వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ (ఫైల్ ఫోటో)
సాక్షి విజయవాడ : రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం స్వాగతిస్తున్నాం అని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. ఇది టీడీపీకి చెంపపెట్టు లాంటిదని, కోర్టు తీర్పు రాక ముందే వారితో రాజీనామా చేయించి రాజకీయ విలువలు కాపాడాలని చంద్రబాబుకు సూచించారు.
ప్రత్యేక హోదాకై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వాలని హితవు పలికారు. అవిశ్వాసానికి అన్ని పార్టీల మద్దతు కూడగడతామని బొత్స పేర్కొన్నారు. రాజు తప్పు చేస్తే బంటును శిక్షించినట్టు గుంటూరులో జరిగిన సంఘటనకు సంబంధిత మంత్రిని తొలగించకుండా కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని బొత్స అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment