తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టీ-పాస్ చర్చ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై మరోసారి వాడివేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌కు స్పీకర్ మైక్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. పార్టీ మారిన వ్యక్తికి కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని నిలదీశారు. పువ్వాడ అజయ్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు.