ.. గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎర్రబెల్లి దాఖలు చేసిన పిటీషన్ పై తీర్పు ఇవ్వడానికి ఇదే కోర్టు నిరాకరించిందని ఏజీ గుర్తు చేశారు.చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు స్పీకర్ పరిధిలోకి వస్తాయన్న ఏజీ.. ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. నేడు మరోసారి పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. -
AP: ఫిరాయింపులపై ఇక స్పీకర్‌దే నిర్ణయం!
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 గంటల వరకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్‌కు లెటర్ రాసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్దమైన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అనర్హత పిటిషన్లపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ‘తుది’ నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు బదులు పంపినట్లు తెలుస్తోంది. నోటీసుల ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నాం తొలుత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపుల విచారణ ఉంది. అయితే.. విచారణకు హాజరుకాలేమంటూ ఆనం రామనారాయణరెడ్డి బదులు పంపినట్లు తెలుస్తోంది. తమ అనర్హత పిటిషన్‌కు సంబంధించి.. పిటిషనర్ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరిజినల్ అని నిరూపించాల్సిన అవసరం ఉందంటూ పాత పాటే పాడారు వాళ్లు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్ కాపీలు కావాలని స్పీకర్‌ను ఆనం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము విచారణకు రాలేమని ఆయన బదులు పంపారు. అలాగే.. మేకపాటి, శ్రీదేవి కూడా మరింత సమయం కావాలని కోరినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. వీళ్లతో పాటు టీడీపీ తరఫు నుంచి కూడా అనర్హత ఫిర్యాదు నమోదు అయ్యింది. .. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్, మండలి చైర్మన్లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు. సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఇవాళ (19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంలో వీళ్ల విచారణ జరగాల్సి ఉంది. అలాగే.. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్(మండలి) సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.ఒకవేళ.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్, చైర్మన్లు స్పష్టం చేశారు. దీంతో రాలేమంటూ లేఖ పంపిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. వీళ్లను కూడా ఇవాళే విచారణకు రావాల్సిందిగా స్పీకర్, మండలి చైర్మన్లు నోటీసులు పంపించారు. -
చీరి చింతకు కట్టాలే ; మరి ఇప్పుడేం చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్ : పార్టీలు మారేవారిని చీరి చింతకు కట్టాలే అని నీతులు మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంపై ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన రాజకీయ వ్యభిచారులు కాంగ్రెస్ నాయకత్వంపై చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నామన్నారు. ఇదే నాయకత్వం వీళ్లకు బీఫామ్ ఇచ్చిన విషయాన్ని గమనించాలని అన్నారు. దమ్ముంటే ఆ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. రాజకీయ ఫిరాయింపులు వ్యభిచారమేనన్న కేసీఆర్ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యబిచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజకీయ వ్యబిచారం చేసే వారిని చేయించే వారిని ఏమనాలని అన్నారు. ‘జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేతలు.. మరి 6 సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు కదా.. స్వయంగా సీఎం కూతురు కూడా ఓడిపోయింది. అంటే మీకు ప్రజా మద్దత లేనట్లే కదా. నియోజక వర్గ అభివృద్ధి కోసమే ఫిరాయించామని ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీ మారక పోతే నియోజకవర్గ అభివృద్ధి చేయనని సీఎం అన్నారా’ అని ప్రశ్నించారు. -
‘విలీనం’పై సభాపతులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : శాసనసభ, మండలిలో తమ సభ్యుల విలీనంపై కాంగ్రెస్ గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు చర్యలు చేపట్టింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్‌కు, అదే హోదాలో మండలి చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ, మండలి కార్యదర్శులు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనం ఎదుట మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. మండలిలో తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలలో నలుగురు పార్టీ ఫిరాయించగా ఎలాంటి అధికారాలు లేకపోయినా మండలి చైర్మన్ కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనమైనట్లుగా ప్రకటించారని షబ్బీర్ అలీ రిట్లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు రాగానే మండలి చైర్మన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదించేందుకు వస్తారని, ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నందున విచారణను వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అభ్యంతరం చెప్పారు. నిన్న, ఈరోజు కూడా హరేన్ రావల్ రాష్ట్ర హైకోర్టులోనే కేసులు వాదించారని చెప్పారు. అయితే ఆయన అమెరికా వెళ్లబోతున్నారని మాత్రమే చెప్పానని రామచంద్రరావు ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. కేసుల్ని వాయిదా వేయాలని మీరే కోరుతున్నారని ధర్మాసనం పేర్కొనగా తానేమీ వాయిదాలు కోరలేదని జంధ్యాల బదులిచ్చారు. దీంతో ధర్మాసనం పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే మండలి చైర్మన్, మండలి సెక్రటరీ, పార్టీ పిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్‌రావు, కె. దామోదర్‌రెడ్డి, టి. సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీలో సీఎల్పీ కేసులోనూ.. శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని (సీఎల్పీ) టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కౌన్సిల్లో చేశారంటూ ఏప్రిల్ 29న దాఖలైన మరో రిట్ పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారించింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారని, సీఎల్పీని సైతం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని (అప్పటికి విలీనం నిర్ణయం తీసుకోలేదు) టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే శాసనసభ స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శితోపాటు టీఆర్ఎస్లోకి ఫిరాయించిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డి. సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె. సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని రెండు కేసుల్లోనూ ధర్మాసనం ఆదేశించింది. కేసుల విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సీఎల్పీ విలీనంపై తాజా వ్యాజ్యంలో.. కాంగ్రెస్ నుంచి తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లోకి ఫిరాయించాక సీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీ బులిటెన్ విడుదల చేసింది. అయితే పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ నిర్ణయాన్ని, శాసనసభ కార్యదర్శి ఇచ్చిన బులిటెన్‌ను రద్దు చేయాలని ఉత్తమ్, భట్టి రెండు రోజుల క్రితం మరో రిట్ దాఖలు చేశారు. నేటి విచారణ జాబితాలో కేసు లేకపోవడాన్ని పిటిషనర్ న్యాయవాది చెప్పడంతో బుధవారం విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన చట్టసభ్యుల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్లో చేరినప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లుగా ప్రకటించే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అనర్హత అంశంపై మాత్రమే స్పీకర్ తీర్పు చెప్పవచ్చునని, విలీన అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ల వాదన. శాసనసభాపతి వేరు, పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్ వేరని, ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ సమీక్ష చేయవచ్చునని వారు వాదిస్తున్నారు. శాసనమండలి, శాసనసభల్లోని ఒక పార్టీకి చెందిన చట్ట సభ్యులను కలిపితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అవుతుందని, అంటే మండలిలో ఆరుగురు, శాసనసభలో 19 మంది చొప్పున (అప్పటికి ఉత్తమ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు) కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని, పాతిక మంది ఉన్న వారిలో 19 మంది పార్టీ వీడినప్పుడే విలీనానికి చట్టపరమైన అవకాశం ఉంటుందని కూడా పిటిషనర్ల వాదన. అయితే మండలిలో ఆరుగురులో నలుగురు, అసెంబ్లీకి ఉత్తమ్ రాజీనామా చేశాక మిగిలిన 18 మందిలో 12 మంది పార్టీకి గుడ్‌బై చెప్పాక ఆ సభ్యుల బలం మూడింట రెండు వంతులేనని అధికార టీఆర్ఎస్ చేస్తున్న వాదనను పిటిషనర్లు తప్పుపడుతున్నారు. మరోవైపు రాజ్యాంగ నిబంధనలకు లోబడే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్లు వ్యవహరించారని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు గట్టిగా వాదిస్తున్నారు. కాగా, ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిలను అనర్హులుగా ప్రకటిస్తూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ దాఖలైన మరో వ్యాజ్యం కూడా హైకోర్టు విచారణలో ఉన్న విషయం విదితమే. ఈ మూడు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీ హామీ ఇవ్వడంతో అందుకు అనుగుణంగా ఇటీవలే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఫిరాయింపులపై మేమే తేలుస్తాం!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసి ఎనిమిది నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఒక్కరు కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన విచారణతో సంబంధం లేకుండా, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం ఫిరాయింపుల వ్యవహారాన్ని తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇందులో భాగంగా గతంలో నోటీసులకు స్పందించని ఫిరాయింపుదారులందరికీ హైకోర్టు గురువారం మరోసారి నోటీసులు జారీచేసింది. అలాగే, ఫిరాయించిన తరువాత మంత్రులైన నలుగురికి కూడా నోటీలిచ్చింది. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఏ అధికారంతో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలంటూ ఎందుకు ఆదేశాలు జారీ చేయరాదో చెప్పాలని కూడా ఆదేశించింది. ఇదే సమయంలో ఈ కేసులో స్పీకర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీంతో స్పీకర్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, హైకోర్టు నోటీసులు జారీచేసిన వారిలో ఫిరాయింపుదారులు బుడ్డా రాజశేఖరరెడ్డి, అత్తారు చాంద్ బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కలమట వెంకటరమణ, ఎం. మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, తిరివీధి జయరాములు, జ్యోతుల నెహ్రూ, పాశం సునీల్‌కుమార్, వరుపుల సుబ్బారావు, ఎస్వీ మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, ఎం.అశోక్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వి. రాజేశ్వరిలతో పాటు మంత్రులుగా కొనసాగుతున్న చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు ఉన్నారు. అంతకుముందు.. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది, ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే.. మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురిని వివరణ కోరాలంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు.. అలాగే, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర్ల సతీశ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాజ్యాలపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులుగా స్పీకర్, ఎన్నికల సంఘం ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ, ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీచేసి 8 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చిన విషయాన్నీ ప్రస్తావించి అనుబంధ వ్యాజ్యాలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, 8 నెలలుగా ప్రతివాదులెవ్వరూ కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. అంతేకాక, స్పీకర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించి ఫిరాయింపుదారులందరికీ నోటీసులు జారీచేసింది. ఉప్పులేటి కల్పన తరఫు న్యాయవాది వకాలత్ ఇవ్వడంతో ఆమెకు నోటీసులు ఇవ్వలేదు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
‘పార్టీ మారిన గాడిదలకు చంద్రబాబు టికెట్ ఇవ్వడు’
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తాడు గానీ, అమ్ముడుపోయిన గాడిదలకు కాదని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సభ ఉండదనీ, అసెంబ్లీలో సభా సంప్రదాయాలు, విలువలున్నాయా అని ప్రశ్నించారు. నైతిక విలువల గురించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడడం చిత్రంగా ఉందన్నారు. స్పీకర్ వ్యవస్థను కోడెల శివప్రసాద్ భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. అన్ని విషయాలపై మాట్లాడే పవన్ కల్యాణ్ ఫిరాయింపు దారులపై ఎందుకు మౌనం వహిస్తారని అన్నారు. వైఎస్ జగన్‌ని దూషించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. టీడీపీలో టికెట్ రాకపోతే చంద్రబాబుని తిడతారని అంబటి జోస్యం చెప్పారు. ఎన్నికలంటే మేము వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారనీ, చంద్రబాబుకు అంత ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, 25 ఎంపీ నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ ముఖ్య నేతలతో విశాఖపట్నంలో ఈ నెల 11న సమావేశం జరగనుందని ఆయన వెల్లడించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలు: స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. ఆయన తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం వాదనలు వినిపించారు. నలుగురు మంత్రులు సహా మొత్తం 19మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలోనే ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేసినా.. స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా.. స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి వాదనలతో విన్న ధర్మాసనం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్ నిర్దిష్ట సమయంలో స్పందించాల్సి ఉందన్న వాదనతో ఏకీభవించారు. -
హోదాపై చిత్త శుద్ధి ఉంటే మద్దతివ్వండి : బొత్స
సాక్షి విజయవాడ : రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం స్వాగతిస్తున్నాం అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ఇది టీడీపీకి చెంపపెట్టు లాంటిదని, కోర్టు తీర్పు రాక ముందే వారితో రాజీనామా చేయించి రాజకీయ విలువలు కాపాడాలని చంద్రబాబుకు సూచించారు. ప్రత్యేక హోదాకై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని హితవు పలికారు. అవిశ్వాసానికి అన్ని పార్టీల మద్దతు కూడగడతామని బొత్స పేర్కొన్నారు. రాజు తప్పు చేస్తే బంటును శిక్షించినట్టు గుంటూరులో జరిగిన సంఘటనకు సంబంధిత మంత్రిని తొలగించకుండా కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని బొత్స అభిప్రాయపడ్డారు. -
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
ఫిరాయించి పదవులా: ధర్మాసనం ప్రశ్న
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో మంత్రులుగా కొనసాగుతున్నారో వివరణ ఇవ్వాలని పార్టీ ఫిరాయించిన నలుగురు మంత్రులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలతోపాటు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులను ఆదేశించిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది అనంతరం టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటంతోపాటు మంత్రి పదవులు అనుభవిస్తున్న నలుగురు ఏ అధికారంతో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 22 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించిన నేపథ్యంలో వారిని న్యాయస్థానం నేరుగా అనర్హులుగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఫిరాయింపుదారులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని తెలిపారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఫిరాయింపుదారులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోందో అర్థం కాకుండా ఉందన్నారు. ఇదే వ్యవహారంపై హైకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒకసారి విచారణకు వచ్చినా మళ్లీ విచారణకు నోచుకోలేదని నివేదించారు. న్యాయస్థానాల్లో ఈ పరిస్థితిని చూసి ఫిరాయింపుదారులు నవ్వుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఫిరాయింపుదారుల్లో నలుగురు ఏకంగా మంత్రి పదవులు అనుభవిస్తున్నారని, అసలు ఫిరాయించడమే రాజ్యాంగ విరుద్ధమైప్పుడు వీరు మంత్రులుగా ఎలా ఉంటారో అర్థం కాకుండా ఉందన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు జారీ చేసి వారి వాదనలు వింటామని పేర్కొంది. అయితే ఒకసారి వాయిదా పడిన కేసు మళ్లీ విచారణకు రావడం లేదని మోహన్‌రెడ్డి పేర్కొనగా తాము చేయగలిగింది ఏమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నవ్వుకుంటే మేం చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతం హైకోర్టులో 3.25 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, నెలకు 5 వేల చొప్పున పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ప్రతీ కేసూ ముఖ్యమైనదేనని, తాము ఏ కేసుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశ్నించింది. ఏ అధికారంతో పదవుల్లో కొనసాగుతున్నారో నలుగురు మంత్రులను సైతం వివరణ కోరతామని స్పష్టం చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమను (కోర్టును) చూసి నవ్వుకుంటే తాము చేయగలింది ఏమీ లేదంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు 1. ఎం.అశోక్‌రెడ్డి 2. పి.డేవిడ్‌రాజు 3. పి.రామారావు 4. గొట్టిపాటి రవికుమార్ 5. పాశం సునీల్‌కుమార్ 6. తిరివీధి జయరాములు 7. బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 8. ఎస్.వి.మోహన్‌రెడ్డి 9. మణి గాంధీ 10. అత్తార్ చాంద్ బాషా 11. జలీల్ ఖాన్ 12. ఉప్పులేటి కల్పన 13. జ్యోతుల నెహ్రూ 14. వరుపుల సుబ్బారావు 15. వి.రాజేశ్వరి 16. కిడారి సరేశ్వరరావు 17. గిడ్డి ఈశ్వరి 18. కలమట వెంకట రమణమూర్తి హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు మంత్రులు 1. చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి 2. ఎన్.అమర్నాథ్రెడ్డి 3. భూమా అఖిలప్రియ 4. రావు వెంకట సుజయకృష్ణ రంగారావు -
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో పశ్చాత్తాపం
-
బడ్జెట్ సమావేశాల్ని బహిష్కరించిన వైఎస్సార్సీపీ
-
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి
-
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి
-
మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని తెస్తే...
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేకపోతే ఏ పార్టీ గుర్తుపై గెలిచినా... మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని విష్ణుకుమార్‌రాజు చమత్కరించారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమే... మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. మంత్రులుగా కొనసాగడం అనైతికం అన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా పరిగణిస్తున్నాం. వాటికి విలువలేదు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే టీడీపీలోకి వచ్చారు. వారి రాజీనామాల అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉంది. శాసనసభ వ్యవస్థలో స్పీకర్‌దే తుది నిర్ణయం. ఉప ఎన్నికలకు ఆ నలుగురు మంత్రులు సిద్ధంగా ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదు. ఇరు పార్టీల రాష్ట్ర, జాతీయ అద్యక్షులు చూసుకుంటారు. వారు స్పందిస్తేనే పార్టీ ప్రకటనగా భావిస్తాం. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు అని అన్నారు. -
కోస్తాలో తీవ్ర ప్రతిఘటన, సీమలో అసమ్మతి..
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగి ‘అభివృద్ధి’ కోసం ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చాలామంది తమ నియోజకవర్గాల్లో పాత టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తలనొప్పిని ఎదుర్కొంటున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రవేశాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాత టీడీపీ శ్రేణులు కొత్తవారికి వ్యతిరేకంగా అసమ్మతితో రగిలిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని నిరసిస్తూ తీవ్రస్థాయిలో ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల అసమ్మతులు, నిరసనలు బాహాటంగానే వ్యక్తంకాగా, మరికొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులాగా కొనసాగుతున్నాయి. చంద్రబాబు జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించడంలేదు. అద్దంకి, కదిరి, బద్వేలు, గూడూరు, కందుకూరు, పాతపట్నం, పామర్రు, ప్రత్తిపాడు వంటి చోట్ల అసమ్మతి స్వరాలు పరాకాష్టకు చేరుకోవడమే కాక, పరస్పరం బాహాబాహీలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిరాయించిన ఎమ్మెల్యేల రాకను ఆయా నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో వారి చేతిలో ఓటమి పాలైనవారు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. అయితే చంద్రబాబు వారందరి గొంతుకలను నయానా, భయానా నొక్కివేసి ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలనే ఏకైక లక్ష్యంతో ఫిరాయింపుల పర్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పడు అదే ఆ పార్టీతో పాటు ఫిరాయింపుదారులకు శాపంగా పరిణమించింది. కోస్తాలో తీవ్ర ప్రతిఘటన బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ పోరాటం చేసి టీడీపీలో చేరిపోయిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రజల నుంచే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. జన్మ భూమి–మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఈశ్వరిని స్థానిక గిరిజనులు ఇన్నాళ్లు లేని అభివృద్ధిని ఒక్క ఏడాదిలో ఏం చేసి చూపిస్తారని ప్రశ్నించడం ఆమెను ఇరకాటంలో పడేసింది. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజు అనుచరుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. శత్రుచర్లను శాంతింపజేయడానికి చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినప్పటికీ వ్యవహారం సద్దుమణగలేదు. అరకులో కిడారు సర్వేశ్వరరావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఫిరాయించిన జ్యోతుల నెహ్రూకు టీడీపీ కార్యకర్తల నుంచి అసమ్మతి ఎదురవు తోంది. ఆయనపై మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన జ్యోతుల చంటిబాబుతో ఆయనకు బొత్తిగా పొసగడం లేదు. ఇదే జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావుపై పోటీ చేసి ఓటమిపాలైన పర్వత సుబ్బారావుకూ సమన్వయం బాగా లోపించిందని తెలుస్తోంది. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వర్ల రామయ్య మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు మళ్లీ టీడీపీ టికెట్ లభిస్తుందనే హామీ ఏదీ లేదు. ప్రకాశంలో భగ్గుమంటున్న విభేదాలు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతున్నాయి. స్వప్రయోజనాల కోసం గొట్టిపాటి టీడీపీలో చేరారని బలరాం వర్గం నిత్యం ఆయనపై ధ్వజమెత్తుతోంది. ఇక్కడ పరిస్థితులను సమతౌల్యం చేయడానికి బలరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినా సెగలు, పగలు చల్లారలేదు. ఏదో ఒక సందర్భంలో రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. కందుకూరు నియోజకవర్గంలో పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారం, మున్సిపల్ స్థలంలో అక్రమ కట్టడాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో టీడీపీ నాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి సామాన్య ప్రజల నుంచి బహిరంగంగానే నిరసనలు ఎదురవుతున్నాయి. అశోక్‌రెడ్డి ప్రవేశాన్ని నిరసిస్తూ ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుకూ స్థానికంగా ఉంటున్న కార్యకర్తలకూ మధ్య పనుల విషయంలో తేడాలున్నాయంటున్నారు. కాంట్రాక్టు పనులను ఎక్కువగా తొలి నుంచీ తన వెంట ఉన్నవారికి డేవిడ్‌రాజు ఇస్తూ టీడీపీలో ఉన్న పాత నేతలను విస్మరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమలో రగులుతున్న అసమ్మతి కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ పరిస్థితి అయితే దయనీయంగా తయారైంది. తాజా జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లినపుడు ఎవరండీ మీరు... అని ప్రజలు తిరగడ్డారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష, మంత్రులు ఆదినారాయణరెడ్డికి, ఎన్.అమరనాథరెడ్డికి, భూమా అఖిలప్రియకు అసమ్మతి చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమోనని సీనియర్ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. -
టీఆర్ఎస్లో ఆసక్తికరమైన పరిణామాలు
సాక్షి, హైదరాబాద్ : అధికార టీఆర్ఎస్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పలు మార్లు చేయించిన సర్వేల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఓ అంచనాకు వచ్చేలా ఫలితాలు ఉపయోగపడ్డాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నా ఏ కారణాల చేతనో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఈ అసంతృప్తి మరింతగా ఉందని సమాచారం. ప్రభుత్వ పనితీరు, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలోనూ ప్రజాభిప్రాయం ఎంతో సానుకూలంగా ఉన్నా, కొందరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అలా లేదంటున్నారు. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా ఈ మేరకు పార్టీ అధినేతకు సమాచారం కూడా చేరిందని చెబుతున్నారు. జంప్ జిలానీలుగా ముద్రపడిన ఇతర పార్టీలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణల పేర జరిగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్ఎస్ బలం ఏకంగా 88కి పెరిగింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. -
ఇరకాటంలో చంద్రబాబు..!
-
ఇరకాటంలో చంద్రబాబు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి.. ఆ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సైకిల్ గుర్తుపై గెలుపొందిన రేవంత్‌రెడ్డి.. పార్టీని వీడిన వెనువెంటనే ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించారు. పార్టీ ఫిరాయింపులు, నాయకుల అనైతిక బరితెగింపులు ఇరు తెలుగు రాష్ట్రాలనూ కుదిపేస్తున్న నేపథ్యంలో రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రేవంత్ రాజీనామా.. అన్ని రకాలుగానూ చంద్రబాబును ఇరకాటంలో నెట్టేసింది. రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీ తెలంగాణలో మూతపడే స్థితికి చేరుకుంది. దీనికితోడు ఆంధ్రపదేశ్‌లో చంద్రబాబు ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. పార్టీ మారినా.. దర్జాగా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. ఏ ఒక్కరితోనూ రాజీనామా చేయించని చరిత్ర చంద్రబాబుది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు.. అధికార పార్టీ పంచన చేరడమే కాకుండా.. ఏకంగా మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు. ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం.. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా డిమాండ్ చేస్తున్నా.. చంద్రబాబు చెవికెక్కించుకోని సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా చంద్రబాబు రెండేళ్లుగా అనైతిక రాజకీయాలు నెరుపుతున్నారు. దీనిపై రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా.. చంద్రబాబు, అధికార టీడీపీ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రేవంత్ రాజీనామా నేపథ్యంలో ఫిరాయింపుల విషయంలో చంద్రబాబు అనైతిక రాజకీయం మరోసారి చర్చనీయాంశమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో సైతం అంతర్గతంగా ఇదే చర్చ కొనసాగుతోంది. పార్టీకి, పదవులకు రేవంత్ రాజీనామా నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామా అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. -
పార్టీ ఫిరాయింపు మంత్రులకు హైకోర్టు నోటీసులు
-
పార్టీ ఫిరాయింపు మంత్రులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : పార్టీ ఫిరాయించి ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని ఆ పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమంటూ జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్టికల్ 164 (1బి) ప్రకారం పార్టీ మారినవారిని మంత్రులుగా నియమించడం చట్టవిరుద్ధమని పిటిషన్ శివప్రసాద్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసును కూడా ఇదే కేసుతో విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను నాలుగువారాల పాటు వాయిదా వేసింది. కాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫారమ్‌పై ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎన్.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి అనంతరం టీఆర్ఎస్లో చేరి, మంత్రి పదవి చేపట్టారు. -
ఈసీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీలో ఈసీని కలిసిన ఆయన... ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా, వారితో రాజీనామా చేయించకుండా నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిర్ణీత సమయంలో స్పీకర్ చర్యలు తీసుకోని పక్షంలో ఎన్నికల సంఘం నుంచి నోటీసులు పంపిస్తామన్నారని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కూడా లేదని ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ.
-
‘చంద్రబాబు చెబుతున్న మాటలు సాధ్యం కాదు’
-
‘చంద్రబాబు చెబుతున్న మాటలు సాధ్యం కాదు’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని, దానికి అదనంగా నాలుగైదేళ్లు పడుతుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి చెబుతున్న మాటలు సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. జేసీ దివాకర్ రెడ్డి గురువారమిక్కడ మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేయడం తప్పుకాదన్నారు. కాలానుగుణంగా పరిస్థితులు మారుతుంటాయని, ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదని, పార్టీలు మారడం, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం తప్పుకాదని చెప్పుకొచ్చారు. ఒకపార్టీలో ఇమడలేక ఎమ్మెల్యేలు పార్టీ మారడంలో తప్పు లేదని, ఈ విషయంలో పార్టీ ఫిరాయించిన వారిని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏమీ చేయలేరని, ఆయన అధికారాలు నామమాత్రమేనని జేసీ వ్యాఖ్యానించారు. -
‘చంద్రబాబు అనైతికతను అందరికీ వివరిస్తాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకు వెళ్లామని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను పాటించే దిశగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రి పదవి నుంచి తొలగించేలా గవర్నర్‌కు తగు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రపతికి విన్నవించామన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి వివరించి, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయనకు కోరినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఒక వినతిపత్రం సమర్పించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక వ్యవహారం నడుస్తోందని, అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఫిరాయింపుదారుల్లో కొందరికి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారన్నారు. అలా మంత్రి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ...ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ పరిస్థితులను నివారించకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అనైతిక వ్యవహారాలపై అన్ని పార్టీల నేతలను కలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది, రేపు మరో పార్టీకి ఇదే పరిస్థితి ఎదురు కావచ్చని అందరి దృష్టికి తీసుకు వెళతామన్నారు. బీజేపీని ప్రభావితం చేసే ప్రతి పార్టీ నేతను ఖచ్చితంగా కలుస్తామని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా ఆడియో, వీడియోల్లో దొరికిపోయారని, బ్లాక్‌మనీ విచ్చలవిడిగా సంపాదించి, ఆ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు అవినీతిని కాగ్ కూడా తప్పుపట్టిందన్నారు. ఇటుక నుంచి మట్టి వరకూ, మట్టి నుంచి మద్యం వరకూ, మద్యం నుంచి బొగ్గు వరకూ బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకూ, కాంట్రాక్టర్ల నుంచి జెన్కో వరకూ జెన్కో నుంచి గుడి భూములు వరకూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలో మార్పు రావాలని, లేకుంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో అందరినీ కలిసి మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తామని వైఎస్ జగన్ అన్నారు. -
‘చంద్రబాబు అనైతికను అందరికీ వివరిస్తాం’
-
రాష్ట్రపతి ప్రణబ్‌కి వైఎస్ జగన్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్‌ను కలిసింది. వైఎస్ జగన్ ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతి దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు ఉన్నారు. కాగా వైఎస్ఆర్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ ఫిరాయించిన నలుగురుకి ఏపీ సీఎం చంద్రబాబు...మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.
-
ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీతో భేటీ కానున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చంద్రబాబు ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి ఈ సందర్భంగా వైఎస్ జగన్ వివరించనున్నారు. -
ఢిల్లీకి బయల్దేరిన వైఎస్ జగన్
-
నేడు రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ
-
నేడు రాష్ట్రపతితో వైఎస్ జగన్ భేటీ
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడాన్ని ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్సీపీ బృందం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 6వ తేదీన భారత రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీతో భేటీ కానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చంద్రబాబు ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి ఈ సందర్భంగా జగన్ వివరిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. -
ఫిరాయింపు రచ్చ
-
ఇది ప్రజాస్వామ్యమేనా.?
-
ఏపీలో చట్టం.. అపహాస్యం
- మంత్రివర్గ విస్తరణలో నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు చోటు - ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన గవర్నర్ - వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఫిరాయింపుదారులు - అసెంబ్లీలో వారు ఇప్పటికీ వైఎస్సార్సీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారని స్పీకర్ వెల్లడి - ఫిరాయింపులను ప్రోత్సహించటమే తప్పు.. ఆపైన వారికి మంత్రి పదవులా..! - చంద్రబాబు వైఖరిపై విమర్శల వెల్లువ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం సాక్షి, అమరావతి చట్టం చట్టుబండలైంది. రాష్ట్ర గవర్నర్ సాక్షిగా పార్టీ ఫిరాయింపుల చట్టం అపహాస్యమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నలుగురు శాసనసభ్యులతో ఆదివారం వెలగపూడి సచివాలయ ప్రాంగణం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ తీరు పట్ల టీడీపీయేతర పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ విలువలకీ ప్రస్తానం అంటూ మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇది బ్లాక్ డే అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇది రాజ్యాంగానికి, రాష్ట్రానికి ఘోరమైన అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలోకి ఫిరాయించిన వారికి మంత్రి పదవులెలా ఇస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. తెలంగాణాలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనే ఆ తప్పు ఎందుకు చేశారని లోక్‌సత్తా ప్రశ్నించింది. సీఎం రాజ్యాంగ విలువలను మంట కలిపారని వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో రావు వెంకట సుజయి కృష్ణ రంగారావు, చదిపిరాళ్ల ఆది నారాయణరెడ్డి, ఎన్ అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియలు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీలో వీరు ఇప్పటికీ వైఎస్సార్సీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వైఎస్సార్సీపీ సభ్యులు 67 మంది అని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు సైతం తప్పు పడుతున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నరే పార్టీ ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించడం దారుణం అని జనం విస్తుపోతున్నారు. మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న 11 మంది ఆదివారం ఉదయం 9.22 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కిమిడి కళా వెంకట్రావు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్, పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, చదిపిరాళ్ల ఆది నారాయణరెడ్డి, కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎన్ అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదినారాయణరెడ్డి, జవహర్, అఖిలప్రియలు పవిత్ర హృదయంతో అని, మిగతా వారు దైవసాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. ప్రమాణం సమయంలో పితాని సత్యనారాయణ, అఖిలప్రియ కొద్దిగా తడబడ్డారు. లోకేష్ ప్రమాణం చేసిన తర్వాత తన తండ్రి చంద్రబాబు, గవర్నర్‌కు పాదాభివందనం చేశారు. నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌లు సైతం ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించారు. కొత్త మంత్రుల్లో భూమా అఖిలప్రియ, జవహర్ మొదటిసారి ఎమ్మెల్యేలు కాగా, లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద గందరగోళం ఉద్వాసనకు గురైన ఐదుగురు మంత్రుల్లో నలుగురు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, కిమిడి మృణాళిని, పల్లె రఘునాథ్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉండగా పీతల సుజాత హాజరయ్యారు. వేదిక ముందు ప్రత్యేకంగా వేసిన సీట్లలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, వియ్యంకుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అక్కడికి రావాల్సి ఉన్నా రాలేకపోయారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూద్దామని వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వెలగపూడి సచివాలయం వద్ద చుక్కలు కనిపించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రాంగణానికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రవేశ మార్గాలపై స్పష్టత లేక అందరూ ఒకవైపే రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అందరినీ అడ్డుకున్నారు. చివరికి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న వారు సైతం లోనికి వెళ్లడానికి ఇబ్బందిపడ్డారు. ఒక దశలో ప్రమాణ స్వీకారానికి వెళుతున్న జవహర్‌ను.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వస్తున్నారంటూ పోలీసులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను సీట్లలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన్ను వేదిక వద్దకు పంపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వేదికకు దగ్గరగా వెళ్లే అవకాశం లేక జనంలోనే ఉండిపోయారు. డీజీపీ సాంబశివరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు సైతం జనంలో చిక్కుకుని బయట పడడానికి ఇబ్బంది పడ్డారు. మీడియా సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మీడియా గ్యాలరీ లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అందరికీ అల్పాహార విందు ఇచ్చారు. గవర్నర్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు విందుకు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులైన హరికృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్‌రామ్, నారా రోహిత్ తదితరులు వచ్చారు. -
వాళ్లు చేస్తే తప్పు... తాను చేస్తే ఒప్పు...
♦ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి ♦ సీఎం తీరుపై విమర్శల వెల్లువ సాక్షి, అమరావతి: ‘‘తలసాని శ్రీనివాస యాదవ్ ఏ పార్టీలో గెలిచాడు? ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో ఆయన సమాధానం చెప్పాలి. తెలుగుదేశంలో పోటీచేసి గెలిచి, కనీసం రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మనల్ని తిడుతూ వేరేపార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్లూ అని అడుగుతున్నా! ఇది న్యాయమా! ప్రజలకు ఆమోదమా?’’ ‘‘మా ఎమ్మెల్యేని ఎన్నికలకు ముందు మీ ఫామ్ హౌస్‌కు తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం సిగ్గుపడకుండా పోలీసు ప్రొటక్షన్‌తో తీసుకువెళ్లిన నీకు (కేసీఆర్‌కు) నీతి గుర్తుకు రాలేదా? అని అడుగుతున్నా. నాకు ఒక ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు సిద్ధాంతం ముఖ్యం. నీతి ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.’’ .... జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా, కూకట్పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భంలో చంద్రబాబు మాటలివి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవి ఇస్తే తప్పుగా, రాజకీయ వ్యభిచారంగా ఆయన అభివర్ణించారు. తమపార్టీ ఎమ్మెల్యేలను సంతలో సరుకుల్లా కొన్నారని, దమ్ముంటే రాజీనామా చేయించి పోటీ చేయాలని సవాళ్లు విసిరారు. ఇప్పుడా మాటలన్నీ మరచి తానే రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, వారితో రాజీనామా చేయించకుండానే నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై మేధావులు, రాజకీయ నిపుణులు మొదలు సామాన్య ప్రజలు సైతం విమర్శిస్తున్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణి మరోసారి రుజువైందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో తప్పన్నదే ఏపీలో ఒప్పుగా భావించడం ఆయన ధోరణికి నిదర్శనమని దుయ్యబడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవులు కట్టబెట్టడంపై చంద్రబాబు చేసిన తీవ్ర దూషణలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన సందర్భంలోనూ కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సత్యహరిశ్చంద్రుడి మాదిరిగా మాట్లాడిన చంద్రబాబు ఇపుడు ఏపీలో తాను స్వయంగా చేస్తున్న ఫిరాయింపుల అరాచక పరాకాష్ట చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు రాజ్యాంగం విలువలు, సిద్ధాంతాలు, నీతి నియామాలంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్నాధ్రెడ్డి, సుజయకృష్ణ రంగారావులకు ఏపీ కేబినెట్లో చోటుకల్పించడంపై ఏం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విపక్షం, రాజకీయ నిపుణులే కాకుండా సొంతపార్టీ వారినుంచి కూడా బాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చంద్రబాబుకు చెప్పేందుకే నీతులు !
-
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్ గా చర్చ
-
పార్టీ ఫిరాయింపులపై మళ్లీ హాట్ హాట్ గా చర్చ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీ-పాస్ చర్చ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై మరోసారి వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు స్పీకర్ మైక్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. పార్టీ మారిన వ్యక్తికి కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. పువ్వాడ అజయ్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ శాసనసభ సభ్యుడిగా అజయ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలపగా, మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ స్పీకర్ వ్యాఖ్యలను సమర్థించారు. స్పీకర్ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. 2004-14 వరకూ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభాపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్లే మాట్లాడాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభ జరిగితే ప్రశ్నిస్తామని అన్నారు. అధికారం ఉందికదా అని ఏమైనా చేస్తామనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. సభ్యులను స్పీకర్ కంట్రోల్ చేయాలని అన్నారు. మరోవైపు పువ్వాడ అజయ్ మాట్లాడుతూ సభ్యుడిగా తన హక్కులను కాలరాయడం సరికాదన్నారు. తాను మాట్లాడే అవకాశం అడిగితే స్పీకర్ అనుమతి ఇచ్చారని, ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. -
దమ్ముంటే 24 గంటల్లో రాజీనామా చేయండి
ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ నేత అంబటి సవాలు సాక్షి, హైదరాబాద్: టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు 24 గంటల సమయమిస్తున్నామని, వారికి సిగ్గు, లజ్జ, దమ్మూ ఉంటే పదవులకు రాజీనామాలు చేసి సైకిల్ గుర్తుపై గెలుపొందాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ప్రతి సవాలు విసిరారు. అంబటి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన సవాలుపై తీవ్రంగా ప్రతిస్పందించారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోదని, అమ్ముడుపోయినవారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించిగానీ, వైఎస్సార్సీపీ గురించిగానీ మాట్లాడే నైతిక హక్కు లేనేలేదన్నారు. తమకున్న 67 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది టీడీపీలోకి పోయినంతమాత్రాన వైఎస్సార్సీపీ వన్నె ఏమాత్రం తగ్గలేదని, రోజురోజుకూ ఇంకా ప్రజాభిమానం చూరగొంటూ తిరుగులేనిశక్తిగా ఎదుగుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. ‘‘పార్టీ మూసేసుకుంటారా? అని మాట్లాడుతున్నవారికి ఏమాత్రం నైతిక విలువల్లేవు. వారు ఎవరి గుర్తుమీద, ఏ జెండాతో, ఎవరి ఫోటో పెట్టుకుని గెలిచారో... ఇపుడు ఏ పార్టీ జెండా కిందకు చేరి మాట్లాడుతున్నారో ఆత్మను ప్రశ్నించుకోవాలి’’ అని అన్నారు. -
మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా?
► 24 గంటల్లో రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ గెలవండి ► పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అంబటి రాంబాబు సవాలు ► వాళ్లు ఓడిపోతే తెలుగుదేశం పార్టీని మూసేస్తారా ► వైఎస్ జగన్‌ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు ► శోభా నాగిరెడ్డి సహా అందరితో పోటీ చేయించి గెలిపించుకున్నాం ► స్క్రిప్టులు ఇచ్చి వాళ్లతో తిట్టిస్తే చంద్రబాబు గొప్పవాడు కాలేడు హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తాము డబ్బులు తీసుకోలేదంటూ కోతలు కోస్తున్నారని.. మరి మీరంతా చంద్రబాబు అందం చూసి వెళ్లారా, ఆయన పాలన చూసి వెళ్లారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని, కానీ అది వద్దనుకుంటే విడాకులు ఇచ్చిన తర్వాత మాత్రమే మరో పెళ్లి చేసుకోవాలని.. అలా కాకుండా, విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకుంటే చట్టం ఒప్పుకొంటుందా అని ప్రశ్నించారు. పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలు 24 గంటలలోగా తమ పదవులకు రాజీనామా చేసి సైకిల్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాలు చేశారు. తాము గెలిస్తే పార్టీ మూసేసుకుంటారా అని ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నించారని.. వాళ్లు ఓడిపోతే టీడీపీని మూసేసుకుంటారా అన్న విషయం కూడా చెప్పాలని ఆయన అన్నారు. మీ పేరేంటని అడిగినప్పుడు అవతలి వాళ్ల పేరు కూడా చెప్పాలని గుర్తుచేశారు. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఇచ్చి చంద్రబాబు కొన్నారని, ఎంతమంది వెళ్లినా వైఎస్ఆర్సీపీ వన్నె తగ్గకపోగా.. మరింత పెరుగుతోందని చెప్పారు. డబ్బులు, పదవుల కోసం అమ్ముడుపోయిన వాళ్లు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం తగదని, ఆయన గురించి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అన్నమాట నిలబెట్టుకోవడం కోసం పదవులు వదులుకుని మళ్లీ పోటీచేసిన కుటుంబం వైఎస్ జగన్‌దని.. కమీషన్ల కోసం వెళ్లిన మీకు జగన్ గురించి, వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. శోభా నాగిరెడ్డి పీఆర్పీలో గెలిచారని, కాంగ్రెస్‌లో ఆ పార్టీని విలీనం చేసినప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీలోకి వచ్చారని, ఆమెతోపాటు టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకున్న చరిత్ర తమదని అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివితే చాలదని, డబ్బులు, పదవులకు ఆశపడి వెళ్లిన 20 మంది సిగ్గు, లజ్జ ఉంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు చేశారు. చట్టాల్ని గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. పెళ్లి చేసుకున్న చోట సంసారం చేయాల్సి ఉండి.. మీరా మమ్మల్ని ప్రశ్నించేదని నిలదీశారు. ఏ పార్టీ తరఫున గెలిచారో, ఆ పార్టీ నాయకుడినే విమర్శిస్తారా.. నైతిక విలువలు పాటించాలని హితవు పలికారు. జగన్ చుట్టూ తిరిగి పార్టీ టికెట్ల మీద గెలిచారని, ఇప్పుడు సిగ్గులేకుండా పచ్చ కండువాలు కప్పుకొంటున్నారని విమర్శించారు. ఊరికే స్క్రిప్టులు ఇచ్చి వాళ్లతో తిట్టిస్తే చంద్రబాబు గొప్పవాడు కారని, తాము మేం కోర్టులను, న్యాయస్థానాలను గౌరవిస్తున్నాం కాబట్టే ఇంతకాలం ఊరుకున్నామని అంబటి రాంబాబు చెప్పారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదని, మీడియాను కూడా ఏమీ చెప్పనివ్వడం లేదని, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 9న ఆయన నిరాహార దీక్ష విరమించేటప్పుడు కొందరు మంత్రులు ఆయనకు హామీలిచ్చారని, ఆ మంత్రులెవరూ ఇప్పుడు రాజమండ్రి దరిదాపుల్లో కూడా కనిపించడం లేదని.. ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానాస్పదంగా ఉందని రాంబాబు అన్నారు. -
స్పీకర్ చర్యలు ఏకపక్షం.. అన్యాయం
♦ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవట్లేదు ♦ మా ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించేలా స్పీకర్‌ను ఆదేశించండి ♦ ఫిరాయింపుదారులకు నోటీసులు జారీచేసేలా కూడా ఆదేశాలివ్వండి ♦ సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేయడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటేయాలంటూ తామిచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత వేటేయాలంటూ తాము ఎవరిపై అయితే ఫిర్యాదు చేశామో వారందరికీ నోటీసులు జారీచేసేలా కూడా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, 16 మంది ఎమ్మెల్యేలు.. భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, టి.జయరాములు, పి.డేవిడ్‌రాజు, ఎం.మణిగాంధీ, కె.వెంకటరమణమూర్తి, పాశం సునీల్‌కుమార్, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, ఆర్.వి.సుజయ రంగారావు, అత్తర్ చాంద్‌బాషా, జి.రవికుమార్, కె.సర్వేశ్వరరావు, బి.రాజశేఖరరెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మేకపాటి పిటిషన్‌లోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. పోరాటం చేస్తున్నందునే... ‘‘వైఎస్సార్సీపీ ప్రతిపక్ష పార్టీగా నిస్వార్థంతో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తోంది. అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నిస్తోంది. ఇది తట్టుకోలేకనే ఫిరాయింపులకు అధికారపార్టీ తెరలేపింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు పలు ఆశలు కల్పిస్తోంది. మంత్రి పదవులను ఎరగా చూపుతోంది. అధికారపార్టీ ప్రోత్సహిస్తున్న ఈ సామూహిక ఫిరాయింపులు ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ఫిరాయింపుల్ని మొగ్గలోనే తుంచి, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొదటిబ్యాచ్ ఫిరాయింపులపై ఫిర్యాదులు చేసి నెలరోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదు.ఫిరాయింపుదారులకు నోటీసులు ఇవ్వలేదు. దీంతో అధికారపార్టీ ఫిరాయింపుల్ని యథేచ్ఛగా ప్రోత్సహిస్తోంది. ఫిరాయింపుదారులు దర్జాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. పదవ షెడ్యూల్లో నిర్దేశించిన విధివిధానాలను స్పీక ర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ విధంగా స్పీకర్ వ్యవహరించడం ఏకపక్షం, అన్యా యం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. ప్రజల్ని వంచించడమే... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నామినేషన్‌పై పోటీచేసి ఈ పార్టీ గుర్తుపైనే ఎన్నికల్లో గెలుపొందారు. ప్రజల్లో పార్టీకున్న పేరును, ప్రతిష్టను, పార్టీ సిద్ధాంతాలను, నిధులను ఉపయోగించుకుని గెలిచారు. తరువాత మా పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న టీడీపీలోకి ఫిరాయించారు. ఇలా చేయడం వైఎస్సార్సీపీ విధానాలను, ఆశయాలను, ఆకాంక్షలను అమలు చేస్తారన్న ఉద్దేశంతో ఓటేసి గెలిపించిన ప్రజల్ని వంచించడమే. ఇలా పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తులపై అనర్హత వేటేయాలంటూ అన్ని ఆధారాలతోసహా స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. ఫిరాయింపుదారులు ఏవిధంగా అధికారపార్టీలోకి చేరింది.. ఆ పార్టీలో సభ్యులుగా కొనసాగుతున్నదీ.. ఆ పార్టీని ఎలా కీర్తిస్తున్నదీ పత్రికల్లో, మీడియాలో సవివరంగా వచ్చింది. ఈ విషయాలను ఫిరాయింపుదారులు కూడా ఖండించలేదు. వీటన్నింటినీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. పదవ షెడ్యూల్ ప్రకారం వారు ఏవిధంగా అనర్హులవుతారో కూడా వివరించాం. ఫిరాయింపుల్ని అడ్డుకునేందుకు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను చేర్చారు. ఫిరాయింపుదారులపై చర్యలకోసం ఫిర్యాదులు అందినప్పుడు వాటిపై స్పీకర్ ఎంతకాలంలోపు స్పందించాలన్నది అటు పదో షెడ్యూల్లోగానీ, ఇటు ఏపీ అసెంబ్లీ నిబంధనల్లోగానీ స్పష్టంగా లేదు. దీనిని అడ్డంపెట్టుకుని స్పీకర్ కాలయాపన చేస్తున్నారు. మేం ఫిర్యాదు చేసి నెలకుపైగా కావస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. న్యాయసమీక్ష చేయవచ్చు.. పక్షపాతంతో స్పీకర్ తీసుకునే నిర్ణయాలకు, అతని చర్యలకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఎటువంటి రక్షణ లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చింది. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకుని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు పదవ షెడ్యూల్‌ను తీసుకొచ్చిన విధానాన్ని, ఆ షెడ్యూల్ లక్ష్యాలను సుప్రీంకోర్టు 1992లో కియోటో హోల్లోహన్ వర్సెస్ జచిల్లు కేసులో స్పష్టంగా వివరించింది. అనర్హత విషయంలో తన ముందున్న ఫిర్యాదులను పరిష్కరించడంలో స్పీకర్ జాప్యం చేయడమంటే రాజ్యాంగ బాధ్యతలను విస్మరించడమే అవుతుంది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమైతే ఫిరాయింపుల భూతాన్ని అడ్డుకోవడంలో విఫలమైనట్లే. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ తీరు ప్రజాస్వామ్య విలువలకు, అసెంబ్లీ సమగ్రతకు హాని కలిగించేలా ఉంది. సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పీకర్ విధులను స్పష్టంగా తెలియపరచింది. తన ముందున్న ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ చేసే అసాధారణ జాప్యంపై న్యాయ సమీక్ష చేయవచ్చు. స్పీకర్ చేస్తున్న ఉద్దేశపూర్వక కాలయాపన వల్ల అధికారపార్టీ తమ ఫిరాయింపుల్ని యథేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో విధిలేక ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నాం’’ అని మేకపాటి తన పిటిషన్లో పేర్కొన్నారు. -
'విశ్వసనీయత లేకుంటే భార్య కూడా నమ్మదు'
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని వైెస్సార్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాలు విసిరారు. అయితే అంత ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. మంగళవారం శాసనసభ వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరనున్న జ్యోతుల నెహ్రూ విషయం ప్రశ్నించినప్పుడు పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత కలిగి ఉండటం ముఖ్యమని తానెప్పుడూ చెబుతుంటాననీ, అవి రెండూ చంద్రబాబుకు లేవని ఆయన మండిపడ్డారు. విశ్వసనీయత లేకుంటే భార్య కూడా ఆ వ్యక్తిని నమ్మదని పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇస్తానంటూ చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తే ఎక్కువ కాలం నిలబడరని ఆయన అన్నారు. -
తలసానిపై నిర్ణయాధికారం స్పీకర్‌దే: గవర్నర్
న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ మంత్రిగా కొనసాగుతుండటంపై మీడియా ప్రశ్నించగా.. 'తలసాని శ్రీనివాస్ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ స్పీకరే' అని సమాధానమిచ్చారు. రాజ్ నాథ్ తోపాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కూడా గవర్నర్ కలుసుకున్నారు.